Saturday 31 July 2021

అజరామర సూక్తి – 317 अजरामर सूक्ति – 317 Eternal Quote – 317

 అజరామర సూక్తి  317

अजरामर सूक्ति  317

Eternal Quote  317

https://cherukuramamohan.blogspot.com/2021/07/317-317-eternal-quote-317.html

अहन्यहनि भूतानि गच्छन्तीह यमालयम् ।

शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ - महाभारतवनपर्व

అహన్య హని భూతాని గచ్ఛంతీహ యమాలయమ్ l  

శేషాః స్తావరమిచ్ఛంతి కిమాశ్చర్యమతః పరం ll

ప్రతి రోజుజీవులు యమ (మరణం) నివాసానికి వెళతారు. మిగిలిన వారు అమరత్వం కోసం 

కోరుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంటుంది ?!

పై శ్లొకముఆధారముగాఅటల్ బిహారీ వాజ్‌పేయి గారు వ్రాసిన  కవితకు నా స్వేచ్ఛా నువాదమును 

 మీ ముందు ఉంచుచున్నాను.

నిన్న ఉన్నది నేడు లేదు

 నేడు ఉండిన రేపు లేదు

ఇదియె దేవుని కాలచక్రం

 మ్రింగివేయును అగుచు నక్రం (నక్రం = మొసలి)

నిన్న ఉంటిమి నేడు ఉందుము

రేపు మనగతి తెలియకుందుము

శాశ్వతమ్మనుమాట ఒక భ్రమ

తెలియగాలవిది నిజముగా ప్రమ (ప్రమ = వాస్తవము)

సాగుచుండును సాంతమియ్యది

స్వీకరించుము నిజములే ఇది

మానవులు మర్త్యులు. కావున వారు మరణించక తప్పదు. నేడు కాకుంటే రేపు, ఏదో ఒక రూపంలో 

లేదా మరొక రూపంలో మరణాన్ని చూదవలసిందే! జీవితం యొక్క వాస్తవికత అనగా జనన 

మరణాదులు పుట్టిన క్షణం నుండే స్పష్టమైనప్పటికీజీవులు ఏదో ఒకవిధంగా ఆ సమస్య నుండి 

తప్పించుకొని కలకాలము బ్రతుకవలెననుకొంటారు. అంతకన్నా మూర్ఖత్వము ఏముంటుంది!

మనం నిజంగా ఆలోచిస్తేఅన్ని భయాలకు మూల కారణంమరణ భయం. 'తెలియని భయం

చాలా తీవ్రంగా ఉంటుంది. అది సమస్త జ్ఞానాన్ని అధిగమించి నిరంతరమూ చావును గూర్చియే 

ఆలోచింపజేస్తుంది. అజ్ఞానమే ఆనంద మనుకోనేవారికి భయమూ లేదు బాధా లేదు. జీవితము 

అంతమైన తరువాత ఏమి జరుగుతుందో తెలిస్తేభయం అంతగా పట్టుకోకపోవచ్చు. సైన్స్ 

ఎక్కువగా వివరించలేని లేదా నిరూపించలేని ఒక జటిల సమస్య ఇది. అదే తెలిస్తే ‘కరోనా’ మనల 

కలవరపెట్టదు. ఇటు scintists అటు బాబాలు, ముల్లాలు, pasters ఎవరూ ఏమీ చెప్పలేక చేయలేక 

‘కరోనా’ ను కళ్ళారా చూస్తూ మంచి కాలము రావలేనని మాత్రమే కోరుకొంటూ వున్నారు. శాస్త్రం 

రుజువును మాత్రమే నమ్ముతుంది. కానీ తత్వశాస్త్రము మొదట పూర్తిగా విశ్వసిస్తుంది మరియు 

తరువాత దాని ప్రామాణికతను గ్రహిస్తుంది! వేదాంత విజ్ఞానానికి విధానమే కీలకము. మన 

పూర్వులగు ఋషులు అన్నివిషయములపైనా, అత్యంత ఆగాహన కలిగిన అత్యున్నత శ్రేణి 

శాస్త్రవేత్తలు. కాబట్టివారి మాట మనకు శిరౌధార్యము.

 "జన్మ ఇచ్చునది జీవితం మరణము దానికి అంతం "

 अहन्यहनि भूतानि गच्छन्तीह यमालयम् ।

शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ महाभारतवनपर्व (यक्ष प्रश्न)

प्रतिदिन अनेक जीवात्माएं यमलोक जाती हैंअर्थात उनकी मृत्यु होती है तब भी शेष अमर होने

की इच्छा रखते हैं इससे बडा आश्चर्य और क्या हो सकता है !

इसी यक्ष प्रश्न को आधार लेके अटल बिहारी वाजपेयीजी ने कविता लिखी थी-

जो कल थेवे आज नहीं हैं

 जो आज हैंवे कल नहीं होंगे

 होनेन होने का क्रम,

इसी तरह चलता रहेगा,

हम हैंहम रहेंगे,

यह भ्रम भी सदा पलता रहेगा।

अपने सामने मौत का मचा यह तांडव देखके भी हृदय में कोई कौंध नहीं उठतीवैराग्य नही 

जगता।  मसलनसद्विचार के अनेक कारण मिलने पर भी सम्यक परिणमन नही होता। सोचेंहम 

क्यो चाहते हैं कि ये महामारी दूर होताकि हम फिर से अतृप्त वासनाओंकामनाओंअपने 

अहमकाम-क्रोध व मोह को जी सकें। महत्वाकांक्षाओं के नाम पे अपने स्वार्थ व लालच को पूरा 

कर सकें।  क्या है ये जो इस महान विपदा में भी लोगों को 'रेमडेसिवीरकी कालाबाज़ारी करने

100 की दाल 120में बेचनेजिंदगियों को ताक पे रखके नेताओं को चुनाव लड़ने के लिए प्रेरित 

करता है। वास्तव में ये जो भी है न ये कोरोना से भी खतरनाक वायरस है।  कोरोना देर सबेर चला 

जायेगा पर ये स्वार्थलालचअहंकार, वासनाओं और

अतृप्त इच्छाओं का वायरस आखिर कब जाएगाक्या बनेगी इसके लिए भी कोई वैक्सीनआचार्य

पूज्यपाद 'इष्टोपदेशमें लिखते हैं- विपत्तिमात्मनो मूढ़ः परेषामिव नेक्षते। दह्यमान- मृगाकीर्णवनांतर-

तरुस्थवत्।। (यानि जंगल मे लगी आग की ज्वाला से जल रहे मृगों से आच्छादित वन के मध्य खड़े 

पेड़ पर बैठे मनुष्य की तरह मूर्ख प्राणी अन्य की विपत्ति/मृत्यु तो देखता है पर अपनी विपत्ति की 

सुध नहीं लेता।)

ये विपत्ति भी एक ऐसा ही 'मेगा अलार्म' है जो हमें उस नींद से जगा रहा है जिसके आगोश में हम 

खुद को इतना बड़ा समझ बैठे हैं कि 'कोई औरव 'कुछ औरनज़र ही नहीं आता। बस अब फिर 

कहीं हम इसे झाकी लेकर न सो जाएं। 

मैं आज ज़द पे अगर हूँतो ख़ुश-गुमान न हो। 

ahanyahani bhūtāni gacchantīha yamālayam 

śeā sthāvaramicchanti kimāścaryamata param  Mahābhārata, Vana parva

All creatures go to death one by one. In spite of this, rest, who are not dead, yet wish

to live forever.

Nothing is more surprising than this, day in and day out, mortal beings see death

in one form or another.  It could be the passing of a near and dear one or road kill

on the street.  Although the reality of life rather, death is evident from the very 

moment of birth, beings want to believe that somehow they will be spared that 

trouble!  What can be a more astonishing phenomenon than that!  Isn't this denial 

the biggest wonder of the world?

If we really think about it, the root cause for all fears is, the fear of death.  Be it

claustrophobia, hydrophobia, or whatever other phobia or Karona, the main 

underlying cause is the fear that one might die in those circumstances. The 'fear of 

the unknown' is so intense that it overbears all other knowledge. One wants to 

embrace the 'ignorance is bliss' philosophy and pretend that the unknown shall 

never come to him just so he doesn't have to face that 'fear of the unknown'!  

Someone once asked, "if death meant just leaving the stage long enough to change 

costume and come back as a new character...would you slow down or speed up?"  

If one knew more about what happens after life, the fear might not be so gripping.  

This is one arena where science has not been able to explain or prove much.  

Science believes only on seeing proof.  But philosophy first believes completely and 

then perceives its authenticity!  This method of learning is the key to vedāntic 

knowledge.  Scriptures given by the rishis (sages) come to aid here.  They were 

scientists of the highest order who experienced life beyond life. So, guess there is 

some bearing to what they have written!

One day your life will flash before your eyes. Make sure it is worth watching.”

స్వస్తి.

Friday 30 July 2021

అజరామర సూక్తి – 316 अजरामर सूक्ति – 316 Eternal Quote – 316

 అజరామర సూక్తి  316

अजरामर सूक्ति  316

Eternal Quote  316

https://cherukuramamohan.blogspot.com/2021/07/316-316-eternal-quote-316.html

अनायासेन मरणं विना दैन्येन जीवनम् ।

देहान्ते तव सायुज्यं देहि मे पार्वतीपते ॥

అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనమ్‌ l

దేహాంతే తవసాయుజ్యం దేహిమే పార్వతీపతే ll

ఓ పార్వతీ పతీ! దైన్యంలేని జీవితాన్నిఅనాయాస మరణాన్నిప్రసాదించి ఆపై

నీ సాయుజ్యాన్ని అనుగ్రహించు’’ అని వేడుకొంటాడు త్రికరణ శుద్ధిగల్గిన భక్తుడు.

ఓ కపటి ‘కామిత ఫల వ్రతము’ చేసి  దేవునితో ‘‘పడిపోవుటకు సిద్ధముగా ఉన్న ఈ 

పూర్వీకుల ఇంటిని అమ్మగా వచ్చిన ధనమంతా హుండీలో వేస్తా’’ నని తన కోరికను 

విన్నవించుచుకొన్నాడు. దేవుని అనుగ్రహముతో అతడి కోరిక సిద్ధించింది. అయితే ఆ 

కపట భక్తుడు ఇంటి విలువను ఒక రూపాయిగానూ తాను పెంచుకున్న పిల్లి ధరను 

యాభై లక్షలుగా నిర్ణయించిరెంటినీ కలిపి అమ్ముతానని బేరం పెట్టినాడు. దేవుని 

దయతో ఇల్లు అమ్ముడు పోయింది. ఇల్లు అమ్ముడుపోయయిన తరువాతఇంటిలో 

ఉన్న హుండీలో ఒక రూపాయిని వేస్తూ ఇంటిని అమ్మిన ఈ డబ్బంతాఅంటే అతను ఈ 

డబ్బంతా అన్నది ఆ రూపాయకు పెట్టుకొన్న పేరు,దేవుని స్వంతం అంటూ వేసినాడు. 

ఇటువంటి వారు ‘వినా దైన్యేన జీవనం’ అన్న మాటకు అనుకూలముగా తానూ అమ్మిన 

డబ్బును గూర్చి తలచినాడుకానీ అట్టివానికి భగవంతుడు ‘అనాయాసేన మరణం’ 

ఇవ్వదని ఊహించుకోలేక పోయినాడు. అందకే ‘కాళ్ళముందు చూపు చూచుకోవద్దు’ 

అంటారు పెద్దలు

మనసు బురుద నింపి మరి దైవమును వేడు

ధూర్తజనుల కున్న దుమ్ముదులుప

తగిన చెంప పెట్టు తప్పక తానిచ్చు

పళ్ళు రాలిపోవ పరమ శివుడు

 

ఖరము గుర్రమేనాడు కాలేదని తెలియడా

కాకి కోకి లగుటన్నది కలవార్తని తలవడా

కపట పూజనములు చేయ గళరకంఠు డెరుగడా

తగిన కర్మ ఫలమునిచ్చి దండన విధియించడా!

అంతులేని ఆశలతో, కోరరాని కోర్కెలతో, సూక్ష్మములో మోక్షమొసగు సులభమైన 

పూజలతో, ఆదేవుని మభ్యపెట్టుటధికమైన ప్రయాసే! అది కేవలము పాము సగము 

నోటకరచిన కప్ప ఎదుట కనిపించే  పురుగును మింగే ప్రయత్నము చేసిన విధముగా 

వుంటుంది.

అందుకే గీతాచార్యుడు సత్కర్మాచరణ యూధమునకు

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।।  2 - 47।। అని చెప్పినాడు.

శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదుకానీ ఆ కర్మ 

ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు 

మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. అట్టి వానికి 

మరణానంతరము భగత్ సాయుజ్యము దొరుకుతుంది.

अनायासेन मरणं विना दैन्येन जीवनम् ।

देहान्ते तव सायुज्यं देहि मे पार्वतीपते ॥

हे परमेश्वर ! मुझे सहजतासे मृत्यु दैन्य रहीत जीवन और देहांतके पश्चात आपसे सायुज्य (अथवा एकरूपता )

देनेकी कृपा करें !

'सहजतासे मृत्युकी सुंदर व्याख्या महामृत्युजंय मंत्रमके द्वितीय पंक्थी में मिलती है

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||"

पकी हुई ककडीखरबुजा या पके फल जैसे अपनी डंठल सेटहनी से अपने आप अलग होते है वैसे

मनुष्य का नैसर्गिक आयुर्मान शतक पुर्णमाने अपने पूरा इस जीवन का कर्मा बंधन छूटनेके बाद

पहले नही , अवधीपुर्व - समय के पुर्व ही अपघातरोग या आपत्ती से अचानक यातनामय मरण ना दे 

प्रभु !

विना दैन्येन का आशय भी गहरा है दीनता में कई बाते अभिप्रेत है केवल दारिद्र्य ही नही जैसे मैं किसीका सहारा लेकर लाचार बनकर अपना जीवन यापन ना करूँ वृद्धावस्थामें खाना-पिनाचलना -फिरना चरितार्थ के लिए दीन ना बनुँ अतिंम क्षण तक स्वतंत्रता से जी सकु ऐसा आशीर्वाद मुझे देना !

सायुज्य परमेश्वर से एकरूपता पुर्णरूपेण समा जाना है यही हर भक्त की मुक्ती की आकांक्षा रहती है | 'हिंदीखोजशब्दकोष में मिला इसका विवरण देखीये :

सायुज्यकिसी में मिलकर उसके साथ एक होने की अवस्था या भाव। इस प्रकार पूरी तरह से मिलना कि दोनों में कोई अंतर या भेद  रह जाय। पूर्ण मिलन। पाँच प्रकार की मुक्तियों में से एक प्रकार की मुक्ति ...

anāyāsena maraa vinā dainyena jīvanam 

dehānte tava sāyujya dehi me pārvatīpate 

Death without exertion, life without affliction, your proximity (attainment of your abode) upon leaving the body - grant me these, O husband of Pārvati!

Upon being asked 'what do you want?’ there may be a plethora of wishes one wants to ask for.  A big house, a bigger bank balance, plentiful youth, good children, lots of friends, good health and the list can be endless!

But, the author of this verse has very simple, yet profound and eternal wishes to ask for!

No matter how many riches one is showered with if he is enduring a painful existence in his body, who would not want to be liberated from that pain?!  The best ambiences and the greatest food will prove repulsive for someone who is suffering from pain of any kind - it could be physical pain, being on life support, etc., or a mental affliction as well.  Everyone wants to live a fruitful and satisfying life and pass away peacefully without much effort, exertion or toil.  This is certainly something to pray for!

While living, there can be multitudes of scarcities - there are places where there is not enough drinking water, enough food to eat or a shelter to sleep under.  Such scenarios are not pleasant and one would want to be released from the affliction of any kind of poverty.  This is surely something to pray for so that goals can be pursued without strife.

Throughout our lives, we are taught to engage in good deeds so that we are liberated from the bondage of birth and death.  Attaining this is the final goal for everyone.  If one is granted the abode of the Lord Himself, a merger with the Lord of Pārvati and being one with Paramashiva Himself, what more would one ever want?!!

Think about it...  Aren't these the aspects one should contemplate upon and ask for?!

స్వస్తి.

Wednesday 28 July 2021

అజరామర సూక్తి – 315 अजरामर सूक्ति – 315 Eternal Quote – 315

 అజరామర సూక్తి  315

अजरामर सूक्ति  315

Eternal Quote  315

 https://cherukuramamohan.blogspot.com/2021/07/315-315-eternal-quote-315.html

नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः ।

विक्रमार्जितवित्तस्य स्वयमेव मृगेन्द्रता ॥ - हितोपदेशसुह्रुद्भेद

నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః l

విక్రమార్జిత విత్తస్య స్వయమేవ మృగేంద్రతా ll  హితోపదేశము- సుహృద్భేదము

జంతువులలో, పట్టాభిషేకము మరియు వివిధ విధములగు సంస్కారములచేత 

సింహమును రాజును చేయుట లేదు. అది కేవలము తన సహజ  పరాక్రమము 

కారణముగా తమకు కావలసిన మేరకు అరణ్యమును స్వాధీనములో ఉంచుకొని 

అడవికి రాజుగా గుర్తింపబడుతూ వుంది. అది తన చేతలచేతనే తన ఆధిక్యత 

నిరూపించుకొంటూ వున్నది.b అందుకే పెద్దలంటారు ‘చెప్పడం కన్నా చెయ్యడం మిన్న’ 

అని.

అడవిలో గంభీరంగా తిరుగుతున్న సింహానికి కిరీటధారణా సంరంభము లేదుఇతర 

జంతువులు అదొక ప్రత్యేక కార్యక్రమముగా ప్రకటించి సంబరాలు జరుపుకొనుటయూ 

లేదు.  సింహమును వనరాజుగా ఎవరూ  ప్రకటించాల్సిన అవసరము లేకుండానే. ఆ 

జంతువు యొక్క శక్తిధైర్యంశౌర్యం మరియు నిర్భీతిని తమకు తాముగా  

తెలుసుకొని, తమ ఏలికగా గుర్తించుతూ ఉన్నాయి.  కారణమూ మన లో గల లక్షణములను, సంఘములో మన చుట్టూ ఉన్నవారు జాగ్రత్తగా  పరిశీలించుతూ ఉన్నారు. ఆ విషయమునెరింగి, మానవులమైన మనము జాగ్రత్తగా సద్గుణ సంపన్నత సాదించితే సమాజముచే గౌరవింపబడుతాము.

మన పనిలోని నాణ్యత మాట అటుంచి, ధైర్యముధర్మముఔదార్యముపాండిత్యము 

ప్రతిభ కలిగివుంటే తమ చుట్టూ వున్నా పౌరులు మనలను నిర్ద్వంద్వముగా తమ కన్నా 

మిన్నగా, తమ ప్రభువుగా తలపోసెదరు.

కావున మాట్లాడవలసినది మనము కాదు మన చేతలు.

नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः ।

विक्रमार्जितवित्तस्य स्वयमेव मृगेन्द्रता ॥ - हितोपदेशसुह्रुद्भेद

जानवरों में कोई राज्याभिषेक या अनुष्ठान नहीं किया जाता हैप्राकृतिक कौशल के कारण जो क्षेत्र का अधिग्रहण करता है वही  जंगल का राजा बनाता है। इ सारे गुण सिर्फ शेर को ही रहते हैं l उसीलिए वह वनचरों का राजा मानाजाता है l

कथनी की तुलना में करनी ज्यादा असरदार होती है!

जंगल में भव्य रूप से घूमते हुए एक शेर का  तो ताज पहनाया जाता है और  ही उसके लिए अन्य जानवरों द्वारा कोई अनुष्ठान या उत्सव मनाया जाता है । वास्तव में उसे जंगल का राजा घोषित करने की भी आवश्यकता नहीं है। अन्य सभी जानवर उसकी शक्तिसाहसवीरता और निडरता से जानते हैं और मानते हैं कि वह सही राजा हैऐसा हमारे कार्यों का प्रभाव होना चाहिए

गुण जो भी होवीरताधर्मपरायणताउदारताबड़प्पन, पान्दितीप्रकर्षा, और बुद्धिजरूर रहना चाहिए l  केवल भाषण के बजाय उसके संबंधित कार्यों के माध्यम से अपनी योग्यता व्यक्त किया जाना चाहिए

कार्यों को अपने लिए बोलने दें!

nābhieko na saskāra sihasya kriyate mgai 

vikramārjitavittasya svayameva mgendratā ॥ - hitopadeśa, suhrudbheda

No coronation or ritual is done by animals; Acquisition (of territory) due to natural 

prowess makes him King of the jungle.

Actions speak louder than words!

A lion majestically roaming in the jungle did not have a crowning ceremony, nor 

were any rituals performed by the other animals for him. He doesn't even have 

to be declared as the King of the Jungle. All the other animals know by his 

power, courage, valor and fearlessness that he is the rightful king! Such should 

be the effect of our actions.

Whatever be the quality: bravery, piety, generosity, nobility, or intelligence, the 

asset should be expressed through its respective deeds rather than just speech.

Let actions speak for themselves!

స్వస్తి.