Wednesday 16 June 2021

అజరామర సూక్తి – 273 अजरामर सूक्ति – 273 Eternal Quote – 273

 అజరామర సూక్తి  273

अजरामर सूक्ति  273

Eternal Quote  273

https://cherukuramamohan.blogspot.com/2021/06/273-273-eternal-quote-273.html

शीलं शौर्यमनालस्यं पाण्डित्यं मित्रसंग्रहः ।

अचोरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः ॥

శీలం శౌర్యమనాలస్యం పాండిత్యం మిత్రసంగ్రహః l

అచోరహరణీయాని పంచైతాన్యక్షయోనిధిః ll

శీలముశౌర్యముఆలస్యము చేయకుండుటపాండిత్యముస్నేహితులను 

సంపాదించుకొనుట అనునవి దొంగలు దోచుకొనుటకు సాధ్యముకాని ఐదు 

అక్షయనిధులు." అని ఈ శ్లోకానికి అర్థం. “శీలం పరం భూషణమ్ " (శీలమే శ్రేష్ఠమైన 

అలంకారము) అని పెద్దలమాట. శీలమంటే సజ్జనసమ్మతమైన నడవడిక. శీలమును 

గూర్చి భర్తృహరి మహాశయుడు చెప్పిన మాట మనకు శిరౌదార్యము.

వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్క్షణాన్‌

మేరుః స్వల్ప శిలాయతే మృగపతిః సద్యః కురంగాయతే ।

వ్యాలో మాల్య గుణాయతే విషరసః పీయూష వర్షాయతే

యస్యాంగేఽఖిల లోక వల్లభతమం శీలం సమున్మీలతి  78

అతనికి వార్థి కుల్య యగునగ్ని జలంబగుమేరు శైలమం

చిత శిల లీలనుండుమద సింహము జింక తెఱంగుఁ దాల్చుగో

పిత ఫణి పూలదండయగుభిష్మవిషంబు సుధారసంబగున్,

క్షితి జన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్

 అందుకే శీలం ఒక గొప్ప నిధి. శౌర్యం ఆత్మాభిమానానికి చిహ్నం. ధైర్యంసాహసం

పరాక్రమంఈ పాదులోనివే. ఈ లక్షణం ఉన్నవాడు జీవితంలో ఆటుపోట్లను 

సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. శత్రువులను అదుపు చేసుకోగలుగుతాడు. మంచి 

పనులను చేయటంలో తన శౌర్యాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు. ఈ గుణం 

ఒక అమూల్యనిధి. అనాలస్యం అంటే, “జంతూనాం నరజన్మ దుర్లభమ్" అనే సూక్తిని 

స్మరిస్తూఈ జీవితపరమ ప్రయోజనాన్ని ఈ జీవితంలోనే అందుకోవటానికి తగిన 

ప్రయత్నాలను ఆలస్యం లేకుండా వెంటవెంటనే చేయటం. ఇది మోక్షహేతువు. అందుకే 

సద్గతినిచ్చే ఈ సద్గుణం అద్భుత నిధి. కేవలం ఎన్నో గ్రంథాలు చదవటం 

పాండిత్యమనిపించుకోదు. పాండిత్యం అంటే జ్ఞానము. జ్ఞానానికి నిదర్శనము సర్వులలో 

దైవాన్ని దర్శించటము. ఆముష్మికసుఖప్రాప్తికి కావలసినది అదే!  సుఖాన్నిప్రసాదించే 

ఇలాంటి విద్వత్తు ఒక అమేయనిధి.

మిత్రులను సంపాదించుకోవటం అపురూపమైన కళ మాత్రమేకాదుమనలోని 

సౌజన్యానికి ఒక తార్కాణం. అసలు ఇత్రుడు అన్నవాడు ఏవిధముగా ఉండాలంటే

ఉత్సవే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటేl రాజద్వారే శ్మశానేచ య తిష్ఠతి స బాంధవఃll

ఆనందములోన ఆపత్తులోనూ దుర్భిక్షము లోనూ దుష్ట బాధలందును మహారాజు ఆస్థానములోనైనా మరుభూమియందైనా అండగా నిలచినవాడే అసలైన మిత్రుడు.

మిత్రలాభం ఎంత ప్రయోజనకారియో “పంచతంత్రం" మనకు వివరించింది. అఘము 

నుండి మరలించి హితార్థ కలితులను చేసే మిత్రులను కలిగి ఉండటం అద్వితీయమైన 

నిధి. ఈ ఐదు నిధులనూ ఏ చోరులూ దోచుకోజాలరు. ఇవి అక్షయనిధులు. అనగా 

ఏనాటికీ నశించిపోనివి.

शीलं शौर्यमनालस्यं पाण्डित्यं मित्रसंग्रहः ।

अचोरहरणीयानि पञ्चैतान्यक्षयो निधिः ॥

इस पाँच मुख्य विषय अविनाशी खजाने हैंजिन्हें चोर नहीं चुरा सकते:

ईमानदारीसाहसगतिविधिविद्वताऔर दोस्तों की एक मंडली

बहुत सारी संपत्ति आदि इकट्ठा करने का कोई मतलब नहीं है। वे सभी नाशवान हैं और आसानी से 

चुराए जा सकते हैं। लेकिन किसी व्यक्ति की सबसे मूल्यवान संपत्ति ये हैं:

1. ईमानदारीचरित्रगरिमाआचरणनैतिकता

2. साहसवीरता

3. गतिविधिसतर्कताउत्पादक रवैया

4. विद्वताछात्रवृत्तिशिक्षा, सही जगह पर अपना ज्ञान का इस्तेमाल करना

5. दोस्तों का संग्रहदोस्त जमा हुएदोस्त मिले या कमाए l दोस्ती का निर्वाचन ऐसा दियागया हैl

उत्सवे  व्यसने चैव दुर्भिक्षे राष्ट्रविप्लवे

राजद्वारे श्मशाने  यतिष्ठति  वान्धवः ।।

सच्चा दोस्त वही होता है जो अच्छे समयबुरे समयसूखादंगायुद्धराजा के दरबार में और मृत्यु के 

बाद भी साथ खडा हो ।

नाम जो भी होये 5 सबसे कीमती और अविनाशी खजाने हैं। उम्र के साथ ये कभी कम नहीं होते। और 

सबसे अच्छी बात यह है कि इन्हें कभी कोई चुरा नहीं सकता

सही प्रकार का धन अर्जित करें!

śīla śauryamanālasya pāṇḍitya mitrasagraha 

acoraharaṇīyāni pañcaitānyakayo nidhi 

The following are the five (types of) imperishable treasures, that can't be stolen by thieves: 1) Integrity, 2) courage, 3) activity, 4) erudition, and 5) a congregation of friends

There is no point in collecting lots of wealth, assets, etc. They are all perishable and can be stolen easily. But the most valuable assets of a person are:

1.       Integrity; character, dignity, conduct, morality

2.      Courage; bravery

3.      Activity; alertness, productive attitude

4.      Erudition; scholarship, education

5.      Collection of friends; friends accumulated, friends acquired or earned

Whatever be the name used, these 5 are the most valuable and imperishable treasures. They never diminish with age. And the best part is, they can never be stolen by anyone.

Earn the right kind of wealth!

స్వస్తి.

No comments:

Post a Comment