Saturday 19 January 2019

ధారా నగరం-అంతర్మథనం


ధారా నగరం-అంతర్మథనం
ఈ క్రింది లంకెలో ధారానగరము(ధార్)ను గూర్చి కొన్ని ముఖ్య విషయములు ఓపికతో చదవండి.
https://cherukuramamohan.blogspot.com/2019/01/blog-post_19.html

దారా నగరము అంతర్మథనము

దక్షిణ దేశము లోనివారలలో ఉత్తరాది పుణ్యక్షేత్రములకు పోయేవారు నా దృష్టిలో తక్కువే! అందులో కూడా తర్కము జిజ్ఞాసతో అచటి పురాతన కట్టడములను చూసేవారు ఇంకా తక్కువ. గడచిన 8౦౦ సంవత్సరములలో దాక్షిణాత్యులకు, ఔత్తరాహికులతో పోల్చితే విదేశీయులచే తిన్న ఢక్కా మక్కీలు తక్కువ.  కానీ ఔత్తరాహికులు మాత్రము తమ ధన మాన ప్రాణములనొడ్డి ఈ సంస్కృతిని రక్షించినారు. వారి అకుంఠిత ప్రయత్నములలో కొంత పోగొట్టుకోవలసి వచ్చినది. అట్లు పొగొట్టుకొన్నవానిలొ కాశీ, మధుర, అయోధ్య, ధార్, మెహ్రోలీ లోని కుతుబ్ మీనార్ మొదలయినవి ఎన్నో వున్నాయి, చివరకు ఎర్రకోట కూడా! ఈ రోజు ఆ కట్టడములన్నింటికీ ముస్లిం నామములే జతజేసి యున్నారు.

ఎంత జరిగినా మనకు ధర్మము పైన దేశముపైన ఉన్న అభిమానమునకంటే మనపైన ఉండునది అపరిమితము.

ఎంత జరిగినా మనకు, స్వధర్మము పైకన్నా స్వదేశముపైకన్నా, మనపైన ఉండు అభిమానము అపరిమితము. అందుకే నేటికీ మన నలందా విశ్వవిద్యాలయ గ్రందాలయమును 3 నెలలు నిర్విరామముగా కాల్చి బుగ్గి చేసిన బర్బరుడగు భక్తియార్ ఖిల్జీ పేరుతోనే , నలందాకు దగ్గరగా ఉండే పొగబండి స్తానకమగు (Railway Station) 'భక్తియార్పూర్' గా భాసిల్లుచున్నది. ఘజ్వా అంటే, ముస్లీములు కానివారిని చంపుట. ఆ పేర్లతో ‘ఘజియాబాద్’ మరియు ‘ఘాజీపూర్’ విలసిల్లుచున్నవి. ‘ఘజియాబాద్’ పూర్వనామము ‘వైశాలి’. మనదేశ చరిత్రలో ప్రసిద్ధనగరము. ఆ నగరము పూర్వనామము తిరిగి పొందుటకు ముహూర్హము ఆసన్నమైనట్లు లేదు. ‘సనాతన ధర్మ బంధువు’లంతా ఒకటైతేనే తిరిగీ మన దేశమునకు పునఃప్రతిష్ఠ చేకూర్చగలము.

ఇప్పుడు, మనము మరువలేని భోజరాజు రాజధాని దారానగరమును గూర్చి ఈ క్రింది లంకెలో కొన్ని ముఖ్య విషయములు విస్తారముగా చదవండి. 

1947 ఆగస్టు 15 వ తేదీన స్వతంత్రమును సాధించి  స్వాతంత్ర్య దినముగా జరుపుకొంటున్నాము. కానీ మనలో ఎంతమందికి ఇది స్వతంత్రదినమా లేక కేవలము అధికార పరివర్తన దినమా! అన్న విషయము తెలుసు. స్వాతంత్రము అన్నది అధికార పరివర్తనము కానేరదు. మనకు ఆగస్టు 15, 1947 న స్వాతంత్రమే ఇచ్చియుంటే దిల్లీ లోని పురావస్తునిలయమున భద్రపరచియున్నారు. మరి మనకు స్వాతంత్రమే ప్రకటించియుంటే  ఈ బదిలీ పత్రమును భద్రపరచుట ఎందులకు?


ఇస్లాం, ఖురాన్, హదీస్, షరియ వీనిని గూర్చి కాస్త తెలుసుకొందాము. మసీదు, పై విషయములలో దేనికీ చెందదు. మరి దేనికి చెందుతుంది అంటే కేవలము స్వార్థవాదులకు  మతాశాపరులకు (Vote Mongers). ఆశ్చర్యమగు విషయమేమిటంటే మసీదుకు ఇస్లామునకు సంబంధము లేదని ఏ ఇస్లాము మతపెద్దయూ  తెలిసికూడా,
 పెదవి విప్పడు. ఖురాన్ అనుశాసనము ప్రకారము పక్కా గోరీలను నిర్మించుట నిషిద్ధము. కానీ ఏ ముఫ్తీ కానీ ఏ ముల్లా కానీ ఈ వాస్తవమును తెలుపడు. ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ గారు వెళ్ళుచుండిన మసీదును సౌదీ అరేబియా ప్రభుత్వము పడగొట్టగాలేనిది అయోధ్య మధుర, కాశీలలో పడగొట్టుట తప్పెందుకగును అని ఆలోచన చేస్తున్నారా ఈ దేశపు ముస్లీములు. మరి హిందూ ముస్లిం భాయి భాయి  అని అనుటలో అర్థము ఎంత ఉన్నది.
ఇక్కడ ఒక విషయమును చెప్పుకొందాము. మధ్య భారతదేశంలో 1000 మరియు 1055 మధ్య కాలంలో పాలించిన రాజు భోజుడు , దారానగరమును(నేటి ధార్) రాజధానిగా చేసుకొని పాలించిన అసాధారణ రాజన్యులలో ఒకడు.  ఆయనను గూర్చి మనము చరిత్ర పుస్తకాలలో చదువనే చదువము. ఆయన కట్టించిన భోజ శాల  ఆయన పాలనకు సజీవదర్పణము. అది నాటి ముస్లిం పాలకుల ఇస్లాం మూఢవిశ్వాసము వల్ల మసీదుగా మార్చబడింది. నేడు మిధ్యాలౌకికవాదులు(Pseudo Seculars) దానిని హిందు ముస్లిం ఐక్యతా చిహ్నముగా చెప్పుకొస్తారు. ఎందుకంటే సరస్వతీ దేవికి అంకితమయిన ఆ శాల యొక్క ఒక గోడకు సంస్కృత వ్యాకరణ సూత్రములు తాపింపబడి ఉన్నాయి. ఆ శాలను మసీదుగా మార్చిన మహనీయులు ఆ గోడను కొట్టివేస్తే తిరిగి మిగతా మూడువైపుల గోదాలున్నంత గట్టిగా కట్టించలేమని తెలియుట చేతనేమో అట్లే వదిలిపెట్టినారు. ఈరోజు దానిని చూపించి హిందూ ముస్లిం సఖ్యతకు అది  నిదర్శనమని చెప్పుకొస్తారు. అట్లు చెప్పుట పుండుకు వెన్న రాచినట్లా లేక దానిపై కారము చల్లినట్లా!
ఈ పురాతన కట్టడమును 14, 15  శతాబ్దములలో కమాల్-మౌల్వీ మసీదు పేరుతో కట్టించబడింది. అక్కడ లభించిన సరస్వతీ దేవి విగ్రహముగా చెప్పబడే విగ్రహమును British Museum కు తరలించినారు. కట్టడము కదిలేటుగా వుంటే అదీ తరలించేవారేమో! మధ్యే మార్గముగా భారత పురావస్తు సంరక్షణ (సర్వేక్షణ) సంస్థ (Archaeological Survey of India) మార్గదర్శకాల ప్రకారం, శుక్రవారము మరియు మహమ్మదీయ పండుగలలో ముస్లింలు ప్రార్ధన చేయవచ్చని  హిందువులు మంగళవారము నాడు మరియు సరస్వతీ దేవి పూజను వసంత పంచమి పండుగలో  చేయవచ్చునాన్న నిబంధనను ఏర్పరచినారు. ఈ కట్టడము  ఇతర రోజులలో సందర్శకులకు తెరువబడి  ఉంటుంది. భోజశాలను పాక్షికముగా పడగొట్టి మసీదు కట్టి ‘హిందూ ముస్లిం భాయి భాయి’ అనుటలో అసలు ఔచిత్యము ఎక్కడున్నది ఎంత ఉన్నది అన్నది నాకు అర్థమగుట లేదు.
ఇక మరొక విషయమునకు వద్దాము. ఒక జాతీయ పార్టి ఒక దశాబ్దమో  లేక ఇంకా అంతకన్నా ముందో హిందూ తీవ్రవాదము అను ఒక క్రొత్త పేరును సృష్టించినారు. అంతకు మునుపే 1976 లో శ్రీమతి ఇందిరా గాంధీ గారి ప్రభుత్వ హయాములో భారతీయ సంవిధానమునందు లౌకిక వాదము (Secularism) అన్న మాటను చేర్చినారు. చేర్చకపోయినా దాదాపు 600 సంవత్సరములు మహమ్మదీయ పాలన లోను అటుపిమ్మట ఒక 200 సంవత్సరములు ఆంగ్లేయుల పాలనలోనూ ఆ ముసుగు లోనే కదా బ్రతికినాము. క్రొత్తగా ఆ పేరు పెట్టి హిందు మతము తప్ప మిగిలిన రెండు విదేశీ మతములకు అల్పసంఖ్యాక వర్గ పట్టముగట్టి, వారి ఉన్నతి కోరునట్టి ఒక జాతీయ పక్షము(National Party) లౌకిక వాద మంత్రముతో మాటలను చేతలను బంధింప ప్రయత్నించుచున్న 90% హిందువులు, ఎవరు ఎటుబోతే మనకేమిలే అని ఏమీ పట్టనట్లున్నారు. దారి ఏదయినా ధనార్జన మన నాయకులు పూనిన వ్రతము. నేడు హిందువులమగు మన పరిస్థితి ‘వండి వడ్డించేది రెడ్డిసాని, రెడ్డి తో వుండేది గుడ్డి పోలి’ అన్న చందమైనది.
ఈ దేశ అధ్యక్షులు (మాన్యులు అబ్దుల్ కలాం గారు తప్పించి), సినిమా హీరోలు, క్రికెట్ కాప్టన్లు, అత్యున్నత న్యాయస్థాన న్యాయాధీశులు, పలువిధముల ఉన్నతాధికారులయి, మైనారిటీ వర్గము వారు ఏలినప్పటికీ వారికి రక్షణ లేదు అనుట హాస్యాస్పదము కాదా!
Of the approximately 300,000 to 600,000 Hindus living in the Kashmir Valley in 1990 only 2,0003,000 remain there in 2016.
According to the Indian government, more than 62,000 families are registered as Kashmiri refugees including some Sikh families. Most families were resettled in Jammu, National Capital Region surrounding Delhi and other neighbouring states.
(Exodus of Kashmiri Hindus - Wikipedia, Google)
62 వేల కుటుంబాలలో కుటుంబమునకు సగటున 4 సభ్యులు సగటున వుంటారనుకొన్నా 2,50,000 బ్రతికి బట్ట కట్టుకొన్నవారు. మరి మిగతవారు ఏమయినట్లు? మరి రక్షణ కావలసినది ఎవరికీ.
తమిళనాడులో ‘మెల్ విశారం’ అన్న ఒక ఊరు వుంది. ఆ ఊరిలో హిందువులు మహా అంటే 10% ఉంటారేమో! పెత్తనమంతా ముస్లిములదే! చివరకు అక్కడి హిందువులు తమ ఆస్తి అమ్ముకొనవలెనన్నా ఊరిపెద్దయగు ‘భాయ్’ చెప్పినవారికి అమ్మవలసిందే! కేరళలో మల్లప్పురం అన్న ఊరిని గూర్చి ఇదేవిధముగా శ్రీ సుబ్బ్రమనియన్ స్వామి గారు తమ ఉపన్యాసము లో చెప్పగా వినుత జరిగినది. మరి ఈ విషములు మనదేశములో మనము మైనారిటీలమైనామని తెలియజేయుట లేదా!
జల్లికట్టు విషయములో గానీ మన ప్రధాన న్యాయస్థానము తనకు ఉచితమన్న న్యాయనిర్ణయము చేసినది కదా మరి 70 సంవత్సరములనుండి తన నిర్ణయమును ఎందుకు చెప్పుటలేదు.పైన తెలిపినట్లు సౌదీ ప్రభుత్వము మహమ్మదు ప్రవక్త గారు నమాజు చదివిన మసీదును పగులకొడుతూ అది కూడా ఖురాను వ్యతిరేకించే ఒక విగ్రహము వంటిదే అని శెలవిచ్చినారు. మరి ముస్లిం ప్రభుత్వమే ముస్లీం ప్రవక్త నమాజు చేయుచుండిన మసీదును పగులగొట్టినపుడు ఎప్పుడో ఎక్కడ నున్దియో వచ్చిన బాబరు కట్టించిన, ప్రార్థనలు జరుపని మశీదును గూర్చి ఉచ్ఛన్యాయస్థానము ఇంత జాప్యము చ్యుత సబబా! ఇంతకంటే అన్యాయము ఉంటుందా! మరి ఆ న్యాయస్థానము శబరీ మల విషయములో ఇచ్చిన తీర్పువలెనే స్త్రీలక్కు మసీదు నందు ప్రవేశమును కలిగించగలదా!

గూగుల్ నుండి యథాతథముగా ఆంగ్లములో సేకరించిన ఈ సమాచారమును చూడండి:
దిల్లీ  జామా మసీదు యొక్క షాహి ఇమాం ను అరెస్ట్ చేయలేని దేశ పోలీసు వ్యవస్థ చేతగానితనమును ఒకసారి పరిశీలించండి
A criminal case was lodged against him (Ahmed Bukhari) along with Habib-ur-Rehman and Nafisa in 2001, after an incident on 3 September 2001, when a mob, led by Bukhari assaulted on-duty police and civic agencies officials trying to remove encroachments from near CGO Complex in Lodhi Colony. Bailable Warrants against Bukhari for this case have been issued over and over by the Delhi court. Delhi Police has been unsuccessful to arrest him citing communal tension for the past 10 years. The Magistrate observed that legal provisions entailed initiating the proceedings of declaring Bukhari a proclaimed offender, but doing so would "undermine the authority of law." Also noted: "In my considered opinion, declaring accused Ahmed Bukhari a proclaimed offender would be a mockery of law and it would provide an easy escape route to the accused. It is surprising and shocking as well to
see the police force not be able to execute the NBW issued against Bukhari. Such inaction by police cannot be tolerated," he said in his order in July 2012.  (From Ahmed Bukhari Wikipedia)
మరి కంచి మఠాధీశులయిన జయేంద్ర మహాస్వాములను 11 నవంబరు 2004 దీపావళి రోజున  మన నాటి ఆంధ్రప్రదేశ్ లోనూ మరియు విజయేంద్రుల వారిని 10 జనవరి 2005 న మఠ ప్రాంగణములోనూ arrest చేయుట జరిగింది (గూగుల్ నుండి). మరి ఈ ఉదంతము వాళ్ళ మనకు ఏమని అర్థమగుచున్నది?
సనాతన ధర్మమును పాటించు సహజన్ములారా ఇక నయినా మన ధర్మము, మన సంస్కృతి ఈ వేదభూమిపై నిలువనీయండి. అందుకు గానూ మీకు తోచిన మంచి ఈ దేశమునకు ఒనగూర్చండి. విదేశీయ పాలనలోనికో కబంధ హస్తాల పరిష్వంగమునకో దేశమును నెట్టక కాపాడండి. యువతయే మన దేశపు పెట్టుబడి.
ధర్మఎవ సదా మూలం ధర్మఎవ సదా గుణం.
స్వస్తి.

Friday 18 January 2019

మన జాతీయ గీతము

మన జాతీయ గీతము
లంకె: https://cherukuramamohan.blogspot.com/…/01/blog-post_18.html

నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦ రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరంగీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్ ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర్ గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది. ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే సాక్ష్యము .
In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can be no debate about it. Of course Bankimchandra does show Durga to be inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [the nation].
మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు నడచినాడు.

మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో ప్రతిఘటన ఏదీ!
ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం. లో వ్రాయబడినది .
మిగతది రేపు చదువుదాం.....
ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగింది .
ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ జాతుల ,పర్వతముల, నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్ గారు నెహ్రు కుటుంబానికి ముఖ్యముగా నెహ్రు గారి తండ్రి మోతిలాల్ నెహ్రుకు అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది. ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములోనికి తర్జుమా చేసి జార్జ్V గారికి 1919 డిసెంబరు28న  సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు కదా !

ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు ఆయన చొప్పించిన అబిప్రాయము.
ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో తమ ఆనంద మఠ్ నవలలో సంతల్ పరగణాల లోని సన్యాసులు ఆంగ్లేయులకు విరుద్ధముగా పోరాడుతూ ఈ పాట రూపములో దేశ మాతపై తమ భక్తిని చాటుటకు   వ్రాసిన దేశ భక్తి గీతాన్ని తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .
"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him specially to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911)"The proceedings began with the singing by Rabindranath Tagore of a song specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28, 1911) "When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was also adopted unanimously." (Indian, Dec. 29, 1911)


ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా మోతిలాల్ నెహ్రు గారి ప్రోత్సాహంతో, కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితేతన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది. మన జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.
మిగిలిన భాగము రేపు చూద్దాము.
3వ భాగము
విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని  పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!



జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)
 జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా
పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా
వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా
తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా
జన్ గణ్ మంగల్ దాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

ఆహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ
హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖిస్తానీ
పూరబ్ పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా
జనగణ ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ
తుం చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ
దారుణ్ బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా
జనగణ పథ్ పరిచాయక్ జయహే, భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే
ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకే, స్నేహమయీ తుమీ మాతా
జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా
జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే
గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే
తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే
తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే
జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll
"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల ఆధారములను ఒకపరి పరికించుదాము -
మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.
1. 1919 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం జరిగింది.
2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1919 లో బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము. మరివిధాత అంటే బ్రహ్మబ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హుడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా!
తరువాతి భాగము రేపు......
4వ భాగము 
4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆసే - తవ సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పుపశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది. దక్షిణమున ఫ్రెంచ్ మరియు పోర్చుగీసు వలసు ఉండినవి.
5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది. పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని అనుకొనుటకు వీలు కాదుఅన్వయము కుదరదు కాబట్టి.
6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం "రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై  కదా వుండినారు.
7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్ పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునావాడ తగునా?
8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా! 
పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును "టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!
మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.
పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి సింహాసనము  చేజిక్కించుకొనిదేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన మీర్ జాఫర్ నుఅతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు. ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూముఖోపాధ్యాయ  ముఖర్జీగానూబందోపాధ్యాయ బెనర్జీగానూ మారిపోయినాయి. అయితే శ్యాం ప్రసాద్ ముఖర్జీ 
ఖుదీరాం బోస్చిత్తరంజన్ దాస్సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికిఠీవికిదర్జాకుదర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.

ఇక ఈ నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి చూద్దాము :
మిగిలినది రేపు.....

5వ భాగము

1. 18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్ కిశోరము ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా పాత్రులు కారని ఎంచి, విధించినారు.  ఇది 1908,మే 21న జరిగిన ఉదంతము. అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర లేకుండా చేసిన బెంగాలు పులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో !
2. రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.
3. ఆయనకు బంగ్లావాసిగా కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది.
4. బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన భాషణము ఇవ్వలేదు .
5. ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు.
6. బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు అంద జేసినారు. 
7. ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ బహుమతినిచ్చినారని కూడా అంటారు. 

ఇక్కడ, ఖుదీరాం బోస్ నేటి తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు, చదివిన/చదివే చరిత్ర లో కనిపించడు. ఈ మహనీయుని గూర్చి ఈ తరం యువతరం తప్పక తెలుసుకోవలసి యున్నది .

1889 డిసెంబరు 3 న జన్మించిన ఈయన 18 సంవత్సరాలా 8 నెలలా 8 రోజులకే ఆంగ్లేయుల పైశాచికత్వమునకు బలియయిన బెంగాల్ బాలవీరుడు.  బెంగాలులోని మిడ్నపూరుకు చెందిన వాడు. ఆయన, అరబిందో గారు పూర్వాశ్రమములో రాజకీయ నాయకునిగా దేశమును జాగృతము చేయుచున్న కాలములో వారి ప్రభావమునకు గురియైనవాడు. 16 సంవత్సరాల నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే మిడ్నపూరు పోలీసు స్టేషను వద్ద బాబుల నమర్చినవాడు. ఆ తరువాత మూడు సంవత్సరములకు ఆంగ్లేయులచే అరెస్టు కాబడి వారిచే విధింపబడిన ఉరిశిక్షకు 11 ఆగస్టు 1908 లో గురియయినవాడు. ఆయనపై వరుస బాబులనమర్చినాడన్న అబద్ధపు అభియోగమును  మోపి  ఆయనకు ఉరిశిక్ష విధింపజేయుట జరిగినది. కింగ్స్ ఫోర్డ్ అన్న ముజఫ్ఫర్ పూర్ బీహారు కు చెందిన అతి కౄరుడైన  మేజిస్ట్రేటును బాంబు ఒక చేతితో రైఫిల్ ఒక చేతితో పట్టుకొని బాంబును బగ్గీ పై వేసినాడు కానీ ఫోర్డు కు బదులుగా కెన్నెడీ అన్న బారిస్టరు యొక్క భార్య బిడ్డ అందులో వుండినారు. ఎట్లయితేనేమి ఖుదీ రామును బంధించినారు 1908 మే 1 న. ఆయనను గూర్చి STATESMAN అన్న ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక  ఈ విధముగా వ్రాసినది.
The English daily, The Statesman, wrote on the following day, May 2, 1908:
The Railway station was crowded to see the boy. A mere boy of 18 or 19 years old, who looked quite determined. He came out of a first-class compartment and walked all the way to the phaeton, kept for him outside, like a cheerful boy who knows no anxiety.....on taking his seat the boy lustily cried 'Vande Mataram'...
ఇక్కడ ఇంకొక విషయము ఏమిటంటే అభియోగము మొత్తమును తనపై వేసుకొని తన సహచర వర్గమునువిప్లవ సంఘమును కాపాడిన మహానీయుడాయన.
The Amrita Bazar Patrika, one of the prominent dailies of that era published about him with the headlines   "Khudiram's End: Died cheerful and smiling" the newspaper wrote: "Khudiram's execution took place at 6 a.m. this morning. He walked to the gallows firmly and cheerfully and even smiled when the cap was drawn over his head." An established British newspaper, The Empire, wrote: "Khudiram Bose was executed this morning...It is alleged that he mounted the scaffold with his body erect. He was cheerful and smiling." The Bengali poet Kazi Nazrul Islam wrote a poem to honor him.
నేను ఆ నిస్వార్థ జాతీయ వీరుని గూర్చి చాలా క్లుప్తముగా తెలిపినాను. గాంధిజీ కి ‘మహాత్మా’ అన్న బిరుదునిచ్చినది ఠాగూర్ గారా కాదా అంటే అది వివాదాంశము. మరణ సమయమున ‘హేరాం’ అన్నాడా లేదా అంటే దానికీ వివాదము విభేదము ఉన్నదీ కానీ ఖుదీరాం గారు ‘వందేమాతరం’ అన్నారా లేదా మోముపై చిరునవ్వుతో అసువులు బాసినారా లేదా అన్నది మాత్రము నిర్వివాదాంశము. ఖుదీరాం ధృవతారలో ఐక్యమైనాడు.  ధృవతారలో ఐక్యమైతే అయినాడు గానీ  అయినట్లు ఆ తారలో మనకు కనిపించడు. మరి ఇటువంటి మహనీయులను గూర్చి పాఠ్యాంశములలో చేర్చ నవసరము లేదా! మన పిల్లలకు దేశభక్తి అవసరము లేదా! బయటి దేశాలలో చదివే భారతీయ విద్యార్థులకు ఈ పుణ్యభూమిని గూర్చి ఎంత తెలుసు.
నేడు బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో నేడు మధ్యందినమార్తాండు.
చాలా దూరం వచ్చినాము. మళ్ళీ కలుసుకొందాము.

స్వస్తి

Wednesday 16 January 2019

కోడి రామ్మూర్తి నాయుడు గారు


కోడి రామ్మూర్తి నాయుడు గారు
'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి జయంతి జనవరి 16.
ఇండియన్ హెర్కులస్' గా బిరుదు గడించిన ఏకైక భారతీయుడు, అందునా ఆయన మన తెలుగువాడు, అందుకుతోడు ఆయన గొప్ప దేశభక్తుడు. ఆయన ఎంతమంది ఆంధ్రులకు గుర్తున్నాడో నాకు తెలియదు. అందువల్ల ఆ మహనీయుని గూర్చి తెలియని వారికొరకు ఆయనను పరిచయము చేయబూనుకొన్నాను.
క్లుప్తంగా ఆయన గురించి:
కోడి రామ్మూర్తి నాయుడు గారు జనవరి 16, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించినారు. వీరి తండ్రి కోడి వెంకన్న నాయుడు గారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి గారి వద్ద పెరిగినారు.
ఈయనకు స్ఫూర్తి ఎవరివద్దనుంది లభించినదో నాకు తెలిసిరాలేదు కానీ ఆయనకు చిన్న వయసులోనే ఈ కలపి మక్కువ ఎక్కువగా వుండినది. ఆయన అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే తన రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. కాలాంతరములో 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగినాడు.

రాను రానూ ఆయన ప్రతిభ మలయా మారుతమై దేశాముయోక్క నలుదిశలా ప్రసరించింది. సంయుక్త మద్రాసు రాష్ట్రములోని ఆంద్ర ప్రాంతమునకు చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులుగా అనతి కాలములోనే గుర్తింపబడినారు వీరు. సంయుక్త మద్రాసు రాష్ట్రమని ఎందుకు వ్రాసినానంటే ఆయనకు సాటి తమిళ ప్రాంతమున ఎవరూ లేరు అని తెలుపుటకు. ఈయన ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన దేహదార్ఢ్య ప్రముఖులలో అగ్రగణ్యులు.
ఆశ్చర్యకరమగు విషయము ఏమిటంటే ఈయన కమ్మవాడయ్యును పూర్తి శాకాహారి. సాధారణ కాపు కుటుంబం లో జన్మించినవాడై కూడా భారతీయ యోగ శాస్త్రానికి సంప్రదాయ మల్లవిద్యకు ప్రపంచ ఖ్యాతి తీసుకుని వచ్చిన మహా ప్రజ్ఞావంతుడు. ఈయన శాకాహారులు. భారతీయ యోగశాస్త్రము. ప్రాణాయామము తో బాటూ జల, వాయుస్థంభన విద్యలను శారీరక బలప్రదర్శనలకు జోడించి జగదేక మల్లుడయినాడు.
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పినాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరినాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించినాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించినాయి.
ఈయన ప్రతిభ మాటలకు అందనిది. తన శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని నింపుకొని, ముక్కలుగా తుంచి వేసేవాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంతో నడుప accelerator ను బలముగానొక్కమనేవాడు. driver seat లో కూర్చున్నవారు దానిని ఎంత బలముగా నొక్కినా కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించు కునేవాడు.  5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు.
పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. వారి ప్రదర్శనలను ప్రజలు తండోపతండములుగా చూచేవారు. దీనిని గమనించిన బాల గంగాధర తిలక్ గారు
విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించినారు. ఆవిధముగా ఆయన ప్రోత్సాహముతో కోడి రామమూర్తి గారు విదేశములలో కూడా ఎన్నో ప్రదర్శనలను ఇచ్చినారు.

అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తి గారి ప్రదర్శనలను చూడవలెనను ఆకాంక్ష వ్యక్తము చేస్తూ ఆదేశామునిచ్చి తన అధికారిని పంపగా ఆయన వచ్చి , రామమూర్తి గారు ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచియుండి  ఆయనకు మింటో గారి మనోరథమును తెలియజేసినారు. అందుకాయన వల్లెయనగా ఆ సందేశమును ఆతడు మింటో గారికి అందజేసినాడు.
రామమూర్తిగారి ప్రదర్శనాసమయము రానేవచ్చింది.  రామమూర్తి గారి ప్రదర్శనలను చూచి అప్రతిభుడైనాడు మింటో! అసలు ఆయనను తానే పరీక్షించవలె ననుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక అంగుళము కూడా కదలలేక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశవిదేశములందు అఖండ ఖ్యాతినీ సంపాదించాడు రామమూర్తి నాయుడు.

ఈయనను పండిత మదనమోహన మాలవ్య గారు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించినారు.

లండన్ లో రాజదంపతులు కింగ్ జార్జి, క్వీన్ మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయతాకు లోనయినారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదుతో ఆయననుసత్కరించినారు.  ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు గారు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్  వంటి దేశాలలో కూడా పలు ప్రదర్శనలిచ్చి అనేకానేక పురస్కారములను అందుకొన్నారు.
ఇక్కడ స్పెయిన్ లో జరిగిన Bull Fight ను గూర్చి చెప్పితీరవలసినది ఒక మాట ఉన్నది.
స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైనది. ఇది  చాల భీకరంగా ఉంటుంది. పాల్గోన్నస్వారి ప్రాణములు పోయిన దాఖలాలు కూడా ఎన్నో వున్నాయి. రామమూర్తి గారిని ఆ పోరులో పాల్గొనమన్నారు అక్కడి వారు.  అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు తల వంచని వీరుడు కావున ‘సరే’నన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకి  దూసుకుని వస్తున్న ఆ పొగరుమోతు  కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేసిన మేరు నగధీరుడాయన. ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆ ప్రదేశము మారుమ్రోగింది.

కోడి రామమూర్తిగారు కోట్లు గడించినారు. ఆయన మహా దాత. తన స్డంపాదనను అధికాంశము దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేసినారు. రామమూర్తిగారి ప్రశంసలు ప్రతిరోజూ పత్రికల్లో వెలువడేవి. భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది.

తెలుగువాడయిన ఈ మల్లయోధుడు ప్రపంచ ఖ్యాతిని తన స్వంతము గావించుకొన్న అశేష శేముషీధురీణుడు. హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి ఈయనకు జగదేకవీరబిరుదమిచ్చినారు.

ఆయన అసమాన శక్తి, అజరామర కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో ఆయనపై దుర్మతులు కొందరు హత్యాప్రయత్నాలు కూడా చేసినారు. లండన్ లో ఎదపై చెక్కపలకను పెట్టుకొని ఏనుగును ఎక్కించుకొన వలసిన సమయములో  ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఆయన ఛాతిపై పెట్టగా ఏనుగు ఎక్కగానే చెక్క విరిగి దాని ముక్క ఆయన పక్కటెముకల లోనికి దిగబడుట జరిగినది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్ లోనే ఉండిపోవలసి వచ్చింది. మరొకసారి రంగూన్ లో కూడాదుండగులు కొందరు ఆయనపై హత్యాప్రయత్నము చేయబోగా, ఆవ్యక్తులను చితకబాది, సురక్షితంగా ఆయన బయటపడటం జరిగింది.
గుజరాతు లోని మాల్కానగరములో అయితే,  భారతంలో భీమునివలె విషప్రయోగాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆదేశాన ఒక విందులో ఆయనకు విషము కలిపిన పాలు ఇచ్చినారు. ఆయన గుటగుటమని అది త్రాగి బ్రేవ్ మని త్రేన్చి విషాన్ని జీర్ణించుకొని మూత్రం ద్వారా విష మలినమును విసర్జించినారు.  అప్పుడు ఆయనను కాపాడినది యోగ విద్యయే!

కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకొనలేదు. ప్రాణాయామము చేసి నిబ్బరంగా వుండిపోయినారు.
సేకరించిన ధనము పలువిధములుగా  కరిగిపోయింది. 1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే ఒక శిష్యుడు. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపినారు నాయుడు గారు.  మరునాడు సంక్రాంతి. కాని ఆయన నిద్ర లేవలేదు. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. బహుశ ఇంద్రునికి ఆయన కళానైపుణ్యము
చూడవలేననిపించినదేమో!
తెలుగు నాడునకు మాత్రమే కాకుండా యావత్ భారతమునకు ప్రపంచమునకు కీర్తినార్జించిపెట్టిన ధ్రువతార శ్రీ కోడి రామూర్తి నాయుడు గారు.
స్వస్తి.