Monday 31 March 2014

This is a collection of leave letters and applications written by people in various places of India ...

1. Infosys, Bangalore : An employee applied for leave as follows:
Since I have to go to my village to sell my land along with my wife, please sanction me one-week leave.

2. This is from Oracle Bangalore:
From an employee who was performing the "mundan" ceremony of his 10 year old son: "as I want to shave my son's head, please leave me for two days.."

3. Another gem from CDAC. Leave-letter from an employee who was performing his daughter's wedding:
"as I am marrying my daughter, please grant a week's leave.."

4. From H.A.L. Administration dept:
"As my mother-in-law has expired and I am only one responsible for it, please grant me 10 days leave."

5. Another employee applied for half day leave as follows:
"Since I've to go to the cremation ground at 10 o-clock and I may not return, please grant me half day casual leave"

6. An incident of a leave letter
"I am suffering from fever, please declare one day holiday."

7. A leave letter to the headmaster:
"As I am studying in this school I am suffering from headache. I request you to leave me today"

8. Another leave letter written to the headmaster:
"As my headache is paining, please grant me leave for the day."

9. Covering note: "I am enclosed herewith..."

10. Another one:
"Dear Sir: with reference to the above, please refer to my below..."

11. Actual letter written for application of leave:
"My wife is suffering from sickness and as I am her only husband at home I may be granted leave".

12. Letter writing: -
"I am in well here and hope you are also in the same well."

13. A candidate's job application:
"This has reference to your advertisement calling for a ' Typist and an Accountant - Male or Female'...As I am both(!! )for the past several years and I can handle both with good experience, I am applying for the post.






Sunday 30 March 2014

జయ ఉగాది

జయ ఉగాది 

శ్రీలు చిల్కునటంచు చిల్కలు పల్కంగ 
జయమంచు ఘోషించె జయ యుగాది 
కోకిలమ్మలు పాడి కురిపించ దీవెనల్ 
జయమంచు ఘోషించె జయ యుగాది
మరుమల్లియల తావి మనసుల రంజింప 
జయమంచు ఘోషించె జయ యుగాది
జలజల పారేటి జలధార జతజేరి 
జయమంచు ఘోషించె జయ యుగాది

కష్ట కాలాలు గతియించె కలుగు శుభము 
నష్టములు చేర రావింక నలువ కరుణ 
దృష్టి ప్రగతిన సారించి దృఢముగాను 
ఇష్టసిద్ధిని గనుమనె ఈయుగాది

సకల పాఠక మిత్ర జనాళికి 
జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో
చెరుకు రామ మోహన్ రావు

Thursday 20 March 2014

భాగవతము (దశమస్కందము)

భాగవతము (దశమస్కందము)

కడుపులోపల నున్న పాపడు గాల దన్నిన గిన్కతో
నడువబోలునే క్రాగి తల్లికి? నాధ! సన్నము దొడ్డు నై
యడగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ
కడుపులోనిది గాదె? పాపడ గాక నే మరి ఎవ్వడన్ ?

భావం:

ప్రభూ! కడుపులోనున్న పాపడు కాలితో తన్నినప్పుడు బాధ కలిగినా తల్లి కోపగించి కొట్టదు కదా! అట్లే సూక్ష్మము,

స్థూలముఅయి, కారణ రూపము, కార్యరూపము అయిన ఈ సృష్టి అంతా నీ కడుపులోనిది కదా ! మరి నేను నీ

పాపడను గాక మరెవ్వడను? నేనేమయినా పాపకర్మములు చేసినా తల్లివలె కడుపులో పెట్టుకుని క్షమించలేవా?



కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః 

దృష్ట్వా ప్రదీపం నీచజన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాహి విప్రాః 

భర్తృహరి సుభాషితము (క్షీర నీర న్యాయము )

భర్తృహరి సుభాషితము (క్షీర నీర న్యాయము )

https://cherukuramamohan.blogspot.com/2014/03/blog-post_20.html

క్షీరేణాత్మ గతోదకాయహి గుణా దత్తాః పురాతేఖిలాః

క్షీరోత్తాప మపెక్ష్యతేన పయసా స్వాత్మా కృశానౌహుతః

గన్తుం పావక మున్మనస్తదభ వద్దృష్ట్వాతు మిత్రాపదం

యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ

ఏనుగు లక్ష్మణ కవి తెలుగు సేత

క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్

క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు

ర్వార సుహృద్విపత్తి గని వహ్ని జొరంజనె దుగ్ధ ,మంతలో

నీరము గూడ శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్

భావము : పాలు,మొదట తనను కలియుటచే, నీటికి తనగుణములన్నీ ఇచ్చినది. పాలు నిప్పుచే కాగి పోవుటచూచి, నాకెందుకులే యని ఊరుకోక నీరు నిప్పుపై దూకినది . తనకై తను త్యాగామునకే సిద్ధపడిన ఆ నీటికి బాసటగా పాలు నిప్పులోకి దూకబోతే నీరు తిరిగి తనను చేరిన తోడనే పాలు శాంతించి తిరిగీ నీటితో సఖ్యతగా ఉండిపొయినది .

మనము రోజూ కాచే నీరు గలిసిన పాలను భావానుగతులమై గమనించితే ఎంత నేర్వ దగిన గుణపాఠము ఉందో గమనించండి . 'పయస్సు' అన్న పదానికి పాలు, నీరు అన్న రెండు అర్థాలూ వున్నాయి. అంటే వాని మనసులు ఒకటి యగుట వలన బహుశ పేర్లు కూడా ఒకటైనాయేమో. లేక ఒకే పేరు ఉన్నందువల్ల ఒకే రకమైన గుణములు కలిగియున్నాయేమో.

పాలూ నీరు మాదిరి మనము కూడా అంతా మంచియే కలిగియుంటే ఎంత బాగుంటుందో !

స్వస్తి.

Friday 14 March 2014

ఆచారములు -- సాంప్రదాయములు -- సంస్కారములు

ఆచారములు -- సాంప్రదాయములు -- సంస్కారములు

ఆచరించుట అన్న మాటకు చేయుట అని అర్థము. ఇల్లు శుభ్రముగా ఉంచుకొనుట ఆచారము. మరి అందరి ఇళ్ళు శుభ్రముగానే ఉంటాయా అంటే ఉండకనూ పోవచ్చు అన్న జవాబు వస్తుంది . ఒకప్పుడు ఆవు పేడ కలిపిన  నీళ్ళు ఇంటి ముంగిట చల్లి ముగ్గువేయుట ఆచారము.నేడు అది మృగ్యము. ఒకప్పుడు అయ్యా, స్వామీ , పెద్దాయనా, పంతులుగారూ, గురువుగారూ అనుట ఆచారము . దగ్గరితనము వుంటే అత్త ,మామ,బాబాయ్,పిన్ని,అన్న, వదినె, అని ఎన్నోవిధాల  పిలుచుకొనే వాళ్లము.ఇప్పుడది లేదు. అన్నింటికీ ఒకటే మంత్రమే! అదే ' ఆంటీ-అంకుల్' మంత్రము. అంటే ఒకనాటి ఆచారము వదిలి కొత్త ఆచారాన్ని అమలుపరచుకొనవచ్చు . దానివాళ్ళ కొంత కాలానికి అటువంటి పని ఒకటి చేస్తూవుండినామా అన్న సందేహము మనలో తలెత్తుతుంది.పూర్వము ఈ ఆచారాలను 3 విధములు జేసినట్లు తోచుచున్నది. 1. దేశాచారము 2. కులాచారము 3. జ్యాత్యాచారము ఈ మూడు కాకుండా 4.మతాచారము అనునది కూడా ఏర్పరచుకొనవచ్చును.

1.దేశాచారము : మనలో మేనమామ కూతురుని వివాహము చేసుకొనుట కద్దు. కొన్ని ప్రాంతములలో చేసుకోరు.ముస్లిములు, క్రైస్తవులు వారి వారి మతములలో లేకున్నా పుస్తెలు మెట్టెలు ధరించుట కద్దు. ఇది దేశాచారమేకదా!

2.కులాచారము : దీనికి ప్రత్యేకముగా నేను ఉదహరించనవసరములేదనుకొంటాను. ఇది స్త్రీలకు బాగా తెలుస్తుంది.
వారికి కార్యాల విషయములో పరిశీలన అధికముగా వుంటుంది.అందుకే ఆపస్తంభ ధర్మ సూత్రములలో 'యత్ స్త్రీయాహుస్తత్' అని తెలుపబడినది.అంటే'స్త్రీలు చెప్పిన విధముగా చేయుడు.'అని అర్థము.

3.జాత్యాచారము: ఎన్నో కొండ జాతులు వుండేది మనము చూస్తూనే ఉన్నాము.వారి ఆచారాలు విలక్షణముగా వుంటాయి.వారి వారి కులపెద్దలు ఆదేశించిన తీరుగా ఆ జాతీయులు నడచుకొంటారు .

4.మతాచారము: ఇక్కడ మతము అంటే ఏ క్రీస్తు మతమో ,ఏ ఇస్లామో కాదు. మనసుకు తోచిన ఆలోచనను మతము అంటారు.ఒక సమూహములో ఏమి చేయవలయునో తెలియని పరిస్తితి ఏర్పడితే వారు పెద్దగా ఎంచుకొన్న అతని అభిమతము ప్రకారము ఆ విధిని నిర్వర్తించుతారు.రాను రానూ అదే అచారమైపోతుంది.


సాంప్రదాయము అటువంటిది కాదు. అది ఎప్పటికీ వుంటుంది. ఆచరణ లేక అమలులో తేడాలు ఏర్పడవచ్చు.ఉదాహరణకు పెళ్లి, దేవతార్చన , నోములు, వ్రతములు ఆచరించుట.పండుగలను పాటించుట. ఇవి సాంప్రదాయము క్రిందికి వస్తాయి.మనము పాటించ వచ్చు లేక ఆచరించ వచ్చు ఆచరించకనూ పోవచ్చు.సాంప్రదాయమునకు  ఒక మూల.ము వుంటుంది. ఆచారము ఒక కుట్టించుకొన్న బట్ట లాంటిది. వేసుకోన్నంత కాలము వేసుకొని వేరేది కుట్టించుకొంటాము. సాంప్రదాయము, సంస్కృతి అనే శరీరమునకు అంగము. ఇది వాడక పోవచ్చును గానీ నరికివేయము.

అసలు సంస్కారముల ప్రతిరూపములే సాంప్రదాయములు. బంకమట్టిని ఉదాహరణగా తీసుకొందాము.కుమ్మరి దానిని సంస్కరించేవరకు అది కేవలము మట్టే, దానిని తగినవిధముగా సంస్కరించిన తరువాతే ఒక చట్టిగానో,ఒక మూకుడుగానో ఒక బానగానో, ఒక కడవగానో,ఒక కళాఖండముగానో తయ్యారవుతూవుంది. కావున ఈ సంస్కారములు మనకూ అవసరమేగదా. అసలు సంస్కారములే మానవులను సంఘటితము చేస్తాయి. ఈ సంస్కారాలు 16 అని స్మృతులు,గృహ్యసూత్రాలుతెల్పుతాయి.ఇవిగర్భాధానము,పుమ్సవనము,సీమంతము,
విష్ణుబలి,,జాతకర్మ,చంద్రదర్శనము,నామకరణము,అన్నప్రాశనముకర్ణవేధ,చూడాకరణము,అక్షరాభ్యాసము,
ఉపనయనము,కేశాంతము,స్నాతకము,వివాహము,అంత్యేష్టి .ఈ సంస్కారములు శూద్రులవిషయములో 10 యగునని వ్యాసులవారు చెప్పినారు.కానీ నేడు చాలా సంస్కారాలు అంతటా కరువైపోయినాయి'

వివాహము ,అంత్యేష్టి అందరూ జరూకొంటూనే వున్నారు.నామ కరణమూ, అన్నప్రాసన ,చూడాకరణము(పుట్టు వెంట్రుకలు),కర్ణ వేధ (చెవులు కుట్టించుట ) ఇవి అన్నీశాస్త్రోక్తముగా జరుపుకొనుట దాదాపుగా మానుకోన్నాము.

ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః.

మన సాంప్రదాయాన్ని కాపాడుట మన ధర్మం. మరి మన ధర్మాన్ని కాపాడుదాం. మన సంస్కృతికి పూర్వ వైభవము కల్పిద్దాం.

తత్సత్

లీలా హేలా -బాల గోపాలా 
అందమౌ తలకట్టు
నెమలీక పెట్టు
ఒక చేత వేణువు
ఒక చేత ధేనువు
మోవి పై సుస్మితము
కనుగవన హితము
రూపు సమ్మోహనము
భక్తీ ఆవాహనము
ఆద్యన్తములు తాను
అందు చీమను నేను
మనసునాతని తలచి
మ్రొక్కుతా మైమరచి

గోపాలకృష్ణు తోడను 
గోపాలనవేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలురెంత ధన్యులో
గోపాలురకైన నిట్టి గురురుచి గలదే

ఆంటీ--అంకుల్--మమ్మీ--డాడీ--మేడం

ఆంటీ--అంకుల్--మమ్మీ--డాడీ--మేడం 


 'aunty' 'uncle' ను గురించి . అసలు ఒక క్రొత్త వ్యక్తిని ఆ సంబోధనలతో పిలువా వలసిన అవసరమేమిటో నాకు అర్థము కాదు.
ఒకవేళ వయసులో బాగా పెద్దవారిన కొత్త వారిని గురువుగారు అంటే ఒరిగి పోయేదేమీ లేదుకదా. ఆంగ్లేయులకు పెళ్లి అంటే 
ఇద్దరు వ్యక్తుల మధ్య ఒడంబడిక . అదే మన సాంప్రదాయములో రెండు కుటుంబాల నడుమ ఒడంబడిక . అందుకే మన 
ధర్మమూ లోని పెళ్లి మంత్రములలొ 'divorce' అన్న పదము నకు స్థానము లేదు. అది లేకుండా వాళ్ళకు గానీ ముస్లిములకు 
గానీ 'contract' ఉవుండదు.
ఒక భర్తతో పిల్లలను కని ఆపైన ఆమె ఎంతమందిని పెళ్ళిచేసుకొంటే వారందరూ ఆపిల్లలకు 'అంకుళ్ళు' అదే విధంగా ఆ మగవాడు 
ఒక పడతి తో సంతానము కలిగిన పిదప ఆమెను విడిచి , తనజీవితములో చేసుకోబోయే ఆడవాళ్ళంతా 'ఆంటీలు'
అందువల్ల ఈ పదములను వాడవద్దు . ఈ విషయమును పది మందికి పంచి వాడించవద్దు .మన సంస్కృతిని పెంచండి.

మమ్మీ అంటే పీనుగు అని అందరికీ తెలిసినదే . డాడి అనేది'డెడి' గా ధ్వనించుతుంది . అంటే పీనుగు అనే అర్థము . ఆవిధముగా 
పిలిపించుకొనుట ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రుల వితరణకు వదిలి పెడుతున్నాను.
ఇక 'మేడం'. మేడం అనే మాట 'మాదామ్' అన్న french పదము నుండి పుట్టినది . మా = my, నాయొక్క ; దామ్ = dame 
(యజమానురాలు ,లేడీ) కాబట్టి మేడం అంటే my lady అని అర్థము . 
కావున దయతో స్త్రీలను అమ్మ అని సంబోధిస్తే చాలామంచిది . ఈ శబ్దం 'ఓం' నుండి ఉత్పత్తి అయినది .

Thursday 13 March 2014

కాండము-పర్వము స్కందము

కాండము-పర్వము స్కందము 


Rajasree Radha

భారతరామాయణ కథలు విన్నపట్టి నుంచి నాకో సందేహం.భాగవతం లోని భాగాలకు స్కంధాలని, రామాయణం లోని భాగాలకు

కాండం అని, మహా భారతంలోని భాగాలకు పర్వాలని పేర్లు ఎందుకు పెట్టారు? మూడు హిందూ పురాణాలు అయినా పేర్లలో

తారతమ్యం ఎందుకు?మా తెలుగు ఉపాధ్యాయులను ఇంకా తెలిసినవాళ్ళను అడగాను. వారిచ్చిన సమాధానం నాకు సరైనదని

అనిపించలేదు.మన పెద్దలు ఏంచేసినా దానికి ఒక కారణం ఉంటుందని నా నమ్మకం.

మీకు తెలిసి ఉంటే చెబుతారని ఆశిస్తున్నాను
అమ్మా

కాండము అన్న మాటకు పరిచ్ఛేదము అంటే a section అన్న అర్థము తో బాటూ కాడ, అంటే శాఖ అన్న అన్వర్థమును

తీసుకొనవచ్చు. దీనికి సమయము అన్న అర్థాన్ని కూడా పెద్దలు చెబుతారు . పరిచేదము అంటే విభాగము, ఉత్తర కాండ

కాకుండా 6 శాఖలున్నాయి రామాయణ కల్పవృక్షానికి. అందుకే మహనీయులైన విశ్వనాథ వారు కూడా తాము వ్రాసిన

రామాయణమునకు 'రామాయణ కల్ప వృక్షము' అన్న పేరునే పెట్టినారు. అంటే మనము ఇందు ప్రేమ ,భక్తి, వాత్సల్యము ,

మమకారము, ద్వేషము,కామము,పౌరుషము,ధర్మనిరతి మొదలగు ఎన్నో శాఖలను మనము గాంచవచ్చు. అందుకే వాల్మీకి

అడిగిన ప్రశ్నకు బదులుగా నారదుడు 16 లక్షణాలు(చంద్రుని కళలు 16) కలిగినవాడు రాముడు అని చెబుతాడు. అందువల్లనే

ఆయన రామచంద్రుడు అయినాడేమో. రామాయణము ఆది కవి వాల్మీకి విరచితము. ఆయన చేట్టు'కొమ్మ'పై క్రౌంచ

మిధునమును చూచుటతోనే కదా రామాయణ ప్రారంభము. వాల్మీకి మొదటి కవి రామాయణము మొదటి కావ్యము అయినా

ఆయన దానిని ఆచంద్ర తారార్కము ఉంటుందని నొక్కి వక్కాణించినారు. రుషి వాక్కు రిత్త పోదు కదా . అంతటి మహనీయుడు

రామాయణ భాగములను కాండములు అంటే అవి కాండములే .

ఇక పర్వము. భారతము యొక్క విభాగాములకు పర్వము అన్న పేరు పెట్టినారు. పర్వము అన్న మాటకు 'గణుపు' అని ఒక

అర్థము . భారతము చెరుకుగడ అయితే ఒక్కొక్క విభాగము ఒక్కొక్క పర్వము. చివరివరకూ మధురమే. పర్వము అన్న

మాటకు పండుగ అన్న అర్థము కూడా వుంది . భారతము చదువుతూ వుంటే అంత ఉల్లాసంగా ఉత్సాహంగా వుంటుంది.

'ధర్మెచార్థేచ కామేచ మొక్షేచ భరతర్షభ --యది ఆస్తి తదన్యత్ర యన్నేహాస్తి తతత్క్వచిత్' అన్నారు వ్యాసులవారు. భారతములో

నేనిది ఎక్కడా దొరకదన్నారు. వేరెక్కడైనా దొరికేది భారతములో కూడా ఉంటుందన్నారు. ఆయన భారత భాగాలను పర్వములు

అంటే మనము వారిని అనుసరించవలసినదే.

ఇక భాగవత స్కందములు. 'స్కందము' అంటే చెట్టు బోదె లేక బొందె. ఇందులోని అన్ని కథలకు మూలము మహావిష్ణువే.

అవతారములు మారవచ్చు. అందుకే వ్యాసులవారు వారిని అనుసరించి పోతన్న 'లలితస్కందము కృష్ణ మూలము

శుకాలాపాభిరామంబు ... 'అని అన్నారు.

అమ్మా నాకు తెలిసినది జ్ఞాపకమున్నంతవరకు తెలియబరచినాను.

తత్సత్
KARMA

What is Karma? This is a complicated question for my calibre. Moreover i can not assess 

myself whether i can do justice to my explanation but still I shall try to keep myself explicit 

on my views on the subject.

I am using the words'Introverts' and 'Extroverts' in a slightly different sense.I would like to 

catigorise the people who are contemplative as 'Introverts' who follow jnaana yoga

where as the extroverts are inclined to action, we can catigorise them as 'actives' and 

hence they take the path of 'karma yoga.' I take the help of 'Bhagavadgeeta' toexpress 

myself.

We are now concerned with the actives. These actives have many vasanaas i.e. desires as 

they are active the come accross somany things and get attached or detached on account 

of their impulses. Life consists of three main activities:

1. Receipt of stimuly from the world.

2. Reaction of stimuly from within.

3. Response back to the world.

In a nut shell it is like a chemical reaction. The combination gives a new product which 

may be useful or may be useless.These are based on three prime qualities or 'Gunas'

which are 1) Satwa 2) Rajas and 3) Tamas

We start from Tamas. It is the state of ignorance and inertia.The Tamasik will be indolent, 

indifferent and indisposed to activity. 

Rajas is the state of passion,desire and agitation.He evinces his interest and attention 

mostly on the acquisition and enjoyment of worldly objects.

Satwa is the state of equanimous,serene and poised thoughts. His mind never strays from 

the Supreme Truth.

But it is very very rare to come accross a person with a single guna but he will be an 

admixture all the three qualities or gunas in its own proportions. and hence we find 

infinate number of people with infinate number of qualities. If one quality is in greater 

proportion it absorbs the remaining two and dominates the person concerned.


यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेर्जुन
कर्मेन्द्रियैः कर्मयोगमसक्ताःस विशिष्यते 

But he who restraining the senses by the mind O Arjuna, engages his organs of action in the yoga of action without any attachment and he excells.
sita's father maharaja Janaka is the fittest example of this kind of human being. Hence he is called a great 'Karmayogi' and was respected as 'Janaka Maharshi.'

I stop at this and continue if wanted.

















Friday 7 March 2014

కవి నారసింహుండు కాడు కానేకాడు

గరికెపాటి వారికి నచ్చిన నా పద్యము 'ఇది వారిని గురించే'

కవి నారసింహుండు కాడు కానేకాడు
సరళ భావతతి విశారదుండు
పాండితీ నరసింహ భాతి కానేకాడు
వాగ్దేవి యొసగిన వరసుతుండు
ధారణా నరసింహ ధమని కానేకాడు
ఆదికవి వాల్మీకి యనుజుడతడు
అవధాన నరసింహు డతనుకానేకాడు
సరస పద్యగరిమ సాంద్రుడతడు

పనిని సాధింప నరసింహు పగిదితాను
వేరు మార్గాల నెన్నని విభుదుడతడు
గాలివానలకెరగాని గరికెపాటి
నారసింహావధానులు నాకు ప్రీతి

గరికెపాటివారికి 'అవధాన బ్రహ్మ రాక్షస' అన్న బిరుదు ఉందని విన్నాను. ఆయన ధారణను ప్రశంసించుతూ బహుశా వారికీ బిరుదునొసంగియుండవచ్చు. నా మనసుకైతే 'రాక్షస' అన్న శబ్దము వారి ధిషణకు సరికాదేమో అనిపించింది. నాకు ఎరుక ఉన్నంతవరకు వారిది కల్మషము లేని మనస్తత్వము. వారి పూరణలు కవిత్వము ఎంతో మధురముగా ఉంటాయి. అయినా నాకు సరిపోనంత మాత్రాన అందరికీ సరిపోగూడదని లేదుకదా. బిరుదు వాడుతూవున్నారంటే వారికీ నచ్చినట్లేకదా.
నామనోగాతమును పై పద్యములో తెలిపినాను. ఒకసారి వారితో కలిసినపుడు ఈ పద్యము వినిపించితే వారు సంతసించుటయేగాక పై పద్యములో ,గాలివానలకెరగాని గరికేపాటి' అన్న ప్రయోగము చాలాబాగుందనిచెప్పినారు.

పై పద్య వివరణ ఇది.

పై పద్యములోని సీసము లోని నాలుగు పాదములలో తేటగీతిలోని రెండు పాదములలో 'నారసింహ' అన్న పదము వస్తుంది.అందుకు నా సంజాయిషీ ఇది: నరసింహుడు భక్త సులభుడే కానీ చూపులకు భయంకరుడు. సింహము తన వేటను చీల్చి చెందాడుతుంది. అంటే ఆవేశము పరాక్రము నరసింహునికి అతిశయము .ఆయన హిరణ్యకసిపును చంపినాడుగానీ చాలా హృదయవిదారకముగా చంపినాడు. ఇక్కడ ఈ నరసింహుడు కవ్విస్తూ నవ్విస్తూ ఊరిస్తూ పూరిస్తున్నాడు . అందువల్లనే అతడు 'ధమని' కాడు అన్నాను. ధమని అంటే కౄరుడు అని నిఘంటువు.ఇక ధారణలో ఆయనను వాల్మీకితో ఎందుకు పోల్చినానంటే మొత్తము రామాయణ కథను నారద, బ్రహ్మలు చెప్పినది చెప్పినట్లుగా,పర్వతాల, రాజధానుల,రాముని అనుచరుల, రాక్షసుల, రాజుల ,ఋషుల, పేర్లతో కలిపి గుర్తు పెట్టుకొనుటకు ఎంత ధారణ ఎంత ధీశక్తి అవి కలుగుటకు ఎంత తపస్సు కావలెనో మీ ఊహకే వదలుచున్నాను. ఇక 'గాలివానలకెరగాని గరికెపాటి నారసింహావధానులు నాకు ప్రీతి' అంటే అవధానమున ఎంతటి కఠిన,కఠినతర,కఠినతమ పరిస్తితులనెడు గాలివానలోకూడా ఆయన గడ్డి మొక్క వలె వంగి తిరిగీ నిటారుగా నిలుచుతాడు తప్పించి మర్రిమాను మాదిరి విరిగి పడడు.


భావతతి =భావసమూహము, భాతి= విధము,వలె,మాదిరి,  సాంద్రత = చిక్కదనము,density, పగిది=వలె

ఇడ్లీకి కొబ్బెర చట్నీ,అల్లపు చట్నీ, వేరుసెనగ పప్పులచాత్నీ. కారప్పొడి, సాంబారు అన్నీ ఉంచటమైనది. కోరిన పదార్థముతో ఇడ్లీ కొరుకవచ్చు.


















Wednesday 5 March 2014

ఐదు నోటు ఒకటి అగుపడలేదని .......

'ఇది నేను వ్రాసిన పద్యము' అని ప్రతిసారీ వ్రాసుకోనుటకు మనసంగీకరించనందున ఇకపై నాది కాని 

పద్యమైనపుడు, ఎవరిదీ అని తెలుపుటకు వ్రాసినవారి పేరు ఉటంకించుతాను. 

ఐదు నోటు ఒకటి  అగుపడ లేదని

పది దినాలు పడితి బాధ నేను

ఆరు పదుల వయసు అగుపించకనె పోవ

అపుడు లేని ఏడ్పు ఇప్పు డొచ్చె



మొదలే తానొక పిచ్చికోతి యగుటన్ ముల్ ద్రొక్కె, మైమర్వగా 
మదిరాపానము జేసి చిందిడెను పెన్ మంటల్ పైన కాళ్ళూనుచున్
కదిలెన్,కందుక రీతిలో,నభమునన్ కన్పింప నాట్యాంగనల్ 
తుదకో తాళ ఫలమ్ము పై బడుట చే దోచెన్ చంద్ర తారావళుల్

అన్వయము మనసుకా మనిషికా అన్నది మీకే వదలిపెడుతూ, ఈ పద్యానికి భావము ఈ దిగువ 


తెలియజేయుచున్నాను .

'మొదలే అది ఒక కోతి దానికి తోడూ పిచ్చిది ఆపై ముళ్ళు త్రోక్కింది ,ఆబాద బాపుకొనుటకు సారాయి త్రాగింది 

తాగిన  మైకములో చిందులు త్రొక్కుచూ నిప్పు లో కాళ్ళు వేసింది,ఆ బాధ భరించలేక ఆకాశము కనిపించేసరికి 

దానిని అంటుదామని బంతి లాగా పైకి ఎగిరింది. అక్కడే వున్న తాటిచెట్టు పైననుండి క్రిందికి జారిపడే తాటి 

పండును గమనించకుండా!అంతే ,కోతికి భూమి పై గల చుక్కలు కనిపించినాయి. ఇది నిజమే కదా !

త్రాగనివాడు నిత్య ధన దాహము చెందనివాడు సర్వదా 

వాగనివాడు పార్శ్వ జన వంచన చేయనివాడు సంతతో 

ద్వేగము లేనివా డొరుల దెప్పర కోరక యుండు వాడెదో 


రోగము లేనివా డెపుడు రూఢముగా ధర లేడు శంకరా

ఈ ప్రపంచములో త్రాగుబోతు కానివాడు,ధన దాహము లేనివాడు,అవసరమున్నా వాగనివాడు , ఇరుగుపోరుగుకు 

మోసము చేయనివాడు భావావేశము (emotion) లేనివాడు, ఇతరులకు కీడు తలపెట్టనివాడు, ఏదో ఒక రోగము 

లేనివాడు తప్పక కనిపించడు.