Sunday 27 June 2021

అజరామర సూక్తి – 284 अजरामर सूक्ति – 284 Eternal Quote – 284

 

అజరామర సూక్తి 284

अजरामर सूक्ति 284

Eternal Quote 284

https://cherukuramamohan.blogspot.com/2021/06/284-284-eternal-quote-284.html

माता शतृः पिता वैरी येन बालो न पाठितः ।

न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ।। चाणक्य नीति

మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః ।

న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా ।। -  చాణక్య నీతి

ఏ బాలుడైతే చదివింపబడడో, వానికి వాని తల్లియే శత్రువు. తండ్రి కూడా శత్రువు. అట్టి 

బాలుడు సభా మధ్యములో హంసల మధ్య కొంగ వలె శోభించడు.

మనిషి మనుగడకు నీతి నియమము ముఖ్యము. జీవన శకటమునకు తలిదండ్రులు 

 చక్రములైతే నీవు సారధివి. నీ నీతినియమములే జోడు గుర్రములు. నీ గుర్రాలు ఎంత 

బలముగా ఉంటే నీవు అంత దూరము పోగలవు. నీకు అటువంటి స్వారి నేర్పినవాడే నీ 

గురువు. అంత మాత్రాన నీ ప్రయాణము సుఖమయమని తలువ వద్దు. నీవు వెళ్ళే బాట 

గతుకులమయమైతే అప్పుడు నీలోని ఆత్మస్థైర్యము, చాకచక్యమే నీకు తోడు. కాబట్టి 

మానవుడు జీవితంలో తన అభివృద్ధికి అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటాడు. 

మనుగడ కష్టసాథ్యమౌతుంది.   జీవితంలో చాలా అవమానాలను ఎదుర్కోనవలసి 

రావచ్చు. వ్యవహారాలని చక్కపెట్టుకునే విషయంలో, పరుల మీద ఆధారపడి బ్రతకవలసి 

వస్తుంది. పండిత గోష్టిలోనూ విషయ విశ్లేషణము, వాదోపవాదాలలో పాలుగొనలేడు. 

ఉన్నతమైన ఉద్యోగావకాశములు తద్వారా వచ్చే సుఖజీవనమూ, పేరు ప్రఖ్యాతులూ 

కూడా దూరమైపోతాయి. పూర్వము పండితుడు అన్నవాడు తన తాహతు తెలిసి 

ప్రవర్తించేవాడు. తనది తప్పయితే ఒప్పుకోనేవాడు, తన లోపములను 

సవరించుకోనేవాడు. నేడు అందరూ పండితులే! అందుచే తన ముగ్గురు గురువులు, 

తన ఆప్తమిత్రులు, అనుభవాలు నేర్పిన పాఠములను మనసునండున్చుకొని మసలవలసియుంటుంది. చదువు నడవడిక అన్నవి ప్రతి వ్యక్తి బాల్యమునుంది సంతరించుకొనవలసినవి.

దీనికి ఉదాహరణగా మనం మనకి తెలిసిన కాళిదాసు ఉదంతాన్ని గుర్తుకు 

తెచ్చుకోవచ్చును. రాజ కుమారి విద్యాధరి గొప్ప విదుషీ మణి. తన విద్వత్తుతో 

ఎంతోమంది పండితులను తన వాదముతో గెలిచింది. దూర్తుడగు మంత్రి యొక్క 

మూర్ఖుడగు కొడుకును వరునిగా ఒప్పుకొనక పోవుటచే మాయోపాయముచే తానూ 

కూర్చున్న కొమ్మనే నరుకుకొనే మూర్ఖునితో పెళ్లి జరిపింప జేస్తాడు. వేరెవరో కాదు, 

అతడే భోజరాజు ఆస్థాన రత్నమగు కాళిదాసు. విక్రమార్కుని ఆస్థాన సకలశాస్త్రజ్ఞుడు 

మరియు మహాపండితకవియగు కాళీదాసు ఈయనకు చాలా పూర్వీకుడు.

కాళిదాసు పండిత సభలో బాగా అవమానింపబడతాడు. భార్య కూడా ఆతనిని 

తిరస్కరించుతుంది.చివరికి కాళికామాత అనుగ్రహంతో కాళిదాసు అఖండ 

విద్వాంసుడౌతాడు. భోజుని అలరించుతూ భోజుని సభకు అలంకారమై 

అనుంగుమిత్రునిగా నిలచిపోతాడు.

అయితే, అందరికీ కాళీమాత అనుగ్రహముకలుగదు కదా! అందుచేత, పిల్లలకు 

చిన్నప్పటినుండీ మంచి నడవడికతో బాటు, తప్పనిసరిగా విద్యాభ్యాసము చేయించాలి. 

నేటి తల్లిదండ్రులు కొందరు పిల్లలపై అంత శ్రద్ధ చూపుటలేదు. తల్లిదండ్రులు వారి 

బాధ్యతను మరచితే, పిల్లలు కొరగానివారుగా మిగిలిపోతారు. మంచి సమాజం ఏర్పడే 

అవకాశాలు ఉండవు. సమాజము చెడితే దేశమే చెడుతుంది.

విద్యయొక్క ఆవశ్యకత, ఆ విషయములో తల్లిదండ్రుల పాత్ర, గుర్తు చేసే చక్కనయిన 

సూక్తి  ఇది.

माता शतृः पिता वैरी येन बालो न पाठितः ।

न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ।।

सरल शब्दों में मतलब है कि ऐसे माता व पिता शत्रु की तरह होते हैं, जो अपनी संतान को 

विद्याध्ययन नहीं करवाते, क्योंकि ऐसा विद्याहीन या अशिक्षित पुत्र विद्वानों व शिक्षित लोगों के बीच 

खडा होना शोभा नहीं देता,जैसे हंसो के बीच बगुला रहना शोभा नहीं देता।

सनातन धर्म शास्त्रों में रिस्तों की बड़ी अहमियत दी गई है, एक बच्चा जब जन्म लेता है तभी से 

उसके इस संसार में भौतिक रिस्ते जुड़ जाते हैं। इन सभी रिस्तो में जो रिस्ता उसका सबसे 

नजदीक और अपना होता है वह माँ-बाप का होता है क्योंकि उन्ही के कृपा से वह इस संसार में 

अपने जीवन को माया और बंधन से मुक्त करने आया है।

माँ-बाप उसके पहले गुरू होते हैं जिन्हें उसे ऐसी शिक्षा देनी चाहिए जो आगे जाकर के उस 

बालक- बालिका को तेजस्वी, ओजस्वी और प्रतिभाशाली बना दे। पर अगर मा-बाप कि शिक्षा में 

जरा सी कमी जैसे अविद्या, अज्ञान, और कोई भी कुसंस्कार आ जाये तो ये बालक के जीवन के 

लिए बहुत विनाशकारी हो सकते हैं।

यह बात आज के परिवेश में चरितार्थ है कि यदि कोई माँ-बाप शासन के इतने प्रयास और 

सुविधाएँ देने के बावजूद यदि अपने पुत्र/पुत्री को विद्या न दे सके तो वास्तव में वे अपने संतान के 

लिए माँ-बाप कहलाने योग्य नहीं है बल्कि अपने संतान के सबसे बड़े शत्रु के समान है।

आज का यह युग विज्ञान और तकनीक का युग है और ऐसे में यदि हम अपने बच्चों को सही शिक्षा 

नहीं दे पाएंगे तो वह समाज में कही भी प्रतिस्पर्धा करने योग्य नहीं रहेगा।विद्या का महत्त्व आज 

इसलिए भी अधिक बड़ जाता है क्योकि आज समाज में बेरोजगारी, जनसंख्या, अनाचार

भ्रष्टाचार, अनैतिकताअराजकता आदि अनेक बुराइयाँ व्याप्त है, यदि बच्चे को व्यवहारिक और 

सैद्धांतिक ज्ञान के साथ साथ नैतिकता की शिक्षा भी दी जाए तो ही समाज के इन बुराइयो को दूर 

किया जा सकता है। जब बात नैतिक शिक्षा की होती है तो बच्चों को शास्त्रीय नैतिक शिक्षा जरूर 

देनी चाहिए, ध्यान रहे कि आपकी शिक्षा में उदाहरण जरूर हो क्योंकि बालक का मन उदाहरणों 

से जल्दी सीखता है। विद्या का अर्थ केवल किसी विषय के ज्ञान तक सिमित न रहे बल्कि उसमे 

आध्यात्मिक और नैतिक शिक्षा का भी स्थान होना चाहिए, ताकि हम अपने बच्चों को एक अच्छा 

इंसान बना कर इस समाज को दे सके।

आज के परिवेश में यह उक्ति केवल माँ-बाप तक सिमित नहीं है बल्कि इसमें गुरु का भी महत्त्व 

बड़ जाता है, यदि माँ-बाप अपने बच्चे को विद्यालय भेज रहे है और उन्हें अध्यापन कराने वाले गुरु 

से सही विषय ज्ञान नहीं मिल पा रहा है तो वह गुरु भी उस विद्यार्थी के लिए शत्रु की भाँति है।

mātā śatru pitā vairī yena bālo na pāṭhita

na śobhate sabhāmadhye hasamadhye bako yathā - cāṇakyanīti

This sookthi or adage gives emphasis on the importance of education.

Parents have to impart to their Offsprings with good education. If such an 

education is not imported to them, their prosperity in the life would be very 

difficult and they will face many insults in the society. They do not fit themselves 

properly in the company of educated people. They feel isolated like a crane 

would be in the company of Swans.

The prime duty of a mother and father, as parents, is to educate their children and 

equip them with necessary life skills. Parents need to take a very active role in helping 

their children become good-hearted, responsible adults with deep-rooted values. This 

is what keeps society strong and surviving. This is the gift parents give to their own 

children and leave to the world. It is alright if they do not make a small fortune that 

lasts for 3 generations, they must educate their children. Such children make the world a happier place to live and will be happy people themselves.

Children will not shine, if the parents don’t concentrate on the brought up of their 

children with utmost care, especially with specific emphasis to moral values, they may 

end-up as a bane to the society. They will prove to be misfits in society, just as a limp 

stork is amidst a group of graceful swans. Swans are known for their grace. A crane is 

wobbly and limps in comparison to a swan. A crane in the middle of a group of swans 

would stick out like a sore thumb. Nobody wants to be a sore thumb. Children, while 

growing up, do not realize the importance of learning nor its applicability. So, it 

becomes all the more important for their parents to teach them all the tricks and trades for leading a successful life. This includes - education, good values and self-confidence.

Parents who do not do this are foes of their own children because they are 

contributing to their downfall, just as rivals would.

స్వస్తి.

No comments:

Post a Comment