Friday 18 June 2021

అజరామర సూక్తి – 276 अजरामर सूक्ति – 276 Eternal Quote – 276

 అజరామర సూక్తి  276

अजरामर सूक्ति  276

Eternal Quote  276

https://cherukuramamohan.blogspot.com/2021/06/276-276-eternal-quote-276.html

स्वर्गो धनं वा धान्यं वा विद्याः पुत्रास्सुखानि च ।

गुरुवृत्त्यनुरोधेन न किञ्चिदपि दुर्लभम् ॥ - रामायण (अयोध्या काण्ड सर्ग.30 श्लोक36)

స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యాః పుత్రాస్సుఖానిచ l

గురువృత్యనురోధేన న కించిదపి దుర్లభం ll

 రామాయణము (అయోధ్యాకాండము సర్గ30 శ్లోకము 36)

మనము, జ్ఞానార్తులము కావున జ్ఞానార్థులము. గురువులు లేకపోతే మనగతి గుండు సున్నయే! 

ఆహారం కోసం వేటాడటం మరియు ఉడికించుట,వేడిచేయుట కొరకు అగ్నిని 

వెలిగించడం వంటి అతిచిన్న జ్ఞానం కూడా బోధన ద్వారా ఒకతరము నుండి 

మరియొక తరమునకు ప్రాప్తించినది. లేకపోతేప్రతి తరము వారూ ‘రెడ్డొచ్చె 

మొదలెట్టు’ అన్న సామెతను కలకాలమూ రుజువు చేయవలసి వచ్చేది.

గురువు అన్న మాటకు అర్థము  పాఠశాలలో వాడబడే 'ఉపాధ్యాయుడు' అన్న 

మాట మాత్రమే కాదు. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న అన్నివిధముల వనరుల నుండి నేర్చుకొంటాడు అది తన తల్లిదండ్రులుతోబుట్టువులుఅవ్వ, తాతలుస్నేహితులు

తోటివారు మరియు అపరిచితులు కూడా కొన్నిసార్లు మనకు జ్ఞాన దాతలౌతారు. వీరందరూ గురువులే!

  సంపాదించిన జ్ఞానాన్ని మరియు అతను సంపాదించిన మూలాలను వాని 

విలువలను గౌరవించేవాడుశ్రేయస్సు లేదా పురోగతికి ఎన్నడూ దూరము కాడు. 

ఎందుకంటేఆగురువుల శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలన్నీ అతనితోనే 

ఉంటాయి, పైగా అతని కోరికలను సులభంగా నెరవేర్చడానికి ఆ ఆశంసనములు అతనికి సహాయపడతాయి.

ఇక గురువు ఎట్లుండవలెనన్నది చూద్దాము.

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్

శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్ l

ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః

నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే ll

అనగా శాంతస్వభావుడుఇంద్రియ నిగ్రహము కలవాడుసత్కుల ప్రసూతుడు(ఇక్కడ 

వేమన పద్యము ఉటంకిచవలసి వస్తుంది:

కులములోన నొకడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ !

ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమునంతకు సువాసన వచినట్లుగాఒక్క గుణవంతుని వలన వంశమునకంతకు మంచిపేరు వచ్చును.) అనగా కులమునకే వన్నె తెచ్చే గుణవంతుని ఆదేశము అత్యంత శిరౌదార్యము. ఇంకా వినయవంతుడుపరిశుద్ధుడుఆచార వంతుడుమంచి వేషధారణగలవాడుగౌరవనీయుడుపవిత్రుడుబుద్ధిమంతుడుమంత్ర తంత్రములలో నిష్ణాతుడుఆగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు. భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులుసాందీపుని వద్ద బలరామకృష్ణులుపరశురాముని వద్ద భీష్ముడుద్రోణుని వద్ద అర్జునుడుగోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులువీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్యరామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. అట్టి గురువులు నిజమైన గురువులు. అట్టి వారినే

గురు బ్రహ్మాగురుర్విష్ణుః గురు దేవో మహేశ్వరఃl
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃll

‘గురువు లేని విద్య గుడ్డి విద్య’ అన్న పద్యపాదమును పట్టుకొని గురువును గూర్చి నేను వ్రాసిన ఈ పద్యములను చదవండి.

గురువు నేర్పు విద్య గుమ్మటమ్మున వె ల్గు

గురువు లేని విద్య గుడ్డి విద్య

గురువు లేనివాడు గురిలేని బాణమే

రామమోహనుక్తి రమ్యసూక్తి

గురువు మీద గల్గు గుడ్డి నమ్మకమొండు

గురిని గూర్చు శిష్యు దరిని జేర్చు

నమ్మకమునకన్న నాణ్యమైనది సున్న

రామమోహనుక్తి రమ్య సూక్తి

గురువు పాదములను గుర్తుగా మదినెంచి

సాగి దండమెట్టి చక్కగాను

మంచిదారి సాగు మరియందరూ మెచ్చ

రామ మొహనుక్తి రమ్య సూక్తి

 

स्वर्गो धनं वा धान्यं वा विद्याः पुत्रास्सुखानि च ।

गुरुवृत्त्यनुरोधेन न किञ्चिदपि दुर्लभम् ॥ - रामायण (अयोध्या काण्ड सर्ग.30 श्लोक36) 

स्वर्गधनधान्य (भोजन)ज्ञानसंतान और सुख - जो अपने शिक्षक के प्रति श्रद्धा रखता है इनमें 

से कोई भी अप्राप्य नहीं है। गुरु के बिना आज दुनिया कहीं नहीं होती! यहाँ तक कि ज्ञान का 

छोटा-सा अंश भीजैसे भोजन का शिकार करना और गर्मी के लिए आग जलानापीढ़ी-दर-पीढ़ी 

केवल अध्यापन के द्वारा ही प्राप्त होता आरहा है l  नहीं तो हर पीढ़ी शुरू सेसीखना हुआ होता l

एक शिक्षक स्पष्ट रूप से एक स्कूल में केवल 'शिक्षकनहीं होता है। हर व्यक्ति अपने आसपास 

के सभी प्रकार के स्रोतों से सीखता है। उसके माता-पिताभाई-बहनदादा-दादीदोस्तसाथी 

और कभी-कभी अजनबी भी। इसलिएये सभी स्रोत उनके गुरु सामान ही है l

जो व्यक्ति अपने द्वारा प्राप्त ज्ञान और जिन स्रोतों से उसने उन्हें प्राप्त किया हैउसे महत्व देता है 

और उसका सम्मान करता हैउस आदमी को  समृद्धि या प्रगति से नहीं रोका जा सकता है। 

क्योंकिउन गुरुवों के सभी शुभकामनाएं और आशीर्वाद उनके साथ रहेंगे और उनकी इच्छाओं 

को आसानी से पूरा करने में उनकी सहायता करेंगे। अपने शिक्षकों को याद रखें। अपने शिक्षकों 

का सम्मान करें!

 svargo dhana vā dhānya vā vidyāḥ putrāssukhāni ca 

guruvttyanurodhena na kiñcidapi durlabham ॥ - rāmāyaa ayodhyakanda sarga 

30 shloka 36

Heaven, wealth, grain (food), knowledge, children and pleasures - none of these 

are unattainable for the one who reveres his teacher.

Without gurus, the world would be nowhere today!  Even the smallest piece of 

knowledge such as hunting for food and lighting fire for heat transcended from 

generation to generation through teaching alone!  Otherwise, each generation 

will be starting from the beginning, time and again!!

A teacher is obviously not just the one titled 'teacher' at a school.  A being learns 

from all kinds of sources around him.  His parents, siblings, grandparents, 

friends, peers and even strangers sometimes.  Hence, all these sources 

command reverence from him!

One who values and respects the knowledge he has gained and the sources he 

has gained them from, cannot be stopped from prosperity or progress.  For, all 

their good wishes and blessings shall be with him and assist him to easily fulfill 

his desires.

Remember your teachers.  Revere your teachers!

స్వస్తి.

No comments:

Post a Comment