Wednesday 9 June 2021

అజరామర సూక్తి – 266 अजरामर सूक्ति – 266 Eternal Quote – 266

అజరామర సూక్తి  266

अजरामर सूक्ति  266

Eternal Quote  266

 प्रायः प्रत्ययमादत्ते स्वगुणेषूत्तमादरः

अलोकसामान्यमचिन्त्यहेतुकं

द्विषन्ति मन्दाश्चरितं महात्मनाम्

ప్రాయః ప్రత్యయమాదత్తే స్వగుణేషుత్తమాదరః

అలోకసామాన్యమచిన్త్య హేతుకం

ద్విషంతి మందాశ్చరితం మహాత్మనాం ll కుమారసంభవము (మహాకవి కాళీదాసు)

విజ్ఞులచే గౌరవము గుర్తింపు పొందిన వ్యక్తికి తన గుణగణములపైన గురుత్వము ఏర్పడుతుంది.

ఉన్నతమైన  పురుషుల  గుర్తింపు దొరకినదంటే తమ సత్ప్రవర్తనపై నమ్మకము ఏర్పడుతుంది.

మూర్ఖులు విజ్ఞులను అపహాస్యం చేస్తారుకారణం. వారి ప్రవర్తన  సాధారణ మానవుల కన్నా భిన్నంగా ఉంటుందిహీనులు ఆ  వ్యత్యాసానికి కారణాలను ఆలోచించలేరు.

మొదట ‘ప్రాయః ప్రత్యయమాదత్తే స్వగుణేషుత్తమాదరః’ ఈపాదానికి విశ్లేషణ ఒక కథ రూపములో చేసుకొందాము.

ఒకతల్లి తన సంవత్సరము బిడ్డ బెల్లము ఎక్కువగా తినుటచే, పశువులవలె చొంగ బెల్లపు రంగులో కార్చుకొనేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక మహిమాన్వితుడగు సాధువు వచ్చినాడు. ఆమె ఆయన వద్దకు బాలుని తీసుకొని పోయి విషయము వివరించి దానిని రూపుమాపు మార్గము అడిగింది. సాధువు ఒక వారము తరువాత ఆ అబ్బాయిని పిలుచుకు రమ్మనినాడు. ఆ విధముగానే ఆమె వారము తరువాత వచ్చి  స్వామీ ముందు నిలచింది. ఆయన సూటిగా బాలుని కళ్ళలోనికి చూస్తూ, ఎంతో ప్రేమతో ‘ఇకపై మెల్లమెల్లగా బెల్లముతినుట మానుకో’ అని చెప్పినాడు. ఒకవారము జరిగిన వెంటనే ఆయిల్లాలు పిల్లవానితో వచ్చి స్వామికి నమస్కారము చేయించి, ఆ బాలుడు బెల్లము తినుట పూర్తిగా మానివేసినాడని చెప్పినది. స్వాములవారు ఆశీర్వదించి ఆమెను పంపివేసినాడు.

ఇదంతా మొదటినుండి గమనించుతూ వచ్చిన శిష్యుడు ఎంతో జిజ్ఞాస కలిగినవాడై ‘ఆ బాలుడు మొదట వచ్చినపుడే మీరు అతనిని బెల్లము తినుట మానుకొమ్మని చెప్పియుండవచ్చు కదా!’ అని అడిగినాడు. అప్పుడు గురువు ‘ ఆ బలహీనత నాలోనే ఉన్నపుడు నేను దానిని విసర్జించిన పిమ్మటనే ఆ బాలునికి బోధించే అర్హత నాకు లభించుతుంది కదా!’ అన్నాడు. అటువంటి జ్ఞానులు చెబితే అది వేదమంత్రముగా పనిచేస్తుంది. అట్టి విజ్ఞులు చెప్పినపుడు తప్పక వ్యక్తికి అమితమగు మనోబలమును సమకూర్చుతుంది. పక్షి కంటిని మాత్రమే చూస్తూ అంబును ఎక్కుపెట్టిన అర్జునుడు ఆమాట గురువుకు చెప్పగానే బాణమును పక్షి కంట్లో గుచ్చుకొను విధముగా వదలినాడు. విజ్ఞులమాట జిజ్ఞాసువుల పై అంత గొప్పగా పని చేస్తుంది.

ఇపుడు మిగిలిన పాదముల అర్థమును మరొక కథ రూపములో విశ్లేషించుకొందాము.

చాటువు ----

ఒక చెరువులో కొన్ని కొంగలు ( సంస్కృతంలో బకము అంటే కొంగ అని అర్థము.) వుండినాయి. వాటి వద్దకు ఓ రోజు ఒక హంస వచ్చింది. వాటి మధ్య జరిగిన  సంభాషణకు అక్షర రూపమే  ఈ చాటు పద్యము. రస విహీనుల మధ్య ఒక పండితుడుచెడ్డ వారిమధ్య మంచి వాడు చేరితే ఎంత అవహేళనకు  గురికాబడతాడో తెలియజెప్పే చాటువిది.

 ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన హంసమ! ఎందునుందువో?

దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?

మవ్వపు కాంచనాబ్జములుమౌక్తికముల్ కలవందు! నత్తలో?

అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!

 

హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలుమేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వెదకినా దొరకవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలుచేపలు తిని బ్రతికే కొంగలకు శ్రేష్టమైన పద్మములముత్యముల  గురించి  తెలియదు కదా! బుద్ధిహీనులు ఎదుటి వారి గొప్పదనమును గానక ఎంత హీనముగా ప్రవర్తించుతారు అన్నదే చాటువు లో చెప్పిన ఈ బక మరాళ సంభాషణ.

 

కొంగలు “ఎవరునువ్వునీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది ఎందుకు?

హంస - ‘నేను హంసని!’

కొంగలు  “ ఎక్కడనుంచి వచ్చావు”?

హంస - “ చాలా దూరంలో ఉన్న మానస సరోవరం నుంచి వచ్చా!”

కొంగలు - ‘ అక్కడి విశేషాలు ఏమిటి’?

హంస - “బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వులుమంచి ముత్యాలు లభిస్తాయి!”

కొంగలు  ‘ నత్తలు ఉంటాయా’?

హంస - ‘ అవేమిటో నాకు తెలియదు’!

కొంగలు  “నత్తలు తెలియవాఅని పక,పకా నవ్వుతాయి”

మనము గమనించవలసినది ఏమిటంటేగొప్పవారు ఎన్నోవిశేషాలువిషయాలు  చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు. అటువంటి వారి ముందు ఊరక ఉండటము మంచిది. 'ఊరకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లే'దన్నారు పెద్దలు.

 ఈ భావాన్నే శ్రీనాధుడు తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ “ అడరి కాకులు చేరి బిట్టరచునపుడుఉదధి రాయంచ యూరక యుంట లెస్ససైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు. అంటే చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి వెక్కిరింపు మాటలకు మౌనంగా ఉండటమో లేక అక్కడ నుంచి వెళ్ళిపోవడమో ఉత్తమమని తెలుపుచున్నాడు కవిసార్వభౌముడు.. కావున ‘ మనకన్నా విద్యవిజ్ఞానముచివరకు వయసులోనైనా సరే పెద్దలయినవారిని  ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు’. ఎంతటి ఆచరణ యోగ్యమైన మాటో చూడండి.

చెవిటి వాని వద్ద  చేరి శంఖమునూద

'ఎంక గొరుకుచుంటివేల యనును

మూర్ఖ మతుల నడుమ మూర్ధన్యుడిట్లురా

రామ మొహనుక్తి రమ్య సూక్తి

प्रायः प्रत्ययमादत्ते स्वगुणेषूत्तमादरः

अलोकसामान्यमचिन्त्यहेतुकं

द्विषन्ति मन्दाश्चरितं महात्मनाम्

एक व्यक्ति जिसे विद्वानों द्वारा सम्मानित माना जाता हैवह अपने गुणों पर अटल विश्वास रखेगा l श्रेष्ठ पुरुषों की पहचान उनके गुणों में विश्वास पैदा करती है

मूर्ख, विद्वानों का मजाक उड़ाते हैं कारणउनका व्यवहार सामान्य मनुष्यों से भिन्न होता हैऔर इसलिए वे इस अंतर के कारणों मूर्ख जनों से पह्चाना जा नाहीं सकते

आइए पहले इस पद (पंक्तिके प्रायः प्रत्ययमादत्ते स्वगुणेषूत्तमादरः’

का एक कहानी के रूप में विश्लेषण करें

एक माँ जिसका  साल का बेटा रोज ज्यादा गुड खा रहा था और इसलिए लगातार नारे लगा रहा था। एक दिन उस नगर में एक मान्यवर संत आया। वह माँ ने उस लड़के को उस संत के  पास ले गईमामले को समझाकर उससे बचाव के लिए प्रार्थना की । संत ने एक हफ्ते बाद लड़के’ को लानेकेलिए कहा । निर्देश के अनुसार वह एक सप्ताह बाद आई और स्वामी के सामने खडी हो गई। स्वामीजी ने सीधे लड़के  की आँखों में देखा और बड़े प्यार से कहा "अब गुड़ चबाना बंद करो।" लगभग एक हफ्ते बाद महिला बच्चे के साथ आई और स्वामी के सामने सिर झुकाकर कहाी कि लड़के ने गुड खाना बिल्कुल बंद कर दिया है। स्वामी ने उसे और लड़के को आशीर्वाद दिया और उन्हें विदा किया

शुरू से ही यह सब देखकर शिष्य बहुत उत्सुक था और उसने पूछा, "क्या आप लड़के को गुड खाना बंद करने को पहले ही कह सकते थे?" गुरु ने तब कहा, "जब वह कमजोरी मुझ में है तो मै उसे कैसे बोल्सक्ता हूँ l इसलिए मैंने पहले खुद को योग्य बनाया और फिर लड़के को इस दुराभ्यास को छोड़ने के लिए कहा।" ऐसे ऋषियों का कहना है कि यह वेद मंत्र के रूप में कार्य करता है। ऐसे 'ज्ञानीव्यक्ति को भरपूर मनोबल प्रदान करसकते हैं।

अर्जुन ने केवल चिड़िया की आंख को देखते हुए अपना बाण उठाया और जब उसने द्रोणाचार्य को बताया और उसकी बात मान लीतो उसने तीर को पक्षी की आंख में घुसने दिया। जिज्ञासु पर ज्ञानी लोगो का आदेश बहुत ही अद्भुत ढंग से कार्य करती है।

आइए अब बाकी पाद टिप्पणियों के अर्थ का विश्लेषण एक अन्य कहानी के रूप में करें

एक तालाब में कुछ सारस थे (संस्कृत में बकामू का अर्थ सारस होता है)। एक दिन उनके पास एक हंस आया। उनके बीच बातचीत इस प्रकार हुई:

सारस- “तुम कौन होआपके पैर और चेहरा लाल क्यों है?

हंस - 'मैं एक हंस हूँ!'

सारस - "कहाँ से आए थे"?

हंस - "सबसे दूर मानसरोवर से आयाहूँ!"

सारस - 'वहाँ क्या है'?

हंस - "सुनहरे रंग में कमल के फूलअच्छे मोती मिलते हैं!"

सारस - 'क्या घोंघे हैं'?

हंस - 'मैं नहीं जानता कि वे क्या हैं'!

सारस - "घोंघे नहीं जानते?" वे जोर से हंसने लगे

नीति यह है कि 'मूर्खों के बीच एक विद्वान अपनी उपस्थिति महसूस नहीं कर सकताइसके विपरीत उसका उपहास किया जाएगा। यह परिणाम होगा यदि अच्छा आदमी बुरे लोगों की श्रेणी में शामिल हो जाए'

 

Praayah pratyayamaadatte swaguneshoottamaadarh

Alokasaamaanyam achintyahetukam

Dwishanti mandaashcharitam mahaatmanaam ll

Kumara Sambhava (Mahakavi Kalidasa)

 

A person who is recognized as respected by the scholars will gain gravity on his attributes

Recognition of superior men builds confidence in their virtues.

Fools mock scholars, reason. Their behavior is different than that of normal humans, and they hence cannot think of reasons for that difference.

Let us first analyze the ‘prayah pratyamadatte swaguneshuttamadarah’ this pada (line) in the form of a story.

A mother whose 1 year old son was eating more jaggery (gingerbread)     daily and hence was exuding slobber constantly. One day a glorious saint came to that town. She took the boy to him, explained the matter and asked him for its prevention. The saint summoned the boy a week later. As per the instruction she came a week later and stood before Swami. He looked straight into the boy's eyes and said with great affection, "Stop chewing jaggery anymore." About a week later the lady came with the child and bowed her head before Swamy, telling him that the boy had completely stopped eating gingerbread. The master blessed her and the boy and sent them away.
Observing all this from the beginning, the disciple was very curious and asked, "Could you have told the boy to stop eating gingerbread when he first came?" The Guru then said, "When that weakness is in me. Hence I qualified myself first and then asked the boy to give it up".  If such sages say it works as Veda Mantra. Such ‘Jnanis’ say that it must provide a person with a lot of morale.
Arjuna raised his arrow, looking only at the bird's eye, and when he told Dronaachaarya and got his nod, he let the arrow pierce the bird's eye. Wisdom works so wonderfully on the inquisitive.
Let us now analyze the meaning of the rest of the footnotes in another story form.

There were some storks in a pond (bakamu in Sanskrit means stork). One day a swan came to them. The conversation between them went on as under:

Storks— “Who are you? Why is your legs and face red?

Swan - ‘I am a swan!’

Storks - "Where did they come from"?

Swan - "Come from the farthest Manasarovar!"

Storks - ‘What’s up there’?

Swan - "Lotus flowers in golden color, good pearls are available!"

Storks - ‘Are there snails’?

Swan - ‘I don’t know what they are’!

Storks - “Don’t know snails?” they laugh loudly.

The moral is ‘A scholar among the Stupids cannot make his presence felt, on the contrary he will be ridiculed. That would be the result if the good guy joined the ranks of the bad guys.

స్వస్తి.

No comments:

Post a Comment