Saturday 26 June 2021

అజరామర సూక్తి – 283 अजरामर सूक्ति – 283 Eternal Quote – 283

 

అజరామర సూక్తి 283

अजरामर सूक्ति 283

Eternal Quote 283

https://cherukuramamohan.blogspot.com/2021/06/283-283-eternal-quote-283.html

ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो

ज्ञानस्योपशम: श्रुतस्य विनयो वित्तस्य पात्रो व्यय: ।

अक्रोधस्तपस: क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता

सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ।।

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా సౌర్యస్య వాక్సంయమో

జ్ఞాన స్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రేవ్యయః l

అక్రోధస్తపసః, క్షమా ప్రభవితు, ర్ధర్మస్యనిర్వ్యాజతా

సర్వేషామపి సర్వకారణ మిదం శీలం పరం భూషణం ll  

భర్తృహరి సుభాషితము-నీతిశతకము

 ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదము

జానుగ భూతికిన్ దొడవు సజ్జన భావము శౌర్య లక్ష్మికిన్

మౌనము, నీతి విద్యకు, శమంబు సుబుద్ధికి, విత్తవృద్ధికిన్

దానము ,దాల్మి శక్తికిని ధర్మ నిరూఢి కదంబ వృత్తియుం,

బూనిక తోడ సర్వగుణ భూషణ మెన్నగ శీలమే సుమీ

ఐశ్వర్యమునకు సజ్జనత అంటే సహనము,సాదు వర్తనము,సాదు సంగము కలిగి యుండుట ఆభరణము. పరాక్రమమునకు మౌనము ఆభరణము అంటే నేను పరాక్రమవంతుడనని విర్రవీగ కూడదు. మంచి బుద్ధికి శాంతి ఆభరణము.సంతృప్తి ఉంటేనే మనసుకు శాంతి. అందుకే పెద్దలు 'సంతుష్టిః నందనం వనం' అన్నారు. ధనవంతునికి దానము ఆభరణము.' చేతులకు తొడవు దానము' అన్నారుపెద్దలు. బలమునకు ఓర్పు ఆభరణము. ఆ మాటకొస్తే మనిషికి ఓర్పు అంటే సహనమే బలము. 'క్షమయా నిష్టితాం జగత్' అనారు ఆర్యులు.

ధర్మావలంబనకు నిగర్వము ఆభరణము. ఈ విషయములో రాముడు మనకు ఆదర్శ మూర్తి.

ఈ ఆభారణములన్నీ శీలము అనే బంగారులో దాగి వున్నాయి.

కావున మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది శీలము. ఆ బంగారమొక్కటి మన చేతిలోవుంటే ఎన్ని ఆభరణాలైనా చేసుకొనవచ్చును. 

ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो

ज्ञानस्योपशम: श्रुतस्य विनयो वित्तस्य पात्रो व्यय: ।

अक्रोधस्तपस: क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता

सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ।।

धन-सम्पत्ति की शोभासज्जनता, शूरवीरता की शोभावाक् संयम'(बढ़-चढ़कर बातें करना) , ज्ञान की शोभाशान्ति, नम्रता, धन की शोभासुपात्र में, दान, तप की शोभाक्रोध करना, प्रभुता की शोभाक्षमाऔर धर्म का भूषणनिश्छल व्यवहारहैपरन्तु इन सबका कारणरूपशील=सदाचार” ‘सर्वश्रेष्ठ भूषणहै ।।

Aishwaryasya vibhushanam sujanataa, shauryasya vaaksamyamo

gynaanasyopashamaH shrutasya vinayo, vittasya paatre vyaya l

akrodhastapasaH kshamaa prabhavitur dharmasya nirvyaajtaa

sarveshaamapi sarvakaaranam idam shiilam param bhuushanam ll

Kindness of spirit adorns wealth. Restraint over speech adorns valor. Wisdom is adorned by detachment to worldly matters. Modesty adorns knowledge. Charity to the deserving adorns wealth. Absence of anger adorns penance. Forbearance adorns the capable. Lack of pretense adorns religious practice. But character is the best ornament and is the root of all these qualities.

స్వస్తి.

No comments:

Post a Comment