Wednesday 30 June 2021

 

కొనకుండా నవ్వుకొనండి-రేలంగి రమణారెడ్డి-

తికమక ప్రశ్న-తీరయిన జవాబు

https://cherukuramamohan.blogspot.com/2021/06/blog-post_30.html

సినిమా షూటింగ్ జరుగుతూ  వుంది. రమణా రెడ్డి Interviewing Officer. ఏ post కు Interview జరుగుతూ ఉందొ  ఆ job తన బావమరదికి గానూ kerchief ముందే  వేసియుంచినాడు. ఆ సినిమా లో ఆయన పేరు భేతాళ రావు. రేలంగి Candidate గా వచ్చినాడు. తన పేరు విక్రమార్క అయితే తానూ దానిని VIK RA MARK గా విరిచి MARK V R గా పెట్టుకొన్నాడు. Already ఆ job, MD రమణారెడ్డి గారి బావమరాడికి Fix అయిపోయిందను Roumer విన్నా నిర్లక్ష్యముగా Interview కు పోయినాడు. MD, Candidate ల నడుమ సంభాషణ ఈ విధముగా జరిగినది:

 

అప్పటి వరకూ వచ్చిన అభ్యర్థులను తికమ ప్రశ్నలడిగి త్రిప్పి పంపుతూ వచ్చినాడు భేతాళ్ రావు. మన రేలంగి విక్రమార్కుడు MD Cabin లోకి Entry ఇచ్చినాడు.

మన MARK లోనికి వెళ్లి తనకు చూపించిన స్థానమునందు కూర్చోగానే బేతాల్ MARK నకు కూడా ఒక తికమక ప్రశ్న సంధించినాడు భేతాళ్. జవాబు చెప్పేవానిలో చురుకుదనము ఉంటేనే వీలవుతుంది జవాబు చెప్పటానికి.

"నీ జేబులో రెండు సిగరెట్లున్నాయి. నీ వద్ద నిప్పు లేదు. ఏవిధముగా కనీసము ఒక సిగరెట్టయినా త్రాగ గలవు?" అన్నాడు భేతాళ్ పాత్రధారి రమణా రెడ్డి.

"దీనికి నావద్ద 4 జవాబులున్నాయి. అన్నీ చెప్పమంటారా ఒకటి చాలునా?" అన్నాడు రేలంగి MARK.

"ఒకజవాబే చెప్పలేక పరిగెత్తి పోతాడనుకొంటే 4 చెబుతానంటున్నాడే" అని తలచి చెప్పమన్నాడు బేతాళ్.

MARK ఈ విధముగా చెప్ప మొదలు పెట్టినాడు

"1. ఒక సిగరెట్టును నీళ్ళలో వేసినానంటే నావ బరువు తగ్గి 'Lighter' అయిపోతుంది. దానితో సిగరెట్టు వెలిగించుకొంటాను.

2. ఒక సిగరెట్టును పైకి ఎగురవేసి పట్టుకొంటాను. "CATCHES WIN MATCHES" కదా సిగరెట్టును వానితో వెలిగించుకొంటాను. అట్లు కొన్ని CATCHES పడితే ఒక MATCH BOX అవుతుంది. అప్పుడు సిగరెట్ వెలిగించుకోవచ్చు  కదా!

నీతలపే మది లోపల నీవలపే హృదిలోపల

నీటిలోన నిప్పు పుట్టి నీరూపములో వెలిగెను

అన్న ప్రసిద్ధ లలిత గీతమును మీరు వినలేదా! ఆ పాటను పాడుతాను దీపక్ రాగములో. నీటిలో నిప్పు పుడుతుంది. దానితో సిగరెట్టు వెలిగించుకొంటాను.

4. ఉన్న రెండు సిగరేట్లలో ఒక దానిని మీ పెదవులలో సుతరాముగా నిలుపండి. రెండవది ఏడుస్తూ కాలిపోతుంది. దానితో సిగరెట్టు వెలిగించండి."

బాబూ ఈ ఉద్యోగము నీదే! నా బావమరదికి వేరే ఉద్యోగమూ చూచుకొంటాను అన్నాడు రమణారెడ్డి బేతాళ్ రావు.

No comments:

Post a Comment