Sunday 26 July 2020

కొనకుండా నవ్వుకొనండి-3


కొనకుండా నవ్వుకొనండి
రేలంగి రమణారెడ్డి-1
నాటి హాస్య మహానటులైన
రేలంగి గారు, రమణా రెడ్డి గారు
ఒకసారి వీధిలో కలిసినారు. కుశల ప్రశ్నలు ముగిసిన
తరువాత రేలంగి గారు రమణారెడ్డి గారిని
ఎటువైపు వెళుతున్నారు?
అని అడిగినారు. అందుకు రమణారెడ్డి గారు  
"నా బొందనాకు నేనుగా ఎటువైపు వెళ్ళను.

గాలి ఎటువైపుకు వీచితే అటువైపే!

రేలంగి -రమణారెడ్డి-2

ఒకసారి రేలంగి -రమణారెడ్డి గార్లు మద్రాసు నుండి హైదరాబాదు వచ్చుటకు రైలు కోసం సిమెంటు బెంచ్ పై కూర్చొని ఉండినారు. అంతలో ఎదురుగా Weighing Machine కనిపించింది. Train రావటము ఎటూ లేటు కదా! పోయి Weighing Machine పీఠము ,మీదికెక్కి బరువుచూచుకొందామనుకొన్నారు.
మొదటరూపాయి వేసిరేలంగి ఎక్కినారు. Ticket వచ్చింది. ఆయన ఆతురుతగా ముందు
Ticket వెనుకవైఒపు చూసినాడు. అందులో ఒకేసారి నలుగురు ఎక్కరాదుఅని వ్రాసిఉంది.

ఈసారి రమణారెడ్డి Weighing Machine ఎక్కి రూపాయి వేసినాడు. వెంటనే ticket బయటికి వచ్చింది. ఆయన కూడా ticket వెనుకవైపు తిప్పి చూచినాడు. అందులో ‘వస్తువును ఉంచిన తరువాతనే బరువు చూడగలరు’ అని ఉండినది.
రేలంగి -రమణారెడ్డి-3
ఒకసారి రేలంగి రమణారెడ్డి గార్లు రైలులో AC బోగీ లో ప్రయాణం చేస్తూ వుండినారు. వచ్చిన ఏదో పెద్ద స్టేషనులో ఇద్దరు ఆంగ్లేయులు ఎక్కినారు. రైలు కదిలింది. ఆంగ్లేయులు వారిలో వారు ఏదో మాట్లాడుకొంటున్నది మన నటులిరువురూ జాగ్రత్తగా గమనించుతూ వుండినారు. పాశ్చాత్యులు ఇరువురూ ఆ బోగీలో ఉన్న (Pull) chain ను చూస్తూ మాట్లాడుతూ వున్నారు.1: ‘ chain లాగితే ఏమౌతుంది’? 2: Train ఆగుతుంది 500 రూపాయలు లాగినవారిపై fine పడుతుంది, లాగుటకు సరియన కారణము లేకపోతే'. సరే ఇద్దరూ తమ తమ జేబుల్లో నుండి డబ్బు తీసి చూసుకొంటే ఒకరివద్ద 3 నూర్లు వేరోకరివద్ద 200 నూర్లు ఉండినాయి. తిరిగి జేబులో పెట్టుకొని ఇద్దరూ ఏవో గుసగుసలు మాట్లాడుకొన్నారు. ఈ సంభాషణ అంతా ఆంగ్లము లోనే జరిగింది. ఎదురుగా కూర్చున్న రేలంగి రమణారెడ్డి గార్లు తెలుగులో అంటే ఆంగ్లేయులకు రాని భాషలో మాట్లాడుకొంటూ వుంటే తమకాభాష రానట్లే వీరికీ ఇంగ్లీషు రాదనుకొన్నారు. కానీ రమణారెడ్డి ఆంగ్లము చదివినవాడు ప్రభుత్వ ఉద్యోగమూ చేసినవాడు. తాను అర్థము చేసుకొన్నది తన మిత్రునితో పంచుకొని మిన్నకున్నాడు. ఆంగ్లేయులు chain లాగినారు. TC వచ్చి అడిగితే మనవారి వైపు చూపి 'వారే లాగింది' అని అన్నారు ఆంగ్లేయులు. TC అప్పుడు మనవారినడిగితే రేలంగి వెంటనే 'అవును మేమే లాగింది' అన్నాడు. 

TC ఎందుకు అని అడిగిన వెంటనే రమణారెడ్డి ఆంగ్లములో 'వారు మావద్ద నున్న 300, 200 మమ్ము బెదిరించి గుంజుకొన్నారు. కావాలంటే వారి జేబులు పరిశీలించండి' అన్నాడు. అంతే మనవాళ్ళిద్దరూ, అక్కడ గుమి కూడిన వారి దృష్టిలో హీరోలయిపోయినారు.
రేలంగి-రమణారెడ్డి-4
Pensive Face on OpenMoji 12.0ఒకసారి షూటింగ్ విరామ సమయములో రేలంగి రమణా రెడ్డి గార్లు పక్కపక్కనే విశ్రాంతిగా కుర్చీలపై కూర్చొని వున్నారుపిచ్చాపాటీ మాట్లాడుకొంటూ. అది దీపావళి సమయము. అందుకేనేమో రమణారెడ్డి గారికి ఒక సందేహము పటాసులను గూర్చి వచ్చింది. వెంటనే రేలగి గారివైపు తిరిగి "ఏమండీదీపావళికి అందరూ పటాకులు పేలుస్తారు కదా! అవి వెలిగించగానే వెలుతురు ముందు కనబడుతుందితరువాత శబ్దము వినిపిస్తుంది కారణమేమంటారు" అన్నారు. రేలంగి గారు వెంటనే          " నిజానికి వెలుగుధ్వని ఒకేసారి వస్తున్నాయి అండీ. కానీ కళ్ళు ముందున్నందువల్ల మొదట వెలుగు కనిపిస్తూ వుంది. వెనుక ఉన్నందువల్ల,
చెవులకు శబ్దము తరువాత చేరుతూ వుంది" అన్నారు.

రామణా రెడ్డిగారు: 😢
కొనకుండా నవ్వుకొనండి-రేలంగి ఆంగ్ల పాండిత్యము-5
ఒకసారి ఎదో పనిమీద రేలంగి గారు రమణా రెడ్డి గారి ఇంటికి వచ్చినారు.
వారిమధ్య నవ్వుకోనేందుకు ఎన్నోమాటలు దొర్లేవి.
ఉన్నట్లుండి రమణా రెడ్డి రేలంగితో 'మీరు ఇంగ్లీషు మాట్లాడ గలరా?' అన్నాడు.
రేలంగి వెంటనే ధారాళంగాఅన్నాడు.
రమణా రెడ్డి: 'అయితే ఈ రెండు వాక్యాలను తర్జుమా చేయండి' .
రేలంగి: 'చెప్పండి'
రమణా రెడ్డి: 'ఈపని మొదట కాలేదు. తరువాత జరిగి పోతూవుండినది'.
రేలంగి: 'ఓస్! అంతేనా! అయితే వినండి. 'This work first not done. After

Done, డన్ డనాడన్ డన్ డనాడన్ డన్ డనాడన్ ..........'


రేలంగి రమణారెడ్డి- Shooting Incident-6
ఒక సినిమా షూటింగ్ జరుగుతూ వుంది. ఆ షూటింగ్ సీన్ లో రేలంగి రమణారెడ్డి పాత్రధారులు. రమణారెడ్డి Judge రేలంగి దొంగ.
ఒకే బట్టలకోట్టులో 4 మార్లు దొంగతనము చేస్తాడు రేలంగి. 4 వ మారు పట్టుబడి Judge ముందు ప్రవేశపెట్టబడుతాడు.
రమణారెడ్డి: కోర్టుకు కొత్తగా కనబడుతున్నావు నీవు దొంగతనానికి కొత్తా! 
రేలంగి: ఏ కొట్టులో పట్టుబడినానో ఆ కొట్టులోనే మొదటసారి నాభార్య కొరకు చీరను దొంగలించినాను. మళ్ళీ దొంగతనము చేయలేదు Your Honor.
రమణారెడ్డి: మరి అదే కొట్టులో ఇంకా మూడుమార్లు దొంగతనము చేసినట్లు Police Record చెబుతూ వుంది.
రేలంగి: ఆ చీర నా భార్యకు నచ్చనందువల్ల మిగిలిన మూడుమార్లూ Replacement కు try చేసినాను Your Honor.
Relangi Speaks Japan Language To Fool Ramana Reddy - YouTube 
Relangi Speaks Japan Language To Fool Ramana Reddy - YouTubeరేలగి-రమణారెడ్డి-7
స్వకపోల కల్పితమైన  ఈ దిగువ సంఘటనకు, హాస్యమునకు అజరామర ప్రతినిధులైన
 శ్రీయుతులు రేలంగి రమణారెడ్డిగార్ల పేర్లు మాత్రము వాడుకొనుచున్నాను. హాస్యము
 ఆనంద దాయకము. ఆనందము ఆరోగ్యదాయకము.
Magical Side Of Ramana Reddy! | Telugu Swagఅప్పుడప్పుడే పేరు ప్రఖ్యాతి ధనము సంపాదిస్తున్న, పై హాస్య జంటను సన్మానింప
పిలచినారు తిరుపతి ప్రముఖులు. తమకు ఇవ్వవలసిన సంభావన, రానూపోనూ
ఖర్చులు కలుపుకొని మాట్లాడుకొన్నారు. రేణిగుంటకు రైల్లో Third క్లాసు లో వచ్చి,
మర్యాద కాపాడుకొనేందుకు రేణిగుంట నుండి ఇంచుమించు 10 కిలోమీటర్ల
దూరానికి  టాక్సీ మాట్లాడుకొన్నారు.
సభ గొప్పగా జరిగినది. కార్యక్రమము ముగియగానే Taxi ఎక్కి రేణిగుంట లో దిగి మళ్ళీ Third Class Ticket కొన్నారు. రాయచూరు పాసింఙరు రైలు Station లో ఆగింది. Rush చాలా ఎక్కువగా ఉండినది ఆ పెట్టెలో. రేలంగి ఎక్కిన వెంటనే ఇంతమంది మధ్యలో నిలబడి ప్రయాణము చేయలేనన్నాడు. రమణారెడ్డి స్వతహాగా Magician కాబట్టి తన చంకకు తగిలించుకొన్న Bag లో నుండి ఒక రబ్బరు పామును తీసి ఆ బోగీలో నేలపై వదిలి ‘పాము పాము’ అని గట్టిగా అరచినాడు. రేలంగి ఇది గమనించినాడు కాబట్టి గమ్మున ఉండిపొయినాడు.  భయముతో ప్రయాణీకులు అందరూ దిగగా, వీరిరువురు మాత్రము మిగిలినారు. హాయిగా చెరి ఒక seat లో పడుకొని నిద్రపోయినారు.
తెల్లవారింది. మోద్దునిద్రనుండి లేచి అటుగా పార పట్టుకొని పోతున్న కూలీని ‘Train మద్రాసు చేరి చాలాసేపయినట్లుందే! ‘ అన్నాడు రేలంగి. ‘లేదు ఇది రేణిగుంటనే! నిన్న ఈ బోగీలో పాము వుండినదని దీనిని తొలగించి వేరే బోగీలో Passengers ను ఎక్కించుకొని ట్రైన్ మద్రాసుకు వెళ్ళిపోయింది’ అన్నాడు. ఇక మనవారి హావభావములు తలచుకొని నవ్వుట మీ వంతు.
రేలంగి-రమణారెడ్డి-8

బా                           బా గా నిద్రపోతున్న నా ఊహల్లో ఒక కల తళుక్కుమని మెరిసింది.
ర                  నేను తీస్తున్న చలన చిత్రములో రమణారెడ్డి హీరోగా రేలంగి ఆయన తండ్రిగా                                    నటిస్తున్నారు.
అది Post Office లో Post Cards ఆమ్మే కాలము.
రేలంగి     కుమారునితో ఈ విధముగా అన్నాడు. రేలంగి
 "ఒరే! రమణా Post Office పోయి ఒక Post Card పట్టుకొని రాపో'
             రమణారెడ్డి: "నాన్నా మరి డబ్బివ్వు"
               రేలంగి: "డబ్బిస్తే ఎవరైనా తెస్తారు. ఆ డబ్బు లేకుండా తెస్తే నిన్ను నా కొడుకని నమ్ముతా!"                                            
                 రమణారెడ్డి బయటికి వెళ్లి కాసేపటికి ఒక వ్రాసిన Post Card పట్టుకొని వచ్చి తండ్రికిచ్చినాడు.
           రేలంగి   అటుఇటు చూసి " నీకు బుద్దిలేదా రాసిన Post Card మీద ఎవరైనా ఎట్లా                                    రాస్తారు?"
              రమణా రెడ్డి: "నీవు Post Card డబ్బు పెట్టకుండా తెమ్మన్నావునేను తెచ్చినాను.
            నీవు ఇప్పుడు దానిపైన రాసినావంటే నీవు నిజంగానే నాతండ్రివని నమ్ముతాను".

                                        రేలం గి:  ?

రేలంగి రమణారెడ్డి-9 (ఇది నా కల్పన మాత్రమే)
 రమణారెడ్డి Interview అధికారిగా ఉన్న కార్యాలయమునకు రేలంగి INTERVIEW కొరకు వచ్చినాడు
రమాణారెడ్డి పరిచయాల తదుపరి అడిగిన ప్రశ్న: Mobile కు పెళ్లికి గల పోలిక ఏమిటి?

రేలంగి: రెంటి విషయములోనూకాస్త ఆగితే ఇంకా మంచి Model దొరికేదేమో అనిపిస్తుంది.
రేలంగి రమణారెడ్డి-11
పుత్ర రత్న రేలంగి: నాన్నా! నాకు 180CC Pulsar కొనిపెట్టవా?
తండ్రి రత్నాకర్ రమణారెడ్డి: Pulsar 180CC కొన్నా, Bullet 500CC కొన్నా

నీవు 80CC Scooty వెనకాల పోయేవానివే కదా!
రేలంగి-రమణారెడ్డి-12   
 (వ్రాసిన ఉదంతము స్వకపోల కల్పితము)
ఒకసారి ఫోటో తీయించుకొనుటకు రమణారెడ్డి గారు రేలంగి గారి వద్దకు వచ్చినారు.
హుందాగా నిలబడి passport size photo తీయమన్నాడు.
రెలంగి "మీరు చక్కగా steel rod లాగా నిలబడండి. చక్కటి photo తీస్తాను" అన్నాడు.
ఆశముదిరిన రమణారెడ్డి, passport size లో తన full photo తీస్తున్నాడని తలచి "నా చెప్పులు కూడా photo రావాలి" అని గద్దించి చెప్పినాడు.
రేలంగి "అలాగే సార్. చెప్పులు కాస్త నెత్తిన ఉంచుకోండి" అన్నాడు.
రమణారెడ్డి:        😏

కొనకుండా నవ్వుకొనండి-రేలంగి-రమణారెడ్డి-13
(స్వకపోల కల్పితము)

ఒకసారి మహా మేధావి యగు రమణారెడ్డి అనేకానేక సార్వజనీన సంస్థలలో (Public Limited Companies) లో పని చేసిన అనుభవముతో Microsoft Corporation, USA కు ఉద్యోగమ కొరకు తన ప్రవర(Bio Data)తో దరఖాస్తు పెట్టుకొన్నాడు. కొన్ని రోజులతరువాత అతనికి ఈ విధమైన జవాబు వచ్చింది ఆంగ్లములో:

Dear Mr. Maha Pandit

You do not meet our requirements. Please do not send any further correspondence. No phone call shall be entertained.

Thanks

Bill Gates.

రమణారెడ్డి ఆనందముతో అరిచి, తెలుగువాడు కాబట్టి. ప్రెస్ రిపోర్టరు అయిన తన అల్లుదు రేలంగిని పిలిచి అతనికి తెలిసిన తెలుగు పత్రికా విలేఖరులను అందరినీ పిలిపించమన్నాడు. అందరూ సమావేశమైన తరువాత ఆయన తన అల్లునితో “నేను ఈ ఉత్తరాములోని ఆంగ్లమును చదువుతాను, నీవు తర్జుమాచేసేది’ అన్నాడు. ‘ఓహ్! అదెంతపని” అన్నాడు రేలంగి. రెడ్డిగారు ఉపన్యాసాన్ని ఈ విధముగా ప్రారంభించినారు.

“Dear Scribes I have received letter from Microsoft USA. I shall let you know the contents of it”. My Son-in-Law Relangi will translate the contents of the letter into Telugu, as I read out the same in English.”

రేలంగి, ఫిరంగిగా మారి తెలుగు గుండ్లను ఈవిధముగా ప్రేల్చనారంభించినాడు.

"విలే ఖరులారా (విలేఖరులారా అనుటకు బదులు) నా కాకి మెత్త (My Crow Soft) నీవౌనొక (you yes a) నుండి నాకు లేఖ అందినది. అందులోని సారాంశమును మీకు తెలుపుతాను. మీరందరూ తెలుగు విలేఖరులు కాబట్టి నేను వారు పంపిన ఉత్తరమును, ఆంగ్లములో, యథాతథముగా చదువుతాను. నా ఉభయభాషా ప్రవీణుడైన అల్లుడు రేలంగి (అంటే నేను అం గుండె చరిచి చెప్పినాడు) ఆంగ్లమును, తర్జుమా చేసిన తెలుగులో మీకు వినిపిస్తాడు.  మీరు వ్రాసుకోండి." అని తర్జుమా చేసినాడు ‘ఉభయ భాషా ప్రవీణ’ రేలంగి గారు.

ఆ ఆంగ్ల పఠనము, తెలుగు అనుసరణ ఈ విధముగా సాగినాయి.

Dear Mr. Ramana Reddy >>ప్రియమైన శ్రీ ‘రామన్నా సిద్ధం’ (Ramana Reddy కి తెలుగు తర్జుమా, Ramana అన్న మాటను రామన్నా గానూ, రేలంగి గారు, Reddy అన్నమాటను Ready గా తీసుకొన్నారు) మహాశయా

You do not meet >>మీరు కలువనే కలువరు

Our requirement >>మాకు అవసరము అంటే మీ కలయిక మాకు అవసరము అని అర్థము.

Please do not send any further correspondence >> మీరు తిరిగి జవాబు తెలిపే ప్రయత్నమూ చేయవద్దు

No phone call >>ఫోన్ లో మాట్లాడే పని కూడా చేయ వద్దు

Shall be entertained >> తప్పక రంజింపచేస్తాము అంటే మీరు వచ్చినారంటే మిమ్ము సంతోషపరుస్తాము.

Thanks >> కృతజ్ఞతలు

Bill Gates.  >> చీటీ గేట్లు

తరువాత రోజు దిన పత్రికలలో వచ్చిన ఈ వార్త చదివి నవ్వి నవ్వి Treatment కు Dr.Prabhakar Reddy వద్దకు పోయినారట.

రేలంగి రమణారెడ్డి-14


రమణారెడ్డి కుమారుడు రేలంగితో: నీకంటే పనికిరానివాడు ప్రపంచములో లేనే లేడు. ఈ సారి కూడా నీవు మళ్ళీ 10th fail అయినావు. నీవు ఇప్పటకి రెండేళ్లుగా fail అవుతూనే ఉన్నావు. పక్కింటి రోజాను, ఎదురింటి మల్లికను జూడు. ఒకరు 98% మరొకరు 97% తో pass అయినారు.

రేలంగి: నేను ఈ రెండేళ్ళు వాళ్ళను చూసిచూసే

fail అవుతూ వస్తున్నాను నాన్నా.

రేలంగి రమణారెడ్డి-15

ఒకసారి స్వర్గవాసులైన రేలంగి రమణారెడ్డి, ప్రతిరోజూ ఇంద్రసభలో అందరినీ నవ్వించేవారు. ఇంద్రుని వద్ద ఒకరోజు శెలవుతీసుకొని అట్లా భూలోకము అందులో భారదేశము అందులో ఉమ్మడి ఆంధ్ర ప్రాంతమునకు వచ్చినారు.  హైదరాబాదులో ఎదో పెద్ద Election Meeting జరుగుతున్నట్లు తెలిసిపోయింది ఇద్దరికీ. వేదికపైన ఉన్న 5 మందిలో ఇరువురిని అమ్మ కొడుకులుగా గుర్తించినారు. పోలికలను బట్టి. అబ్బాయి అందముగా ఉన్నాడు పేరేమి అని అడిగినాడు రేలంగి రమణారెడ్డిని. అబ్బాయి పేరు ‘రాగులు’ ఆతని అమ్మ పేరు ‘సేమియా’ అని చెప్పినాడు రమణారెడ్డి. ఆ ఫోటోలు ఏవో అమ్మకు చూపుతున్నట్లున్నదే అని అడిగినాడు రేలంగి. అంత రమణారెడ్డి ‘అవి ఆసభకు తమ తండ్రులతో వచ్చిన పెళ్ళికాని ఆడపిల్లలవి. గొప్పవాడు కాబట్టి తన CAMARA MEN లతో చెప్పి వారి ఫోటోలు తీయించి అమ్మకు చూపించి ఏ అమ్మాయి బాగుంటుంది అని అడుగుతున్నట్లు ఉన్నాడు. అంతలో ఆమె మాట్లాడవలసిన సమయము వచ్చినట్లుంది. అమె గొప్పగా, విదేశస్తురాలయినా, ఆమె యాసలో హిందీలో అనర్గళముగా మాట్లాడి బిగ్గరగా “హమే బహు ‘మత్’ చాహియే” అని 5,6 మార్లు అనింది ‘బహుమత్’ అన్న మాటను విరిచి. తమపిల్లలకు ‘రాగులు’ తో పెళ్ళిపెత్తనము నెరుపుదామని వచ్చిన తల్లిదండ్రులు నిరాశతో వెళ్ళిపోయినారు.   కథ మళ్ళీ మొదటికి వచ్చింది’. ఈ విధముగా రమణారెడ్డి వ్రతకథ చెప్పిన రీతిలో రేలంగికి విశధపరచినాడు.

స్వస్తి. 

రమణారెడ్డి రేలంగి - 16


రేలంగి : రమణారెడ్డి గారు మీరు లావు

కావటానికి ఏ వైద్యమును అనుసరిస్తారు.?

రమణారెడ్డి: హోమియోపతి నేచురోపతి

వాడినాను. ఫలితము లేదు.

రేలంగి: ఆలోపతి వాడలేదా!                              

రమణారెడ్డి : అందులో మందులే Expire ఔతాయి

మనషులు కారని నమ్మకమేమి?

రేలంగి :😂

రేలంగి-రమణారెడ్డి-17

ఒక తెలుగు సినిమా shooting జరుగుతూ ఉంది.  ఒక రైలుపెట్టె లో రేలంగి రమణారెడ్డి ఎక్కినారు. వారు ఒకరికొకరు అపరిచితులు.  రైలు పోతూవుంటే ఇరువురూ మాటలు కలిపినారు. రమణారెడ్డి గారు తమ ఆంగ్ల భాషా చాతుర్యమును చూపదలచి ఆంగ్లములో రేలంగి గారిని అడిగినారు "Where did you born" అని.

రేలంగి ముక్తసరిగా 'Hyderabad' అన్నారు. రమణారెడ్డిగారు వెంటనే "Which part" అన్నారు మరి రేలంగి గారు తక్కువ తిన్నవారా! వెంటనే ఆయన కూడా ఆంగ్లములో "All parts" అన్నారు.

రమణారెడ్డి రేలంగి - 18

రేలంగి గారు MLA గా నిలిచి ఓడిపొయినారు. పోతేపోయినారు కానీ District Collector రమణారెడ్డి గారివద్దకు వెంటనే పోయి తనకు తక్షణం Z-Category Security కావాలన్నారు తక్షణం Election కు సంబంధించిన Secretary ని రమ్మని ఎన్ని ఓట్లు ఆయనకు వచ్చినదీ తెలుపమంటే అవి 3 అని తేలినది. వెంటనే రమణారెడ్డి రేలంగితో ' మీకు వచ్చింది బోడి మూడు ఓట్లు. మీకెందుకండీ Security' అన్నాడు

       అందు రేలంగి సమాధానము 'మీరు చెప్పింది నిజమే! నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా! ఆ మూడూ కూడా మా కుటుంబ సభ్యులవే! నేను పెట్టుకొన్న Party కొత్తదయినందువల్ల నాఓటు పాత పార్టీ గుర్తుకే వేసుకొన్నాను. దీనివలా ఏమి అర్థమవుచున్నది మీకు? మొత్తము Constituency నాకు విరోధులేకదా! మరి నేను ఒంటరిగా ఊరిలో తిరుగావలేనంటే

         Z-Category Security కావలసినదే కదా!' అన్నారు.

రమణారెడ్డి గారు వేసుకొన్న బట్టలు చించుకొని దగ్గరగా ఉన్న Bus-Stand వైపు పిచ్చి పిచ్చిగా అరుచుకొంటూ పరుగెత్తినారు.

రమణారెడ్డి రేలంగి - 19

రమణారెడ్డి పల్లెటూరివాడు. చెరుకు నములుతూ Train ఎక్కబోతున్నాడు. రేలంగి Ticket Examiner.

రేలంగి: మీరు తినే ఆ చెరుకు గణుపు పారవేసి ఎక్కండి. Compartment లో చెరుకు నమల కూడదు.

రమణారెడ్డి చెరుకు నములుతూనే : ఏం అక్కడ నమిలితే రసము రాదా!

రేలంగి: ???

కొనకుండా నవ్వుకొనండి – రేలంగి రమణారెడ్డి – 20

రేలంగి : రమణారెడ్డి గారూ నాకొక సలహా చెప్పండి. ఈ రోజు నేను ఒక అతి ముఖ్యమైన Party కి పోయేదుంది. అందరూ ఆశ్చర్యముగా నావైపే చూసే విధముగా ఒక కోటు పేంటు చెప్పండి.

రమణారెడ్డి: అట్లయితే Petty Coat వేసుకు పొండి. Pant అవసరము కూడా ఉండదు. అందరూ కన్నార్పకుండా మిమ్మే చూస్తారు. 

కొనకుండా నవ్వుకొనండి రేలంగి-రమణారెడ్డి -21

(ఇది స్వీయ కల్పన)

ఒకసారి, మద్రాసు వాసియగు రమణారెడ్డి ఎదో పనిమీద హైదరాబాదు రావటము జరిగింది. ఆయన దిల్షుక్ నగర్ నుండి గాచ్బౌలీ వెళ్ళుటకు దిల్షుక్ నగర్ లో బస్సు ఎక్కినాడు. కాసేపు తరువాత రేలంగి కూడా అందులోనే ఎక్కి, సీటు ఖాళీగా ఉండుటచే రమణారెడ్డి గారి ప్రక్కనే కూర్చున్నాడు. అక్కడ బస్సుకదిలింది, ఇక్కడ మాటామంతి మొదలయ్యింది. పరిచయములయినాక ఇరువురూ వేదాంతమునుగూర్చి మాట్లాడదొడగినారు.

రమణారెడ్డి: అసలు పాడుపనులు చేసేవారు ఎక్కడికి పోతారని మీ అభిప్రాయము?

రేలంగి : మీ వూరిలో ఎక్కడికి పోతారో తెలియదు కానీ

మా హైదరాబాదులో అటువంటివారు అందరూ Necklace Road కే  పోతారు.

రమణారెడ్డి గారు మళ్ళీ నోరు తెరువలేదు.


MAXIMUMMINIMUM’ (కల్పితం) -22

ఆ పాఠశాలలో రమణారెడ్డి గారు ఉపాధ్యాయుడు.

రేలంగి గారు  విద్యార్థి.

రమణారెడ్డి గారు పాఠము చెబుతున్నారు. సందర్భవశమున ‘అమ్మ’ ను గూర్చి చెప్పవలసి వచ్చింది. వారు ఇలా చెప్పడము ప్రారంభించినారు. “పూర్వపు రోజులలో తల్లిని అమ్మా అని పిలచేవారు. ఆమె అక్కయ్యను పెద్దమ్మ అని చెల్లెమ్మను పిన్నమ్మ  అని పిలిచేవారు. కాలాంతరములో పిన్నమ్మ పిన్ని అయ్యింది కానీ  పెద్దమ్మ 'పెద్ది' కాలేదు.  ఆమాట అటుంచితే అమ్మ తరువాతి కాలములో Mummy అయ్యింది. తరువాతి కాలానికి MOM అయ్యింది. Latest గా MUM అయ్యింది. అంతా ఆంగ్లమహిమయే కదా! మరి పెద్దమ్మ పిన్నమ్మలను ఏమనాలో” చేబుట్టావా రేలంగీ అని  అడిగినాడు. క్షణము కూడా ఆలస్యము లేకుండా  వెంటనే రేలంగి 'MAXIMUM' MINIMUM' అని జవాబు చెప్పినాడు.

చెరుకు రామ మోహన్ రావు

23

రమణారెడ్డి : ఏకాంతములో ఉన్నపుడు

గాడిద ఏమాలోచిస్తుందో చెప్పగలవా'

రేలంగి: “చెప్పగలను”

రమణారెడ్డి: “అయితే చెప్పు”

రేలంగి: “కాస్త టైం పడుతుంది”                        

రమణారెడ్డి: “అయితే ఏకాంతంలో ఉన్నపుడు ఆలోచించి చెప్పు”


24

రేఖాచిత్రం: కామిక్కులకు, మాజిక్కులకు రెడీ అనే రమణారెడ్డి !రేలంగి జన్మదినం సందర్భంగా డైరీలోని బహిరంగ రహస్యాలు.రేలంగిని దారిలో రమణారెడ్డి కలిసినాడు.

ర.రె.:బాగున్నారా?

అడిగీ అడక్కముందే ఆయన రేలంగి గారి పెదవులవైపు జూసి

'ఏమిటి, మీ పెదవులు నిప్పుకణికెల వలె అంత ఎర్రగా ఉన్నాయే!'

అన్నాడు.

రేలంగి 'అవి కాలినాయి' అన్నాడు.

ర.రె. ' 'అంత వేడి పెదవులు ఏ యువతీ కలిగియున్నది?'

రేలంగి 'యువతీ కాదు రైలింజను'

ర.రె. 'రైలింజనును ఎందుకు ముద్దు పెట్టుకొన్నారు?'

రేలంగి "నా భార్యను ఎక్కించిన ఆరైలు తనను పుట్టినింటికి తీసుకు పోతూ ఉందికదా, నాకు స్వతంత్రము లభింపజేసింధి కదా! అని  అని కృతజ్ఞతా పూర్వకముగా తన్మయత్వముతో ఇంజనును ముద్దుపెట్టుకోన్నాను.'

ర.రె. ???

*********************************








    😟                                                 






దాయాదులు 
'పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ దాయాదులు ' అన్నారు పెద్దలు.
ఆ విధంగా దాయాదులైన ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ ఒకరి పైనొకరు కత్తులు దూసుకోనేవారు . ఒకసారి తమ్ముడు తపస్సు చేసుకొనడానికి పోతున్నాడని తెలిసి తానూ తయారయినాడు తపస్సుకు అన్నగారు. 
ఇద్దరూ ఒక కొండ నెంచుకొని పైకి వెళ్ళినారు. తమ్ముడు కొండ అంచుకు కాస్త క్రిందనే నిలిచి తన తపస్సు మొదలు పెట్టినాడు. అన్న కాస్త పైకి చేరి తానూ తపస్సు మొదలుపెట్టినాడు.
    కొంత కాలము గడిచింది. పెద్దవానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుడు వానికి ప్రత్యక్షమైనాడు.  వరమేమి కావాలో కోరుకొమ్మన్నాడు. వాడెంతో తెలివిగా యోచించి 'మీరు చిన్న వానికిచ్చే వరానికి  రెండింతలు కావాలి' అన్నాడు . కష్టమనుకోకుండా దేవుడు చిన్నవాని వద్దకు పోయి ఏమి వరము కావలెనో అడిగితే , అన్న ఏమి కోరినాడన్నాడు. దేవుడు వాస్తవము చెప్పిన వెంటనే 'స్వామీ నాకు ఒక కన్ను పోగొట్టు' అన్నాడు .
అంతే చిన్నవానికి ఒక కన్ను పెద్దవానికి రెండు కళ్ళూ పోయినాయి.


"భార్య తెరువబోక తానూ మూసుకొన్న పెదవి
నాయిల్లే స్వర్గమవును నాదందున పై 'పదవి' "
''కొరత లేక కోరినంత ఇచ్చినచో నాకు 'మనీ'
వేరెవ్వరు నా మొగుడే నా ధన ఖని నాకు 'హనీ' '

True Love is Like Pillow

You could HUG it when you are in trouble

You could CRY on it when you are in pain

You could EMBRACE it when you are happy

You could KISS it when you get sweet memory