Saturday 3 April 2021

అజరామర సూక్తి – 197 अजरामर सूक्ति -197 Eternal Quote – 197

 అజరామర సూక్తి  197

अजरामर सूक्ति -197

Eternal Quote  197

https://cherukuramamohan.blogspot.com/2021/04/197-197-eternal-quote-197.html

शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदः l

शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते ll

శుభం కరోతి కల్యాణం ఆరొగ్యం ధనసంపదః l

శతృబుద్ధి వినాస్శాయ దీపజ్యోతిర్నమొస్తుతే ll

శుభదాయకమైన ఓ దీప శిఖా! మాకు ఆరోగ్యఐశ్వర్యధన సంపదలను ప్రసాదించు. 

మా శతృవులలోని అహంకారమును అడగించు.ఇదే మా నమస్కారమును గైకొనుము.

అర్ర్గ్య ఆనంద ధన సంపదలకు మూలము అహంకార వినాశనము. 

అహంకారమేల్లపుడూ అరిషడ్వర్గాలనే ఆశ్రయించి యుంటుంది. ఈ అంతః శత్రువులు 

ఆరుగురు. 1. కామ 2. క్రోధ ౩.లోభ 4. మోహ 5. మద 6.మాత్సర్యము. ఇవి ఒకే శతృవు 

యొక్క ఆరు తలలగా కూడా భావించవచ్చు. ఆ ఒక వ్యక్తే అహంభావము. అవి పోతే ఇది 

పోతుంది,ఇది పొతే అవి పోతాయి. మొదట మనలోని శతృవులను తరిమివేసి ఆ మహా 

జ్ఞానమనే దీప శిఖను మన శత్రువులా యొక్క అహంకారమును తొలగించమని 

కోరుటకు మించిన కోరిక ఏమున్నది. అప్పుడు ఈ జగమంతా మన కుటుంబమే.

దీపం జ్యోతి పరబ్రహ్మదీపం సర్వతమోపహః |

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||

పరబ్రహ్మ జ్యోతిస్వరూపుడు. త్రిమూర్తి స్వరూపుడు. ఆ మాటకొస్తే  ఆయన 

త్రిమూర్తులకతీతుడు. కనుక దీపాన్ని ఆరాధిస్తే అసలు సకల దెవతలనూ ఆరాధించినట్లే. 

ఆ జ్యోతిని పరంజ్యోతిగా తలచి ఆరాధించితే అజ్ఞానం తొలగడమే కాక సర్వ శుభాలూ 

కలుగుతాయి. అసలు ‘మను చరిత్ర’ లో పెద్దన ఈవిధముగా ప్రవరునిచే వరూధినికి 

చెప్పించుతాడు:

ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం

జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో

కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా

నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా

మనసు మరేదేనిపయిననూ మరలించక, తదేకముగా అంతర్ముఖులమై హృదయ కుహురములోనున్న ఆ పరంజ్యోతిని కాంచగలుగుటచేత ఏర్పడే ఆనందమే ఆనందమని ఈ పద్యమునకు స్థూలమగు అర్థము. ‘జ్వాలమాలాకులం భాతి’ అని వేదము ఈ విషయమునే పుష్టి చేయుచున్నది. కావున బాహిరముగా నైనా దీపారాధన ఎంతో ప్రాధాన్యత కలిగి వుంది. తల్లులారా క్రమము తప్పక సంధ్యాదీపము వెలిగించి పై శ్లోకములను మీరు చెప్పి మీ పిల్లలచేత చెప్పించండి. 

शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदः

शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते

हे शुभदायक दीप शिखा ! हमें आयुआरोग्य,ऐश्वर्य और  प्रसन्नता दे उस के अतिरिक्त  हमारे 

दुश्मनोका अहंकार को मिटादो |ऐश्वर्यबड़ों का मानना ये है की 'दीपं सर्व तमोपहमदीप जलते ही 

अन्धेरा भाग जता है आदमी में जब अहंकार का अंत होता है तो दुश्मनी की बात ही पैदा नहीं होती 

आदमी के अन्तःशत्रू  छे होते हैं वे है काम(इच्छाक्रोध मद लोभ मोह और मात्सर्य

अगर in शत्रुओं को कोई निर्मूलन करले सकता है तो इस संसार ही भाई चारा से भारपूर होजाता है  |   

 दीपं ज्योति परब्रह्म दीपं सर्वतामोपहम l

दीपेन साध्यठे सर्वं संध्यादीपा नमोस्तुते ll

 

दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दन:।

 दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तु ते।। 

दीप प्रकाश का द्योतक हैतो प्रकाश ज्ञान का। परमात्मा से हमें संपूर्ण ज्ञान मिले इसीलिए दीप प्रज्वलन  करने की परंपरा है। कोई भी पूजा हो या किसी समारोह का शुभारंभ। समस्त शुभ कार्यों का आरंभ दीप  प्रज्वलन से होता है

जिस प्रकार दीप की ज्योति हमेशा ऊपर की ओर उठी रहती हैउसी प्रकार मानव  की वृत्ति भी सदा ऊपर ही उठेयही दीप प्रज्वलन का अर्थ है। अतसमस्त कल्याण की चाह रखने वाले  मनुष्य को दीप जलाते समय यह मंत्र अवश्य पढना चाहिए। निश्चित ही आपका कल्याण होगा। 

दीपदीपकदीवा या दीया वह पात्र है जिसमें सूत की बाती और तेल या घी रख कर ज्योति प्रज्वलित की जाती है। पारंपरिक दीया मिट्टी का होता है   l

महिलाओं माताओं हर शाम  दीप ज्वलन करतेहुए ऊपर के श्लोक आप भी बोली उर बच्चोसे

 

भी बोल्वाइए l

SubhaM karOti kalyaaNam aarogyaM dhanasampada@h

SatRbuddhi vinaasSaaya deepajyOtirnamostutE

 

O light of the lamp ! The bestow-er of auspiciousness, fortune, health, wealth, prostrations to thee, for the destruction of the attitude of enmity.

A lamp is a symbol of not only light, but also knowledge.  Just as it eradicates darkness where it is, the light of knowledge eradicates ignorance and ego. They both are interrelated. If ignorance is obliterated automatically ego vanishes.   When ego vanishes there will not be any differentiation, no inferiority or superiority complex.  No complexity leads to no jealousy, and no jealousy tantamounts to no enmity.  Therefore the light of knowledge cuts out this cycle in the very bud.  For the one who is aware that there is the same light of the Supreme power in everyone, there is no room for enmity!

Let the light of that lamp be in each home and heart.

Deepam jyothi parabrahma deepam sarwathamopaham|

Deepena saadhyathe sarwam sandhyaa deepam namosthuthe ||

The above Sanskrit shloka means “I prostrate to the dawn/dusk lamp whose light is Supreme Knowledge, which removes the darkness of ignorance and by which all can be achieved.”

The diyas signify the importance of light or knowledge and represent a whole circle of life. It is an epithet of goodness, virtuosity, harmony and truth. The story behind the advent of diyas is quite interesting and dates back to the days of Ramayana.
Oh mothers and sisters  please practise the habit of lighting Diya every evening telling the above Shlokas and also please make it a habit to render by your children also.

స్వస్తి.

No comments:

Post a Comment