Sunday 28 May 2017

మనోమంథనం

మనోమంథనం
నేను నా రచనలేవయినా ఒక లంకె లో ఉంచుతాను. అందువల్ల ఉత్సాహవంతులు ఆస్య గ్రంధ కుడ్యముపై వెదకే అవసరము లేకుండా నేను తెలిపిన లంకెను తాము గుర్తుగా కాపాడుకొంటే ఎప్పుడయినా దానిని అనావృతము (To Open) చేసి చదువుకొనే వీలుంటుంది.


నేను ముసలివాడనే కానీ నేను ముఖ్యముగా పడుచువారి కొరకే వ్రాస్తాను. వారికి మన దేశ చరిత్ర, మన పురాతన వైభవము, మన పూర్వుల ప్రాభవము,మన దేశమును లేక మనదేశములోని వివిధ ప్రాంతములను ఏలిన రాజుల దేశ భక్తి, అన్నింటికీ మించి మన మహర్షివరేణ్యుల  విజ్ఞాన యోగదానము, వారి పరిశీలనాపటిమ, ఈనాటికీ దూరేక్షణ (Telescope) సహాయముతో కనుగోనలేని విషయములను, సూక్ష్మదర్శినులకు, కనబడని విషయములను, ఊహల
కందని విషయములను, గ్రహచారము, భూగోళము, వివిధములగు ధాతువులు(Minerals)
వైద్యము, శస్త్ర చికిత్స, ఈ విధ్జముగా చెప్పుకొంటూ పోతే లెక్కకు మిక్కుటమగు ఎన్నో ఆవిష్కరణనలను, తమ తపోశక్తితో అందజేసి, పాశ్చాత్యులవలె పేరుకు తపించని వారిని గూర్చి నాకు తెలిసినది వ్రాస్తూ వున్నాను. నాకు తెలుసు ఈ పనివల్ల దమ్మిడీ ఆదాయము ఘడియ పురుసత్తు ఉండదని. ఆరెంటిని కాదని వ్రాస్తున్నానంటే మీకు తెలియజేయు ప్రయత్నము తప్ప నా మనసులో వేరు తపన లేదు. కానీ ఒక్కొక్కసారి అవి చూసే వారి సంఖ్య కేవలము నామమాత్రముగా వుంటుంది. నేను నిరాశపడుటలేదు. కారణము నేను కేవలము ఆశావాదిని కావటమే! నా సంకల్పబలము నన్ను మేడిమ త్రిప్పనీయుటలేదు.
మొన్న ఆంగ్లములో The Tyrant Diaries
(From the memoirs of a French adventurer who served at Tipu’s court)
FRANCOIS GAUTIER అను చరిత్రకారుడు మరియు ప్రముఖ పాత్రికేయుడు. పరదేశమగు France (Paris) లో పుట్టి హిందుత్వమును స్వీకరించి ఈ దేశపు యువతిని పెళ్లియాడి ఇచ్చట నిలిచిపోయి ఆధార సహితమగు చరిత్రను భారతీయులకు అందజేయ వలయునను తపనతో వ్రాస్తూవుంటే అటువంటి వ్యక్తి రచనలను తిరస్కరించినాడు ఒక పాఠకుడు.
మిగత పాఠకులు ఎవరయినా దీనిని చదివి ఖండించినారా అంటే చదివేతేనే కదా ఖండించేది అన్న జవాబు వస్తుంది. బహుశ పాఠకులలో తేలికగా వుండే విషయములకు అధికముగా స్పందించేవారు ఎక్కువగా వుంటారేమో! మనదేశమునకు పునర్వైభవము తేవలెనన్న తపనతో నా సమయమును, ముదిమికి వలయు కనీసపు సుఖమును లెక్కచేయక, నాశక్తినంతయును కూడగట్టుకొని, నా పరిధిలో నాకు చేతనయినంత పరిశోధన చేసిన పిదపనే నా వ్రాతలను మీకు పంచుచున్నాను.

చరిత్ర తెలుసుకొనుట ఎందుకు అన్న ఆలోచన కొందరిదయితే, చదివితే ఏమొస్తుంది అన్నధోరణి కొందరిది. అసలు చరిత్ర చదివితే తప్పిదములు ఎక్కడ జరిగినదీ తెలుస్తుంది. వానిని సవరించుకొనుటకు మనకు అవకాశము లభించుతుంది.
టిప్పు సుల్తాను ను గూర్చిన ఈ వివరములు చూడండి.
 టిప్పు సుల్తాన్ 1750 నవంబర్ 20న జన్మించినాడని చరిత్రకు సంబంధించిన పాఠములు మరియూ వికీపిడియా తెలుపుచున్నాయి.  కానీ ప్రభుత్వం మాత్రం ఈనెల 10న టిప్పు జయంతిని అధికారికంగా జరిపింది. నవంబర్ 10 ఒక చీకటి రోజంటున్నారు చరిత్రకారులు. బెంగళూరు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి సూర్యనారాయణ రావు గారు ఏమంటున్నారో వారి మాటలోనే చదవండి.
Former Bangalore University Vice Chancellor Thimappa Manchale Suryanarayanarao called out the government’s ignorance on social media, “I just learnt from a historian that the tyrant Tipu’s birthday falls on November 20. November 10 is the day on which he hanged 700 Iyengars in Melkote.” As a result, the Melkote Iyengars do not celebrate Diwali even today. By cruel irony, that is the day the Karnataka government decided to celebrate its supposedly secular hero. How embarrassing can this get?
ఇక ఈ వాస్తవాన్ని గమనించండి (From Firstpost.com)
it’s the Coorgs, who he killed and converted, it’s the Mangalorean Catholics, whose churches he destroyed, and the Nairs of Wyanad and Malabar, who he tried to exterminate. Evidence for this comes from Tipu’s own letters and diaries. Instead, Chief Minister Siddaramaiah casually dismisses history by saying that the protests were by “communal forces”.

That’s not true, according to Coorgs. Says Coorg-born Gautham Machaiah, former executive vice-president, Zee Networks, “Coorgs are not opposed to Tipu Jayanti because he was a Muslim. He was a tyrant. He butchered thousands of Coorgs, mainly women and children, and forcibly converted innumerable people. We would have equally opposed Tipu Jayanti had he been a Hindu or a Christian.” The seething anger among Coorgs is ripe for exploitation.
భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో, వాల్మీకి,  ఆటవికుడు కానీ బ్రహ్మత్వమును పొందిన మహానుభావుడు,  ఆది కవి ఈ ప్రపంచములోనే, మరియు కనకదాసు వెనుకబడిన కురుబ గొల్ల కులస్తుడు, కానీ తన భక్తితో ఆ భగవంతుడినే తన వైపునకు తిప్పుకున్న పుణ్యమూర్తి, శ్రీ కృష్ణ దేవరాయలతోనే కనాభిషేకము చేయించుకొన్న, ఆయన గురువగు వ్యాసరాయలుకు అనుంగు శిష్యుడు, ఈ ఇరువురి జన్మ దినములను మన దేశీయ పంచాంగముననుసరించి శెలవు దినములుగా ప్రకటించినారు. అందుకు ఇది పోటీయా అన్నట్లు ఇప్పటి ప్రభుత్వము ఈపని చేసింది. మరి ఏవిధముగా ఆలోచించినా పై ఇరువురితో టిప్పుసుల్తాను పోల్చదగిన వాడా!
కర్ణాటక భగ్గుమనదా! టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుప రాష్ట్రమునకు ఇపుడు అవసరమా! ఇప్పుడు ఓ కొత్త వివాదం తెరమీదికి తెచ్చినట్లు కాదా?
మరి ఈ తప్పిదములు చరిత్రపుటలకు ఎక్కవలసిన అవసరము లేదా! ఇంతకన్నా ముఖ్యమగు సత్కార్యములు రాష్ట్రమునకు చేయవలసినవి లేవా!
ఈ వివరములు యువకులయిన మీరు గమనించిన తరువాతనయినా మంచిచెడులను అరసి చూసి మంచికి ప్రాధాన్యతనివ్వండి. చరిత్ర తెలుసుకోండి. ఇది రాజకీయము కాదు. దేశము అరాచాకీయము కాకుండా చూడండి. ఒక్కసారి మనో మంథనము చేసుకొండి. దేశమునకు అన్యాయము చేసిన వాళ్ళను మీరు పరీక్షించి తెలుసుకోండి. దేశము కొరకు ప్రాణాలను అర్పించిన మహనీయులను వెలుగులోనికి తెండి. ఎవరు వ్రాసే మాటలూ నమ్మవద్దు, నేను వ్రాసినవయినా సరే! మీరు పరిశీలించి వాస్తవమును గ్రహించి మీరు తెలుసుకొన్న వాస్తవ చరిత్రను మీ పిల్లలకందించండి.
స్వస్తి


Wednesday 24 May 2017

ఘజియాబాద్

ఘజియాబాద్

గతము ఘన కీర్తి కలిగియున్నా, గతము కంటకప్రాయమైనదై ఉన్నా, గతమునందు నరరూప రాక్షసుల వాతబడి కోట్లాది స్వజనులు అసువుల బాసినా, మనకు చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఎందుకంటే మన ధ్యానము, ధ్యాస, ధ్యేయము ధనార్జన మాత్రమే! దానికొక పరిధి,పరిమితి ఏమాత్రమూ లేదు. అసలు మన నాయకుల సముపార్జనకు ఆకాశమే హద్దు. ఒకవేళ వారికి ఊర్ధ్వ లోకములకు పోవు సమయమున ఏమయినా ప్రత్యేక వెసలుబాటు ఉందేమో!

అది గతమని తలచి నింపాదిగా ఉండిపోతే మన పూర్వ వైభవము గుర్తించి తిరిగీ దానిని భూమిపై ప్రతిష్ఠించగలమా! అణువిఘాతముచే అణువణువూ నేలమట్టమయిన హిరోషిమా నాగాసాకీని పట్టించుకోకుండా వదలిపెట్టి ఉంటే జపాను ఈనాడు ఇంత ప్రగతి సాదించి ఉండేదా!

వారి సంస్కారమును గూర్చి ఒక్కమాట చెప్పి ఈ ఉపోద్ఘాతము చాలించుతాను. జపాను వెళ్ళిన భారతీయుడొకడు అక్కడి రైలులో ప్రయాణము చెయవలసి వచ్చినది. ఇక్కడి వలెనే ఎదుటి Seat పై కాళ్ళను నిటారుగా సాచి ఉంచినాడు. ఆ కాళ్ళను ఆనుకొని కూర్చున్న జపానీయుడు వెంటనే ఆ కాళ్ళను తన ఒడిలో ఉంచుకొన్నాడు. భారతీయుడు ఎందుకు ఆవిధముగా చేసినారని అడిగితే అది మరొక్క వ్యక్తి కూర్చునుటకు కేటాయింపబడిన స్థలము, కాళ్ళను ఉంచుకొనుటకు కాదు. ఇక మీ కాళ్ళను నా ఒడిలో ఎందుకు ఉంచుకొన్నానంటే మీరు మా అతిథులు, మీకు ఉచిత రీతిని సపర్య చేయుట మా ధర్మము అన్నాడట ఆ జపానీయుడు. ఆయన చూపినది ఒకనాటి మన సంస్కారము. నేడు మనకు వంటబట్టినది అసహ్యము అసభ్యమయిన సంస్కారము. ఇది ఎవరి వద్దనుండి నేర్చుకొన్నామో నాకయితే అంతుబట్టలేదు.

ఇక ఘజియాబాద్ ను గూర్చి తెలుసుకొందాము. 

ఘజియాబాద్
https://cherukuramamohan.blogspot.com/2017/05/blog-post_24.html
పురాణములననుసరించి ధర్మరాజునకు 7 వ తరము వాడయిన నిచక్షు అను రాజు, తన పరిపాలనా కాలములో బీభత్సమును సృష్టించిన వరదల వల్ల తన రాజధానిని వత్స దేశపు నగరమగు కౌశాంబిని రాజధానికి అనుకూలమగు నగరముగా తయారు చేయించి అచటికి మార్చినాడు. ఈ వంశము యొక్క 26 వ తరపు రాజు 'రాజా ఉదయనుడు'. ఈ నగరము మహాభారత కాలములో లేదు గానీ ఈ ప్రాంతపు ఉనికి మాత్రము ఎన్నో శతాబ్దములకు పూర్వము కూడా కనిపిస్తుంది.  జాతక కథలలో కౌశాంబి ని గూర్చి అనేక మార్లు వినవస్తుంది. గౌతమ బుద్ధుని కాలములో దేదీప్యామానముగా వెలుగుచుండినది ఈ నగరము. కాళిదాస, భాస, క్షేమేంద్ర మహాకవుల గాథలు ఈ ప్రాంతముతో ముడిపడి ఉన్నాయి.
ఈ నగరము ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో వుంది. ఇది ఘజియాబాద్ జిల్లాకు కేంద్రమగు ఘజియాబాదునకు 13 కి.మీ. దూరమున 15 నిముసముల ప్రయాణ సమయమును కలిగియున్నది.
ఇక ఘజియాబాద్ నగరమును గూర్చి తెలుసుకొందాము. దానికి పూర్వము ఘాజి అన్న మాటకు అర్థమేమి అని తెలుసుకొందాము.
ఒట్టోమాన్ రాజవంశ కవియగు అహ్మదీ1402 లో వ్రాసిన వ్రాత ప్రకారము  ఘాజి అన్న మాటకు ఈ విధమగు అర్థము చెప్పబడినది. గూగుల్ నుండి నేను సేకరించినది యథాతథముగా మీ ముందుంచుచున్నాను.
“The Ottoman poet Ahmedi, writing ca. 1402, defines ghazis as "the instruments of God's religion, a servant of God who cleanses the earth from the filth of polytheism." (Lewis, The Political Language of Islam, pp. 147148, note 8)
అదే పదమునకు ఆంగ్ల పదకోశములు ఏమి అర్థమును తెలుపుచున్నవో ఒకసారి గమనించండి.
 gha•zies
1. A Muslim who has successfully fought against non-Muslims.
2. Used as a title for such a warrior. (The free Dictionary. com)
The Cambridge History of Turkey defines Gaza as "a raid for plunder, later came to mean holy war fought for Islam.
అసలు ఈ 'ఘజ్వా' అన్నది ఎట్లు ప్రాచుర్యములోనికి వచ్చిందో గమనించండి.

When performed within the context of Islamic warfare, the ghazw's function was to weaken the enemy's defenses in preparation for his eventual conquest and subjugation. Because the typical ghazw raiding party often did not have the size or strength to seize military or territorial objectives, this usually meant sudden attacks on weakly defended targets (e.g. villages) with the intent of demoralizing the enemy and destroying material which could support their military forces. Though Islam's rules of warfare offered protection to non-combatants such as women, monastics and peasants (in that they could not be slain), their property could still be looted or destroyed, and they themselves could be abducted and enslaved (Cambridge History of Islam, p. 269)
ఇక ఇటీవలి కాలములో నవంబరు 2015 లో పారిస్ లో జరిగిన ఉగ్రవాదుల దాడుల సందర్భముగా ఆ ఉగ్రవాది మూక ఏమి చెప్పిందో చూస్తాము:
Gazawat as holy war: After the terrorist attacks on Paris in November 2015, the Islamic State group is said to have referred to its actions as "ghazwa". Probably the most famous use of the term "ghazwa" is in the phrase 'Manhattan Raid', used by Al-Qaeda to refer to the September 11th attacks.
అంటే పై విషయములవల్ల మనకు ఘజ్వా అన్న మాటకు 'ఇస్లామేతర మానవాళి' వినాశనము అని మనకు అవగతమగుచూ వుంది.

తిరిగీ ఇపుడు ఘజియాబాదు యొక్క పూర్వ చరిత్ర తెలుసుకొందాము. ఈ నగరము క్రీస్తుకు పూర్వము 2500 సంవత్సరముల నాటి చరిత్ర కలిగి వుంది. ఘజియాబాద్ ను ఆనుకొని ప్రవహించు హిందన్ నది తీరములందు మోహన్ నగర్  కు దగ్గరగా, త్రవ్విన త్రవ్వకములలో బయల్పడిన కొన్ని  గ్రామములు ప్రాంతములు మహాభారత రామాయణ కాలము నాటివి. వానిలో 'ఘర్ముక్తేశ్వర్' 'పూత్' 'అహర్' ప్రాంతములు 'మహాభారతము'నకు అనుబంధమై యుండగా, 'లోని' కోట, రామాయణములో, శతృఘ్నుని చే వధింపబడిన 'లవణాసురు'నిది గా గుర్తిపబడుచున్నది. అసలు 'లోని' అన్న పేరు బహుశ 'లావణి' అని తనపేరు తో లవణాసురుడు తన పేరుతో నిర్మించుకొన్న ఆ కోట 'లోని' అయినదేమో! అసలు సముద్ర గుప్తుడు ఇచట అశ్వమేధ యాగము చేసినట్లు ఇచ్చటి త్రవ్వకముల ద్వారా తెలియ వచ్చుచున్నది. 1740 తుగ్లక్ రాజులకు వజీరుగా నుండిన వజీర్ ఘాజీయుద్దిన్ తనపేరు పెట్టి ఈ నగరమునకు తనదైన శైలిలో కొన్ని మార్పులు చేసి ' ఘజీయుద్దీన్ నగర్' మార్చినాడు. కాలాంతరములో ఈ పేరును కురుచచేసి 'ఘజియాబాద్' గా నామకరణము చేసినారు.
పర్షియా, మొసపుటేమియా మున్నగు దేశములను జయించిన పిమ్మట భారత దేశము ముస్లీము దేశము కాకపోవుట, అవధికందని అందలి సంపత్తి, అంతకన్నా ముఖ్యముగా అచటి దేవాలయములను కూల్చి అందలి సంపదను వశము చేసుకొనుట అన్న ధృడమైన ఆలోచనలతో, అప్పటికే తనదైన శైలిలో దేశమును నాశనము చేసి పాలకుడై ఏలుచున్న సుల్తాన్ నసీరుద్దిన్ ముహమ్మద్ తుక్లక్ తో 1938 యుద్ధమునకు దిగి దేశమును నాశనము చేయుచూ, వేలకు వేల కోట్ల విలువ చేసే దేశ సంపదను, లక్షలాది భారతీయులను, విగత జీవులను చేసి తన కైవశము చేసుకొన్నాడు. తాను చేసిన ఈ పైశాచిక చర్యను 'ఇస్లాము యొక్క ప్రాబల్యము కొరకై అల్లా పేరుతో చేసిన పవిత్ర కార్యముగా' చెప్పుకొన్నాడు.
'పళ్ళూడగొట్టుకొనుటకు ఏ రాయి అయితేనేమి' అన్నట్లు ఏ ముస్లిం పాలకుడయినా చేసినది భారత దేశ నాశనమే! స్వాతంత్ర్యము సాధించినా మనము మన పట్టణములకు, ఊర్లకు, ప్రాంతములకు, పల్లెలకు వారి పేర్లు కలిగియుండవలసినదేనా!
పాకిస్తాన్ ప్రభుత్వము
తమ దేశములోని కరాచీ లోగల 'రాంబాగ్' ను 'ఆరాం బాగ్' గా మార్చింది.
లాహోర్ లోని 'వన్ రాధారాం' ను ' హబీబ్ కోట్' గా మార్చింది.
1970 లో బలూచిస్తానములోని 'హిందూ బాగ్' ను 'ముస్లిం బాగ్' గా మార్చింది.
ఇటువంటివి ఎన్నో! ఎన్నెన్నో! నేను చూపినది  మచ్చుకు మాత్రమే!
హరూన్ ఖాలిద్ అన్న ప్రముఖ రచయిత వ్రాసిన, వ్రాయ బోవుచున్న పుస్తకములు,
A White Trail and two forthcoming books, In Search of Shiva and Walking with Nanak. చదివితే మనకు అచ్చటి పరిస్థితి అర్థము కాగలదు.
మనదేశములో ముస్లిం పాలకుల పేర్లతో ఏర్పడిన ప్రాంతముల పేర్లు నేటికి కూడా నాటి పాలకుల దౌష్ఠ్యమునకు ప్రతీకగా వారిపై మన విధేయతకు దర్పణముగా అలహాబాదు, ఔరంగాబాదు, హైదరాబాదు, ఫిరోజ్ పూర్, ఫిరోజ్ కోట్, ఆదిలాబాద్, వంటి ఎన్నో ప్రాంతములు స్వాతంత్ర్యము వచ్చి 70 సంవత్సరములయినా ఎటువంటి మార్పు లేకుండా యథా తథముగా ఉన్నాయి.  ఈ విధముగా చెప్పుకొంటూ పోతే అవి లెక్కకు మిక్కుటములు.

నేను ఈ వ్యాసమును వ్రాయుటలోని కారణము ఏమిటన, బహు విగ్రహారాధకులమగు మనకు వారిమతము శత్రువు కాకపోయినా,  ఇస్లాం మతమునకు  వారి మతగ్రంధము ప్రకారము మనము శత్రువులము. అటువంటి వారిని చంపి తన విధేయతను 'అల్లా'కు చాటేవాడు 'ఘాజీ'. మరి అధికసంఖ్యాకులమగు  మనదేశములో ఇంకా ఇటువంటి పేర్లు గల ఊర్లలో నిర్లజ్జగా నివసించుచున్నామే మనకు స్వాభిమానము లేదు కానీ అది రాదా అది రాకూడనిదా! ఎంతో పురాణ ప్రశస్తి కలిగిన కౌశాంబిగా ఈ నగరమును మార్చ కూడదా!  ఆ జిల్లాకు 'కౌశాంబి' అన్న పేరు పెడితే మన దేశము యొక్క ప్రాచీన వైభవమునకు వన్నె తెచ్చినవారము కామా! మీరే ఆలోచించండి.

స్వస్తి.

Saturday 13 May 2017

వార్తా పత్రికల సాక్షిగా

వార్తా పత్రికల సాక్షిగా
ఒకటి కడిగిన ముత్యం
ఒకటి కడగని ముత్యం
ఒకటి ఆణిముత్యం
ఒకటి అసలైన ముత్యం
ఒకటి ఆలిచిప్ప ముత్యం
ఒకటి అరుదైన ముత్యం
మొత్తానికి ఏదోఒక ముత్యం
నీతీ నిజాయితీ పత్యం
ఈ ముత్యా లనునిత్యం
చూస్తున్నామిది సత్యం

కోర్ట్ల కరిగెను కొన్నిముత్యాలు
కోరకుండా జీత భత్యాలు
జీవితము తమ ప్రజలకేనని
వారి సంపద రక్షకులమని
మభ్య పెట్టిన మహా రాజుల
మూటలను గొనిమాయమాటల
మభ్యపెట్టెడు న్యాయ వాదుల
నేతిబీరల వాదనమ్ములు
వాస్తవమ్ముల మరుగు పరచగ
తెలిసి కూడా తెలియ నట్లుగ
చూసికూడా చూడనట్లుగ
కళ్ళు మూసీ మూయనట్లుగ
కోర్టు లిచ్చెను తీరుపు
దేశాన కలుగదు మారుపు
మంచి సమయం మించ దొరకదు
మాయువులకిది మార్గదర్శం
అక్రమమ్ముల విక్రమార్కులు
వక్ర మార్గపు చండమార్కులు
కోర్టు వారిని ఆశ్రయించిన
కోరు ఫలితము వచ్చితీరును