Friday 25 June 2021

అజరామర సూక్తి – 282 अजरामर सूक्ति – 282 Eternal Quote – 282

 

అజరామర సూక్తి  282

अजरामर सूक्ति  282

Eternal Quote  282

https://cherukuramamohan.blogspot.com/2021/06/282-282-eternal-quote-282.html


बालादपि ग्रहीतव्यं युक्तमुक्तं मनीषिभिः ।

रवेरविषये किं न प्रदीपस्य प्रकाशनम् ॥ - हितोपदेशसुहृद्भेद

బాలాదపి గ్రహీతవ్యం యుక్త ముక్తం మనీషిభిః l

రవే రవి విషయే కింన ప్రదీపస్య ప్రకాశనంll

విద్వాంసులైనవారు నీతియుక్తమైన వాక్కును బాలుడు చెప్పిననూ గ్రహించవలెను. 

చీకటుల చిదుమ సూర్యకాతి రాత్రులందు రాలేదు కదా! అప్పుడు చిరుదివ్వె వెలుగు 

చిందించగలుగు చున్నదిగదా!  కావున సమయోచిత సమాధానము చెప్పుటకు జ్ఞాన 

సవిత్రుడు అనగా జ్ఞాన సూర్యుడే రానవసరము లేదు. జ్ఞానవంతుడగు బాలుడు, తన 

జ్ఞాన పరిమితికి లోబడి, సమస్యను తీర్చగలడు. రాత్రమున చిరుదివ్వెవెలుగును మనము 

ఆధారము చేసుకొనుటలేదా!

దీప శిఖను మనము తిలకింప చిన్నదౌ

చిన్న వెలుగు తోడ చీల్చు తమము

భాను భాస మపుడు పరికింపగానౌనె

రామమోహనుక్తి రమ్య సూక్తి

సూర్యుడు గ్రహములకు అతిపెద్ద కాంతి వనరు కావచ్చు. కానీ తాను కూడా చేరుకోలేని 

ప్రదేశాలు ఉన్నాయి. లోతైన లోయలుచీకటి గుహలుదట్టమైన అడవుల గురించి 

ఆలోచించండి. ఈ ప్రదేశాలకు సూర్యకాంతి యొక్క నైజము తెలిసే అవకాశమే లేదు. 

అయితేఒక చిన్న దీపమును, ఆ ప్రదేశమునకు తీసుకుకు పోగాలిగితే తన శక్తి మేరకు 

 ఆ స్థలాన  వెలుగు నింపగలుగుతుంది. అటువంటి ప్రదేశములలోఅత్యంత 

ప్రకాశవంతమైన సూర్యుని కంటే దీపము అవసరమును దీర్చుచున్నది. రాత్రి పూట 

అసలు మనమున్న చోట సూర్యుని చూడలేము కదా! అంధకార బందురమైన గదిలో 

వెలుతురు నింపుటకు చిరుదివ్వె ఉపయోగపడుతుంది కానీ ప్రచండ సూర్యకిరణములు 

అచటికి చేరుకోలేవు కదా! కావున సహాయ పడుటకు జ్ఞాన సవిత్రుడే రానక్కరలేదు, 

బాలుడైనా జ్ఞానమనే తన చిరుదివ్వె వెలుగుతోనే మన కార్యములను చక్కబరచగలడు.

లక్షల విలువగలిగిన కొన్నితెలివైన సలహాలు కొన్నిమార్లు పిల్లల నోటి నుండియే 

వస్తాయి. పిల్లలు కల్లాకపటము కానని స్వచ్ఛమైన హృదయాలను కలిగి ఉంటారు. వారి 

పరిభాషలో జీవితము చాలా సులభమయినది. అందువల్లపెద్దలు విషయాలను 

క్లిష్టతరం చేసుకొన్నపుడుపిల్లలు తెలివిగా పరిష్కార మార్గము చూపిస్తూ ఉంటారు. ఆ 

సమయంలోఅది పిల్లల నుండి వచ్చినందున దానిని నిర్లక్ష్యము చేస్తే నష్టపోయేది 

మనమే! తెలివిగల సలహా ఎచటి నుండి వచ్చినా  అంగీకరించాలి మరియు గౌరవించాలి.

ప్రతి శిశువులోనూ అంతర్లీనముగా తనదగు ప్రజ్ఞ ఉంటుంది. మన సమస్య ఆ పరిధి 

లోనికి వచ్చిందంటే మనకు తక్షణమే సమాధానము దొరకుతుంది.  బాలురు 

బుద్ధికుశలురు, వారివి డేగకళ్ళు. కాబట్టి వారి మాటలపై శ్రద్ధ వహించుట ఎంతో 

అవసరము.

बालादपि ग्रहीतव्यं युक्तमुक्तं मनीषिभिः ।

रवेरविषये किं न प्रदीपस्य प्रकाशनम् ॥ - हितोपदेशसुहृद्भेद

समझदार शब्दअगर एक बच्चे से भी  रहे हैंतो हमें बुजुर्ग होनेपर भी ग्रहण करना चाहिए। जहां सूर्य नहीं हो सकता वहां क्या दीपक का सहारा नहीं नहीं लेते क्या?

 सूर्य किसी ग्रह के लिए प्रकाश का सबसे बड़ा स्रोत है। लेकिन ऐसी जगहें भी हैं जहां वह नहीं पहुंच सकता। सबसे गहरी घाटियोंसबसे अंधेरी गुफाओंसबसे घने जंगलों के बारे में सोचो। इन जगहों पर किसी ने भी शायद ही कभी सूरज की रोशनी की फीकी किरण देखी होगी ? हालाँकिएक छोटा सा दीपक जब वहाँ ले जाया जाता हैतो वह पूरे स्थान को रोशन कर देता हैऐसे स्थान के लिए बड़े उज्ज्वल सूर्य की अपेक्षा से दीपक अधिक उपयुक्त होता है। फिर रात के बारे में कैसेसूरज रात में कमरे को रोशन करने के लिए नहीं पहुँच सकतालेकिन एक छोटा सा दीपक कर सकता है!

यही बात बुद्धिमानी भरी बातों के साथ भी होती हैजो कभी-कभी किसी बच्चे के मुंह से निकलती हैफिर भी उसकी कीमत लाखों में होती है। बच्चे बिना द्वेष के बोलते हैं और दिल के सबसे शुद्ध होते हैं। उनकी शब्दावली में जीवन बहुत सरल और सुगम होता है। इसलिएजब वयस्क चीजों को जटिल बनाते हैंतो बच्चे अधिक समझदारी से बोलने लगते हैंउस समय इसे सिर्फ इसलिए छूट नहीं देना चाहिए क्योंकि यह एक बच्चे से आया है। किसी भी मुख या साधन से निकले ज्ञानी वचनों को स्वीकार करना चाहिए और उनका सम्मान करना चाहिए

हर बच्चा प्रतिभाशाली होसकता है। लेकिन हर बच्चा अपने अपाने विभाग में पारंगत होसकता है l अधिकतर बच्चे बुद्धिमान और चौकस होते हैंकभी-कभी उनकी बातों पर ध्यान दें

bālādapi grahītavya yuktamukta manīṣibhi 

raveraviaye ki na pradīpasya prakāśanam  hitopadeśa, suhdbheda

Sensible words, if coming even from a child, should be received by mankind. 

Doesn't a lamp illuminate where the sun cannot?

The sun might be the biggest source of light for a planet. But there are places 

where even He can't reach. Think about the deepest valleys, the darkest caves, 

the thickest forests. These places might have never seen the faintest ray of 

sunlight. However, a small lamp when taken there, lights up the whole place! For 

such a place, a lamp is much more appropriate than the big bright sun.  How 

about at night?  The sun can't reach at night to light up the room, but a little lamp 

can!

Same is the case with wise words, which sometimes, comes from the mouth of a 

child, yet they are worth a million. Children speak with no malice and have the 

purest of hearts. Life is very simple in their terminology. Hence, when adults 

complicate things, children seem to speak more sensibly! At that time, one 

should not discount it just because it came from a child. Wise words from any 

mouth or means should be accepted and respected.

Every child is born a genius. They are wise and observant!  Heed to their words 

sometimes.

స్వస్తి.

No comments:

Post a Comment