Friday 18 June 2021

అజరామర సూక్తి – 275 अजरामर सूक्ति – 275 Eternal Quote – 275

 అజరామర సూక్తి  275

अजरामर सूक्ति  275

Eternal Quote  275

https://cherukuramamohan.blogspot.com/2021/06/275-275-eternal-quote-275.html

भग्नाशस्य करंड पिंडिततानोर्म्लानेन्द्रियास्यक्षुधा

कृत्वांखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः l

तृप्तस्तत्पिशितेन सत्वर मसौ तेनैव यातःपथा

स्वस्थास्तिष्ठत दैव मेवहि परं वृद्धधौ क्षैये कारणं ll

భగ్నాశస్య కరండ పిండిత తనోర్మ్లానేంద్రియస్య క్షుధా

కృత్వాఖుర్వివరం స్వయం నిపతితో నక్తం ముఖే భోగినః ।

తృప్తస్తత్పిశితేన సత్వరమసౌ తేనైవ యాతః పథా

స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్ధౌ క్షయే కారణమ్‌॥ భర్తృహరి

రాతిరి మూషకమ్ము వివరమ్బొనరించి కరండబద్ధమై

భీతిలి చిక్కి యాసచెడి పెద్దయు డస్సిన పామువాత సం

పాతము చెందె దానిదిని పాము తొలంగె బిలంబు త్రోవనే

యేతరి హాని వృద్ధులకు నెక్కటి దైవము కారణమ్మగున్ (ఏనుగు లక్ష్మణ కవి)

కర్మ ఫలము దైవానుగ్రహము జీవితాలలో ఎంతగా పనిచేస్తాయో తెలియజేసే శ్లోకము 

ఇది. అందుకే ఒక కర్మను చేయ చేబూనునపుడు మాత్రమే కాకుండా 

నిరంతరమూ దైవ ధ్యాన తత్పరతను పెంచుకొనుటచే దుష్ఫలిత ప్రభావమును సడలింప 

జేయుచూ, అది బుద్ధిని ప్రచోదనము చేసి సత్కర్మాచరణ చేయ ప్రేరేపించుతుంది. ఈ 

శ్లోకార్థమును గమనించండి.

      బుట్టలో బంధింపబడినదై భయము చేత కృశించినదై ఆశలుడిగి ఆకలిగొన్న పాము 

వాత ఒక ఎలుక,బుట్టలో తినుటకేదో యున్నదని భావించి దానికి బొరియ గావించి 

లోనికి దూరిబడి చావగా దాని తిని పాము ఆ రంధ్రము గుండానే బయటికి వెళ్లి 

పోయింది . మంచి చెడులకు  కారణము దైవము కాదా !

ఇక్కడ ఎలుక కామము అనగా కోరికకు బానిసయి వివేచనారహితముగా పాముకు 

బలియై పోయినది. ఈ విషయమును విశదపరిచే ఈ శ్లోకము, భగవద్గీత,  కర్మసన్యాస 

యోగములోనిది. గమనించండి.

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ ।

అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ।। 12 ।।

సకల క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసికర్మ యోగులు 

శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలోతమ కామముచే అనగా 

కోరికలచే ప్రేరేపింపబడిస్వార్థ ప్రయోజనం కోసం పని చేసే వారుకర్మ బంధములలో 

చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆకర్మ 

మంచికే దారి తీస్తుందో చెడుగుకే దారి తీస్తుందో అది భగవంతుని నిర్ణయముపై 

ఆధారపడి యుంటుంది.

       అదే సందేహము అర్జునునికి కూడా కలుగుటచే ఆయన శ్రీకృష్ణుని ఈ విధముగా 

అడుగుచున్నాడు “ చేసే పని ఒక్కటే అయినాకొందరు భౌతిక బంధాలలో 

చిక్కుకుంటారుఅదే సమయంలో మరి కొందరు భౌతిక బంధాలనుండి విముక్తి 

పొందుతారు అన్న విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి”?  శ్రీ కృష్ణుని జవాబు ఈ 

శ్లోకంలో వినండి. భౌతిక ఫలాలపై ఆసక్తి లేకుండావాటిచే ప్రేరేపింపబడకుండాఉన్న 

వారు కర్మ బంధాలలో చిక్కుకోరు. కానీప్రతిఫలము కోసం ప్రాకులాడుతూ మరియు 

భౌతిక సుఖాలు అనుభవించాలనే కామానికి వశమై పోతేవారుకర్మబంధ ప్రతి 

క్రియలలో చిక్కుకుంటారు. మంచికయినా చేడుకయినా కర్మఫలము అనుభవించక 

తప్పదు.

 'యుక్తఅంటే "భగవంతుని తో అంతర్గతంగా ఏకమై పోవటం. "అంతఃకరణ శుద్ది 

తప్ప మరే ఏ ఇతర ప్రతిఫలమూ కోరుకోకపోవుట" అని చెప్పుకోవచ్చు. 'యుక్త

పురుషులు తమ కర్మలకు ప్రతిఫలాన్ని ఆశించకుండాప్రతిగాఅంతఃకరణ శుద్ది 

కోసము మాత్రమే కర్మలు చేస్తుంటారు. కాబట్టివారు త్వరలోనే దివ్య జ్ఞానాన్ని మరియు 

శాశ్వతమైన ముక్తిని పొందుతారు.

 మరో పక్క, 'అయుక్తఅంటే, "భగవంతునితో ఏకమవ్వకుండా" అని అర్థం. మరో 

విధంగా కూడా చెప్పవచ్చు, "ఆత్మకు శ్రేయస్సు కలిగించని ప్రాపంచిక ప్రతిఫలాలు 

ఆశించటం" అని. ఇటువంటి వారుఅత్యాశ చే ఉసికొల్పబడివ్యామోహంతో కర్మ 

ఫలములను ఆశిస్తారు. ఇటువంటి దృక్పథంలో చేయబడిన పనులు ఆ 'అయుక్త

వ్యక్తులను జన్మ-మృత్యు సంసార చక్రం లో బంధింపబడి జనన మరణాలను, ఎలుకవలె, 

పొందుతూనే ఉంటారు.

भग्नाशस्य करंड पिंडिततानोर्म्लानेन्द्रियास्यक्षुधा

कृत्वांखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः l

तृप्तस्तत्पिशितेन सत्वर मसौ तेनैव यातःपथा

स्वस्थास्तिष्ठत दैव मेवहि परं वृद्धधौ क्षैये कारणं ll

टोकरी में फँसा भूखा साँपबाहर निकालनेका कोइ रास्ते के बिना लाचार टोकरी में पडी थी l  टोकरी में खाना मिलनेकी  उम्मीद मेंएक चूहा छेद करके उस के अन्दर घुसा ओर उसमें दब गया। साँप उसे खाकर उसी रंध्र से बाहर निकल गई l हर एक घटना का इश्वर ही उत्तरदाई होता है l

 युक्तकर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् |

अयुक्तकामकारेण फले सक्तो निबध्यते || 12||

जो लोग सांसारिक इच्छाओं से ग्रस्त हैंवे तार्किक सोच के लिए जगह नहीं देंगे। वे स्वैच्छिक या अनैच्छिक 'कर्मकरतेहुए भगवान को 'सापेक्ष कर्म’ के अच्छे या बुरे कर्म के प्रभावको स्वीकार करने में सक्षम बनते हैं। इधर चूहा बिना दिमाग लगाएनतीजों से ज्यादाखाने के लिए उत्सुक था। उसीलिए इच्छा के प्रबक्लता का बंदी होकर नतीजे के बदले में खानेकेलिए तरसा l इस सिलसिलेमें उपरोक्त श्लोक की अवधि को प्रमाणित करने के लिए मैं 'भगवद्गीता के कर्म संन्यास योगसे एक प्रासंगिक श्लोक उद्धृत करता हूँ जो इस प्रकार है:

भग्नाशस्य करंड पिंडिततानोर्म्लानेन्द्रियास्यक्षुधा

कृत्वांखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः l

तृप्तस्तत्पिशितेन सत्वर मसौ तेनैव यातःपथा

स्वस्थास्तिष्ठत दैव मेवहि परं वृद्धधौ क्षैये कारणं ll

सभी कर्मों का फल भगवान को अर्पित करने से कर्मयोगी चिरस्थायी शांति प्राप्त करते हैं। जबकि जो लोग अपनी इच्छाओं से प्रेरित होकर स्वार्थ से काम लेते हैंवे अपने कर्मों के फल में आसक्त होने के कारणफंस जाते हैं

यहाँ अर्जुन ने श्रीकृष्ण को उसी संदेह को प्रकट किया "यह कैसे समझा जाए कि एक ही कार्य करने से कुछ लोग भौतिक अस्तित्व के लिए बाध्य होते हैं और अन्य भौतिक बंधन से

 मुक्त हो जाते हैं"इसका उत्तर श्रीकृष्ण इस श्लोक में देते हैं। जो लोग भौतिक पुरस्कारों से अनासक्त और प्रेरित नहीं होते हैं वे कभी भी कर्म से बंधे नहीं होते हैं। लेकिन जो लोग कामनाओं के लालसा रखते हैं और भौतिक सुखों का आनंद लेने की इच्छा से ग्रस्त हैंवे काम की प्रतिक्रियाओं में फंस जाते हैं। युक्त शब्द का अर्थ है "ईश्वर के साथ चेतना में एकजुट।" इसका मतलब यह भी हो सकता है कि "दिल की शुद्धि के अलावा कोई इनाम नहीं चाहिए।" जो व्यक्ति युक्त होते हैं वे अपने कार्यों के फल की इच्छा को त्याग देते हैंऔर इसके बजाय आत्म-शुद्धि के उद्देश्य से कार्यों में संलग्न होते हैं। इसलिएवे जल्द ही दिव्य चेतना और शाश्वत आनंद प्राप्त करते हैं

दूसरी ओरअयुक्त का अर्थ है "चेतना में भगवान के साथ एकजुट नहीं।" यह "आत्मा के लिए लाभकारी नहीं होने वाले सांसारिक पुरस्कारों की इच्छाको भी इंगित कर सकता है। ऐसे व्यक्ति तृष्णा से प्रेरित होकर कर्मों के फल की लालसा रखते हैं। इस चेतना में किए गए कार्य की प्रतिक्रियाएं इन अनुयुक्त व्यक्तियों को संसार या जीवन और मृत्यु के चक्र से बांधती हैं

 Bhagnasasya karanda pinditatanormlanendriyasyakshudha

Kr̥tvākhurvivara svaya nipatitō nakta mukhē bhogina l

Kr̥ptastatpiśitēna satvara masau tēnaiva yātapathā

Svasthāniṣṭhita daiva mēva hāy para vr̥d'dhau kayē kāraa ll

 The hungry snake, trapped in the basket, layed in the basket, helpless with 

no way out. Hoping to find food in the basket, a mouse pierced through it 

and got buried in it. The snake ate it and came out of the same stomata. 

God is responsible for every incident, we are only his subjects.

People who are obsessed by worldly desires will not give room for logical 

thinking. That voluntary or involuntary ‘karma’ enables the almighty to 

accord the ‘good or bad effect of the relative deed’. Here the rat without 

putting the mind, was keen for the food than the repercussions. To 

substantiate the tenor of the above shloka I quote a relevant shloka from 

‘Karma sanyasa yoga of Bhagavadgita’ which is as under:

Yukta karma-phala tyaktvā śhāntim āpnoti naihhikīm l

Ayukta kāma-kārea phale sakto nibadhyate ll

Offering the results of all activities to God, the karm yogis attain everlasting 

peace. Whereas those who, being impelled by their desires, work with a 

selfish motive become entangled because they are attached to the fruits of 

their actions.

Here Arjuna reveals the same doubt as above to Sri Krishna “How is it to be 

understood that performing the same actions some people are bound to 

material existence and others are released from material bondage”?  Shree 

Krishna gives the answer in this verse.  Those who are unattached and 

unmotivated by material rewards are never bound by karma.  But those 

craving reward and obsessed with the desire to enjoy material pleasures 

become entangled in the reactions of KARMA. The word yukt means “united 

in consciousness with God.”  It can also mean “not wanting any reward 

other than purification of the heart.”  Persons who are yukt relinquish desire 

for the rewards of their actions, and instead engage in works for the purpose 

of self-purification.  Therefore, they soon attain divine consciousness and 

eternal beatitude. 

On the other hand, ayukt means “not united with God in consciousness.”  It 

can also denote “desiring mundane rewards not beneficial to the soul.”  

Such persons, incited by cravings, lustfully desire the rewards of actions.  The 

reactions of work performed in this consciousness bind these ayukt persons to 

the samsara or the cycle of life and death.

స్వస్తి.

No comments:

Post a Comment