Wednesday 14 April 2021

అజరామర సూక్తి – 207 अजरामर सूक्ती - 207 Eternal Quote – 207

 అజరామర సూక్తి  207

अजरामर सूक्ती -  207

Eternal Quote – 207

https://cherukuramamohan.blogspot.com/2021/04/207-207-eternal-quote-207.html

स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्नानि वसन्ति देहे ।

दानप्रसङ्गो मधुरा  वाणी देवार्चनं ब्राह्मणतर्पणं  ॥ चाणक्य नीति

స్వర్గస్థితానామిహ జీవలోకే చత్వారి చిహ్నాని వాసంతి దేహే l

దానప్రసంగో మధురాచ వాణీ దేవార్చనం బ్రాహ్మణ తర్పణం చ ll


సమాజంలో ఏకాలంలోనైనా పేదలుఉపేక్షితులుబాధితులు ఉంటారు. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అయితే ఆదుకోవడానికి ప్రధానంగా కావలసింది మంచి మనస్సుధనం. ఈ రెండు కలిగిన వాళ్లు మాత్రమే దాతలుగా పేరు పొందగలరు.

మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు. పాత్రత తో సంబంధము లేనిదానము అన్నదానము.

ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

దానమును గూర్చి ఈ చక్కనయిన చిన్న కథ చదవండి:

దానము యొక్క గొప్పతనము

 

ఒకసారి రాజుగారు గురువుగారిని మెచ్చి, వారికి పట్టుబట్టలను బహుమతిగా ఇచ్చినాడు. గురువు వాటిని తీసుకుని ఇంటికి వెళ్తుండగా దారిలో చలికి వణుకుతున్న ఒక బిచ్చగాడు కనిపించినాడు. గురువు తన వద్ద ఉన్న పట్టువస్త్రాలు తనకన్నా ఆ బిచ్చగాడికే బాగా ఉపయోగపడతాయనితన చేతిలో ఉన్న పట్టు బట్టలను బిచ్చగాడికి ఇచ్చేవేసినాడు.

మరునాడు రాజు నగర సందర్శనకు వెళ్లినపుడు అనుకోకుండా తానూ గురువుకు ఇచ్చిన పట్టువస్త్రాలను ధరించిన బిచ్చగాణ్ణి చూసి, రాజుగారికి చాలా కోపమొచ్చింది. ఎట్లో ఆవేశమును అణచుకొన్నాడు.

 కొద్ది రోజుల తరువాత రాజు గారు మళ్లీ గురువుకు బహుమతిగా ఒక బంగారు కడియాన్ని బహుమతిగా ఇవ్వడము జరిగింది. కానీ గురువుగారు ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయలేక ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తికి ఇచ్చినాడు. వేగుల ద్వారా ఆ విషయం తెలిసిన రాజుగారు  కోపాన్ని పట్టలేక వెంటనే గురువుగారిని పిలిపించి ‘మీ మీద గౌరవంతో మీకు బహుమతులు ఇస్తుంటే వాటిని మీరు అందరికీ దానంగా పంచి పెట్టడం అనేది ఏమంత పద్ధతిగా లేదు’ అని కోపపడినాడు.

అందుకు గురువు “రాజా! దానం చేయడమంటే ఆ వస్తువు మనది కాదు అని త్రికరణ శుద్ధిగా తలంచి ఇతరులకు ఇవ్వటమే దానము". దానము తీసుకొన్న వ్యక్తితాను దానం ద్వారా పొందిన ఆ వస్తువును ఏమి చేసినా ఆవస్తువుకు, దానిని మొదట ఇచ్చిన దాతకు సంబంధం ఉండదు.

అందుకే అన్నారు పెద్దలు "నీవు కుడిచేత్తో చేసే దానం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు" అని. అలాగే "నీవు ఎప్పుడు చేసిన దానాన్ని అప్పుడే మరచిపోవాలి " అని.

ప్రియ భాషణము

మనసుకు సంతృప్తి, ఇటు మాట్లాడే వానికి అటు వినే వానికి, కలిగించునదే సుభాషణము.

నేను వ్రాసిన ఈ రెండు పద్యములను చదవండి.

మనసు మాటలోన మాటేమొ పనిలోన

పనికి పట్టుదలను పదిలపరచి

కష్ట పడెడు వాడు కడు గొప్ప వాడురా

రామ మొహనుక్తి రమ్య సూక్తి

 

పాటకు పల్లవి ప్రాణము

ఆటకు ‘లయ’యౌను ప్రాణమాలోచింపన్

మనిషికి నడతే ప్రాణము

మాటకు ప్రాణమ్ము’నిజము’మరువకు రామా!

అంటే మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట. త్రికరణములు అంటే మనోవాక్కాయకర్మలు. భావము మొదట మనస్సులో కలుగుతుంది. అది వాకు ద్వారా బహిర్గతమౌతుంది. దానిని క్రియారూపమున పెట్టె కర్మమునాచరించితే మనము ఒక కార్యమును బాహ్యాభ్యన్తరశ్శుచితో చేసినట్లు. అప్పుడే మనసుకు తృప్తి,మనిషికి ఆనందము.

'పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్అన్నది భర్తృహరి వచనము. మాట గొప్పదనము వెలకట్టలేనిది.

తుంబురుడు, బాహు, హాహా హూహూ వీరు కశ్యప ప్రజాపతికి ప్రధకు జన్మించిన పుత్రులు. పురాణములలో ప్రియ భాషణమునకు వీరు పెట్టినది పేరని కొనియాడబడినది.

భక్తి

భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తి మార్గాలు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా

క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్

'పై శ్లోకాలను పోతన తెనిగించిన విధం

తను హృద్భాషలసఖ్యమున్శ్రవణమున్దాసత్వమున్వందనా

ర్చనముల్సేవయునాత్మలో నెఱుకయున్సంకీర్తనల్చింతనం

బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

పైన చెప్పిన 9 మార్గాలను అనుసరించిముక్తి పొందిన మహా భక్తులను ఈ దిగువ గమనించండి.

శ్రవణ :

సత్‌పురుషుల వాక్యాలుసత్‌గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది.  పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందినాడు.

 

కీర్తన :

భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకినారదుడుతుంబురుడు,త్యాగయ్యశ్యామ శాస్త్రిముత్తుస్వామి దీక్షితులు  మొదలైన వారు కీర్తన భక్తితో మోక్షం పొందినారు.

 

* స్మరణ  :

భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి.. ఎందఱో ఋషిమునులుప్రహ్లాదుడుధ్రువుడుతులసీదాసుమొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

 

* పాదసేవన :

భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్రసేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడుగుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.

 

* అర్చన భక్తి :

ప్రతిరోజు తులసి పుష్పాదులుఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. విదురుడుఅక్రూరుడుమొదలగు వారు ఇందుకు ఉదాహరణ.

 

వందన :

వందనం అంటే నమస్కరించడం. తనయందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుమనినమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోదించాడు. ఎన్ని యాగాలు చేసినాశాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు. ధర్మరాజు ఇందుకు చక్కని ఉదాహరణ.

 

* దాస్య భక్తి :

ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునికు ఎల్లప్పుడు సేవకుడైహనుమంతుడులక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందినారు.

 

* సఖ్య భక్తి :

సఖ్యం అనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడుసుగ్రీవుడుసుదాముడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

 

* ఆత్మ నివేదన లేదా ప్రపత్తి :

ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప ఇంకెవరూలేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతిగజేంద్రాదులు ఇందుకు చక్కని ఉదాహరణ.

బ్రాహ్మణ సంతర్పణ

తాను నిరంతరం చదువుకుంటూ వుండడంశిష్యులకు బోధించడంయజ్ఞాలు చేయడంయజమానులతో చేయించడందానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు.

ఒక నాటి పౌరోహిత్యంపూజారి జీవితంఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థపలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది.

రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగాదారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. లోక కళ్యాణము ఆత్మ  సాక్షిగా కోరే ఒక బాపనికి స్వయంపాకము దానము చేయలేమా!


स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्नानि वसन्ति देहे ।

दानप्रसङ्गो मधुरा  वाणी देवार्चनं ब्राह्मणतर्पणं  ॥ चाणक्य नीति

 

दान

दान के बारे में, मेरे ख़याल में, रहीम के ए दो दोहे काफी है l पढ़िए l

रहिमन दानि दरिद्रतर तउ जांचिवे योग

ज्यों सरितन सूखा परे कुआॅ खनावत लोग ।

यदि दानी ब्यक्ति अत्यधिक गरीब हो जाये तब भी वह याचना करने योग्य रहता है।

इश्वर उसके पास कुछ न कुछ देने के योग्य रहने देते हैं।यदि नदी सूख जाता है

तो लोग उसमें कुआॅ गडढा खोेदकर जल प्राप्त कर लेते हैं।

तब हैंा लो जीबो भलो दीबेा हेाय न धीम

जग में रहिबो कुचित गति उचित न होय रहीम ।

तभी तक जीना अच्छा है जब तक खूब दान दे सकें।जब दान देने की शक्ति खत्म हो

जाये तो मर जाना हीं उचित है।बिना दान दिये संसार में जीना ब्यर्थ है।

प्रिय वादन

ऐसी वाणी बोलिए मन का आपा खोए l

औरन को सीतल करे आपहू सीतल होए ll

आप का वचन कभीभी ऐसा रहना चाहिए की उस में आपका घमंड एक रत्ती भी न हो और उस से आ भी मिठास पाए और ओ भी जो आप के बातें सुन रहे हैं l

मीठी वाणी बोलनाकाम नहीं आसान।

जिसको आतीं हैं ये कलाहोती वहीं सुजान। ।

मधुर वाणी बोलना आसान बात नहीं है वह एक कला है जो अच्छी तरह वह सीखता है वही सज्जन कहलाता है l

भक्ती

पाँच पहर धन्धे गयातीन पहर गया सोय ।

एक पहर हरि नाम बिनुमुक्ति कैसे होय ॥

प्रतिदिन के आठ पहर में से पाँच पहर तो काम धन्धे में खो दिये और तीन पहर सो गया । इस प्रकार तूने एक भी पहर हरि भजन के लिए नहीं रखाफिर मोक्ष कैसे पा सकेगा ।

रात गंवाई सोय केदिन गंवाई खाय ।

हीरा जनम अनमोल थाकौड़ी बदले जाय ॥

रात तो सोकर गंवा दी और दिन खाने-पीने में गंवा दिया । यह हीरे जैसा अनमोल मनुष्य रूपी जन्म को कौड़ियो मे बदल दिया ।

ब्राह्मण

जो नेक ब्राह्मण होताहै वह दूसरों का भलाई चाहता है l राजा के बिना किसी के यहाँ भीक नहीं माँगता l निजी ब्राह्मण हर समय विश्व कल्याण ही चाहता है l वैसे लोगों को भूक रखना महा पाप होता है l सीलिए वैसे लोगू आदर पूर्वक चावल, सब्जी, दाल, इमली, नमक आदी सारे वस्तुएं देकर उनका भोजन का इन्ताजाम करनाहै l सच्छा ब्राह्मण दिनरात लोककल्याण की चिंता ही करता है l एक सच्चे ब्राह्मण के बारे में ये चार पंक्तियाँ देखी l

ब्राह्मण सिर्फ मंदिर में पूजा करता हुआ पुजारी नहीं है,

ब्राह्मण घर-घर भीख मांगता भिखारी नहीं है।

ब्राह्मण गरीबी में सुदामा-सा सरल है,

ब्राह्मण त्याग में दधीचि-सा विरल है।

 

 

svargasthitānāmiha jīvaloke catvāri cihnāni vasanti dehe 

dānaprasago madhurā ca vāṇī devārcana brāhmaatarpaa ca 

cāṇakya nīti

There are 4 signs of a person in heaven even while living in this world - giving, pleasant words, worshipping the Lord and satiating (the hunger) of a vidvān (learned person).

It is in one's own hands to make life a living hell or heaven. One doesn't have to wait to pass on to see heaven. His life can be as blissful as being in heaven if he inculcates these 4 attributes -

Giving - Sometimes a small thing given can mean everything in someone's life! True giving is when you give your all and yet feel like it was nothing! These are truly blissful feelings.

Pleasant words - Someone once asked, “If someone were to pay you 10 cents for every kind word you ever spoke and collect 5 cents for every unkind word, would you be rich or poor?” Words are the keys to another's heart! Blessed are those who are measure rich on this scale!

Worshiping the Lord - When every action is an offering to the Lord, there is nothing much he needs to do after that. He is just as close to God as he would be in heaven.

Satiating the hunger of a vidvān (learned one) - Why specifically a vidvān? Why should his hunger be satisfied? In those days, a brāhmaa was generally given the responsibility of giving knowledge to people. He would roam from place to place propagating his learning. He would not be equipped to make his own meals at home, so satiating his hunger means contributing to the propagation of knowledge! Such a person is happy for doing his share for the society.

A person involved in these 4 kinds of actions is in virtual heaven. In his mind, he is as happy as being in heaven even with his breathing spirit still in the body!  It is not about going to heaven after passing on, but living in heaven here and now!

Find your own heaven. Do good, feel good!

స్వస్తి.

No comments:

Post a Comment