Saturday 1 May 2021

అజరామర సూక్తి – 225 अजरामर सूक्ती - 225 Eternal Quote – 225

 అజరామర సూక్తి  225

अजरामर सूक्ती -  225

Eternal Quote – 225

https://cherukuramamohan.blogspot.com/2021/05/225-225-eternal-quote-225.html

मूलं भुजङ्गैः शिखरं प्लवङ्गैः

शाखा विहङ्गैः कुसुमानि भृङ्गैः ।

श्रितं सदा चन्दनपादपस्य

परोपकाराय सतां विभूतयः ॥

మూలం భుజంగైః శిఖరం ప్లవంగైః

శాఖా విహంగైః కుసుమాని భృంగైః l

శ్రితం సదా చందన పాదపస్య

పరోపకారాయ సతాం విభూతయః ll

తరు మూలమున పాములు, తరు శిఖరమున పక్షులు ఒకవేళ కొమ్మలలో చూద్దామా అంటే పక్షులు, పూవులపైనేమో తేనెటీగలు ఇన్ని, ఇన్ని విధాల నిన్నిబ్బంది పెడుతూ వున్నా సుగంధములీను తావులను మాదరి జేర్చేడు గంధ సాలమా మేము పరోపకార పారీణత అన్నది నీనుండీ కదా నేర్చుకోనవలసినది.

ఈ దిగువన నేరు వ్రాసిన పద్యమున అరటి చెట్టు యొక్క గొప్పదనము, ఆచేట్టుయొక్క లోకోపకార గుణములను వర్ణించుటయే గాక తన అవతార కారణము ముగియగానే తనువూ చాలించిన శ్రీ కృష్ణుని వలె తానూ కూడా తన మాలి ఋణము తీర్చుకొని ప్రాణములర్పించుచున్నది అన్న ఒక శ్రేష్ఠ సద్గుణము వర్ణించబడినది. ప్రాణములర్పించకున్నా , అంతో ఇంతో ఎంతో కొంత మనము కూడా లోకహితము కొరకు మనవద్ద మిగిలిన దానిలో ఉపయోగించవచ్చును కదా! పద్యము చదవండి.

ఆకులు భోజనమ్మునకు ఆనక కాయలు దూట(బొందె) మొగ్గలున్

ఆకొను వారికన్నమున కాదరుఔ ఆనుపాన సంపదల్

నాకము తాకనిచ్చు బహు నాణ్య ఫలంబుల నిచ్చి పెళ్ళిలో

చక్కని శోభగూర్చతవ స్కంద నికాయము నిచ్చి యక్కటా

గైకొన జేతువే  చపల కాయము నీ వనమాలికిచ్చుచున్

ఏ కడ నీదుసద్గుణము లేవిధి నబ్బును మాకు గాంచగన్

సాకినవాని దౌ ఋణము సాంతము దీర్చెడు సారభూజమా

ఓ కలితా గుణాంబుధి సదంచిత మూర్తి నమస్కరించెదన్

పై పద్యము అరటి చెట్టు యొక్క సద్గుణ వర్ణన.

ఇక్కడ ఇంకొక విషయము చెప్పవలసి యున్నది. యాదృచ్ఛికముగా పైనతెలిపిన శ్రీగంధపు చెట్టును నేను ఈశ్వరుని పోల్చుటకు 2017లోనా  ‘శంకరదాస అష్టోత్తర శతి’ పద్య శతకములో శంకరునికి పోలుస్తూ వర్ణించుట జరిగినది. సందర్భమునకు తగినదిగా భావిన్చుతూ మీ ముందుంచుచున్నాను. ఈ వ్యాఖ్య వ్రాసిన వారు Dr. నాగరాజారావు గారు M.A. Ph.d. గారు.

పాదులలో భుజంగములు అనే 49వ పద్యం లో పాములు, (ఇవి ప్రమాద కారులు) పక్షులుకోతులు (ఇవి చంచల స్వభావము కలవి) పూవులుతుమ్మెదలు (మనోరంజకమైనవి)వీనితో కూడిన శ్రీగంధపు చెట్టు అని శంకరుణ్ణి పోల్చారీకవి.  శ్రీ శంకరాచార్యులవారి శివానంద లహరి లోని ‘సదా మోహాటవ్యాం ......’(20 వ శ్లోకం) ‘చందశ్శాఖీ.....’ (45 వ శ్లోకం)  అనే శ్లోకాల భావచ్ఛాయలందులో వున్నాయి .  శ్రీ శంకరులవారి వైదిక తాత్విక సాహిత్యంపై వీరికున్న భక్తికి ప్రీతికి ఇది ప్రతీక. పద్యము యొక్క పూర్తి పాఠము ఈ దిగువ చూడండి.

49. పాదులలో భుజంగములు పైన విహంగములుండ,గాంచగన్

మోదముతోడ మర్కటపు మూకలు కొమ్మలపైన , పుష్పముల్

స్వాదు మరంద పానమున సంతసమందెడు బంబరాళి బల్

సందడి జేయునట్టి తిరు చందన భూజము నీవు శంకరా!

కావున తప్పక పరోపకారమును అలవరచు కొందాము. ఆ భగవంతునికి ప్రీతీ పాత్రులమౌదాము.

मूलं भुजङ्गैः शिखरं प्लवङ्गैः

शाखा विहङ्गैः कुसुमानि भृङ्गैः ।

श्रितं सदा चन्दनपादपस्य

परोपकाराय सतां विभूतयः ॥

मूल  नागों का आवास हैंशीर्ष बंदरों का निवास हैशाखाएँ (भरी हुई हैंपक्षियों के स्थावर हैंफूलों मधुमक्खियों का बसेरा है l जैसे कि ये सभी प्राणी  एक चंदन के पेड़ पर स्थित हैंउसी तरह महापुरुष जोभी करते हैं ओ अपने स्वार्थ केलिए नहीं बल्कि दूसरों के भलाई केलिए करते है l यही गुण

उन का धन है

यहाँ के चन्दन के पेड़ का सद्गुण वर्णन कियागया है। वृक्ष  केवल अपने परिवेश को सुगंध देता हैबल्कि यह अन्य प्राणियों की जमावट का भी आयोजन करता है। सांप जड़ों से प्यार करते हैंबंदर शीर्ष पर बैठते हैंपक्षियों की एक अनंत संख्या आरामदायक शाखाओं में अपना घोंसला बनाती हैऔर फिर मधुमक्खियां हैं जो इसके फूलों के प्रति आकर्षित हैं। चंदन के पेड़ का अस्तित्व दूसरों के लाभ के लिए है। ऐसा ही नेक का स्वभाव है। चन्दन साल परोपकारपारीणतापरहितवाद का एक संपूर्ण और अनोखा आदर्श है। वे जो कुछ भी करते हैं वह दूसरों की भलाई के लिए होता है। परोपकार (परा-अपकरा - दूसरों की मदद करनाउनका परिभाषित गुण है

निस्वार्थ कर्म ही मानव को 'महानबनाते हैं!

mūla bhujagai śikhara plavagai

śākhā vihagai kusumāni bhṛṅgai 

śrita sadā candanapādapasya

paropakārāya satāṃ vibhūtaya 

 At the base there are serpents; at the top there are monkeys; branches (are filled) with birds; flowers (are filled) with bees; (just) as all (these creatures) are situated on a sandal tree, similarly benevolence is the wealth of the noble.

The description of the sandal tree here is very vivid. The tree not only gives fragrance to its surroundings, but it also hosts a hoard of other beings. Snakes love to dwell by the roots; monkeys sit on the top; an infinite number of birds make their nests in the cosy branches; and then there are bees who are attracted to its flowers. The sandal tree's very existence is for the benefit of others. Such is the nature of the noble. Altruism is engrained in them. Everything they do is for the good of others. Paropakāra (para-upakāra - helping others) is their defining trait.

Selfless pursuits are what make the human, 'noble'!

స్వస్తి.

No comments:

Post a Comment