Friday 30 June 2023

కొనకుండా నవ్వుకొనండి-రేలంగి-రమణారెడ్డి

  కొనకుండా నవ్వుకొనండి-రేలంగి-రమణారెడ్డి 

                                            (స్వకపోల కల్పితము)

https://cherukuramamohan.blogspot.com/2023/06/13-public-limited-companies-microsoft.html

ఒకసారి మహా మేధావి యగు రమణారెడ్డి అనేకానేక సార్వజనీన సంస్థలలో (Public Limited Companies) లో పని చేసిన అనుభవముతో Microsoft Corporation, USA కు ఉద్యోగమ కొరకు తన ప్రవర(Bio Data)తో దరఖాస్తు పెట్టుకొన్నాడు. కొన్ని రోజులతరువాత అతనికి ఈ విధమైన జవాబు వచ్చింది ఆంగ్లములో:

Dear Mr. Maha Pandit

You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained.

Thanks

Bill Gates.

రమణారెడ్డి ఆనందముతో అరిచి, తెలుగువాడు కాబట్టి. ప్రెస్ రిపోర్టరు అయిన తన అల్లుడు రేలంగిని పిలిచి అతనికి తెలిసిన తెలుగు పత్రికా విలేఖరులను అందరినీ పిలిపించమన్నాడు. అందరూ సమావేశమైన తరువాత ఆయన తన అల్లునితో “నేను ఈ ఉత్తరములోని ఆంగ్లమును చదువుతాను, నీవు తర్జుమాచేసేది’ అన్నాడు. ‘ఓహ్! అదెంతపని” అన్నాడు రేలంగి. రెడ్డిగారు ఉపన్యాసాన్ని ఈ విధముగా ప్రారంభించినారు.

“Dear Scribes I have received letter from Microsoft USA. I shall let you know the contents of it”. My Son-in-Law Relangi will translate the contents of the letter into Telugu, as I read out the same in English.”

రేలంగి, ఫిరంగిగా మారి తెలుగు గుండ్లను ఈవిధముగా ప్రేల్చనారంభించినాడు.

"విలే ఖరులారా (విలేఖరులారా అనుటకు బదులు) నా కాకి మెత్త (My Crow Soft) నీవౌనొక (you yes a) నుండి నాకు లేఖ అందినది. అందులోని సారాంశమును మీకు తెలుపుతాను. మీరందరూ తెలుగు విలేఖరులు కాబట్టి నేను వారు పంపిన ఉత్తరమును, ఆంగ్లములో, యథాతథముగా చదువుతాను. నా ఉభయభాషా ప్రవీణుడైన అల్లుడు రేలంగి (అంటే నేను అని గుండె చరిచి చెప్పినాడు) ఆంగ్లమునుతర్జుమా చేసిన తెలుగులో మీకు వినిపిస్తాడు.  మీరు వ్రాసుకోండి." అని తర్జుమా చేసినాడు ‘ఉభయ భాషా ప్రవీణ’ రేలంగి గారు.

ఆ ఆంగ్ల పఠనము, తెలుగు అనుసరణ ఈ విధముగా సాగినాయి.

Dear Mr. Ramana Reddy >>ప్రియమైన శ్రీ ‘రామన్నా సిద్ధం’ (Ramana Reddy కి తెలుగు తర్జుమా, Ramana అన్న మాటను రామన్నా గానూ, రేలంగి గారు, Reddy అన్నమాటను Ready గా తీసుకొన్నారు) మహాశయా

You do not meet >>మీరు కలువనే కలువరు

Our requirement >>మాకు అవసరము అంటే మీ కలయిక మాకు అవసరము అని అర్థము.

Please do not send any further correspondence >> మీరు తిరిగి జవాబు తెలిపే ప్రయత్నమూ చేయవద్దు

No phone call >>ఫోన్ లో మాట్లాడే పని కూడా చేయ వద్దు

Shall be entertained >> తప్పక రంజింపచేస్తాము అంటే మీరు వచ్చినారంటే మిమ్ము సంతోషపరుస్తాము.

Thanks >> కృతజ్ఞతలు

Bill Gates.  >> చీటీ గేట్లు

తరువాత రోజు దిన పత్రికలలో వచ్చిన ఈ వార్త చదివి నవ్వి నవ్వి Treatment కు Dr.Prabhakar Reddy వద్దకు పోయినారట.

Monday 26 June 2023

ఇది కథ కాదు వాస్తవికత

ఇది కథ కాదు వాస్తవికత

https://cherukuramamohan.blogspot.com/2023/06/l-6-71-73-1933-to-1948.html

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్l

ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్॥

(మహా ఉపనిషత్తు 6వ అధ్యాయము 71 - 73)

మహారాజా దిగ్విజయ్‌సింహ్ జీ రంజిత్‌సింహ్ జీ జడేజాను (1933 to 1948) నవనగర్‌కు చెందిన జామ్ సాహెబ్ అని పిలుస్తారు. దయార్ద్ర హృదయుడగు ఈ మహాపురుషుని గురించి మనము వినము పాఠ్యాంశముగా పొరబాటున కూడా చదువము. రెండవ ప్రపంచ యుద్ధములో పోలిష్ శరణార్ధు లగు తల్లులకు పిల్లలలకు,వారి కష్టములనును గురించి విని గుజరాత్‌లోని తన పాలనా పరిధిలోని ఒక ప్రాంతములో వారికి అన్నివిధములగు వసతులు కల్పించి వారిచే బాపూ అని పిలిపించుకొన అపర శిబి చక్రవర్తి.

మానవత్వం మరియు సర్వమానవ సహోదరత్వము పై ప్రపంచ విశ్వాసాన్ని కలిగించే ఈ వాస్తవ కథనాన్ని చూడండి.రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పోలెండ్ పిల్లలను రక్షించడానికి కంకణము కట్టుకొన్న భారతీయ రాజు దీనికి ఉదాహరణ.

రెండవ ప్రపంచ యుద్ధము చిన్న చిన్నఐరోపా దేశాలకు వినాశ హేతువుగా పరిణమించినది. సెప్టెంబరు 1939లో హిట్లర్ బలగాలు పోలాండ్‌పై దాడి చేయడంతో దేశంలో లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయినారు. ప్రమాదకరమైన పరిణామాలతో పోరాడుతూ, అనేక మంది మహిళలు మరియు పిల్లలు ఇతర ప్రదేశాలలో ఆశ్రయం పొందేందుకు ప్రభుత్వము యొక్క ఆజ్ఞ మేరకు దేశము వదిలి ఓడలో శరణార్థులై సాగినారు. కానీ అనేక దేశాలు వారిని అనాదరణకు గురిచేసి  వారిని నిస్సహాయంగా వదిలివేసినారు. చివరికి, మెక్సికో, న్యూజిలాండ్ మరియు భారతదేశము వంటి దేశాలు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాయి

భారతదేశంలో, నవనగర్‌కు చెందిన మహారాజా దిగ్విజయ్‌సింహ్ జీ రంజిత్‌సింహ్ జీ జడేజా వారికి కారుణాకర హృదయుడై తన కారుణాకరమును అందించినాడు. శరణార్థులు బొంబాయి లో  అడుగుపెట్టినప్పుడు బ్రిటీష్ అధికారులు వారి ప్రవేశాన్ని తిరస్కరించ నిర్ణయించుకొని యుండినారు. ఆ శరణార్థుల  కష్టాలను చూసి, దిగ్విజయ సిమ్హులవారు  వారికి సహాయము చేయ కృతనిశ్చయులైనారు.కానీ బ్రిటీషు వారి పాలన కావున  ప్రతిఘటన ఎదుర్కొనవలసి వచ్చినది. అయినప్పటికీ, 'జామ్‌సాహెబ్' గారు వెనుకాడక అకుంఠిత దీక్షతో మొక్కవోని ధైర్యముతో బ్రిటీషు వారిని ఒప్పించి మెప్పించి  పోలిష్ శరణార్థులను తీసుకువెళుతున్న ఓడను రోసీ అనే ఓడరేవు వద్ద నిలపమని ఆదేశించినాడు.ఆయన  తన వేసవి రాజభవనానికి సమీపంలోని జామ్‌నగర్ జిల్లాలోని బాలచాడి అనే పట్టణంలో గుడారాలు వేయించినాడు. 'హోమ్ ఎవే ఫ్రమ్ హోమ్'గా పోలిష్ శరణార్థులకు వేరు దేశంలో ఉన్న భావన   రానీకుండా మహారాజా వారు చూసుకున్నారు. ఆయన  మొత్తం 640 మంది శరణార్థులకు సహాయం చేయటం జరిగింది. అందులో మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. భోజన నిద్రా వసతులకు సంబందినంతవరకు  వారికి అవసరమైన వస్తువులను అన్నీ ఆయన సమకూర్చినారు.ఒకసారి బాలచాడి శిబిరంలో ఒక పోలిష్ శరణార్థి శిబిరంలో వండిన బచ్చలికూర  నచ్చలేదని మారాము  చేస్తే , శరణార్థులు అందరూ కలిసి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. వారంతా మహారాజావారిని బాపూ అని పిలిచేవారు.ఈ విషయం విని బాపు వెంటనే వంటవాళ్లను ఇకపై ఆ వంటకమును చేయవద్దని వంటవారికి ఆదేశమునిచ్చినాడు.

నేటికీ మహారాజు పెద్ద మనసును ఆ పోలిష్ శరణార్థులు, ఆ ప్రభుత్వానికి మరువలేనిది. 'సర్వైవర్స్ ఆఫ్ బాలచాడి' అనే బృందం అతన్ని ప్రేమమయుడైన 'బాపూ'గా  గుర్తుంచుకొనుటయేగాక  అంతటి ప్రపంచ యుద్ధ సమయములో తమ ప్రాణాలను కాపాడి అక్కున చేర్చుకొన్నందుకు  అతనికి ఎప్పటికీ ఋణపడి ఉండు విధముగా ఆ మహానుభావునికి నివాళిగా, వార్సాలోని ఒక చతురస్రానికి రాజు పేరు పెట్టారు. 2014లో 'స్క్వేర్ ఆఫ్ ది గుడ్ మహారాజా' అనే ప్రాంతంలో ఒక పార్క్ నిర్మించబడింది. ఈ రోజు కూడా స్థానికులు సందర్శించే అతని గౌరవార్థం ఒక స్మారక చిహ్నం నిర్మించబడింది.

స్వస్తి.


Thursday 8 June 2023

మనలోనే మనకు వైరమా

 మనలోనే మనకు వైరమా 

https://cherukuramamohan.blogspot.com/2023/06/blog-post.html

ఈ దిగువ ఒక పాఠకుడు 

శంకరాచార్య నిందన చేసే వాళ్లని ఇలా స్మార్త గ్రూపులలో పాడి పొగడడం తరమా. శంకరుల తల్లి దుర్వ్యవహారం వల్ల శంకరుల పుట్టారని మాధవులు నిందతో ఉంటారు. అటువంటి మాధవులని ఆరాధించడమే కాక ఇల్లా స్మార్త గ్రూపులలో ప్రచారం చేయడం ఎప్పుటికీ సరికాదు. మీ నమ్మకాలు మీ వైయక్తికం.

శంకరులు సన్యసించి కూడా తన తల్లి అవసానదశలో ఉన్నాడని దివ్యదృష్టితో గ్రహించి తల్లివద్దకు చేరుకొని ఆమెను మరణానంతరము, ఆమె కోరిన విధముగా వైకుంఠమునకు పంపుతాడు. తల్లిని గూర్చి విలపించుతూ 'మాత్రు పంచకము' ఆశువుగా చెబుతాడు, శంకరులు వారి తలిదండ్రుల తపోదీక్ష వల్ల కలిగిన కుమారుడు. ఈ విషయమును, శంకరుల వారికాలములో ఉండి 'శంకర విజయము' వ్రాసిన చిత్సుఖాచార్యుల రచన ద్వారా తెలుసుకొనవచ్చును. 

సైద్దాంతికముగా వాదాడ నేర్వనివారు ఏనుగుపై దుమ్ము జల్ల ప్రయత్నించిన వారే ఔతారు. 

ఈ నీతిశాస్త్రోక్తిని గమనించండి.

సత్యం భ్రూయాత్ ప్రియం బ్రూయాత్ 

న  భ్రూయాత్ సత్యమప్రియం

ప్రియం చ నానృతం  భ్రూయాత్ 

ఏషా ధర్మ స్సనాతన: ||

మానవ జీవితంలో మాటకు (వాక్కుకు) ఉన్న మహిమ మహత్తరమైనది.. సత్యమునే పలుకవలెను అని మనందరం అనుకుంటాం.. అయితే, కొన్ని సందర్భాలలో సత్యం మాట్లాడకూడదని కూడా తెలుసుకోవాలి. అవి ఏమిటో ఈ శ్లోకంలో వివరించినారు. 

ఎల్లప్పుడూ సత్యమే పలకాలి.ప్రియమైన మాటలనే పలకాలి. అయితే, ఎదుటివారిని బాధపెట్టే మాటలు ఎంత సత్యమైనప్పటికీ వాటిని పలుకరాదు. అలా అని, ప్రియం చేకూర్చే మాట అనుకుంటూ అబద్ధం కూడా చెప్పకూడదు. ధర్మము చాలా సూక్ష్మమైనది.దానినెరిగి ప్రవర్తించవలెను.


వైష్ణవులు మాధ్వులు అందరూ సనాతన ధార్మికులే! ఒకే చెట్టుకు అనేక శాఖలు ఉంటాయి. మనము ఫలానా శాఖ పళ్ళను మాత్రమే తినము. అన్నమయ్య వైష్ణవుడు. అందరూ ఆరాధించుచున్నారు. ఆళ్వారులు ఆండాళ్ తో సహా అంతావైష్ణవులు. ఇప్పుడు స్మార్తులలో తిరుప్పావై చదువుతూ ఆండాళ్ నోములు నోమేవారెందరో!

ఇక ద్వైతము. ఆత్మ వేరు పరమాత్మ వేరు అని ప్రతిపాదించుటచే ఈ ఆత్మికజీవి పరమాత్ముని చేరుటకు పరితపించుతాడు. అంతే కానీ అన్యథా కాదు. ఉడిపి మంత్రాలయములకు వెళ్ళే వారిలో అద్వైతులే ఎక్కువ. నేను అద్వైతిని. శంకరులవారి సిద్ధాంతములు నాకు శిరౌదార్యములు. కానీ చావుబ్రతుకుల మధ్యనున్న నా శ్రీమతిని రక్షినది ఎ మందులూ వైద్యులూ కాదు. ర్మంత్రాలయ రాఘవెంద్రుడే! ఆయన అద్వైతులను గానీ శంకరుల వారినిగానీ తూలనాదినట్లు నేను చదువలేదు.

ఇక శంకరుల వారిని గూర్చి చేప్పుటకు నా శక్తి చాలదు. వారి గొప్పదనమంతా ఈ  క్రింది శ్లోకము లోనే ఉన్నది.ఆయనను 'అపర  శంకరులు' అని శ్లోకములోనే చెప్పబడినది. .

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం.

సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః॥

శంకరం శంకరాచార్యమ్ కేశవం బాదరాయణం

సూత్రభష్యకృతౌ వన్దే భగవంతౌ పునః పునః.

సూత్రం మరియు భాష యొక్క రచయితలు అయిన శ్రీ శంకరాచార్య రూపంలో ఉన్న శివునికి మరియు వేదవ్యాస (బాదరాయణ) రూపంలో ఉన్న విష్ణువుకు మళ్లీ మళ్లీ నమస్కారాలు.ఇక్కడ శంకరులవారిని అపర శంకరులుగా చెప్పుట జరిగినది.


అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్l

షోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రిమ్శే మునిరత్యగాత్ll

అని ఆ అపర శంకరులను గూర్చి తెలుపుతూ ఉంది. మనము అద్వైతులము స్మృతులను విశ్వసించుతాము కాబట్టి స్మార్తులమైనాము. విశిష్టాద్వైతులు, మాధవులు కూడా స్మృతులను నమ్ముతారు. ఆ విధముగా వారు కూడా స్మార్తులే కదా! వేదాలను నమ్ముతారు కావున వారుకూడా వైదికులైనారు కదా! 

అంతే కాక ఆదిశంకరులను' అపర శంకరులు అన్నారు, 'జగద్గురువు అన్నారు. మిగత మతాచార్యులను 'అపర విష్ణువు' 'అపర ఆంజనేయుడు' అనలేదు.

ఇక ఉపసంహారానికి వద్దాము. నేను మీకు పైన తెలిపిన ఉదాహరణ ప్రకారము మన మూలము ఒకటే! 12వ శతాబ్దానికి చెందినా రామానుజులవారు 120 సంవత్సరములు జీవించినట్లు చెబుతారు కానీ ఆయన మొత్తము దేశమును తిరిగినట్లు తెలిసిరాదు. క్రీస్తు పూర్వము 4 శతాబ్దికి చెందిన శంకరాచార్యులవలె, 14వ శతాబ్దమునకు చెందిన మధ్వాచార్యులవారు  నాటి భారతదేశమును 32 సంవత్సరముల వయసులోపే చుట్టిన దాఖలలు లేవు.  మధ్వాచార్యులవారు దక్షిణాది మాత్రమే తిరిగినారు.


విషయమును వివరముగా చెప్పవలసిన బాధ్యత మనదే!

ఓరుపు నేరుపు కలసిన

మారుపు  తేగలుగవచ్చు మంచి మనసుతో

పరిమర్ష గల్గువానికి  (పరిమర్ష = కోపము)

పరిణామము తెలియరాదు పరహిత రామా!


ద్వేషము స్వస్థత చెరచును 

ద్వేషము వైరమ్ము పెంచు తీరుగ తలవన్

ద్వేషము మిత్రుల బాపును 

ద్వేషము కెల్లపుడు నీవు ద్వేషిగా మనుమా!


ఈ దిగువన ఒక అద్వైతి ఆవేదన గమనించండి.


ద్వైతుల గురువు రాఘవేంద్రుల వారు రచించిన, (లేక ప్రక్షిప్తములేమో. ఇది నామాట) ఈ బాలుడు పారాయణం చేస్తున్న శ్లోకాలను ఒప్పుకుంటారా తెలుసుకోండి.???

ఒప్పుకుంటే ఆ అంత నిందను వారు చేసినట్టే

ఇది వారి పరంపరలో వచ్చిన గ్రంథం ఇప్పుడు మంత్రాలయ పాఠశాలలో పాఠం చేస్తారు

దీన్ని సూక్ష్మంగా గమనిస్తే రాఘవేంద్రుల వారు స్మార్తులకి గురు ఎలా కారని స్పష్టపడుతుంది మరియు ఈ అంతా నింద తప్పనియు చేయొద్దనియు వారు ఎక్కడా చెప్పి లేదు కాదా వారే పారాయణం చేసి ప్రోత్సహించారు అంటే వారి ఆంతర్యం గ్రహించండి సంస్కృత శుభాషితాలు కొన్ని రాశారు కాబట్టి మీకు సంస్కృతం తెలుస్తుందని ఊహిస్తున్న అయినా కానీ దాని అనువాద కింద ఉన్నది

కిందటి విడియోలో చూడండి పారాయణం

అదేమిటో తెలుసా సుమధ్వ విజయం గ్రంథంలో 1సర్గలో

49 to 55 శ్లోకాల్లో వున్నా విషయం

ఆ బాలుడు చేస్తున్న నిందకు అర్థం శ్లోకాలకు

కాలడి అనే బ్రాహ్మణ అగ్రహారం మణిమంత రాక్షసుడు సంకరడుగా పుట్టినాడు వాణిది సాంకర్య (వ్యభిచార) జన్మ

అంతా ఒక్కటే అన్నాడు

ఎవరు తన మాట వినరేమో అని

దుర్బుద్ధి తో అందరు ఏ ఆశ్రమం వారి మాట వింటారో అలాంటి సన్యాస ఆశ్రమాన్ని మోసం గా తీసుకున్నాడు

తనది కాని దాన్ని తనది చేప్పే వాడు దోంగ

విడు తనది కాని బ్రహ్మని తాను అన్న మహాతస్కర (పెద్ద దోంగ)

పరమపవిత్ర మైన బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాచాడు అది ఎలా ఉందంటే

పురోడాశ అన్నాని యజ్ఞానికి మడి గా చేస్తే

మలం తింటున్న కుక్క వచ్చి తింటే ఎలాగుంటుందో అలా

దోంగ పిల్లి ఎలా హవిర్శేశాన్ని తింటున్న దో అలా

దేవుడి పూజకి మంచి పూల మాల ఉంటే దాన్ని ఒక కోతి పీకేస్తోంటే ఎలాగుంటుందో అలా

పద్మ సరోవరానికి మదగజం వచ్చి తొక్కి నాశనం చేస్తే ఎలాగుంటుందో అలా

జగన్మిథ్య అంటూ జనులను వంచన చేస్తుండేవారు

అని చప్పుతున్నాడు

ఇక్కడ ఆలోచించాలి కాలడి పుట్టిన వారెవరు ?

సన్యాసం తీసుకున్నది ఎవరు ?

మలం తింటున్న కుక్క, దోంగ పిల్లి, మదగజం, కోతి మహాతస్కర (పెద్ద దోంగ) అని ఎవర్ని నిందిస్తున్నారు ?

ఇలా బాలపాఠంలో నే శంకర నిందను స్మార్త ద్వేషాన్ని నూరిపోసుతున్నారు గా

ఎవరు మారాలి ?

ఇవన్నీ భయంకర నింద తెలిసిన కూడా బ్రాహ్మణ ఐక్యతా అంతా ఒకటే అని ఊరికే అందామా ???


ఒక్కరు తిడుతూ ఉంటాను అదే సత్యం అదే మా పరంపరలో వచ్చినది, మీరు ఒప్పుకోకున్నా, ఇదే మాకు శాస్త్రియత అని

నిందను చేస్తున్నారు, అప్పుడు ఐకమత్యము సాధ్యమేలా వీలౌతుంది.



Cheruku Ramamohanrao, ayyaa meeku S Pavan Sharma choopettina aadhaaraalu ishtamayyaayi anukuntaanu.. Mana gurluvulaina shankaruluvaarini nindinchina vaaru manaku sarvatha poojyulu kaaru. 


Cheruku Ramamohanrao

Author

Top contributor

మీకు అటు అద్వైతము మీద ఇటు శంకరుల వారిమీద ఉన్న భక్తి గౌరవాలకు  అనేకానేక నీరాజనాలు. 

ఒకటి కావాలని త్రిమతాల వారికందరకూ కలిగితే ఐకమత్యము సాధ్యమౌతుంది.

అలా కావాలంటే పరస్పర గురువులను ఆచార సంప్రదాయాలను గౌరవించాలి అప్పుడు ఐక్యత సాధ్యమౌతుంది.


S Pavan Sharma garu, ఈ విధముగా కొందరు స్మార్తులు మాధ్వులను కూడా నింద చేసినారు.ద్వేషానికి ద్వేషము సమాధానము కాలేదు. శంకరులవారిని అభిశంశించినవారు, వారికాలములో ఎందరో. ముఖ్యముగా జైన బౌద్ధ కర్మిష్లులు ఉండినారు. వారినందరినీ తన వాదనా ప్రతిభతో ఓడించినారు.

‘బ్రహ్మావతార స్వరూపుడు’గా భావించే మండనమిశ్రుడిని వాదనలో జయించిన పిమ్మట, వారిని శిష్యులుగా చేర్చుకొని సన్యాసాశ్రమం ఇవ్వగా, ఆయనే ‘సురేశ్వరాచార్యులు’గా ప్రసిద్ధి చెందినారు. వారి ధర్మపత్ని ఉభయభారతీ మాతను శారదాదేవి స్వరూపిణిగా గుర్తెరింగి తాను స్థాపించబోయే పీఠాలకు ‘అధిష్ఠాన దేవత’గా ఉండమని శంకరులు కోరగా, ఆ జగన్మాత దానికి అంగీకరించింది. ఇక్కడ ఎక్కడా ఆమహనీయుడు ద్వేషణకు తావివ్వలేదు. మండన మిశ్రులవారి ప్రథమ గురువగు గౌడపాదులవారు వేషము మార్చి బౌద్దునిగా వారి ఆరామము చేరి వారితో వాదించగా, వారు సహించలేక పై అంతస్తునుంది తోస్తే వారు 'వేదాలు నిజమైతే నేను క్షేమముగా క్రిందికి చేరుతాను' అని ఊరుకోన్నాడేగానీ తన శిష్యగణముతో పోయి ఎదిరించలేదు. అంతే కాదు క్షణికావేశమునకు గురియైనందుకు తన తనువునే తుషాగ్నికి ఆహుతి చేసుకొన్నాడు కానీ పరమతస్తులను ద్వేషించలేదు.అట్టిమహనీయులు మనకు ఆదర్శము. అద్వైతము అఖండమౌ అగ్ని. ద్వేషించే వారంతా శలభములే!

ఇంకా మీరు ద్వేషమునకే ప్రాధాన్యత ఇస్తే వయసు కారణముగా, నేను సమాదానములనిస్తూ పోలేను. మన్నించేది.


ఇది ఆస్యగ్రంధిలో నాకు పైవారితో జరిగిన సంవాదము. ఐక్య రాష్ట్ర కూటమి (United States) లోని ఒక రాష్ట్రములో ప్రాథమిక విద్యా శాలలలో బైబిలు , అశ్లీలత, హింస ఉన్న కారణముగా నిషేధింపబడినది, ఈ దిగువ BBC ప్రసారము చేసిన వార్తను మీ ముందుంచుచున్నాను. Washington: A school district in the US state of Utah has banned the Holy Bible in primary schools for “vulgarity and violence”, the media reported on Saturday.


The decision was taken this week by the Davis School District, located north of the state capital Salt Lake City, the BBC reported.

ఇక అటువంటి ఉదంతములు ఖురాను లోనయితే చెప్పనవసరమే లేదు. దురదృష్టకరమైన విషయమేమిటంటే ముస్లీములు ఆ విషయములను పిల్లలకు బోధించి మతఛాందసులుగా మార్చుట మానరు. ఈ రెండు మతాలవారూ సామ దాన భేద దండోపాయాలతో మన మతము నుండి మాట మార్పిడులను ప్రోత్సహించే వారే!

అందుచేత నేను చేపావచేదేమిటంటే 

మనలో మనం 

కలసి ఉంటె కలదు సుఖం

కాదంటే కలుగును దుఃఖం

చేయి చేయి జత కలిసిన 

చేయలేనిదేమున్నది

చెరుపు జేయ తలపోసిన

చెడుమతాల చీడ వదల

చెంగట చెడు చేరనీక

చేవ జూపి సాగుదాం


స్వస్తి.