Thursday 8 October 2020

చిత్రకారుడు ‘శిల్పి’ మరియు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాములవారు

 

 

      చిత్రకారుడు ‘శిల్పి’ మరియు 

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాములవారు

https://cherukuramamohan.blogspot.com/2020/10/blog-post.html

ఈ వ్యాసము ఆర్భాటము అట్టహాసమునకు ఇష్టపడని, ఏమీ చేయకుండానే ఏదో 

చేసినట్లు మసిపూసి మారేడుకాయ చేసే మహనీయుల జాబితాలో చేరని, మనకు మన భాషకు, మన సంస్కృతికి అన్యాయముచేసి ఆంగ్లేయులు ఇచ్చిన బిరుదములను, గౌరవ పదవులను నెత్తికెత్తుకొని ఊరేగని ఒక ఉన్నత వ్యక్తిని, తెలుసుకోనగోరే పాఠకులకు, పరిచయము చేయుచున్నాను.

P.M. శ్రీనివాసన్ (1919-1983) మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో, తరువాత చెన్నైలోని 

గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో కళను అభ్యసించినాడు, అక్కడ అతను పెన్ 

మరియు ఇంక్ లైన్ స్కెచ్‌లలో రాణించినాడు. ]

ఆనంద వికటన్ పత్రికకు , శ్రీనివాసన్ రాజకీయ మరియు సామాజిక సంఘటనల 

రూపశిల్పిగా రేఖాచిత్రములు గీచేవారు . ఆలయ భవనములు మరియు ఆలయ 

శిల్పకళను అందించడంలో ఈయన నైపుణ్యమును గమనించి ఈయనను పత్రిక 

యొక్క Senior Artist 'మాలి' అతనికి 'శిల్పి' అని పునర్నామకరణము చేసినారు. 

దేవాలయ మూలవిగ్రహములపై, దేవాలయ శిల్పములపై విశేషమగు అవగాహన 

సాధించి తన ఇరవై రెండు సంవత్సరాలలో ఆనంద వికటన్ ను తన నైపుణ్య ప్రతిపత్తితో  ఎంతగానో జనరంజకముగా తయారుచేసి అధికముగా ఆ సంచికలనుప్రతిచారితము (Circulate)చేయగలిగినాడు. 1947 నుండి 1960 వరకు, దక్షిణ భారత దేవాలయాల చిత్రాలు ప్రతి వారం ఆనంద వికటన్‌లో తెన్నట్టు సెల్వంగల్ (దక్షిణ భారత కలానిధులు) పేరుతో కనిపింపజేసినాడు..

 ఆనంద వికటన్ ను విడిచిపెట్టిన తరువాత, భవన్స్ జర్నల్, కలై మగళ్, దినమణి కతీర్

అముతాసురభి మొదలైన వాటికి శిల్పి తన సేవలను అందించినాడు. . అతను ఇలస్ట్రేటర్ 

పద్మావాసన్‌కు గురువు .

శిల్పి దక్షిణ భారతదేశంలోని ప్రతి మారుమూల దేవాలయ ప్రాంతములను 

పర్యటించినాడు. భక్తుల యొక్క దర్శన సమయము ముగిసిన పిదప, ఆయన ఆలయ 

శిల్పకళ యొక్క చిత్రాలను రాత్రి సమయంలో కేవలము ప్రమిదేలో నూనెలో 

తడిసియుండే వత్తి వెలుతురులో మూలవిరాట్టులను చిత్రీకరించేవారు . తన అనుచరుల 

కోసం, దేవాలయాల లోపలి గర్భగుడిని చూడటానికి అరుదైన అవకాశాన్ని 

అందించినాడు. దేవత యొక్క ఆభరణాల యొక్క ప్రతి వివరాలు ఖచ్చితంగా ఆయన 

గీచిన చిత్తరువులలో ప్రతిబింబిస్తాయి. ఈ రోజు భక్తులు తమ  తమ ప్రార్థనా 

మందిరాలలో ఉంచుకొనే ప్రతి విగ్రహ చిత్రమూ అయన అందించినదే!  ఆయన 

అందించిన వేంకటేశ్వరుని మూలవిరాట్టు చాయా చిత్రము ప్రామాణికమైన 

వేంకటేశ్వరుని చిత్రములలో మొట్టమొదటిది.

రాత్రి చివరి గంటలలో, ప్రపంచం మొత్తం లోతైన నిద్రలో మునిగిపోయిన తరువాత

ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంభాషణ ప్రారంభమైంది. ఒకరు గౌరవనీయమైన 

జద్గురువుఅందరిచేత ప్రేమించబడ్డ మరియు గౌరవించబడ్డ వారు,  మరియొకరు అత్యంత ప్రతిభావంతుడగు  కళాకారుడు. పవిత్రమగు ఆగది లోపల, చమురు దీపం వెలుగులో, చిత్రకారుడికి స్వామీ యొక్క ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన కళ్ళు 

వెలిగిపోతూ కనిపించినాయి. స్వామీ శిల్పి తో  ఇలా అన్నాడు, "మీరు చాలా జీవితాలను 

గడిపినారు, అన్ని జన్మలలోనూ పరమాత్ముని  హృదయపూర్వకముగా ఆరాధించుతూ 

వచ్చినారు. మీ గత జీవితములో వివిధ దేవాలయాలలో స్థపతిగా పనిచేసినారు, అక్కడ 

మీరు దైవంలోని వివిధ రూపములను చెక్కుట గరిగినది. ఇది మీ చివరి జన్మ. ఇకమీద 

 ఈ పవిత్ర  నైపుణ్యమును పలుచన చేయవద్దు. మూలవిరాట్టుల, కళారూపములను  

యథా తథముగా  ఒంటరిగా, ప్రమిదెలలో, తైలముతో వెలిగింపబడిన వత్తుల 

వెలుతురులో రాత్రి సమయములో మూల విరాట్టుకు ఎదురుగా కూర్చొని, ఆ విగ్రహము 

యొక్క చిత్రమును గీచెదనని ప్రతిజ్ఞ చేయండి. మీ ప్రతిభ దైవికమైనది, మీరు దైవముచే 

ఆశీర్వదించబడినవారు.  శిల్ప ఆగమ శాస్త్రాల గురించి మీకు ఇప్పటికే తెలుసు, మీకు 

ఎక్కువ తెలుసుకొనవలసిన అవసరం లేదు. మీ చిత్రాల ద్వారా, ప్రతి ఇంటికి దైవాన్ని 

తీసుకురావాలనే లక్ష్యంతో, రేపు సూర్యోదయ సమయంలో కొత్త ప్రపంచంలోనికి 

వెళ్ళండి. ”

కళాకారుడు సెలవు తీసుకున్నాడు భారత దేశములోని  మారుమూల దేవాలయాలకు 

వెళ్ళినాడు, మూలవిరాట్టుల రూపమును తన చిత్ర వస్త్రమున (Canvas) బంధించాడు. 

ఇది అంత తేలికైన పని కాదు, ఎందుకంటే ఆంక్షలు కఠినమైనవి, మరియు సనాతన 

సాంప్రదాయబద్ధులయి  స్వచ్ఛమైన హృదయాలు గలవారు మాత్రమే అటువంటి అద్భుత 

కఠిన కర్తవ్యములను నిర్వహించగలవు. అతనితో చంద్రశేఖరసరస్వతి యతీంద్రులు 

 మీరు మీ ఊహలను ఉపయోగించకూడదు, మీరు పుణ్యక్షేత్రాలలో చూసే దేనినీ 

మార్చకూడదు, మీరు శిల్ప శాస్త్రాన్ని మాత్రమే అనుసరిస్తారు, మరియు వివిధ 

భంగిమలలో గమనించిన విధముగా దేవతామూర్తులను యథాతథ రూపములలో 

బంధించవలెను. మీరు అదనముగా విద్యుత్ దీపములు  ఉపయోగించకూడదు, మీరు 

గదిలో వెలిగించిన పరిమిత దీపాలలో పని చేయాలి మరియు చ్త్రలేఖనానుభవము  ద్వారా 

మీరు ధ్యానము చేస్తూ, దైవం యొక్క మారుతున్న స్వరూప (లక్షణాలను) సంగ్రహించాలి. 

ఈ విధంగా,మీరు పుణ్యక్షేత్రంలోని దైవిక శక్తిని మీ చిత్రలేఖన కళలో బంధించాలి, శిల్ప 

రహస్యములన్నీ  మీ కుంచె లేఖనా సామర్థ్యము ద్వారా వ్యక్తమవుతాయి. ”

ఈవిధమగు నిర్దేశాములను స్వామి నుండి గ్రహించి గురువుకు జీవితాంతము తన ప్రతి 

శ్వాసను ఆయన ఆశీర్వదించి యొసగిన ఆదేశమును అనుసరించి  ‘శిల్పి’ సరికొత్త 

జీవితాన్ని ప్రారంభించినాడు.

శిల్పి భార్య మహా పెరియవ యొక్క బలమైన భక్తురాలు. వయస్సు పెరిగేకొద్దీ, ఆమె 

స్వామిని సందర్శించలేక అతని ఆశీర్వాదమును పొందలేకపోతున్నందుకు 

కుమిలిపోయేది.

మిగిలిన విషయమును శిల్పిగారి స్వంత మాటలను, నా శక్తి సామర్థ్యము మేరకు, 

తెనుగునకు అనువదించి మీముందుంచుచున్నాను.

పరమాచార్యులతో నా అనుభవము (ఇది శిల్పి గారు ఆంగ్లమున చెప్పిన తన 

స్వంతమాటలకు తెలుగు అనువాదము.

“ మీరు ఇన్ని చిత్రములు గీస్తూ వున్నారే ఒక్కసారి మహా పెరియవ చిత్రము 

గీయకూడదా! నా శేషజీవితము ఆ చిత్తరువును చూస్తూ గడిపెదను” అన్నది ఆయన భార్య పద్మావతి. నేను వెంటనే కంచి పీఠమునకు ఉత్తరము వ్రాయగా జవాబు ‘రమ్మంటూ’ తక్షణమే వచ్చింది. నేను హక్తి వినయములతో జగద్గురువునకు నమస్కరించి మౌనముగా నిలచినాను. స్వామివారు వెంటనే”అయితే నీవు నా బొమ్మ గీయుటకు వచ్చినావన్నమాట. నీవు గీచె ఆ బొమ్మలో నేను ఇముడుతానా! నీవు ‘మాలి’ శిష్యుడవు కదూ?”  అంటూ ప్రశ్నించినారు కానీ వారు నాకు అనుమతినిచ్చినట్లు తెలిసిరాలేదు.

కొన్ని దినముల తరువాత బొమ్మ గీయుటకు నాకు అనుమతి లభించినది. స్వామి ఒక 

చోట నిలకడగా కూర్చొని వారికి ఎదురుగా సూర్యుని వేడిమికి మాడు మాడేవిధముగా 

ఉన్న చోట కూర్చొని బొమ్మ గీయమన్నారు. ఎండవేడిమి భరించలేక 

సతమతమవుతూవున్న నాతో స్వామివారు కష్టముగా ఉందా? అని అంటూ అంతా 

సర్దుకొంటుందిలే అన్నారు. అంతే వాతావరణము చల్లబడి నా మనసును స్వామీ 

విగ్రహముపై నిలువజేసింది. నేను బొమ్మ గీయ మొదలుపెట్టినాను. కానీ నేనెంత 

యత్నించినా ఆయన రూపమును అందుగల కలాకాన్తిని అందిపుచ్చుకోలేక 

పోయినాను. అంటే ఆయన కరుణా కటాక్ష వీషణలు నాపై ఇంకా సంపూర్ణముగా 

ప్రసరింపబడలేదని గ్రహించినాను.  నా ఏకాగ్రతను చలించనివ్వలేదు. స్వామీ కరుణ నా 

నిశ్చలతలో ఎప్పుడు లీనమైనదో ఏమో, చిత్తరువు ముగించి స్వామీ పాదాలముందు 

ఉంచినాను.

నేను నా శ్రీమతి ఉత్కంఠతాభరితులమై స్వామివారి ముఖారవింద వికాసమునకు 

ఎదురు చూస్తూ వుండినాము. కాసేపు గడిచిన పిమ్మట స్వామీ రెండుచేతులతో దానిని 

గైకొని హృదయ ఫలకమునకు ఆనించి ఒక క్షణము నిమీలిత నేత్రుడైణ పిదప, చిన్న 

కాంచీపురములో ఉండుటచే, స్వామీ వరదరాజస్వామి గుదివైపునకు దృష్టిని మరల్చి, 

అశ్రుపూరిత నయనములతో వీక్షించగనే దేవాలయమున ఘంటలు గణ గణ 

మ్రోగనారంభించినాయి. మాహృదయములు ఆనంద తుందిలములై నర్తించినవి.

          స్వామి బిల్వ మరియు  తులసి మాలలను  చేతికి తీసుకొని చిత్రముపైనుంచి మాపై 

ఆశీర్వాదపూర్వకముగా అక్షతలు జల్లి మమ్ము మనసారా రెండుమార్లు దీవించినారు.

ఇదంతా దూరమున కూర్చొని గమనించుతూ ఉండిన జయేంద్ర సరస్వతులవారు, మా 

తిరుగు ప్రయాణములో వారివద్దకు ఆశీర్వాదము కొరకై వెళ్ళినపుడు, స్వామీ కరుణ మీపై 

సంపూర్ణముగా ఉండి, శుభమస్తు, వెళ్ళిరండియని దీవించినారు.

ఇది 1956 లో జరిగిన సంఘటన. kamakoti.org లో లభించిన ఈ విషయమును 

యథాశక్తి తెలుగులోనికి అనువదించినాను.

 ‘శిల్పి’ గారు  1956 లో రచించిన మహా పెరియవ యొక్క యథాతథ కళాకాంతులు 

కలిగిన చిత్రము యొక్క ప్రతిరూపమును మీ ముందుంచుచున్నాను.

స్వస్తి.