Tuesday 15 June 2021

అజరామర సూక్తి – 272 अजरामर सूक्ति – 272 Eternal Quote – 272

 

అజరామర సూక్తి  272

अजरामर सूक्ति  272

Eternal Quote  272

https://cherukuramamohan.blogspot.com/2021/06/272-272-eternal-quote-272.html

क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरा तेखिलाः

क्षीरोत्ताप मपेक्ष्यतेन  पयसा स्वात्मा कृशानौ हुतःl

गंतुम पावक मुन्मनस्तदभवद्दृष्ट्वा तु मित्रापदम्

युक्तंतेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्विदृशी ॥ 1.76॥ परोपकार पद्धति-भर्तृहरि नीति शतकम

భర్తృహరి సుభాషితము (క్షీర నీర న్యాయము )

క్షీరేణాత్మ గతోదకాయహి గుణా దత్తాః పురాతేఖిలాః

క్షీరోత్తాప మపెక్ష్యతేన పయసా స్వాత్మా కృశానౌహుతః l

గన్తుం పావక మున్మనస్తదభ వద్దృష్ట్వాతు మిత్రాపదం

యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ ll ॥ 1.76॥

పరోపకార పధ్ధతి-భర్తృహరి నీతిశతకం

ఏనుగు లక్ష్మణ కవి తెలుగు సేత

క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్

క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబుదు

ర్వార సుహృద్విపత్తి గని వహ్ని జోరంజనే దుగ్ధ ,మంతలో

నీరము గూడ శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్

 

క్షీరము తోడుత నీరము చేసెను మనసు మీరగా తా సావాసము

పొయ్యిపాలు చేయంగా పాలను అగ్గి భగ్గుమన పోయిని జేరుచు

పొరలబోవు తన మిత్రుని కొరకై పొరలెను నీరము పోయ్యిలోపలికి

తనకొరకై తన మిత్రుడు దూకుట చూడలేక తా దూకునంతలో

నీరు చిలక తా పులకరించెను నీరూ పాలూ నిలచెను ఒకటై

స్నేహమన్నచో అదియే కాదా తక్కినదంతా తుక్కుయే సదా!

పాలు,మొదట తనను కలియుటచేనీటికి తనగుణములన్నీ ఇచ్చినది. పాలు నిప్పుచే కాగి 

పోవుటచూచినాకెందుకులే యని ఊరుకోక నీరు నిప్పుపై దూకినది . తనకై తను 

త్యాగామునకే సిద్ధపడిన ఆ నీటికి బాసటగా పాలు నిప్పులోకి దూకబోతే నీరు తిరిగి 

తనను చేరిన తోడనే, అంటే పొంగే పాలపై నీటిని చిలకరించినతోడనే పాలు శాంతించి 

తిరిగీ నీటితో సఖ్యతగా ఉండిపొయినది .

మనము రోజూ కాచే నీరు గలిసిన పాలను భావానుగతులమై గమనించితే ఎంత నేర్వ 

దగిన గుణపాఠము ఉందో గమనించండి . 'పయస్సుఅన్న పదానికి పాలునీరు అన్న 

రెండు అర్థాలూ వున్నాయి. అంటే వాని మనసులు ఒకటి యగుట వలన బహుశ పేర్లు 

కూడా ఒకటైనాయేమో. లేక ఒకే పేరు ఉన్నందువల్ల ఒకే రకమైన గుణములు 

కలిగియున్నాయేమో.

 

क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरा तेखिलाः

क्षीरोत्ताप मपेक्ष्यतेन  पयसा स्वात्मा कृशानौ हुतःl

गंतुम पावक मुन्मनस्तदभवद्दृष्ट्वा तु मित्रापदम्

युक्तंतेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्विदृशी  1.76॥ परोपकार पद्धति-भर्तृहरि नीति शतकम

होते  सज्जन  मित्र  हैं  कैसेएक  उदाहरण  सुनिए  जैसे|

जल  ने  दूध  के संग  मिलकर  केमैत्री  दृढ़  कीगुण ले कर के|

दूध  ने जल  को  किया  समानकिया  मित्र  का  यों  सम्मान,

जल  ने  देखा  दूध  जलता  हैमित्र  बचाने  जल  जलता  है,

स्वयं  अग्नि  में  डाला  होमजय जयकार  हुई  सब  व्योम,

व्याकुल हुआ  दूध  तब  भारीचला  दाह को  कर  तैय्यारी,

तभी  मित्र  जल  ने  बाहर  सेशीतल  छींटों  को  दे  कर  के,

शीघ्र  दूध  को  कर  दिया  स्थिरऔर  दूध  भी  शांत  हुआ  फिर|

क्यों कि दूध  ने पाया  जल  मित्रऐंसा  उदाहरण  ना अन्यत्र|

पानी दूध से मिलते ही दूध ने पानी को उसके सारे गुण दे दिया। जब पानी दूध को उबलता देखा तो 

दूध के पहले ही पानी आग में खूद पड। जब दूध अपने मित्र केलिए आग में खूदने वाला था तब  

पानी उस पर छिडकते ही  दूध शांत हो गया और पानी के वापस आते ही पानी के साथ तालमेल 

बनाके शांती से रह गया l

अगर हम उस दूध पानी का भावनात्मक रूप से  देखेंगे तो यारी क्या होती है हम समझसकते हैं l  

पयास्’ शब्द के दो अर्थ हैंदूध और पानी। शायद उन दोनों का अविभाज्य सम्बन्ध सेनाम भी एक 

हो गया है। या एक ही नाम होनेसे  उनके गुण एक होगए हैं

Kshirenatmagatodakaya hi Guna Dattah Pura Telekhilaah

Ksirottapa mepekshaytena payasa svatma krishanau huth l

Gantum pavaka munmanastadbhavddrishtva tu mitrapadam

Yuktantena Jalen Shamyati Sataam Maitri Punarstvdrishi 

As soon as water get mixed with milk, milk gave water all its qualities. When the water saw the milk boiling, the water started pouring into the fire even before the milk. When the milk was about to plunge into the fire for the friend, the milk calmed down as soon as the water was sprinkled on him, and as the water came back, he remained peacefully in harmony with the water.

If we look at that milk, water combination emotionally, we can realize what the friendship is! We can understand that the word 'payas' has two meanings, milk and water. Perhaps due to their inseparable relationship, the name has also become one. Or by having the same name, their qualities have become one.

స్వస్తి.

No comments:

Post a Comment