Sunday 20 June 2021

అజరామర సూక్తి – 277 अजरामर सूक्ति – 277 Eternal Quote – 277

 

అజరామర సూక్తి  277

अजरामर सूक्ति  277

Eternal Quote  277

https://cherukuramamohan.blogspot.com/2021/06/277-277-eternal-quote-277.html

शत्रोरपि गुणा वाच्याः दोषा वाच्या गुरोरपि ।

सर्वदा सर्वयत्नेन पुत्रे शिष्यवदाचरेत् ॥ - सुभाषितरत्नभाण्डागार

శత్రోరపి గుణా వాచ్యాః దోషా వాచ్యా గురోరపి l

సర్వదా సర్వయత్నేన పుత్రే శిష్య వదాచరేత్ ll

శత్రువు సుగుణములను కీర్తించుటలో బిడియపడ కూడదు. అదేవిధముగా గురువులో 

విధమైన దోసము దొరలినా తెలుపుటకు సంశయించకూడదు. అట్లే శిక్షణా 

సమయములో కొడుకును కూడా శిష్యుని వలెనే చూడవలెను కానీ కొడుకని 

గారాబము చేయరాదు.

ప్రతి ఒక్కరికి వారి స్వంత యోగ్యతలు మరియు లోపాలు ఉండుట సహజము. అదేవిధముగా ఒక వ్యక్తి శత్రువయినంత మాత్రమున నిరసించకూడదు. పూర్వము రాజులు యుద్దరంగమున వైరి రాజుల శౌర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకునేవారువిలువ అన్నది వ్యక్తికి బదులుగాయోగ్యతకు ఇవ్వవలసియుంటుంది. అందరిలో మంచిని చూచుట మనమలవరచుకోన వలసిన ప్రముఖమగు లక్షణము.

భారతీయ సంస్కృతి సాటి మానవుని సాధారణ వ్యక్తిగా చూడకుండా అతని లోని 

సద్గుణశ్రేణిని మనము గ్రహించవలె. శత్రువును చూసినాఅతని సలక్షణాలను 

గ్రహించుట సద్గుణసంపన్నుని ధ్యేయముగా ఉండవలెను. 

‘శత్రోరపి గుణా వాచ్యా’ అన్న మాటకు ఒక చక్కని ఉదాహరణ చదవండి. 

కంబ రామాయణములో, రావణుడు చనిపోతున్నప్పుడు రావణుని ఔన్నత్యమును తెలిపి రామచంద్రుడు లక్ష్మణునితో ఆయన వద్దకు వెళ్లి అతని నుండి ఉపయోగకరమైన 

సలహాలు తీసుకొని కొన్ని విధానాలు తెలుసుకొని రమ్మని చెబుతాడు. ఆశ్చర్యచకితుడైన 

లక్ష్మణుడు వినయముగా తన వ్యతిరేకతను వ్యక్తము చేస్తాడుకానీ రాముడు అతనికి 

నచ్చజెప్పి రావణుని వద్దకు పంపుతాడు.

అయిష్టత తోనే లక్ష్మణుడు వెళ్లి రావణుడి తల వద్ద నిలచి ధర్మబోధ చేయమంటాడు. రావణుడు తన వైపు కన్నెత్తి కూడా చూడక పోవుటచే లక్ష్మణుడు అవమానంతో తిరిగి వచ్చిఏమి జరిగిందో అన్నకు తెలియజేస్తాడు. శ్రీరాముడు అసలు అహంకారి అతను కాదు నీవు అని చెబుతూ, ఒక శిష్యునిగా వెళ్ళి తెలుసుకోనిరంమని చెప్పి పంపుతాడు. లక్ష్మణుడు అన్న మాట పాటించి రావణుని పాదాల చెంత నిలచి ధర్మబోధన గ్రహించి తిరిగి అన్నవద్దకు వస్తాడు. మంచి ఎక్కడున్నా గ్రహించి తీరవలసినదే!

         ఇక ‘దోషా వాచ్యా గురోరపి’ అన్న విషయమును గూర్చి తెలుసుకొందాము.

అజ్ఞానము, అవివేకము లేక విషయానుశీలన లోపించిన వారిగా శిష్యులు మాత్రమె ఉండావసరము లేదు. గురువులు కూడా ఉండవచ్చును. గురువు తప్పులను వినమ్రతతో తెలియజేయుటకు  తగిన  ధైర్యము మరియు విశ్వాసము శిష్యుడు కలిగి యుండవలెను. గురువు యోగ్యుడయితే తన తప్పును సవరిచుకొంటాడు. అయోగ్యుడయితే అతని వద్ద చదువు కొనసాగించవలసిన అవసరమే ఉండదు.

 ఇపుడు ‘సర్వదా సర్వయత్నేన పుత్రే శిష్య వదాచరేత్’ అన్న విషయమును కాస్త చర్చిన్చుకొందాము. తల్లిదండ్రుల బాధ్యత తమ సంతానము నైతికత విలువలతో సమృద్ధియగు జీవితము  సాగించుటకు తగిన విధముగా రూపొందించటము. అది వారిని ఆధ్యాత్మికంగా గొప్ప మరియు ప్రశాంతమైన జీవనశైలి వైపు నడిపిస్తుంది. అలా చేయడానికితల్లిదండ్రులు బోధించేటప్పుడు నిష్పాక్షికంగా ఉండాలి. వారి యోగ్యతలకు ప్రతిఫలం ఇవ్వాలి మరియు వారి మూర్ఖత్వానికి శిక్ష విధించాలివారు తమ పుత్రులయినా తక్కిన ఛాత్రులవలెనే పరిగణించవలసియుంటుంది.

వారు పెరుగుతున్నప్పుడు వారిలో  ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేయాలి. అలాంటి పెద్దలు మరింత సంతృప్తికరంగాశాంతియుతంగా మరియు సంతోషకరమైన సమాజాన్ని తయారు చేస్తారుఇది ప్రపంచానికి సుఖము శాంతి సంతోషమును సమకూర్చుతుంది.

 

शत्रोरपि गुणा वाच्याः दोषा वाच्या गुरोरपि ।

सर्वदा सर्वयत्नेन पुत्रे शिष्यवदाचरेत् ॥ - सुभाषितरत्नभाण्डागार

भारतीय संस्कृति तो यह कहती है की सामान्य व्यक्ति के गुण देखने की बात तो है ही। तुम यदि 

शत्रु के प्रति भी देखो तो उसके गुण देखोशत्रु से भी गुण ग्रहण करो। कितनी उदार दृष्टि है यह 

उसी के जीवन में प्रगट हो सकती है जो अंदर से उदार है। शत्रोरपि गुणावाच्यारामायण का एक 

प्रेरक प्रसंग है जब रावण मरणासन्न था तो रामचंद्र ने लक्ष्मण से कहा कि लक्ष्मण रावण बहुत बड़ा 

नीतिज्ञ रहा है जाओ उससे तुम कुछ ग्रहण करो कुछ नीतियां सीख लो लक्ष्मण जी एकदम 

बौखला गए की भैया आप यह क्या कह रहे हो उस अभिमानी रावण के पास वही गुण होंगे जो मैं 

उससे लेने जाऊं  रामचंद्र जी ने समझाया  लक्ष्मण अब वह हमारा शत्रु भी नहीं अब तो वह नीति 

निपुण और मरणासन्न राजा है जाओ तुम उससे गुण ग्रहण करके आओ” l  इतनी उदगार दृष्टि 

रामचंद्र की।

 

राम जी के कहने पर लक्ष्मण गए और रावण के सिर पर खड़े होकर बोले कि भैया कहते हैं तुम्हारे 

पास बहुत गुण हैं मुझे दे जाओ मैं तुम से लेने आया हूं अब तुम्हें तो यहां से जाना ही है l  रावण ने 

उसकी ओर आंख उठाकर भी नहीं देखा l  लक्ष्मण लौट आए और बोले भैया वह अभिमानी गुण 

बताने की बात, बात तो दूर, उसने मेरी तरफ आंख उठाकर भी नहीं देखा l  रामचंद्र ने कहा 

लक्ष्मण भूलते हो अभिमानीवह नहीं अभिमानी तुम हो यदि किसी से कुछ ग्रहण करना हो तो 

शिष्य बन कर जाओ विजेता बनकर नहीं l

लक्ष्मण को बात समझ में आ गई इस बार लक्ष्मण रावण के चरणों में पहुंचे और उनसे कहा भैया 

राम ने मुझे आपके पास भेजा है, आप इस स्थिति में मुझे सारी नीतियों का ज्ञान दीजिए जो मेरे 

काम में आएगी l इस बार लक्ष्मण ने निस्संकोच अपनी सारी नीतियां देदी l  कथा का अपना 

विस्तार है पर मैं सिर्फ यह कहना चाह रहा हूं कि शत्रोरपि गुणा वाच्या इस नीति को अपना कर 

अपने चिंतन को उदार बनाओ तभी गुण ग्रहण की उदार वृत्ति जागृत हो सकेगी।

दोषा वाच्या गुरोरपि... अगर गुरू में भी दोष हो बिना हिचकिचाए उस अवगुण को बतानाही है l 

अगर गुरूजी उस बात को सही तरीखेसे लेकर अपने आप को सुधारलिया तो वे पूजनीय है l उन्ही 

के यहाँ शिक्षा प्राप्त करनेका प्रयास करो l अगर ठीक से नहीं लियातो उसे छोड़ना ही बेहतर है 

जिस गुरू में मान्यता नहीं है उस के यहाँ शिखा प्राप्त करने से कुछ भी फ़ायदा नहीं रहेगा l

सर्वदा सर्वयत्नेन पुत्रे शिष्यवदाचरेत् : किसी भी हालत में शिक्षा देते समय अपने पुत्र को भी शिष्य 

के सामान ही बर्ताव करना है l अगर शिक्षा के समय लाड-प्यार दिखाएंगे तो पुत्र सूखा पत्र 

बनसकता है l  

śatrorapi guṇā vācyāḥ doṣā vācyā gurorapi 

sarvadā sarvayatnena putre śiyavadācaret  subhāṣitaratnabhāṇḍāgāra

Merits should be spoken of even in an enemy; wrongdoings are to be 

pointed out even in a teacher; with all effort, deal with offspring as you would with students.

Some dos and don’ts!

Everyone has their own merits and demerits, even enemies. Just because he 

is not one's favorite person, doesn't mean that his merits should be 

discounted. Great kings have always admired the valor of other powerful 

kings, although they were going head to head against each other. The value 

is given to the merit, not to the person himself.  See the good in everyone!

Indian culture says that it is a matter of seeing the qualities of an ordinary person without considering his status. Even if you look at the enemy, see his qualities, get the qualities from the enemy also if they are adorable. How generous the vision is, it can be manifested in the life of the one who is generous from inside. Shatrorpi gunaa vaachyaa:  There is an inspiring episode of Ramayana when Ravana was dying, Ramachandra told Lakshmana about Ravana who has been a great moralist and asks him to go and take useful advices from him and learn some policies. Lakshman ji was completely shocked and says his brother, “What are you saying! That arrogant Ravana will have the same qualities as we are acquainted with. Should I go to get advices from him”? Such is the bright sight of Ramchandra.

At the behest of Ram ji, Lakshman went and stood on the head of Ravana 

and said “My brother told me you have treasure of good qualities, give me 

as I have come to take them from you, however you leave earth”. Ravana 

did not even raise his eyes towards him. Lakshman returned with ignominy 

and conveyed what had transpired. Ramchandra said Lakshman “he is not 

arrogant, you are arrogant. Go to him as a disciple you will get the advices 

from him. Be a winner, not a loser.

Lakshman understood the matter, this time, he reached at the feet of Ravana and asked him “Brother Ram, has sent me to you, in this situation, give me the knowledge of all the policies which will be useful to me”. This time Laxkshan without hesitation gave all his efforts with all his submissiveness and got every advice from him. The story has its own extension, but I am just trying to say that  ‘Shatrorapi Guna Vaachyaa’: Make your thinking liberal by adopting this policy even with an enemy, then only the liberal attitude of acquiring virtue will be awakened.

Follies are follies, whether coming from a layman, a scholar, an uneducated man, or even a teacher. In order to uphold dharma, even the scriptures give the liberty to students or youngsters to call out anyone taking a wrong step, even if he is the educator himself. Dharma has the last word always! Have the courage and confidence to speak up against wrongdoings.

The responsibility of any parent is to equip their offspring with life-essential skills that are rich with morals and values.  This leads them towards a spiritually rich and peaceful lifestyle. To do that, the parents need to be unbiased while teaching them. Their merits should be rewarded and their follies penalized, just as they would their students. Indulging them at all times will teach them no life lessons. If one wants their offspring to be ready to take on the world as young adults, they need to build that confidence in them, while growing up. That can come only when they are dealt with the same way as one would deal with their students - without any attachment! The main goal is to teach them life skills. Such adults make a much more contented, peaceful, and a happy society which in turn makes the world a much happier place.

Choose the right tool, for the right trade!

 స్వస్తి.

No comments:

Post a Comment