Thursday 30 April 2020

పిల్లలు - తలిదండ్రులు

                             పిల్లలు – తల్లిదండ్రులు

ఋజు మార్గములో నడిచే పిల్లల మరియు తల్లిదండ్రుల గూర్చి నేను ప్రస్తావించుటలేదు. అట్లు కాని కొన్ని  వాస్తవాలను గమనించుదాము. 
పెళ్ళయిన అనతి కాలములోనే ఒక శిశువు కలిగితేఆ శిశువు వయసు 2 సం. లోపు వున్నప్పుడు కొందరు దంపతులు సరసమైన తమ కోరికలనాపుకోలేక అసహ్యముగానో అసభ్యముగానో ప్రవర్తించుచుంటారు.

ఇది చాలా తప్పయిన విషయము . పిల్లలలో జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. వాళ్ళు గమనించినది ఆ వయసులో వ్యక్తపరచ లేకున్నా వయసు వచ్చిన తరువాత తమ జ్ఞాపకాలకు రెక్కలు సమకూర్చుకొంటారు. ఇంకొక జంట తరచూ పోట్లాడుకొంటూ

వుంటారు. అది కూడా ఆ శిశువు మనసులో నెలవైపోతుంది. పెరిగేకొద్దీ తాను విపరీతమైన 'అహం' తో సాటి వారితో తగవులాడుతాడు.

అదే ఒక గుడికి పోయినపుడు తల్లిదండ్రులు కాకుండా శిశువుతో 3,4 ధర్మాలు భిక్షగాళ్ళకు చేసే విధముగా చూడండి. పెద్దయితే వారిలో ఎక్కడ లేని దయ జాలి ఉంచుకొంటారు. సాటి మనిషికి సాయపడగలుగుతారు. ఆడపిల్లలకు మొదటిసారి తలనీలాలు తీయించిన తరువాత మరులా క్రాపులు కటింగులు లేకుండా చూడండి. పిల్లలకు చిన్న యసులోనే పరికిణీలు కట్టించండి. కాలకృత్యములు తీర్చుకొన్న వెంటనే స్త్నానము చేయించి మీకు తెలిసిన శ్లోకాలో పద్యాలో ఒక్కొక్కటిగా చెప్పించండి. ప్రతిచెట్టు అటు బీజము వల్లనైనా ఇటు గాలికో, ఎటూ గాకుంటే కాకి పిచ్చుకల ద్వారానో మొక్కగా మొలుస్తుంది. మొలిచిన తరువాత మనకు పరిశీలించే సమయము వుంటే మొక్క మంచిదా కాదా అని తెలుసుకొని దానిని వుంచటమో వూడపీకడమో చేస్తాము . మరి గమనించక పోతే ఏదోఒకరోజు ఆ చెట్టు గొడ్డలికెరగాక తప్పదు. మొక్క వంగుతుందికానీ మాను వంగదు కదా!

పిల్లలకు చిన్న వయసు లో తప్పక రామాయణ భారత నీతిచంద్రిక కథలు చెప్పండి, పెద్దలను ఇంటిలో వుంచుకొనేవాళ్ళు వారితో చెప్పించండి. ఇవికాక సమయస్పూర్తి, హాస్యము , మొదలగు గుణముల కాలవాలమైన కాళీదాసు, తెనాలి రామకృష్ణ కథలు తెలియజేయండి. ఈ కాలము పిల్లలకు అక్షర వ్యత్యాసాలే తెలియదు. మన భాష లోని అక్షరాలలో ప్రాణ మహా ప్రాణాలను గూర్చి పిల్లలకు ఈ కాలములో చెప్పేటప్పటికి చెప్పే వారి ప్రాణాలు పోతాయి. భాష నాశనమౌతుందన్న చింత రవ్వంత కూడా లేకుండా ఎంతో కాలము నుండి వస్తున్న భాషను కేవలము తమ పేరు ప్రతిష్ఠ కోసమే పాటుబడి, వున్న అక్షరాలలో కొన్ని తీసివేసియును, వాడుక భాష అన్న పేరుతోను, చనిపోయిన మహనీయులు చనిపోయి కూడా మనలను మన పిల్లలను చంపుచున్నారు. ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రుల మీద పడింది. తప్పక పిల్లలకు 'అమరము' ఆంధ్ర నామ సంగ్రహము' నేర్పించండి.ముఖ్యము గా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఆధునిక కవులైన 'శ్రీ శ్రీ' 'దేవరకొండ బాలగంగాధర తిలక్' లాంటివారి కవితల లోని కొన్ని పదాలు నిఘంటువును ఆశ్రయించనిదే అర్థము చేసుకోలేరు. దిగంబర కవితలు నగ్న కవితలు ఎందుటాకులైపోయినాయి. పచ్చగా ఎప్పటికీ ఉండేది కళ్యాణ సాహిత్యమే.

తండ్రి పిల్లలకు సినిమా కథానాయకుడు. అతనే ఆదర్శము. మరి ఆతండ్రి పిల్లలను పెళ్ళాన్ని పార్టీలని పబ్బులని, ఫంగ్షన్లని తీసుకు పోతున్నాడు. అవి చూసి పిల్లలు ఏమి నేర్చుకొంటారు అనే ఆలోచన వారికి ఉందా! సినిమా మంచిదయితేనే పిల్లలతో కూడా వెళ్ళండి. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకోవద్దు.ఒక కొడుకు ఈ విధంగా తండ్రి తో అంటున్నాడు.

పబ్బుకేగ వలయు పదివేలు నాకివ్వు

"తనయ! డబ్బు గాదు తగినబుద్ధి

నీకు వలయు " నన్న నీవద్ద యది లేదు

కలిగియున్న దడుగ గలుగుదనెను

ఆ స్థితి కలగకుండా చూచుకొనుట మంచిది.

కాస్త 7 నుండి 10 సంవత్సరముల లోపువారవుతునే ఆడ మగ తేడా లేకుండా ఆటలు మొదలు పెడతారు. సహవాసము మంచిదయితే పరవాలేదు. కాకుంటే? 'సహవాస దోషయా పుణ్య గుణా భవంతు' సహవాస దోషయా పాప గుణాభవంతు’ అన్నారు పెద్దలు. మరి ఎంతమంది తల్లిదండ్రులకు ఇవి గమనించే వెసలుబాటు వుంది. అసభ్యమైన అసహ్యమైన మన బుద్ధికి అనూహ్యమైన తిట్లను ఆడ పిల్లలు తమ ఆటలలో వాడుచున్నారు.

నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతూ ఉంది:

రాజవత్ పంచవర్షాణి దశ వర్షాణి  తాడవత్ l

ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్ ll

పుట్టినది మొదలు 5 సంవత్సరముల వరకు, అమ్మాయి గానీ అబ్బాయి గానీ రాజు వలె లేక రాణి వలె చూచుకోవాలి. తరువాత 10 సంవత్సరములు అదుపాజ్ఞలలో, అవసరమైతే కొట్టియైనా సరే, ఉంచుకోవాలి. ఆపై మాత్రము తల్లిదండ్రులు వారి సంతానముతో ప్రాణ స్నేహితుల వలె మెలగాలి. శాసించేది శాస్త్రము. ‘Science  ‘Subject to Change’. అందుకే పాశ్చాత్యులది ‘Moral Science’ , మనది ‘నీతి శాస్త్రము’.

ఇక ఇంట్లో శుభ్రత. ఇంటి పనులకు పెట్టుకొన్న పనిమనుషులు ఎంత శుభ్రముగా పని చేస్తారు అన్నది మీ ఆలోచనకే వదిలి మీరు చేసే పనుల గూర్చి ఒక మాట చెబుతాను. చాలా మంది ఇళ్ళలో mineral water పేరుతో వచ్చే నీళ్ళు త్రాగడానికి ,పిల్లలకు త్రాపడానికి అలవాటు పడినారు. అసలు అందులో ఏమి minerals కలుస్తున్నాయి ,అవి minerals అని అనవలెనా లేక అవి chemicals అనవలేనా! సాధారణమైన మంచినీరు త్రాపుటలేదే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెంపొందగలదా? ఇంట్లో అమ్మ తదితర పెద్దలు చేసే వంట కంటే hotel భోజనాలు అంత ఆరోగ్యకరమా? మీరిట్లు పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలను ఎట్లు పెంచుతారు అన్నది ఆలోచించుతున్నారా? అట్లని అసలు బయట తిండి తిననే వద్దు అనుటలేదు. ఎప్పుడో  ఒకసారి అంటే పరవాలేదు. ఎప్పుడూ అంటేనే వస్తుంది చిక్కు.
గతములో నేను వ్రాసిన పద్యము సందర్భోచితముగా దలచి మీముందు ఉంచుచున్నాను:

ఈ నాటి భోజనపు అలవాట్లను గూర్చి నేను వ్రాసిన పద్యము సందర్భోచితమని దలచి  మీ ముందుంచుచున్నాను. ఒకసారి గమనించండి.

పిజ్జాలు బర్గర్లు ప్రియ భోజనమ్మాయె 

మంచిజొన్నల రొట్టె మరుగు పడియె

నూడుల్సు ఫాస్తాలు నోరూరగా జేసె

సద్దియంబళులెల్ల సమసి పోయె 

చాక్లెట్లు కేకులు చాల ఇష్టమ్మాయె

వేరుశెనగలుండ వెగటుగలిగె

కెంటకీ చికెనేమొ కీర్తనీయంబాయె 

వంట ఇంటిన వంట మంట గలిసె 


వైను బ్రాందీల విస్కీల వరద మునిగి

స్టారు హోటళ్ళ కేగేటి సరళి పెరిగి 

పనికిమాలిన యలవాట్ల ఫలితమంది

ఆసుపత్రుల పాలైరి అధిక యువత 

 పిల్లలలో అతి తక్కువగా తాము చేసే పని తప్పా ఒప్పా అని తర్కించుకొనే వాళ్ళు కూడా వుంటారు. అప్పుడు వారు మంచి వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. కానీ ఈ విధమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా అతి చిన్న వయసునుండి పిల్లలకు చెబుతూ రావలసిన బాధ్యత తల్లి తండ్రులపై వుంటుంది.

ఒక చిన్న కథ చెబుతాను. అన్నివ్యసనాలూ కలిగిన ఒక రాజుకు ఇద్దరు కొడుకులుండేవారు. రాజ కుటుంబము కాబట్టి పెద్దవుతూనే ఎవరి భవనాలు వారికుండేవి. కానీ బాల్యములో తల్లిదండ్రుల వద్ద వుండేవారు కావున ఇరువురూ తండ్రిని పరిశీలించేవారు. పెద్దవాడు తల్లికి తెలియకుండా తండ్రిని ఎంతో జాగ్రత్తగా గమనించేవాడు. చిన్నవాడిని మాత్రము తల్లి గమనించి ఎంతో గోముగా తన తండ్రి చేసే పనులన్నీ చేయకూడనివి అని హెచ్చరించింది. బాలుని మనసులో అది బలంగా నాటుకుంది.

వారు ఇరువురు పెద్దవారై తమ తమ భవనాలలో ఉండజొచ్చినారు. రాజు తన కాలము ముగియ వచ్చిందని తెలుసుకొని మంత్రితో తన ఇద్దరు కొడుకులలో తగిన వారసుని ఎన్నమని మంత్రి తో చెప్పినాడు. సరేయన్న మంత్రి మొదటి కొడుకు వద్దకు పోయి చూస్థే తండ్రెంతనో తానంతగానే వున్నాడు. మంత్రి 'నీవు వ్యసనాలకు ఇంత బానిసవైపోయినావే రాజ్యమును ఎట్లు ఏలగలవు' అన్నాడు. అందుకు అతడు 'వేరే ఏమి నేర్చుకోగలను ఆ తండ్రిని చూసి' అన్నాడు.

మంత్రి రెండవ రాకుమారుని వద్దకు పోతే ఎంతో కళా కాంతులతో అలరారుచున్నాడు. మంత్రి అతనితో కూడా అదే ప్రశ్న అడిగినాడు. అందుకు ఆ రెండవ అబ్బాయి నేను తండ్రినుండి ఏమేమి నేర్చుకొనకూడదు అన్న విషయాన్ని నేర్చుకొన్నాను. ఇది నా తల్లి పెట్టిన భిక్ష అన్నాడు. తరువాత ఎవరు రాజైవుంటారు అన్న ముగింపు మీకు తెలిసిందే .

ఇంకా వ్రాయవచ్చు గానీ ఇదే ఎక్కువైనదని ఈ పద్యము తో విరమిస్తున్నాను.

పండు తేనె తెనుంగు ప్రాచి పోవగ జూచు

ప్రతిభ గలిగినట్టి ప్రభుత మనది

నన్నయ తిక్కన్న నాణెంపు కవితల

కాలాన గలిపేటి ఘనత మనది

శాస్త్రీయ సంగీత ఛాయ నాసాంతమ్ము

పడనీక కాపాడు పాట మనది

అలవలాతల కూడ అద్భుతమ్మౌకైత

యనుచు కొండాడేటి యాస్థ మనది

అమెరికా తప్పటడుగుల నడుగు లిడుచు

స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది

విల్వలకు వల్వలెల్లను విప్పివేసి

గంతులేయించు చున్నట్టి గరిత మనది

మనదు సాస్కృతి నంతయు మరచి పోయి

నాగారీకమ్ము కౌగిట నలిగిపోయి

తాతలను వారి చేతల త్రవ్వి గోయి

పాతి పెట్టితిమన బదుల్ పల్కగలమె

స్వస్తి.

 

5 సంవత్సరముల క్రితము వ్రాసిన ఈ వ్యాసముపై స్పందన ఈ దిగువ పొందుపరచినాను.
పూర్ణ చంద్ర రావు మంత్రాల
పూర్ణ చంద్ర రావు మంత్రాల kaani ee rojullo puttina 6 va nelalone crushlo cherchi thalli thandri office ki velthunnaru inka pillalaki thalli thandrulameeda  gouravam gaani peddalu cheppe maata vinaalani ela anpisthundhi

Ranga Prasadarao చాల చాల మంచి విషయాలు చక్కగా   వివరించారు...గురువుగారు శ్రీ గరికపాటి గారు చెబుతున్నట్లు.....పిల్లలందరికీ ఈ వేసవి సెలవల్లో భాస్కర సుమతి దాశరధి శతకాలు ప్రతి పదార్ధం వివరించి బట్టీ పట్టేలా చేస్తే కూడా బాగుంటుందని అనుకుంటాను... 

 Rama Devi Cheruku Ramamohanrao గారు మంచి విషయాన్ని పంచినందుకు, ధన్యవాదాలండి... కాని ఆచరించే వారు తక్కువ.. ఎవరిని తప్పు పట్టాలని కాదండీ... ఆరోగ్యమైన సంస్కారవంత మైన ఇంకో తరం కోసం ఎవరు ఆలోచించడం లేదు.. పిల్లలకి కావలసినవి ఇవ్వడం అంటే డబ్బుతో చేసేవే ఎక్కువ అదే వారికి సులువు.. మీరు చెప్పినవి చేయడానికి సమయం కావాలి.... అదే మా దగ్గర లేదు అనేవాళ్ళు కోకొల్లలు.... ఇదివరకు డబ్బు మాత్రమే సమస్య.. ఇపుడు మాత్రం డబ్బు కంటే సమయము లేకపోవడమే (లేదు అనడమే ) పెద్ద సమస్య..
Cheruku Ramamohanrao అమ్మా డబ్బు సమయాన్ని హరించుతూవుంది. కుబేరుని వాహనము మనిషి . ప్రక్కనే వున్నాడు పరమేశ్వరుడు(ఉత్తరము ప్రక్కన ఈశాన్యము) . కానీ దృష్టి ఆవైపు మరలదు .
దాసునిగా ఉన్నంతకాలము దండన అనుభవించ వలసినదేకదా. 'నా' నుండి 'మన' చేరవలేనంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరము .కష్టనష్టాలు వుంటాయి కానీ కడకు సంస్కృతి నిలిపిన సంతృప్తి మిగులుతుంది.
Krishna Murthy చాలా మంచి సందేశం ...వీటితో పాటూ వీలైతే ఏదైనా ఒక శతకం నుండి ఒక పద్యం కూడా అందిస్తే బాగుంటుందని నా కోరిక...నమస్సులు...
B V Narasimha Rao Ittanam Batti chettandi babu, Manchi toraga yekkadandi. Anta America vallu yekkuvai poyarandi. Machi Nearchu Kontea Manchidea.
శ్రీ లు పగిడి Good chala baaga chepparu.

Mohan Sandya Mana samskruti sampradayalu gurinchi chala bagachepparu. Pillalanu ela terchi diddali annavisayalu chala baga chepparu neti balale repati pavurulu. Andaru mella alochiste mana bharata mata garvapade navataram munu mundu chudagalamni cheputunna. Mee lanti valla bodanalu chala avasaram. Marinni manchi vakyalu telupagalarani korukuntunna.

Thursday 9 April 2020

కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్

       కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్
https://cherukuramamohan.blogspot.com/2020/04/blog-post_9.html
పైశీర్షికలోని విషయములగూర్చిచర్చించుటకుముందు నా ఈ పద్యమును చదవండి.
అంధుల చేతి దీపము మహా బధిరాళి వినంగతూర్యముల్
బంధుర వేద శాస్త్ర ఘన పాఠము మూగ వచింప బూనుటన్
బంధమునెంచనట్టి బహు బంధు సమూహపు సాయమందుటన్
కంధిన మంచినీరు మన కల్పననైన గనంగ సాధ్యమే!
పైన తెలిపిన శీర్షికకు ఈ పద్యానికి గల సంబంధమేమిటి అన్నది మన మనసులో వెనువెంటనే ఉద్భవించే సందేహము. అయినా సంబంధము లేని విషయముతో ఎవరూ ప్రారంభించరు కదా! ఇల్లు అన్నతరువాత నీభార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు అన్న ఒకప్రత్యేక అనుబంధముంటుంది, అది సహజము. అదేవిధముగా అపూర్వవిజ్ఞాన ఖని, అనంత వేదరాశిని గల్గిన మన సనాతన ధర్మమును చిన్నచూపు చూస్తే, తల్లిచన్ను గుడిచి తల్లి రొమ్మును గుద్దినట్లే! ఈ వాస్తవమును ఒకసారి గమనించండి. ఎంతటి ఘోరములు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయెడువారు కొందరయితే సర్వమత సామరస్య ప్రబోధకులు కొందరు. ఒకచేయి కదిలిస్తే శబ్దము రాదు, రెండు చేతులు తగు శక్తితో కలిస్తేనే శబ్దము. ఈ మాట ఇంచుమించు 2,000, మరియు 1500 సంవత్సరముల నాడు ప్రభవించిన అన్యమతముల విషయములో వాస్తవము. ఈ విషయమును గమనించండి.
   మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ్ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం అన్న పాటను వారు రచించి ఒక బాణీ కట్టి మనచే పాడింఛినట్లు మనము విని ఉంటాము. మరి ఈ పాటలో అల్లా కూడా ఉన్నాడు కదా! ఎపుడైనా ముస్లిం ఎవరైనా పాడగా విన్నారా! లేక ఈ పాటను పూజ్య బాపూజీ మనకోసమేఅంటే హిందువుల కోసమే వ్రాసినారా! ఆపాట యొక్క వాస్తవ రూపమును గమనించండి:
 రఘుపతి రాఘవ రాజారాం  పతిత పావన్ సీతా రాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
నిజానికి ఇది మన జాతి పితగా వ్యవహరింపబడే గాంధీ గారు అసలు భజనను మార్చి వ్రాసినది. ఇది భారతీయులందరి కొరకు వ్రాసినది అని చెబుతారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు దీనిని పాడి ప్రచారములోనికి తెచ్చినారు. దీనికి మూలమగు భజన రచయిత మరుగున పడిపోయినారుకానీ దీనిని హిందువులు తప్ప అన్యులు పాడుట నేను వినుట జరుగలేదు. ఇందులో క్రీస్తు పేరు లేదని క్రైస్తవులు పాడరు. రాముని పేరు వుందని ముస్లిములు పాడరు. మరి గాంధీ గారు ఎవరి కొరకు వ్రాసినారన్నది మీ ఊహకు వదులుతాను.
అసలు ఈ భజన పుట్టుపూర్వోత్తరములకు పోతే దీని మొదటి రెండు చరణములు నామరామాయణములోనివి. ఈ రెండు చరణములతో లక్ష్మణాచార్య గారు ఈ క్రింది భజనను వ్రాసినారు. చదువుతూ వుంటే అర్థమగుట లేదా లక్ష్మణాచార్యులవారు తెలుగువారని. ఎందుకంటే ఈ చిన్న భజనలో మన భద్రాద్రి రాముడు చోటు చేసుకొన్నాడు.
రఘుపతి రాఘవ రాజారాం -  పతిత పావన సీతా రాం
సుందర విగ్రహ మేఘశ్యాం -  గంగా తులసీ సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం - భక్త జనప్రియ సీతారాం
జానకి రమణా సీతారాం - జయ జయ రాఘవ రాజారాం 
మన నాయకులు,కరోనా మనలను కరవక ముందే, హిందువులను  ఈ విధమయిన  క్వారంటైన్ లు సృష్టించి అందులోనే కలకాలము ఉండజేయ తలచినారు. జరుగవలసిన అన్యాము ఇంత అంత అని చెప్పలేనంత జరిగిపోయినది. మన భారత ప్రప్రథమ ప్రదానియగు జవహర్లాల్ గారి మంత్రివర్గములో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యా శాక్ల్హమంత్రి. ఆయన ఎంతో జాగరూకత వహించి ముస్లీముల దౌష్ట్యమును కప్పిపుచ్చి, హిందూ రాజుల శౌర్య సాహసాలను హిందూ మహాసముద్రములో ముంచి, ముస్లిం ఓట్లు ఇప్పటికీ కుహనా లౌకిక వాదముతో మనలను మభ్యపెట్టుటకు మన వెంట ప్రచ్ఛన్నముగా ఎందఱో మహనీయులు ఉన్నారు. అయినా ఇప్పుడిప్పుడు ఆ బంధనమునుండి కొద్దికొద్దిగా విముక్తులమగుచున్నాము. ఇకనయినా మనము అన్నది మనసులో నిలుపుకోకుంటే మనకు 
మనది అన్నది ఏదీ ఉండదు. కావున ఆత్మస్థితుడయిన ఆ పరమాత్మను సాక్షిగానెంచి మనము మన ధర్మాచార నిబద్ధత కలిగియుందాము.
మిగిలినది రేపు .............
    కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-2
ఇక అసలు విషయానికి వద్దాము. అసలు తబ్లిఘీ అంటే ఏమిటి అన్నది మొదట తెలుసుకొందాము. నిఘంటువు ప్రకారము తబ్లిఘీ అంటే దైవ వాక్కును ప్రచారము చేయుట (Preaching Gods dictums) అని అర్థము. దీనికి సంబంధించిన కట్టడము తత్సంబంధమైన మసీదు దిల్లీ లోని నిజాముద్దీన్ లో ఉంది. దీనిని నిజాముద్దీన మర్కజ్ అంటారు. అంటే తబ్లిఘీల నిజాముద్దీన్ కేంద్రము(Markaz=Center కేంద్రము) అని అర్థము. ఇక్కడ జరిగిన సమావేశమునే ఉర్దూ లో  జమాత్ (Jamaat=Congregation, సమావేశము) అంటారు. तबलीग करना मतलब मुसलमानों को कुरान-हदीस की बातें बताना। అన్న ఈమాట Markaz Nizamuddin
@nizamuddinmarkazdelhi (सलमानों को कुरान-हदीस की बातें बताना।) నుండిగ్రహింపబడినది. తబ్లిఘి జమాత్ అనధికారిక సంస్థాగత నిర్మాణాన్ని అనుసరిస్తుంది మరియు సంస్థాగత అంతర్ముఖ సమాచార అచ్ఛాదనమును పాటించుతుంది (introvert institutional profile). దీనిని "వంశానుక్రమఅధినాయకత్వ నిర్ణయ విధానాలపై తక్కువగా ఆధారపడే స్వేచ్ఛామత ఉద్యమము" గా వర్ణించబడినది. ఇది ప్రజాబాహుళ్య వార్తారంగములకు   దూరము  ఉంటుంది.  దాని కార్యకలాపాలు మరియు సభ్యత్వ వివరాలనుప్రకటించదు.  ఒక సంస్థగాతబ్లిఘీ జమాత్ విరాళాలు కోరదు మరియు ఎవరికీ నిధులు ఇవ్వదు. వాస్తవానికి సభ్యులు తమ ఖర్చులను సొంతముగానే  భరించాలి. అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేనందున మరియు అధికారిక సభ్యత్వ గణన తీసుకోబడలేదు కాబట్టిఖచ్చితమైన సభ్యత్వ గణాంకాలు తెలిసే అవకాశమే లేదు.  ఈ ఉద్యమపెద్దలు  పత్రికా సమావేశాములయందు పాల్గొనదు.  అధికారికంగా గ్రంథాలను ఎప్పుడూ విడుదల చేయలేదుఅయినప్పటికీ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రచురణలు ఉన్నాయి (సాధారణంగా దీనిని తబ్లిఘి నిసాబ్ [తబ్లిఘి పాఠ్యక్రమము] అని పిలుస్తారు. పుస్తక అభ్యాసానికన్నా ఎప్పుడూ
వ్యక్తిగత సంభాషణలకు ప్రాధాన్యత నిస్తారు. వీరి అతి ముఖ్యమయిన 6 సూత్రములను ఈ క్రింద పొందుపరచుచున్నాను.
1.కలీమా: త్రికరణ శుద్ధిగా(Conviction)  అల్లాను నమ్మి మరియు ఖురాన్ చెప్పిన జీవనశైలిని అవలంబించండి.
2.నమాజ్: నిర్దేశించిన ప్రార్థనలు క్రమము తప్పక చేయటం.
3. ల్లిమ్ మరియు జిక్ర్‌: దైవ చింతనతో కలిసిమెలిసి జీవించడము. ఒక  అవగాహనదగ్గరితనంఒక అనుబంధము,మరియు దేవుని యొక్క మారిఫా అనగా జ్ఞానము అనగా దేవుని గూర్చిన అవగాహన సాధన..
4.ఇక్రమ్ అల్-ముస్లిం [ముస్లింలను గౌరవించడం]: ప్రేమకరుణగౌరవంఔదార్యం మరియు గౌరవము అన్న ముఖ్యాంశములు కలిగి సాటి ముస్లిములను గౌరవించుట.
5.సాహిహ్ నియాహ్ / ఇఖ్లా [దేవునికి మాత్రమే]:  చిత్తశుద్ధితో దేవునిమంచివైపునకుస్వీయ పరివర్తన కోరుతూ (ముఖ్యంగా ఇబాదా ముమలాత్) ప్రార్థనల ద్వారా ఒకరి జీవితాన్ని సంస్కరించడం ".
6. దావా తబ్లిగ్ / తబ్లిగ్-ఇ-వక్త్ [ఆహ్వానం మరియు రాకపోకలు]: పండితులను (మౌల్వీలు)ఆహ్వానించడం మరియు వారి ప్రవచనానుసారము నడచుకొనడము, - ఆ విశ్వాసము ఆధారంగా జీవితాన్ని గడపడానికి మరియు దాని సద్గుణాలను నేర్చుకోవడానికిముహమ్మద్ అడుగుజాడలను అనుసరించి మరియు అతని సందేశాన్ని ఆచరించడాన్ని, (A) రోజూ వరకు మానవజాతి అంతా ఆరు లక్షణాలలో మొదటి ఐదు సూత్రములను పాటింప నిర్దేశించుతూ వుంది. (B) మానవాళి అంతా ఆ విధముగా ఆచరించి మోక్షాన్ని పొందిస్వర్గాన్ని సాధించడం ద్వారా నరకము లోని దావానలము నుండి  రక్షించబడతారు.
(ఇంగ్లిష్ Wiki కి నా తెలుగు అనువాదము)
ఇక పైన తెలిపిన విషయముల గూర్చి విశ్లేషించుకొందాము.
ప్రప్రథమముగా నేను తెలుసుకొన్న మేరకు ఖురాన్ లో జమాత్ లను ప్రారభించమని లేదు. మరి అదే లేనపుడు ఇమామ్ లు  ఎక్కడనుండివస్తారు.
ఇక పైన చెప్పిన 6 విషయములను లేక సూత్రములను ఖురానే చెబుతుంది. మరి అవే సూత్రములను గూర్చి వీరు చెప్పవలసినది ఏముంది. 
1వ సూత్రము అల్లాను నమ్మి ఖురాను చెప్పిన జీవనశైలిని అనుసరించమని ఉంది. ఖురాను దాదాపు 1500 సంవత్సరము నాటి మత గ్రంధము. అందు ఇజ్రాయిల్ పాలస్తీనా, అరబ్ దేశముల నాగరికత, నైసర్గికము అగుపించుతాయి కానీ మన రీతి రివాజును గూర్చిన ప్రస్తాపన అందు లేదు. వారి మడమల వరకు దుస్తులు కూడా ఇసుక తూఫాన్ నుండి రక్షించుకొనుటకే ప్రత్యేకముగా తయారు చేయబడినవి. కానీ మన దేశస్థులను మార్చుటకు వారు ఎంతో క్రూరమయిన విధానములు అవలంబించినారు అన్న మాటకు చరిత్రయే సాక్ష్యము. ముస్లింలలో భట్, రాజ, మొదలగు పేర్లకు చివరన ఉండే ఆ ఉపనామములు వారి పూర్వులు హిందువులలో ఏ తెగవారు అన్న విషయాన్ని తెలుపుతాయి. అసలు వారిలోని 90% శాతము తమ పేర్లకు చివర అరబిక్ పేర్లను తగిలించుకొంటారు గానీ హిందుస్తానీ అని తగిలించుకొంటారా! మరి వీరి తండ్రులు అక్కడి వారేనా! ఈ రోజుకు కూడా తాజమహల్, చార్మినార్ మొదలయిన కట్టడములను వారుహమారాహై అనే చెబుతారు. తైమూర్, ఇబ్రహీం లొదీ, బాబరు, ఔరంగజేబు, అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దుశ్చర్యలు మాటల కందనివి. ఈ సందర్భములో, ఈ మట్టిలో పుట్టి ఈ తల్లి భిక్ష తింటూ తమ కుమారునికి, క్రూరాతి క్రూరుడై లక్షలమంది హిందువులను కిరాతకముగా చంపి, ఎందఱో స్త్రీలను మానభంగము గావించిన, తైమూరు పేరు పెట్టుకొనుట ఎంతవరకు సమంజసము. చన్నుగుడిచిన తల్లి రొమ్మును గుద్దుట కాదా!  పైన తెలిపిన ప్రతి ముస్లిం పాలకుడూ అత్యంత కిరాతకుడు. చివరి ముఘల్ క్రూర పాలకుడగు ఔరంగజేబు, 17 మార్లు దండయాత్రలు జరిగిన సోమనాథ దేవాలయముపై చివరి సారిగా దండయాత్రను జరిపి నాశనము చేసిన నిర్దయుడే కాక, శివాజీ కుమారుడు మహా పరాక్రమశాలియగు శంభాజీని  మోసముతో బంధించి ఆ మహానుభావుని శరీరమును తలక్రిందులుగా సమాంతరముగా నడుచు రెండు ఒంటెలకు తలక్రిందులుగా కట్టి ఆ ఒంటెలను నడిపించుచూ ఆ మహానీయునిపై మానవ మూత్రమును చల్లించిన చరిత్ర కలిగినవాడు. ఇట్టి నీతిమాలిన చర్యలను ఖురాన్ ప్రోత్సహించిందా! అట్లు ప్రోత్సహించియుంటే దానికి పవిత్రత నెవరయినా ఆపాదించగలరా! అట్లు కాక ఖురాన్ ను  కాదని పైన తెలిపిన మహానుభావులు ఇష్టానుసారముగా వ్యవహరించియుంటే వారు ముస్లీములు అన్న పదమునకు అర్హులౌతారా!   

ఇక రెండవ సూత్రమును గూర్చి ముచ్చటించుదాము. నమాజ్ అన్న పదము నమస్ అన్న సంస్కృత దజన్యము. 
మిగిలినది మరొకమారు.........
కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-3
ఇది తబ్లీఘీలకు మాత్రమే పరిమితము కాదు.
ముస్లీములందరూ పాటించవలసిన బాధ్యత. అసలు ముస్లీములలో షియా సున్నీలు ప్రధాన తెగలు. ప్రపంచ ముస్లిం జనాభాలో 70% సున్నీలు 20% షియాలు 10% మిగతవారు. సున్నీలలో 4 తెగలు. అవి హనఫీషాఫయీమాలికీ హంబలీ షియాలలో జాయిదీనిజారి ఇష్మాయిలీహఫీజితయ్యబి,అన్నవేకాక సూఫీ కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కలిగియుంది. ఇక నమాజుచేయుటకు మసీదులో పురుషులకు మాత్రమే ప్రవేశము. స్త్రీలకూ లేదు. మొన్న జరిగిన తబ్లిఘీ సమావేశములకు వచ్చిన వారంతా మగవారే! మరి ఈ నిబంధన ఖురాన్ లో ఉంటే అది సమంసమా! ఒకవేళ లేకుంటే మరి ఖురాన్ ను అతిక్రమించినట్లు కాదా!
మూడవది ల్లిం మరియు జిక్ర్ అంటే దైవ చింతనతో కలిసిమెలిసి జీవించడము, దగ్గరితనము కలిగియుండటము మొదలగునవి. రాశిగా బిరియానీ వండి ఒక చాప పైన పరచి ఉమ్మడిగా తినుట ఇందు ఒక భాగము. నిజానికి ఇది పాటించదగిన ఆరోగ్య సూత్రమేనా! దీనివల్ల అంటురోగములు వ్యాపించే అవకాశము లేదా!
   మనము నిశితముగా గమనించితే 4వ సూత్రమగు ఇక్రం-అల్-ముస్లిం, ముస్లిములను గౌరవించమని చెబుతుంది. కాఫిర్లను గౌరవించమని ఖురాన్ లో లేదు. కాఫిర్ అంటే ముస్లిం కాని వాడు. మరి కాఫిర్ మానవుడు కాదా! సాటి మానవుని గౌరవించక పోవుటయే కాక, బందీలుగా దొరకిన హిందూ రాజులను, చిత్రహింసల పాలు చేసిన ఔరంగజేబు తైమూరు వంటి నరరూప రాక్షసులను ఖురాను సాక్షిగా నిజమయిన ముస్లిములని అనగలమా! ముస్లిములు కాని వారితో ఆవిధముగానే వ్యవహరించవలెనని ఉంటే అమానుషమగు ఆదేశములనిచ్చిన ఆ గ్రంధము యొక్క వాస్తవముల గూర్చి పరిశోధించనవసరము లేదా!
ఐదవది సాహిహ్ నియాహ్ / ఇఖ్లా [దేవునికి మాత్రమే]. ఈ విషయమును ఏ మతమైనా బలపరుచుతుంది. ఇందులో స్వపర భేదములు ఉండరాదు.
ఇక ఆరవది, దావా తబ్లిగ్ / తబ్లిగ్-ఇ-వక్త్ [ఆహ్వానం మరియు రాకపోకలు]: పండితులను (మౌల్వీలు)ఆహ్వానించడం మరియు వారి ప్రవచనానుసారము నడచుకొనడము. మరి ఇటువంటి సభలను బహిరంగముగా కాక, మసీదులలో రహస్యముగా ఏర్పాటు చేసుకొనవలసిన అవసరమేమి?
ఇవన్నీ కాకుండా ఈ తమ్ముని పైజామా అన్న కుర్తా, మీసాలు లేకుండా గడ్డము మాత్రము అడ్డదిద్దముగా పెంచుకోవడము, ఇక్కడ అక్కడ అనకుండా ఎక్కడంటే అక్కడ ఉమ్మడము చేయమన్న నిర్దేశము ఏమయినా ఉన్నదా!
ఇక మనదేశము గొప్పదనమును ఒకసారి చూద్దాము.

దాదాపు ముస్లీములు 800 సంవత్సరములుమనలను ఏలినా, మనతో ఎంతో క్రూరముగా వ్యవహరించినా మనము మన ధర్మమును కాపాడుకొన్న ఏకైక దేశము మనది.
కర్బలా యుద్ధములో హిందూ సారస్వత బ్రాహ్మణుడైన రహిబ్ సిద్ధ దత్ హుస్సేన్ కు శత్రువగు యాజిద్ తో పాయిరుసల్పి తన ౭గురు కుమారులను పోగొట్టుకొన్నాడు. ఆకారనంగానే హుసేన్ బ్రాహ్మణులు అన్న పేరు ప్రచారములోనికి వచ్చింది.
సిరియాలో ఇప్పటికీ కఫ్ర్ హింద్ అనే ప్రాంతము ఉన్నది. వారు చంద్రగుప్త మౌర్యుని పనుపున హుసేన్ ను చంపినా యాజ్ద్ మరియు అతని ముఖ్య అనుచరులపై పగతీర్చుకొనుటకు వెళ్లి, పగ తీర్చుకొని అక్కడే ఉండిపోయినారని చెబుతారు.
  మోసపూరితమైన కర్బలా యుద్ధములో ఇమాం హుస్సేన్ మరణించిన తరువాతఆయన కుటుంబమునకు శరణు నొసగినది భారతదేశములోని సింధ్ ప్రాంతమును పరిపాలించుచుండిన రాజా దాహిర్. ఆ కృతజ్ఞత అరబ్బుల మనసులో ఉండియుంటే మనపై వారు దండెత్తేవారే కారు.
కేరళ రాష్ట్రములోనిభారత దేశములో అత్యంత ప్రాచీనమైన చేరమాన్ జుమ్మా మసీదుత్రిషూర్ జిల్లాకొడుంగల్లూర్ తాలూకామేతాలా లో 629A.D. లో నిర్మింపబడినదిఅప్పటి రాజుయొక్క అనుమతితో. కానీ పోర్చుగీసు వారు 1504 లో దానిని సమూలముగా నాశనము చేసినారు.
ఈ విధముగా చెబుతూపోతే ఇంకా ఎన్నో ఉదంతములు మనకు తెలియవస్తాయి. కానీ మనము పొందిన ప్రతిఫలము, దారుణ మారణ హోమము, నిర్దాక్షిణ్యముగా స్త్రీల శీలాపహరణ, లక్క్కక్షాల కోట్ల సంపదలను కొల్లగొట్టటము.
ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతమంతా మనతో నాడు ముస్లిములు మన సహాయమునకు ప్రతిఫలముగా ఎట్లు వ్యవహరించినారు అన్న విషయమును వెలుగులోనికి తెచ్చుట నా ఉద్దేశ్యము.

ఇప్పుడు ఇక ముల్లా మొహమ్మద్ సాద్ మరియు తబ్లిఘీలను గూర్చి తెలుసుకొందాము.
మౌలానా సాద్ పూర్తి పేరు మౌలానా మొహ‌మ్మ‌ద్ సాద్ ఖంద‌ల్వి.  త‌బ్లిగీ జ‌మాత్ వ్య‌వ‌స్థాప‌కుడు మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ ఖంద‌ల్వి మునిమ‌న‌వ‌డే మౌలానా సాద్‌. భార‌తీయ ఉప‌ఖండంలో సున్నీ ముస్లింలకు చెందిన అతిపెద్ద మ‌త సంస్థ ఇది. 1927లో మౌలానా ఇలియాస్ ఖంద‌ల్వి త‌బ్లిగీ జ‌మాత్‌ను ప్రారంభించినారు.  యూపీలోని షామ్లీ జిల్లాలోని ఖాంద్లాలో ఇలియాస్ పుట్టారు. దాంటో ఆయ‌న పేరు చివ‌ర్లో ఖంద‌ల్వి పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.
ఈ తబ్లీఘీ జమాత్ బ్రిటీషు వారి కాలములో వారి ఆశీర్వాదముతో మొదలయ్యింది. నేటికి కూడా అది రిజిస్ట్రేషన్ కాలేదు. 1927 కు ముందునుండి కార్యకలాపాలు సాగిస్తున్నా బ్రిటీషు ప్రభుత్వమూ ఆ సంస్థను తమయొక్క అభిమతమునకు అనుగుణమైన సంస్థగా భావించి దాని స్థాపనకు తల ఊపినారు. వారు ఈ సంస్థనుచాపక్రింద నీటిలా ప్రాకుతూ హిందువులను ప్రభావితముచేసి ముస్లీములుగా మార్చుటయేగాకతమపాలనకు వ్యతిరేకముగా పనిచేయదు అని అర్థము చేసుకొని  మన సనాతన ధర్మమునకు వ్యతిరేకముగా ఒక బలమైన విషబీజమును తబ్లిఘి పేరుతో నాటినారు.

అసలు ఏ నిజాముద్దీన్ పేరుతో డిల్లీలో ఈ మర్కజ్, రైల్వే స్టేషన్ మొదలయినవి ఉన్నాయో, ఆతడు హిందువులు కాఫిర్లని బోధచేసి వేలాదిమందిని చంపించినాడు. ఈ నిజాముద్దీన్ కు అత్యంత ప్రియతమ శిష్యుడు మరియు తబలా, ఖవ్వాలీ మొదలగునవి కనిపెట్టి భారతీయ సంగీతమునకు ఎంతో సేవచేసిన వానిగా మనచేత పాఠ్యాంశములలో చదివించబడిన అమీర్ ఖుస్రో ఎందఱో హిందువుల ప్రాణములను తీయుటయేగాక హిందువులను చంపిన సుల్తానుల ఘనతను ఎంతగానో పొగుడుతూ గానము చేసినాడు.
మిగిలినది మరొకసారి.....
కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-4
ఇంతటి చరిత్ర కలిగిన ఈ తబ్లీఘీ లో 2015 నవంబరు16 న 13 మంది సభ్యులు ఉండవలసిన  షూరా(Board of Members) లో కొందరు సభ్యులు వయోభారముతో సహజ మరణము పొందుటవలన వారికి ప్రత్యామ్నాయముగా క్రొత్త సభ్యులను ఎన్నుకొనుటకు ఏర్పాటు చేసిన సమావేశములో సాద్ మిగతా సభ్యుల అభిమతమునకు విరుద్ధముగా అనను తబ్లీఘీ కి అమీర్ గా ప్రకటించుకొనిపగ్గములను అందుకొన్నాడు. ఇంచుమించుగా ఇతనికి 214 దేశములకు చెందిన 100కోట్ల అనుచరులున్నారన్నది అంచనా.
పెద్ద పెద్ద ముస్లీములంతా ఈ సంఘ సభ్యులు. పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళగు షహీద్ ఆఫ్రీదియుసూఫ్ యోహన్న( తబ్లిఘి ఆకర్షణ వల్లనే క్రిస్టియానిటి వదలి ఇస్లాం పుచ్చుకొని మొహమ్మద్ యూసుఫ్ అయినాడు) సక్లైన్ ముస్తాక్ఇంజమాముల్ హక్ ఈ విధముగా ఎందఱో దీని సభ్యులు. మౌలానా మొహమ్మద్ సాద్ నేడు అపారమైన ధనవంతుడు. ఆయనపై చట్టపరముగా కేసులు కూడా ప్రభుత్వ శాఖలే కోర్టులో వేసినాయి. ఇప్పుడు కదిలించిన ఈతీగ,ఈ లాకౌట్ ముగిసిన తరువాత డొంకను కదిలించబోతుంది.
మార్చి నెల 10-15 తేదీల నడుమ ఈ తబ్లిఘీ  సమావేశము ఏర్పాటు చేయబడినది. ఇంచుమించు 250 విదేశములనుండి సభుయులు ఈ సమావేశామునకు వచ్చినారని అంచనా.
దాదాపు 2000 సభ్యులవరకు దేశవిదేశములనుండి వచ్చినారని అంచనా. ఇంకా ఎక్కువమంది కూడా వచ్చియుండవచ్చునని ప్రచార సాధనాల భోగట్టా. ఆ సందర్భమున మౌలానా సాద్ ఈ విధమగు ప్రకటనలు ఇచ్చినట్లు క్రింద కనబరచిన ప్రచార మాధ్యమాలు తెలుపుచున్నవి. దానితోబాటు ఆయన యొక్క నడవడికను కూడా OUTLOOK తెలిపిన విషయములను యథాతథముగా ఆంగ్లములోనే ఉంచుచున్నాను. మొదట ఆయన ఆదేశమును నాకు తెలిసిన, YOUTUBE లో నేను విన్న మేరకు, నా పరిమిత పరిజ్ఞానముతో ఆయన ఉపదేశామును తెలుగుల్కో తెలియజేయుచున్నాను.
మసీదులో సమావేశమగుటవల్ల కరోనా వ్యాప్తి చెందదు. ఒకవేళ ఎంతో నమ్మకస్తుడైన గొప్ప వైద్యుడే చెప్పినా మసీదు వదలనవసరము లేదు. ఈ మహమ్మారి కారణముగా మసీదు వదిలే ఆలోచనే మనసులోనికి రానివ్వవద్దు. ఒకవేళ ఈ వ్యాధితో మరణమే ఎదురైనా మసీదుకు మించిన మంచిస్థలము దొరుకదు. 18 వ తేదీన మసీదులో సమావేశమయిన వారిని మసీదు వదిలి పోకుండా నిలిపినాడు. మౌలానా మొహమ్మద్ సాద్ ను గూర్చిన మరికొన్ని వివరాలు తెలుసుకోండి. వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు దేశాలనుండి వచ్చిన సభ్యులను మర్కజ్ లోనే వదిలి, మార్చ్29 న పోలీసులు మర్కజ్ తనిఖీకి వచ్చేసమయానికి తాను అంతర్ధానమైనాడు.
ఆయన వృత్తి దేవుని ప్రబోధమును వ్యాపింప జేయుట. ఎంతో సాధారణమైన జీవితమును అటువంటివారు గడుప వలసి ఉంటుంది. ఈయన విలాసవంతమగు జీవితమును చూస్అతె విస్తుపోతాము. ఆయనకు డిల్లీలో రేడు పెద్ద భవనాలు మరియు విలాసవంతమైన క్షేత్ర ప్రసాదము(Farm House) కలిగియున్ఆడుతయే గాక అత్యంత ఆధునికమగు, విశాలమైన ఈత కొలను మెర్సిడిస్ బెంజ్ వంటి అనేకమైన బారులు తీరిన కారులు కలిగియున్నాడు. మౌలానా అన్న పదమును అసలు ప్రపంచ దేశాలలోని ఎవరూ తమ పేరుకు తగిలించుకోరు. ఎందుకంటే వారి భాషలో 'మౌలానా' అన్న పదము అరబ్బీలో వ్రాయబడిన ఖురాన్ లో 'అల్లాకు మాత్రమే వాడబడింది. అదికూడా రెండుమార్లేనట. 'నా' అంటే మాయోక్క అని అర్థమట. మరి ఎవ్వరూ ఇవ్వకుండా పేరుకు ఇంత పవిత్రమైన బిరుదులు తగిలించుకొనవచ్చునా!

మిగిలినది మరొకరోజు.....
కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-5
ప్రసారమాధ్యమములనుండి గ్రహించిన వార్తలను యథాతథముగా చదువండి.
The Markaz chief Saad had allegedly in his sermon urged Muslims to defy lockdown and come out to pray together to break the COVID-19 curse. He termed the pandemic as a 'conspiracy to separate Muslims and make them untouchable' but also added that those who have been detected with Coronavirus have to be quarantined.
republicworld.com d.Aprl2, 2020

Deemed as one of the most influential movement in Muslim world, Tablighi Jamaat was established by Maulana Muhammed Ilyas Khandlawi, the great grandfather of Maulana Saad. Tablighi Jamaat was an offshoot of Deoband movement and aims at revival of the true Islam as perceived by the Prophet Mohammed.

Bypassing rituals and regulations of Tablighi Jamaat, Maulana Saad ignored all orders of Shura (central council) of Jamaat, and declared himself the Amir to capture the coveted seat at the Markaz Nizamuddin in November 2015 as he turned 50.

"He insulted the elders, scholars and the members of the Shura. The Amir is elected on the advice of the Shura but he (Maulana Saad) did not pay heed to any orders of the supreme council and decided on his own to take over the Jamaat," said Maulana Idris of Shamli.
Well known Islamic university Darul Uloom Deoband, the seat of Sunni Deoband movement, is also not happy with Maulana Saad's style of functioning including his teachings for the past three years. Darul Uloom went to the extent of issuing a fatwa against Maulana Saad for his controversial interpretation of verses of holy Quran. Some leading Maulanas of the Sunni sect also seem to be unhappy with Maulana Saad's provocative statements. In a leaked audio tape of Maulana Saad which went viral on social media recently, some portions of his speech are highly objectionable.
OUTLOOK THE NEWS SCROLL01 APRIL 2020 Last Updated at 11:42 PM | SOURCE: IANS
On March 13, two weeks after the group held a meeting in Malaysia that emerged as a source of hundreds of coronavirus cases across Southeast Asia, Tablighi Jamaats members gathered in New Delhi, including nearly 200 Indonesians and Malaysians, according to two top Tablighi leaders interviewed by Reuters.
WORLD NEWSAPRIL 3, 2020 / 4:43 AM / 5 DAYS AGO
ఈ సదస్సు ముగిసిన తరువాత విదేశీయులు భారతదేశములోని వివిధ ముఖ్యమగు అంటే ముస్లిం జనాభా ఉన్న ప్రాంతములకు వెళ్లి సమావేశములు ఏర్పరచి పాల్గొన్నారని భోగట్టా. ఈ సమావేశాములకు స్థానికులు ఎందఱో శ్రోతలుగా వచ్చినారట. వాస్తవానికి ఇది విసా చట్టమును అతిక్రమించడమే!
ఈ సభకు దిల్లీలో సమావేశమయిన వారిలో 6గురు తెలంగాణా వాసులు తమిళనాడు కర్నాటక, జమ్మూ కాశ్మీరు కు చెందిన ఒక్కొక్క వ్యక్తి ఈ సభలవల్ల కరోనాకు ఆహుతి కావడము జరిగినది.
ఈ దేశమునకు వచ్చిన 19 మంది విదేశీ ప్రతినిధులలో ఫిలిప్పీన్స్ కు చెందిన ఒక వ్యక్తి మరణించినట్లు Times of India పత్రికకు అందిన సమాచారము.
అదేసమయములో దిల్లీ లో బహిర్గతమైన కోవిద్-19 కి సంబంధించిన 25 మంది వ్యాదిగ్రస్తులలో 19 మంది ఈ నిజాముద్దీన్ సమావేశము వారే!
మార్చ్ 30, సోమవారము నాడు, తమిళనాడులో  కొత్తగా బయటపడిన ఉదంతములు 38. ఆ రాష్ట్రము నుండి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య980.
దేశములోని వివిధ జనాభా ఎక్కువగల ముస్లిం ప్రాంతములలో తెలంగాణాలోని కరీం నగర్ ఒకటి. ఇండొనీషియ నుండి వచ్చిన బృందసభ్యునికి అక్కడ పరీక్ష చేయగా ఆతను కరోనా కౌగిట చేరియుండినాడు. ఇది మార్చ్ 14న జరిగిన ఉదంతము.
TIMES OF INDIA.COM Mar 31, 20200, 10.05 IST
ఢిల్లీ క్వారంటైన్ లో తబ్లికి జమాత్ సభ్యులు రెచ్చిపోయారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. నిన్న క్వారంటైన్ కు వచ్చిన 167 మంది జమాత్ సభ్యులు డాక్టర్  లపై ఉమ్మివేస్తూ వారిని భయపెడుతున్నారు. నిన్నటి నుండి వారి ప్రవర్తన అలానే ఉంది. వారి ప్రవర్తన తో విసిగిపోయిన డాక్టర్లు మరియు  ఆస్పత్రి సిబ్బంది తమకు సెక్యూరిటీ కావాలని వేడుకుంటున్నారు.ఇక గాంధీలోను  ఢిల్లీ  ప్రార్థనలకు హాజరైన ఓ కరోనా పేషంట్   వైద్యులపై దాడి చేసాడు. అంతే కాకుండా అక్క ఫర్నిచర్ ను ధ్వంసం చేసాడు. దీంతో గాంధీలో కూడా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.దాడి చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందిచించిన ఈటెల రాజేందర్ గారు డాక్టర్ లపై సిబ్బంది పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.
By Umakanth Rao (TV9 తెలుగు)   Posted April 15, 2020  12:36 pm IST
నిజాముద్దీన్ మార్కాజ్ యొక్క అమిర్ మౌలానా సాద్ యొక్క ఫామ్ హౌస్ ఒక ప్యాలెస్ కంటే తక్కువ కాదు.
అల్లాహ్, ఖురాన్ మరియు హదీసులను ఇతరులకు తెలియజేసే సమూహం తబ్లిఘి జమాత్, దాని అతిపెద్ద మర్కజ్ నిజాముద్దీన్ . ఈ మార్కజ్ యొక్క ప్రధాన ప్రవక్త ధనవంతుడైన అమీర్ మౌలానా సాద్ కంధల్వి వార్తల్లో ఉన్నారు. దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ నుండి దేశవ్యాప్తంగా వ్యాపించిన కరోనా సోకిన వారి సంఖ్యను మూడు రెట్లు పెంచి, నిజాముద్దీన్ మర్కజ్ మరియు అమీర్ మౌలానా సాద్ లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎఫ్ఐఆర్ జరిగింది, దిల్లీ క్రైమ్ బ్రాంచ్ మౌలానా సాద్ కోసం వెతుకుతోంది. కరోనాను ఓడించడానికి ప్రారంభించిన ప్రచారానికి ఇది కొత్త సవాళ్లను జోడించింది. మౌలానా సాద్‌తో చాలా వివాదాలు ఉన్నాయి. అతనికి దారుల్ ఉలూమ్ డియోబంద్‌తో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, అతని మద్దతుదారులు కూడా తక్కువ కాదు. పరిస్థితి మరియు జమాత్ గురించి ప్రత్యేక నివేదిక ... మరింత చదవండి-
NTV వార్తలు
గతమార్చి 28 నుంచి మౌలానా పరారీలో ఉన్నాడు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులని కూడా పలు సందర్భాల్లో వార్తలు అందాయి. కాగా-తాను కూడా కరోనా బాధితుడినేనని, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నానని మౌలానా ప్రకటించుకున్నాడు. ఇతని కోసం పోలీసులు ఢిల్లీలోని తజీమ్ ఘర్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల గాలిస్తూ ఉన్నారు.
నిజాముద్దీన్ మర్కజ్, తబ్లీఘీ జమాత్, మౌలానా మొహమ్మద్ సాద్ లను గూర్చి పదుగురికి తెలియవలేనాను తలంపుతో నాకు తెలిసిన మేరకు మీముందు ఉంచినాను. ఇకపై జరిగే విషయముల పత్రికలూ దూరదర్శనులు. చరవానుల ద్వారా తెలుసుకొనగలరు. ప్రతి పాతకుడు మనసులో ఉంచుకోవలసిన విషయము ఏమిటంటే మీ ప్రక్కన కరోనా వైరస్; కన్నా భయంకరమైన నిలువెల్లా విషము కలిగిన దూర్తులు ఉన్నారు. జాగరూకత వహించండి. దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడండి.
ధర్మో రక్షతి రక్షితః

స్వస్తి.
Narasimha Reddy “Idam braahmyam idam kshathram” anna mata Bramhana veerulake varthisthundi kadandi, kavuna vare poradali; memantha venuka jayajaya dhvanalu chesukuntu vostham!
బ్రాహ్మణ వర్ణము సత్వగుణము అధికముగా కలిగియుంటుంది. అది రాను రానూ నియమనిష్ఠలలో శ్రద్ధ చూపకపోయినా, సత్వమును అలసత్వముగా అలవరచుకొన్నారు. నెత్తిన పిడుగు పడుతూ వున్నా నామీదకాదులే అన్న ఆలోచన వారిలో ప్రబలి పోయింది.
పై పెచ్చు వారిలో ఎవరికయినా ఒకవేళ జాగృతి కలిగితే వారు తప్పక మీవంటి సాహసవంతులను సమకూర్చుకోకుండా అడుగు ముందుకువేయలేరు. ఇది మన ధర్మమును నిలుపుకోనవలసిన ఒక యాగము. దీనికి చాతుర్వర్ణములూ సహకరించితేనే కార్యసిద్ధి కలుగుతుంది. కానీ ఆలోచన చెప్పుటకు వారు ముందువరుసలో ఉంటారు. ఎవరయినా  నిదుర లేపవలసి వచ్చినపుడు, నిదురపోయే వారిని లేపుతారు కానీ, ముందే మేల్కొన్నవారిని లేపరు.
ఇక రెడ్డి అన్న పదము రేనాటి రాజులనుండి వచ్చినది. రేనాటి రాజులు రాను రాను రట్టడులై రెడ్లు అన్న పేరు సంతరించుకొన్నది. ఆ మాటకొస్తే కాపులు (బలిజ) కమ్మ, వెలమ వారు కూడా రాజ్యాలు ఎలినవారే. అసలు రాయలసీమ ప్రాంతములో రెడ్లను కాపులు అనే అంటారు.
బ్రాహ్మణులను గూర్చి పైన చెప్పినదానికనా అతి ముఖ్యమయిన విషయము ‘బ్రాహ్మం’ అంటే బ్రాహ్మణ వర్ణము కాదు. బ్రహ్మత్వను పొందుట. ఆ విధముగా బ్రహ్మత్వము పొందినవారిలో  భక్త నందనుడు మాలవాడు, తిన్నడు చెంచు, కుంభారుడు కుమ్మరి, మొల్ల, సిరియాళుడు ఈ విధముగా ఎందఱో వివిధ వర్ణములవారు వున్నారు. నేను వాడిన ఆ శాస్త్రోక్తి అందరికీ సంబంధించినది కానీ, కుత్సితమైన మనస్సుతో వాడినది కాదు.
రాయి రాయి కలిస్తేనే కొండ తయారౌతుంది. ఇటుక ఇటుక కలిస్తేనే ఇల్లు తయారౌతుంది. మనిషి మనిషి కలిస్తేనే మన ధర్మం నిలుస్తుంది.
నేను నా రచనలలో ధర్మ పరిరక్షణను తప్పించి అన్యథా తెలుపను. అసలు నా మనసులోని  మాట  ప్రారంభములోనే ఉపోద్ఘాతముగా పద్యరూపములో తెలుపుకొన్నాను.

మరియొకసారి నేను తెలిపిన మాటను తప్పుగా తలువవద్దని తెలుపుచున్నాను.