Friday 30 April 2021

అజరామర సూక్తి – 224 अजरामर सूक्ती - 224 Eternal Quote – 224

 

అజరామర సూక్తి  224

अजरामर सूक्ती -  224

Eternal Quote – 224

https://cherukuramamohan.blogspot.com/2021/04/224-224-eternal-quote-224.html

वृथा वृष्टिः समुद्रेषु वृथा तृप्‍तस्य भोजनम् ।

वृथा दानं समर्थेभ्यः वृथा दीपो दिवापि च ॥ - सुभाषितरत्नसम्मुच्चय

 

వృథా వృష్టి: సముద్రేషు | వృథా తృప్తస్య భోజనమ్‌ |

వృథా దానం సమర్తేభ్యః | వృథా దీపో దివాపిచ || - సుభాషిత రత్న సముచ్ఛయ

సముద్రాలపై కురిసిన వర్షాలూ, తృప్తిగా కడుపు నిండిన వానికి భోజనమూ, సిరి సంపదలతో తులతూగే ధనవంతునికి దానమూ, అలాగే పట్టపగలు దీపము వెలిగించుట వ్యర్థములే.

కాబట్టి దీనులకే దానధర్మాలు చెయ్యాలి, కడుపు నిండిన వారికి కాదు. ఈ భావాలన్నీ వివరించే భర్తృహరి శ్లోకం చూడండి.

తృష్ణాం ఛి౦ది భజక్షమాం జహి మదం పాపే రతిం మా కృథా:

సత్యం బ్రూహ్యపయాహి సాదుపదవీ౦ సేవస్వ విద్వజ్జనం

మాన్యాన్మానయ విద్విషోప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయం

కీర్తిం పాలయ దు:ఖితే కురు దయామేతత్సతాం చేష్టితం

ఓ మానవా! అవసరమునాజు మించిన కోరికలు త్యజించు. సర్వ శ్రేష్ఠమైన సహనమును అలవరచుకో! పాపకర్మలపై మనసు పోకుండా చూచుకో! నిజాము నిజాయితీని పుణికి పుచ్చుకో! సత్ శీలుర మార్గామునే అనుసరించు. విద్వాంసుల సేవను మరువకు. గౌరవము పొందదగ్గ వ్యక్తులను తప్పక గౌరవించు. శత్రువులను కూడా నీ నడవడికచే అనుకూలముగా ఉంచుకొనవచ్చును. నీవు దీనికోరకోరకు చేసేది త్రికరణ శుద్ధితో కూడిన ప్రయత్నము మాత్రమే! వినయము విడువగూడని సంపద. అదే నీకు శ్రీకరము శుభకరము. నీ గుణములచే ప్రతిష్ఠ పొందవచ్చును, కానీ నిరంతరమూ దానిని కాపాడుకో! ఆర్తులను సర్వకాల సర్వావస్థల యందునూ ఆదుకో!  ధర్మాచరణమంటే ఇదే! దీనిని మనము స్వంతము చేసుకోగలిగితే నిజమైన సజ్జనులమౌతాము.

భాస్కర శతక కారుడు ఈ విధముగా చెబుతున్నాడు.

సిరగల వానికెయ్యెడల చేసిన మేలది నిష్ఫలంబగున్‌

నెఱి గుఱిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్‌

వఱపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటన్‌

కురిసినగాక అంబుధులకుర్వగ ఏమి ఫలంబు భాస్కరా!

మనం ఎన్నో దానధర్మాలు చేస్తూ ఉంటాము. చేసేటప్పుడు పుచ్చుకునే వాడికి యోగ్యతా ఉందా లేదా అని విచారి౦చ౦. ఉన్నవాడు లేనివాడు కూడ ఉన్నవాడికే పెట్టాడు అన్న మాదిరిగా మనం మనకంటే ఉన్నతంగా ఉన్నవాడికి దానధర్మాలు చేస్తాం, లేనివాడికి చెయ్యం. ఎ౦దుకంటే ఉన్నవాడికి చేస్తే మనకు గౌరవం లభిస్తుందని, మనకెప్పుడైన ఆ వ్యక్తి ఉపయోగపడతాడని మన భావన. కాని ప్రతిఫలాన్ని ఆశించి చేసే ఏ దానమైన లేక సహాయమైన సరైందనిపించుకోదు.

కలిమి గల లోభికన్నను

విలసితముగ పేద మేలు వితరణియైనన్

చలి చెలమ మేలుకాదా

కులనిది అంబోధికన్న గువ్వలచెన్నా!

(చలి చెలిమె అంటే నదీ తీరము లోని నెమ్ము గల ఇసుకను కాస్త త్రవ్వి ఒక వెడల్పయిన గుంత చేస్తే అందులో అమృత తుల్యమైన నీటియూట చూడవచ్చును. ఆ త్రవ్వబడిన గుంత లేక గుంటను 'చలి చెలమ' అని అంటారు.

డబ్బు కలిగీ వితరణ అంటే దానపరత్వము లేని లోభికంటే సాయపడే మనసున్న పేద ఎప్పటికీ మేలు. ఉప్పునేరు తో ఉండే సముద్రము కంటే అతి చిన్నదయినా మంచినీరిచ్చే చెలమ ఎంతో మేలు కదా!

అందుకే శ్రీశంకరాచార్యులవారు ‘దేయం దీనజనాయ చ విత్తం’ అన్నారు. అంటే దీనజనులను అవ్యాజముగా ఆదుకో!

वृथा वृष्टिः समुद्रेषु वृथा तृप्‍तस्य भोजनम् ।

वृथा दानं समर्थेभ्यः वृथा दीपो दिवापि च ॥ - सुभाषितरत्नसम्मुच्चय

 

समुद्र में होने वाली वर्षा का कोई महत्व नहीं होता, क्योंकि उसका जल किसी उपयोग में नहीं  

पाता और व्यर्थ ही बह जाता है पेट भर खाना खाने के बाद तृप्त हुए व्यक्ति को भोजन कराने का 

कोई महत्व नहीं धनवान व्यक्ति को दान देने का कोई महत्व नहीं और सूर्य के प्रकाश में दीया 

जलाने का कोई महत्व नहीं

 अर्थात, कहने का तात्पर्य है कि जरूरतमंद के काम आने का महत्व है समर्थ व्यक्ति की सहायता 

करने का कोई लाभ और महत्व नही होता

जगद्गुरु शंकराचार्यजी से कहागया इस श्लोक को देखीए :

तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृथा:,

सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्य विद्वज्जनम्

मान्यान्मानय विद्विषोअप्यनुनय प्रख्यापय प्रश्रयं,

कीर्तिम् पालय दु:खिते कुरु दयामेतत्सतां लक्षणम्।।

 हे मानव!तृष्णा का त्याग करो, क्षमा धारण करो, अभिमान छोड़ो, पाप कर्म में आसक्ति करो

सत्य बोलो, सज्जनों के मार्ग का अनुगमन करो, विद्वज्जन की सेवा करो, सम्मानीय जनों का सम्मान 

करो, शत्रुओं को भी अनुकूल रखो, नम्रता प्रदर्शित करो, यश की रक्षा करो और दुःखीजनों पर दया 

करो। यही धर्माचरण होता है

और इस हमें अपनाना है और तभी तुम सज्जन कहलाते हो l

vthā vṛṣṭi samudreu vthā tp‍tasya bhojanam

vthā dāna samarthebhya vthā dīpo divāpi ca

- subhāṣitaratnasammuccaya

 Rain on the ocean is futile; feeding the satiated is in vain; bestowal to an able person is unnecessary; lighting a lamp in sunlight is useless.

 When performing deeds, one should be aware of their usefulness.  Although the deed is performed in good faith, the recipient should be worthy of it as well. Money given as charity to the needy cannot be equated to money given to the already wealthy!

 Similarly,

1. The cool fresh waters of rain go futile when showered on the salty ocean. There is more than sufficient water in an ocean in the first place, and the rain water won't make the water any less salty. Hence, it is a futile effort. But the same rainwater on a desert will be very welcome.

 2. Feeding the already fed: even if an elaborate menu is laid out in front of them, they wouldn't be in a position to enjoy it. The needy and hungry are the ones who know the value of food; they should be fed instead.

 3. Giving charity to the already rich and well-to-do doesn't even make sense!

 4. What is the use of lighting a lamp during broad daylight when the Sun is shining bright? There is no requirement.

 Such should be one's deeds; in the right place, at the right time. Be judicious.

స్వస్తి.

 

No comments:

Post a Comment