Thursday 8 April 2021

అజరామర సూక్తి – 202 अजरामर सूक्ती - 202 Eternal Quote – 202

 

అజరామర సూక్తి 202

अजरामर सूक्ती -  202

Eternal Quote 202

https://cherukuramamohan.blogspot.com/2021/04/202-202-eternal-quote-202.html

तत्कर्म यन्न बन्धाय सा विद्या या विमुक्तये

आयासायापरं कर्म विद्याऽन्या शिल्पनैपुणम् - विष्णुपुराण

తత్కర్మ యన్నబంధాయ సా విద్యా యా విముక్తయే l

ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్ప నిపుణమ్ ll

బంధ హేతువు కాని కర్మయే కర్మ. ముక్తికి చేరువ చేసేదే విద్య. ఎంతో శ్రమ పడి ఏడంభము, జంభము, దో సాధించినామని తలచి అహంకరించునది కేవలము నైపుణ్యము అని మాత్రమే చెప్పనగును.

నేను వ్రాసిన ఈ పద్యమును ఒకపరి పరికించండి.

టేబులు నట్టు బిగించిన

డాబుల రాయుండు తాను డబ్బాకొట్టెన్

ఈ బరువు పనులు జేయగ

ఏ బలశాలులకు జెల్లు ఎన్నగ రామా!

ఆ వ్యక్తి చేసినది అత్యంత అల్పమైన పని. కానీ చెప్పేది మాత్రము అంత గొప్ప పని తనకు తప్ప అన్యులకు సాధ్యము కాదని. ఇక్కడ ఆవ్యక్తిలో మనకు కనిపించేది అహంకారము, ఉత్కర్ష (Excessive exaggeration), డంభము, జంభము, ఆత్మ శ్లాఘనము అత్యంత హేయమైనవి. ఇవి కొరగానివి. వ్యక్తికి కేవలము అవమానమును చేకూర్చునవి. రెండవ విధమైనవి, ఉదాహరణకు ఒక క్రొత్త యంత్రమును ఆవిష్కరణ చేయుట. అది నిజానికి గొప్ప పనే. కానీ కాలాంతరములో అటువంటివి ఎన్నో ఇంకా మెరుగు పరచి వాడకమునకు తెస్తారు. అంతటితో ఆ అ ఆవిష్కరణ సరి. ఈ మాత్రానికి ఎదో చేసితిమని అహంకరించుట అవసరమా! మనము చేపట్టవలసినది, సమాజములో సభ్యునిగా ఉంటూ కూడా, నిత్య నూతనము, నిరంతరానందము ఇవ్వగలిగిన ఆ కార్యమును సాధించుట. అది సాధించితే మనము ప్రసార మాధ్యమముల జోలికి పోకుండానే మన ప్రఖ్యాతి జగద్వ్యాప్తమౌతుంది. రమణ మహర్షి, రామకృష్ణ పరమ హంస, మహావతార్ బాబా, కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వాములవారు, శృంగేరి చంద్రశేఖర భారతి స్వాములవారు మొదలగు వారంతా ఆ ఉన్నత పదమును సాధించిన వారు. మన ఆశయము అది కనుక అయినదంటే అందుకు అనువగు వస్తువులు అన్నీ తమకు తామే లభ్యమౌతాయి. నీవు ఉద్యోగమును ఎంచుకొని, సాధించి  కార్యాలయమునాకు పోయిన రోజు మేజా, ఆసనము మరియు కావలసిన పరికరములన్నీ నీకు సమకూరుచున్నాయి కదా! ఇదీ అంతే! కావలసినదల్లా ధృఢ సంకల్పము.

సంకల్ప మొకటి కల్గిన

సంకటముల బాపు నదియె సత్వర రీతిన్

అంకితము చేయ మనసును

ఇంకేమియు కొదువలేక ఈప్సిత మొదవున్

కావున పై వాని నమ్మి పూనితే ఆపైన ఆపైవాడే నీకు తోడవుతాడు. 

పరిపరి విధముల మనసును

పరిగెత్తగనీయబోక పర దైవముకై

పరమార్థ సాధనముకై

పరితాపము చెందు దాని బడయగ రామా!

 

तत्कर्म यन्न बन्धाय सा विद्या या विमुक्तये

आयासायापरं कर्म विद्याऽन्या शिल्पनैपुणम् - विष्णुपुराण

क्रिया  उसे कहते हैं  जो बाध्यकारी नहीं होती; ज्ञान वही है जो मुक्ति की ओर ले जाता हैअन्य सभी क्रियाएं कठोर होसकते हैं और ओ विज्ञान सादे शिल्प कौशल हैं

निष्पादित होने वाली प्रत्येक कार्रवाई को  निर्व्यामोह की भावना के साथ किया जाना चाहिएकिसी भी काम को करने या किसी भी काम को करने के लिए, आदमी स्वार्थरहित होना चाहिएअपने आप को नाम और प्रसिद्धि बनाने केलिए कोशिष करना बेकार है l  यह कर्तव्य और जिम्मेदारी के दृष्टिकोण के साथ किया जाना

 

चाहिएअहंकार के लिए किया गया कोई भी कार्य उतना ही अच्छा होता है, जितना कच्चे अमरुद खानेका है! कोई ऐसे कार्यों में लिप्त होकर खुद को चोट पहुंचा रहा है, क्योंकि वह केवल खुद को आगे बांध रहा हैयह वैसा ही है जैसे एक पक्षी जानबूझकर एक पिंजरे के अन्दर जाके खुद को बंद कर के दरवाजा बंद कर देता है,  और चाबियों को फेंक देता है और समझता है की वह आसमान को जीतलिया है l इसे सिर्फ मूर्खता और मानसिक अपरिपक्वता कह सकते हैं l

 

केवल वही जो किसी को मुक्ति के मार्ग की ओर ले जाता है वह है ज्ञानकेवल वह क्रिया फलदायी है जो बाध्यकारी नहीं हैअन्य सभी ज्ञान और कार्य केवल कठिन शिल्प कौशल हैं l ऐसा किसी भी अन्य विषय सीखना सिर्फ एक और कौशल बनता हैशायद  यह हाथ, हृदय या सिर का कौशल हो सकता है, लेकिन यह दुनिया के बंधनों से मुक्ति नहीं दिलाता हैl मुख्य रूप से जब तक अहंकार से आदमी बांधाहुवा है, वह तो ना ही कोई सच्ची सीख है न ही कोइ अच्छा रास्ता बतासकता है

इन परिभाषाओं का सार ए है की हमारे दृष्टिकोण में बदलाव जरूर लाना हैसिर्फ, वही काम और कौशल अंतिम लक्ष्य की ओर हमें ले जा सकते हैं l जब करने के प्रति दृष्टिकोण बदलता है, और वे सांसारिक संबंधों से  अलगाव  होजाते हैंइस तरह की अनासकती कोई दर्द, नफरत या दुख से विमुक्त करता हैयह एक जीत की स्थिति है और यही जीत की स्थिथि हैl

 

 

tatkarma yanna bandhāya sā vidyā yā vimuktaye

āyāsāyāpara karma vidyā'nyā śilpanaipuam - viṣṇupurāṇa

That is action which doesn't lead to binding; that is knowledge which leads to liberation.  All other actions are mere chores of arduousness; all other sciences are plain craftsmanship.

Each and every action executed should be done with a feeling of detachment.  For any deed done or any chore performed, the motive behind it should not be a selfish one.  It should not be done because it brings oneself name and fame, nor because it makes one feel entitled and accomplished.  It should be performed with the attitude of duty and responsibility alone.  Any action performed as food for the ego is as good as not done, says the poet!  One is hurting himself by indulging in such actions, for he is only tying himself up further.  It is as if a bird willfully flies into a cage, closes the door, locks itself up, throws away the keys and dreams about conquering the skies!   Obviously, it would take the bird forever to get free and enjoy the unbound skies!!

Only that which leads one towards the path of liberation is knowledge.  Only that action is fruitful that is not binding.  All other wisdom and actions are mere arduous craftsmanship, says the poet.  Any other learning is just another skill.  It might be the skill of the hand, heart or head.  But that which does not emancipate one from the bindings of the world, mainly his ego, is no true learning.

The essence of these definitions is a call for a shift in attitude.  The same chores and skills can lead to the ultimate goal when the attitude towards the doing, as well as its result, are that of detachment.  For, he who is pristine and pure needs but one thing - detachment!  There is no pain, hatred or sadness where there is detachment.  It is a win-win situation!

స్వస్తి.

*****************************************

No comments:

Post a Comment