Friday 9 April 2021

అజరామర సూక్తి – 204 अजरामर सूक्ती - 204 Eternal Quote – 204

 అజరామర సూక్తి  204

अजरामर सूक्ती -  204

Eternal Quote  204

https://cherukuramamohan.blogspot.com/2021/04/204-204-eternal-quote-204.html

 अर्थनाशं मनस्तापं गृहे दुश्चरितानि  ।

वञ्चनञ्चापमानञ्च मतिमान्न प्रकाशयेत् ॥ - चाणक्य नीति

అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ l

వంచనం చాపమానం చ మతిమాన్న ప్రకాశయేత్ ll- చాణక్య నీతి

ధననష్టాన్నిమనస్తాపాన్నిఇంటిలోనివారి దుష్ప్రవర్తనలనుతనకు జరిగిన మోసాన్నితాను పొందిన అవమానాన్ని బుద్ధిమంతుడు బహిరంగంగా చెప్పుకోకూడదు”

ఈ పెద్దల మాటను చూడండి.

గుణ దోష బుధో ఘృణ్ణన్ ఇందుక్ష్వేళా వివేశ్వరః l

శిరాసా శ్లాఘ్యతే పూర్వం పరం కంఠేన యచ్ఛటి ll

అన్నది పెద్దల మాట . పరమ శివుడు గరళమునుమనకుకలిగినబాధను అని అన్వయము గోతులోనే అంటే మనము మనసులోనే ఉంచుకొన్నాడుకావున మాము కూడా మన బాధను బహిర్గతము చేయరాదు. అదే సంతోశామునైతే పరమేశ్వరుడు నెత్తిన చంద్రుని పెట్టుకొన్న రీతిగా మనము కూడా పదుగురితో పంచుకోనవచ్చును.

లోకంలో వింత మనస్తత్త్వం గల మనుషులు చాలా మందే ఉంటారు. ఎదుటి వారి కష్టాలుసమస్యలులేమి - వారికి నిర్హేతుకంగా ఆసక్తినిసకృత్తుగా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ చాణక్యుడు చెప్పిన మాట ఇది.

మరో కోణం నుంచి చూస్తేఒక వ్యక్తి తాను అనుభవిస్తున్న బాధలను మరొకరికి చెప్పుకుంటేబరువు దించుకున్న వాడౌతాడనేది కూడా వాస్తవమే.

ఒక్కొక్కసారి ఇతరులకు చెప్పుకోవటం వల్ల కొన్ని సమస్యలకు వారిద్వారా పరిష్కారమూ లభించవచ్చు. మనస్సుకు ఊరటా కలుగవచ్చు. మనసెరిగిన వాడుమానవత్వం గలవాడుస్వార్థరేఖ ఏకోశానా లేని వాడూ అయితే సహానుభూతి చూపటమేకాక క్రియాత్మకంగా మేలు చేస్తాడు. కానీఎంతో విశ్వాసంతో తమ వైయ్యక్తిక విషయాలను చెప్పినవారిని ప్రత్యక్షంగానోపరోక్షంగానో హేళనచేసి,రాక్షసానందాన్ని పొందేవారిని ఏమనాలి ?

ఒకప్పుడు మిత్రునిగా ఉన్న వ్యక్తి వ్యహారరీత్యా శత్రువు కావటం కూడా సంభవమే.మైత్రి నెరపిన వేళ ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకుంటారు. అది వికటించిన వేళ  ఒకరి లోపాలు ఒకరు బహిర్గతం చేసుకుంటారు. పనిగట్టుకొని కనిపించినవారందరిలో ప్రచారం చేస్తారు. ఈ స్థితి ఎన్నో విపరీతాలకు దారితీయవచ్చు. “తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులె శత్రులగుట” తథ్యము కదా!

తమబాధలను ఇతరులకు చెప్పే ముందు అందువల్ల ప్రయోజనం ఉంటుందాఉండదాఅని ఆలోచించటంసాధ్యమైనంతవరకూ ఇతరుల సానుభూతిని ఆశించి భంగపడకుండా ఉండటం అవసరం. ప్రతి వ్యక్తీ ధీరతతో ఉదాత్తంగా తనకు ఎదురైన సమస్యలను తానే ఎదుర్కొని పరిష్కరించుకోగల సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలని గ్రహించాలి.

అర్థనాశం అంటే ధనము నశించడముఅసి ఎవిధమైనా కావచ్చు. ఉదాహరణకువ్యాపారము వ్యవసాయము వంటి వానిలో నష్టము వచ్చుటమోసగింపబడుటదొంగిలింపబడుట పోగొట్టుకొనుట మొదలగు అనేక కారణాల వాళ్ళ ఉన్న అస్తి పోగొట్టుకొనవచ్చు.

మనస్తాపం అంటే మనసుకు ఏర్పడిన దుఃఖముఅది కుతుమ్బపరమైనది కావచ్చుబంధు మిత్రుల రూపములోనోభార్యాపుత్రుల రూపములోనోఅనారోగ్య అవాంతర పరిస్థితుల వల్లనో ఇది కలుగవచ్చు. ఇటువంటి 'ఆపదలందు ధైర్యగుణముకావలెనని భర్తృహరి మాట.

గృహమండలి దుశ్చరితం అనగాసంతానము జులాయిగా తిరుగుటయోభార్య గయ్యాళి,దుశ్శీల అగుతాయోఇంటి గౌరవము మంటబెట్టి కుమార్తె దుశ్చరిత అగుటయో,

వంచన అనగా మోసము చేయుట అనగా మనము ఒకరినైనా మోసగించవచ్చులేక మనలనేవరైనా మోసగించవచ్చు అది సంపద పరమైనా కావచ్చువేరు ఏ కారణమైనా కావచ్చు,

పరాభవము అంటే ఇటువంటి వంచనాదులవల్ల ఏర్పడిన అవమానములులేక పైన తెలిపిన గృహపరమైన్తువంటి అవమానములులక కార్యాలయములో పై అధికారి మందలింపులు వంటివి కావచ్చు .

ఇలాంటివన్నీ తగిన సమయము, తగిన వ్యక్తి దొరికే వరకూ మన మనసునకే పరిమితము చేసుకొనూట ఎంతో మంచిది.

अर्थनाशं मनस्तापं गृहे दुश्चरितानि  ।

वञ्चनञ्चापमानञ्च मतिमान्न प्रकाशयेत् ॥ - चाणक्य नीति

धन का नाशमन का ताप (दुःख)स्त्री का चरित्रकिसी से ठगे जाने परकिसी के द्वारा अपमान किए जाने पर (विशेष तौर पर अपने से नीचे के लोगों के द्वाराबुद्धिमान् लोग इसे प्रकाश में ना लाएंअर्थात् दूसरों को  बताएंअन्यथा आपका उपहास उडाया जाएगा और आपके दुःख को कोई नहीं समझ पाएगा

इस श्लोक का निहितार्थ यह है कि सामान्य जीवन में व्यक्ति तमाम प्रकार के खट्टे-मीठे अनुभव पाता है। उनका उल्लेख दूसरों के समक्ष करने लिए वह अक्सर उत्साहित हो उठता है। जहां तक सुखद अनुभवों की बात है दूसरों को बताने से नुकसान की संभावना नहीं रहती है या कम रहती है। लेकिन कड़वे अनुभवों और परेशानियों के बारे में ऐसा कहना ठीक नहीं होगा। यह संभव है कुछ गिने-चुने लोग व्यक्ति के प्रति सहानुभूति रखें और आवश्यकतानुसार उपयोगी सलाह एवं सहायता भी दें। किंतु ऐसी उदार वृत्ति कम लोगों में ही देखने को मिलती है। कई ऐसे लोग होते हैं जो व्यक्ति की बातों का मन ही मन आनंद लेते हैंउसकी पीठ पीछे जग-हंसाई करने/कराने से नहीं चूकते। मेरे जीवन का अनुभव यही रहा है कि ऐसे जनों के मन की कुटिलता भांपना आसान नहीं होता

इन्हीं बातों को ध्यान में रखते हुए चाणक्य का मत है कि धन की हानिअनिष्ट घटनाओं से प्राप्त मानसिक कष्टघर-परिवार में दुःखद किंतु गोपनीय घटनाएंठगे जानेऔर अपमानिन होने की बातों का खुलासा बुद्धिमान व्यक्ति  करे। उन्हें अपने मन ही तक सीमित रखे

इस श्लोक को देखीए

 

गुणदोषौ बुधो गृह्णन् इन्दुक्ष्वेडा विवेश्वरः ।

शिरसा श्लाघ्यते पूर्व परं कण्ठे यच्छति ॥

मानेसमझदार लोग जैसे महाशिव ने किया वैसा ही करते हैं l शिवजी जैसे विष को कंठ ताका ही सीमित किया वैसेही बुद्धिमान अपने  कष्ट व्याकुल  अप्मानोंको मन के अन्दर ही रख्लेताहाई l संथोश्जनक वार्ताओं को अपने बन्धुमित्रों में बांटलेते है l

जब तक कोई अपने दिल को समझकर ठीक सलाह नहीं देता तब तक ऊपर बताए गए बातें मन में ही रखलेना है l

 

arthanāśa manastāpa ghe duścaritāni ca 

Vañcanañcāpamānañca matimānna prakāśayet  - cāṇakya nīti

Loss of wealth, mental anguish and misdemeanors in the house, deceit and disgrace - the prudent do not elucidate.

Add thy joys, subtract thy sorrows.

There is nothing to celebrate about grievances of the mind or losing wealth. No one is proud of misconduct in their family nor about disgrace may they have faced. Talking about being deceived isn't a happy moment either!  Talking about these situations brings back memories of pain and adds to his sorrow.

The prudent do not bring unpleasant situations onto themselves. Publicizing these issues brings on either shame or embarrassment. Neither is desired by anyone. The farsighted and judicious have this forethought and avoid facing it from the get-go!

These topics come up when one indulges in mindless gossip and puts himself into situations where he might embarrass himself! Being judicious with words and not talking for the sake of talking, is the best way.

The wise speak because they have something to say, whereas a fool speaks because he has to say something! Speak wisely.

Just observe this shloka carefully,

Gun dosh budho ghrunnan idukshvelaa viveshvarah l

Shirasaa slaaghyate poorvam param kanthena yachChati ll

Siva Almighty limits poison to his throat but keeps moon on his head. This conveys a message to us that ‘Keep all sorrows and miseries within yourself but the happiness with all who are your near and dear.

Unless you get a chum who can step into your shoes and advises you the right path don’t divulge your sorrows with anybody.

These words are real diamonds which shows you light even in bitter darkness. This greatness belongs to our ancisters like Chanakya.

 స్వస్తి.

No comments:

Post a Comment