Sunday 18 April 2021

అజరామర సూక్తి – 212 अजरामर सूक्ती - 212 Eternal Quote – 212

 అజరామర సూక్తి  212

अजरामर सूक्ती -  212

Eternal Quote – 212

https://cherukuramamohan.blogspot.com/2021/04/212-212-eternal-quote-212.html

वृक्षान् छित्वा पशून्हत्वा कृत्वा रुदिरकर्दमम् ।

यद्येवं गम्यते स्वर्गे नरकः केन गम्यते ॥ पञ्चतन्त्रकाकोलूकीय

వృక్షాన్ ఛిత్వాపశూన్ హత్వా కృత్వా రుదిరకర్దమం l

యద్యోవం గమ్యతే స్వర్గే నరకః కేన గమ్యతే ll

చెట్లను కూల్చివేసిన తరువాతజంతువులను ఊచకోత కోసి నెత్తుటి బురదను సృష్టించి స్వర్గము సాధిస్తేమరి నరకము ఎవరి కొరకు ఉన్నట్లు?

 పుట్లుగ పాపకార్యముల పూర్తిగ జేసియు దీక్షతోడుతన్

చెట్లను కొట్టి జంతువుల ఛేదన చేయుచు రక్త కర్దమం

బట్లొనరంగ జేసి మరి  అందరు స్వర్గము చేరిపోవ, తా

మట్లొనరించియున్ నరక మందున జేరగ బోరు ఎన్నడున్

ఇక్కడ ఒక వాస్తవమైన కథ చెప్పుకొందాము. చిన్న పిల్లవాడు ఒక వనము లోని ఒక చెట్టు వద్దకు రోజూ వస్తూ ఉంటాడు. చెట్టుకు ఎంతో ముచ్చట వేసి ఆ పిల్లవాడు, వాని స్నేహితులు ఆడుకొనుటకు రోజూ అందమైన తన  ఆకులు నిచ్చేది. బాలుడు కొంచెము పెరిగిన తరువాత  చెట్టు తన కొమ్మలకు ఊయల కట్టుకోనిచ్చి, వారు ఊగుతూ వుంటే సంతోషించేది. ఆ బాలుడు మరికాస్త పెద్దయినతరువాత స్నేహితులతో కూడి ఆడుకొని అలసిపోతే ఆకలి తీరడానికి పళ్ళు సేద తీరడానికి నీడ ఇచ్చేది.. బాలుడు పెద్దయ్యాకఇంటిని నిర్మించుకొనుటకు అతని కోరికపై కావలసినంత కలపనిచ్చింది. వంటచరకు కావాలంటే కొమ్మలు నరికి తీసుక పొమ్మని చెప్పేది. చివరకు చెట్టుకు మిగిలినది బోదె మాత్రమే! పొరుగూరికి పోయి ఆదారిలో తిరిగి అలసి సొలసి  వస్తున్న అతనిని చూసి మాకు నెలకు ఒరిగిపోయి కూర్చొని సేద తీర్చుకొమ్మంది. చెట్టు మళ్ళీ లేచి నిలబడలేదు.  అప్పటికి గాని చెట్టు యొక్క గొప్పదనము ఆ, ఒకనాటి  బాలునికి అర్థము కాలేదు. ఆ చెట్టు కోసము అప్పటికీ, ఎప్పటికీ తానివ్వగలిగినదల్లా చేరెడు కన్నీళ్ళే!  

జంతువుల ఊచకోత గురించి ఎంత చెప్పినా తక్కువే! తనకు మేలుచేసే ప్రకృతిని తానూ నరుకుతూ పొతే తనకు కాక పోయినా తన తరువాతి తరాలకు నిలువ నీడ కూడా ఉండదు. వనాలుంటే చేట్లుంటాయి, మృగాలుంటాయి, అందుచేత ప్రకృతి సమతుల్యము ఉంటుంది.  మనిషి ఇది ఎంత తొందరగా గ్రహించి తమ తమ ఊర్ల ఎటి ఒడ్డున చెట్లు పెంచితే భావి తరాలకు ఎంతో మేలుజేసిన వారవుతారు.

 స్వర్గము నరకము పైన ఉన్నవో లేవో తెలియదు కానీ వానిని, ఏది కావాలంటే అది, భూమి పైనే ప్రతిష్ఠించుకోగల సామర్థ్యము మానవునికి ఉన్నది. తన ఇష్టమును పటిష్టము  చేసుకొనే బాధ్యత తనదే!

वृक्षान् छित्वा पशून्हत्वा कृत्वा रुदिरकर्दमम् ।

यद्येवं गम्यते स्वर्गे नरकः केन गम्यते ॥ पञ्चतन्त्रकाकोलूकीय

पेड़ों को तोडने के बादजानवरों का संहार करके एक खूनी कीचड़ बनाने के बादअगर स्वर्ग प्राप्त होता हैतो नरक जानेवाला कोइ भी नहीं. रहता !

 इस वास्तविक  कहानी को थोड़ा ध्यान से पढ़िए l  एक छोटा लडका एक पेड़ के पास आता था। पेड़ उसे खेलने के लिए अपने पत्ते देता था। थोड़ा लड़ा बड़ा हुआ l पेड़ अपने  शाखाओं से उसे झूलने देता था। जब लडका और थोड़ा बड़ा हुआ तो उसे अपने छाँव में बैठ ने केलिए कहता था l  खाने केलिए मीठे फल देता था l जब बच्चा बड़ा

हुआतो पेड़ उसे अपना घर बनाने के लिए लकड़ी प्रदान किया। जब आदमी अधिक चाहता थातो पेड़ ने अधिक दिया l सब कुछ देदिया पेड़ ने अब सिर्फ उसका स्कन्द बचा l जब नौजवान हुआ वो बच्चा दुसरे गाँव से आ रहा था पेड़ ने धरती पर लेट गया और उस लड्केको उसपर बैठ के थकावन दूर करलेने को कहा l यह  है पेड़ की विशालता। एहसान वापस करने के बजायआदमी लूटता है और लूटता हैजैसे पेड़ ही नहीं बचा!

जानवरों के संहार के बारे में क्या कहना हैक्या मनुष्य को पता चलता है कि वह कौन सा खूनी दलदल बना रहा है और प्रवाह बना रहा हैक्या वह समझता है कि वह लंबी दौड़ में खुद को चोट पहुंचा रहा हैक्या वह यह भी समझ सकता है कि उसके कार्यों के नतीजे क्या होसकते हैं? प्रकृति को बचानेसे ही हम बच सकते हैं l नदी तटों पर हम पेड़ उगाएंगे तो फिरसे हम वातावरण में संतुलन लासकते हैं l

 कोई नरक में नहीं जाना चाहता। सभी प्राणी स्वर्ग तक पहुँचने का लक्ष्य रखते हैं। इन आकांक्षाओं के साथयदि मनुष्य के कार्यों में इतनी निर्दयता है तो वह क्या स्वर्ग जा सकता है l स्वर्ग और नरक को पृथ्वी पर बसाना इंसान के हाथ में है l वो, दो कहीं ऊपर नहीं है l इसी विषय को कवि व्यंग्यपूर्वक ऊपर के श्लोक में कहे हैं l  

 vkṣān chitvā paśūnhatvā ktvā rudirakardamam 

yadyeva gamyate svarge naraka kena gamyate  pañcatantra, kākolūkīya

 After tearing down trees, massacring animals, after creating a bloody mire, if this is how heaven is attained, (then) hell is attained by whom?

 There is a story where a little boy comes to a tree.  The tree gives him leaves to play with.  He would then climb the trunk and swing from the branches.  When the boy grows up, the tree provides him with fruit and wood to build his home.  When the man wanted more, the tree gave more, until only a stump was left.  Even then, when the weary man came by, the stump propped itself up and gave him a place to sit on!  Such is the magnanimity of the tree.  Instead of returning the favors, man loots and loots, like there is no tomorrow until nothing is left!  What to say about the massacring of animals?    Does man realize what a bloody quagmire he is creating and letting flow?  Does he understand that he is hurting himself in the long haul? Does he even comprehend that there are repercussions for his actions?

 No one wants to go to hell.  All beings aim to reach heaven.  With these aspirations, if man's actions are so merciless, one can only imagine the brutality if the aim was to reach hell instead!!  The poet sarcastically says, if these beings want to reach the Garden of Eden, who else shall make it to Hades?!!

Heaven and hell are not for attaining afterlife, but are created here and now!  One can either make the earth a green heaven or one bloody hell!  It is all in our own hands.

స్వస్తి.

No comments:

Post a Comment