Thursday 8 April 2021

అజరామర సూక్తి – 203 अजरामर सूक्ती - 20 Eternal Quote – 203

 అజరామర సూక్తి  203

अजरामर सूक्ती -  203

Eternal Quote  203

https://cherukuramamohan.blogspot.com/2021/04/203-20-eternal-quote-203.html

तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते ।

द्वापरे यज्ञमित्यूचुः दानमेकं कलौ युगे ॥ - पराशरस्मृति

తపః పరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే l

ద్వాపరే యజ్ఞమేవాహుః దానమేకం కలౌ యుగే ll

 అన్యే కృతయుగే ధర్మాస తరేతాయాం థవాపరే ఽపరే l

అన్యే కలియుగే ధర్మా యదాశక్తి కృతా ఇవll (శాంతి పర్వము -అధ్యాయము 224 - 26వ శ్లోకము)

కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు కాల చక్రములోని నాలుగు బిందువులు. సత్య యుగమున అనగా కృత యుగమున ధర్మము 4 పాదాల నడువగా త్రేతాయుగమున 3, ద్వాపరమున 2 పాదాలతో నడుస్తుంది. కలియుగమున మాత్రము ప్రారంభము నుండియే ఒకే పాదము పై నడుస్తుంది. ధర్మాచరణము కూడా ఆయా యుగమును బట్టి, ఆయుగమునకు తగిన విధముగా మారుతూ వుంటుంది.

తపః పరం కృతయుగే తరేతాయాం జఞానమ ఉత్తమమ l

థవాపరే యజ్ఞమ ఏవాహుర థానమ ఏవ కలౌ యుగే ll (శాంతి పర్వము -అధ్యాయము 224 - 27వ శ్లోకము)

పూర్వయుగాలలో క్రమంగా తపస్సుజ్ఞానంయజ్ఞాచరణం ఉత్తమ ధర్మాలుగా పరిగణింపబడితే -కలియుగంలో దానగుణం వాటితో సమానమైనదిగా చెప్పబడింది.

"శతేషు జాయతే శూరఃసహస్రేషు చ పండితః l

వక్తా శతసహస్రేషుదాతా భవతి వా న వా" ll

అన్నది ఆర్య వాక్కు. వందలమందిలో ఒక శూరుడువేలమందిలో ఒక పండితుడు లక్షలమందిలో ఒక గొప్ప వక్త ఉండవచ్చుగానీ నిజమైన దాత దొరకుతాడా లేదా అన్నది  సందేహాస్పదమే ! "అదాన దోషేణ భవేద్దరిద్రః" అనేది మన విశ్వాసం. దానం చేయకపోవటం అనే దోషం వల్ల వచ్చే జన్మలో కావచ్చు ఈజన్మలోనే కావచ్చు దరిద్రుడౌతాడని దీని భావం.

దీనికి అన్వయముగా ఒక డబ్బున్నవాడు డబ్బంతా పోగొట్టుకొని బిఖారి యగునని కాదు. డబ్బు అంతా తనవద్దే ఉన్నా తోడుగా రక్త పీడనము (Bloodpressure) మధు మేహము (Diabetis) ఉంటె చాలు. తానూ ఇష్టపడే వస్తువులు చూస్తూ ఉండవలసినదే! తినలేడు. యోగ్యులు కాని సంతానము పొందిక లేని భార్య , ఇవన్నీ వ్యక్తి యొక్క దౌర్భాగ్యమునకు సంకేతములే! మన ఇంటిముందు యాచకులు నిలబడి "ధర్మం చేయండి బాబూ!" అని అరుస్తున్నారంటే వాళ్ళు అడుక్కుంటున్నారనీ అర్థంకాదు. వాళ్ళు బిచ్చగాళ్ళనీ అనుకోకూడదు. "బాబూ! మీరు ధర్మదూరులై ఉన్నారుఇప్పటికైనా ఒక ధర్మకార్యం చెయ్యండి" అని మనను హెచ్చరించటానికి ఒక యాచకుని రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణస్వరూపులుగా వారిని గుర్తించాలని విజ్ఞులు విశ్లేషిస్తారు. ఎవరైనా తమకు దానం చేస్తే ప్రతిగృహీతలు కృతజ్ఞతలు చెప్పటం సర్వసాధారణం. కానీ తాను చేసిన దానాన్ని స్వీకరించితనను ధన్యుణ్ణి చేసిన ఆ ప్రతిగృహీతలకే దాత కృతజ్ఞుడై ఉండాలంటారు వివేకానందస్వామి.

 భగవద్గీత దానాలను మూడు విధాలుగా విభజించింది. 

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే 

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ।। 17 - 20 ।।

దానము చేయుట కర్తవ్యము (సరియైన పని) అని భావించితగిన పాత్రత ఉన్నవాడికిప్రతిఫలాపేక్ష లేకుండాసరియైన సమయంలోసరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.

స్కంధ పురాణము ఈ విధముగా పేర్కొంటున్నది:

న్యాయోపార్జిత విత్తస్య దశమాంశేన ధీమతః

కర్తవ్యో వినియోగశ్చ ఈశ్వరప్రీత్యర్థమేవ చ

"నీవు న్యాయముగా సంపాదించిన దానిలో నుండిపదవవంతు పక్కకు తీసిఅది నీ కర్తవ్యముగా భావించిదానిని దానం చేయుము. నీ దానమును ఈశ్వర ప్రీతి కోసమే అర్పితం చేయుము." దానము సక్రమమైనదా లేదాఉన్నతమైనదా నీచమైనదాఅనేది శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలను బట్టి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్హతగల పాత్రుడికిసరియైన సమయంలోసరియైన ప్రదేశంలో ఇవ్వబడుతుందో అప్పుడు అది సత్త్వ గుణ దానము అని చెప్పబడుతుంది.

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ।

దీయతే చ పరిక్లిష్టం తద్ధానం రాజసం స్మృతమ్ ।।17- 21 ।।

అయిష్టముగా ఇవ్వబడిన దానముఎదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది.

అదేశకాలే యద్ధానమ్ అపాత్రేభ్యశ్చ దీయతే ।

అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ।। 17 - 22 ।।

అనుచిత ప్రదేశంలోసరికాని సమయంలోఅర్హతలేనివారికి (అపాత్రులకు)మర్యాద చూపకుండాలేదా చులకనగా ఇవ్వబడిన దానముతామసదానము గా పరిగణించబడుతుంది.

"అన్నాచ్ఛాదన దానేషు పాత్రం నైవ విచారయేత్ అన్నస్య క్షుధితః పాత్రం వివస్త్రో వసనస్య చ" అన్నవస్త్ర దానాల విషయంలో పాత్రతనుగూర్చి ఆలోచించకూడదు. ఆకలి చెంది ఉండటంవివస్త్రుడై ఉండటము  ఆయావ్యక్తులకు పాత్రతను చేకూరుస్తాయి. అందువల్ల వెంటనే ఆయాదానాలు చేయాలి.

"ఇచ్చేవాడుంటే చచ్చేవాడుకూడా లేచి కూర్చుంటా" డని తెలుగులో ఒక సామెత ఉన్నది. వాడు లేచి కూర్చున్నా ఇక్కడ ఇవ్వాలని అనుకొన్న వాడు ఆ లేచిన వానికి ఇస్తాడో లేదో అంతా సందేహమే! అసలు కలియుగములో దేహము నిండా సందేహమే!

 ఒకప్పుడు ధర్మరాజు వేదవ్యాసుణ్ణి "దానం గొప్పదాతపస్సు గొప్పదా?" అని అడిగాడు. అపుడు వ్యాసుడు ధర్మరాజుతో "నాయనా! మానవులు ధనంకోసం ఎన్ని సాహసాలైనా చేస్తారు. వారికి ప్రాణం మీద కంటె ధనం మీద ప్రీతి! అందుకే ధనంకోసం ప్రమాదమని తెలిసినా ,పదునైన ఆయుధాల తో తలలు తెగ్గోస్తారు. సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళిపోతారు! వ్యవసాయంపశుపాలనం మొదలైన క్లిష్ట కార్యాలు చేస్తూ అలసి సొలసిపోతూ ఉంటారు! పరదాస్యానికి సైతం వెనుకాడరు! ఇంత కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎవరైనా దానం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయము కదా! తప్పక అది తపస్సుకన్నా గొప్పది” అన్నాడు.

 "మూర్ఖో నహి దదాత్యర్థం నరో దారిద్ర్య శంకయా ప్రాజ్ఞస్తు వితరత్యర్థం నరో దారిద్ర్య శంకయా"

 "దానం చేస్తే నేను దరిద్రుడినైపోతానేమో!" అనే సంశయంతో మూర్ఖుడు అసలు దానమే చేయడు. "ఇపుడు దానం చేయకపోతే రాబోయే జన్మలో దారిద్ర్యం సంక్రమిస్తుందేమో!" అనే శంకతో ప్రాజ్ఞుడు దానం చేస్తాడు. అని ఈశ్లోకభావం.

"శతహస్త సమాహరసహస్రహస్త సంకిర" అంటుంది ఆర్షవాణి. "వంద చేతులతో సంపాదించు. వేయి చేతులతో వితరణ చెయ్యి" అని దీని భావం. పెద్దలు తాము దానాలు చేయటమే కాకఈ దాన గుణాన్ని పిల్లలకు నేర్పాలి. ఎవరి స్థాయిలో వారు త్యాగబుద్ధిని అలవరచుకోవటం సమాజానికి ఎంతో అవసరము.

तपः परं कृतयुगे त्रेतायां ज्ञानमुच्यते ।

द्वापरे यज्ञमित्यूचुः दानमेकं कलौ युगे ॥ - पराशरस्मृति, यह श्लोक  मनुस्मृति में भी देख सकते हैं l

सत्य युग का का परम श्रेष्ठ धर्म तपस्या मानागया है जिस से मानव अपने सभी श्रेय एवं प्रेय प्राप्त करसकता था lत्रेता में ज्ञान प्राप्त करनाद्वापर में यज्ञ करना परम धर्म मानागेका है कलियुग का धर्मं केवल दान को ही माना गया है l

 अन्ये कृतयुगे धर्मास्त्रेता याम् द्वापरेऽपरे l

अन्ये कलियुगे धर्मा यथा शक्ती कृता इवll (व्यास भारतं-शांती पर्वम्–अध्यायं 224-शलोकं 26)

अर्थात् युग के ह्रास के अनुरूप चारों युगों के धर्मों का ह्रास होनेलगा कृत  सैट युग के धर्मं अन्य हैंत्रेतायुग में अन्यद्वापर में अन्य तथा कलियुग में कुछ अन्य धर्म उप्पय के रूप में प्रचलित हुएl

 तपः परम कृतयुगे त्रेतायां ज्ञानमुत्तामं l

द्वापरे यज्ञमेवाहुर्दानमेव कलोऊ युगे ll (व्यास भारतं-शांती पर्वम्–अध्यायं 224-शलोकं 27)

सत्य युग का का परम श्रेष्ठ धर्म तपस्या मानागया है जिस से मानव अपने सभी श्रेय एवं प्रेय प्राप्त करसकता था lत्रेता में ज्ञान प्राप्त करनाद्वापर में यज्ञ करना परम धर्म मानागेका है कलियुग का धर्मं केवल दान को ही माना गया है l

एक एक युग का एक एक धर्मं इसलिए बतायागया है, युग युग में धर्म घटता जानेसे आचरण के 

मार्ग भी सरल करते गए हैं l बाधा इस बात की है कि इस कलयुग में लोग धर्म या दान करने 

केलिए ज्यादा हिचकिचाते हैं l लोग दान नहीं करने केलिए कई वजह ढूंढते हैं l

भिखारी दान माँगने केलिए नहीं बलकी डा देनेका अवसर हमें डे रहा है l वैसे अच्छे अवसर हमें 

खोना नहीं l हमें उसे उसके पात्रता के अनुसार दान जरूर देना है l

 ऊपर दिए  तीनों श्लोक एक ही अर्थ हमें सम्झारहे है l एक के बदले अनेक ग्रंथों में इसलिए 

कहागया है की इस सत्य वाक्य को किसी न किसी किताब में पढने से आदमी उसका पालन कर 

सकता है l

हम अब कलियुग में रह रहे हैं l उसलिये हम दान गुण अपनाएंगे तो बस, मुक्ति मिलसकती है l 

ध्यान इस विषय का भी रहना चाहिए की अपात्रदान नहीं करे l लेकिन, आदमी चाहे कोइ भी हो , 

जो भूका है, नंगा है, या रहनेका आस्था व वसति नहीं हैं उसके पात्रता के बारेमें बिना सोचे दान 

करना चाहिए l हमारे पूर्वज ऐसा कहते हैं :

दारिद्रय कृतं दानं शून्य लिंगस्य पूजनं l

अनाथ प्रेत संस्कारम् कोटि यज्ञ समं विधुः ll

दीं दरिद्रों को सहायता करना व दान देना, बिना पूजा के पड़े रहे शिव लिंगों का पूजा करना, 

अनाथ शव का दहन संस्कार करना करोड़ यज्ञों का फल देता है l

tapa para ktayuge tretāyā jñānamucyate 

dvāpare yajñamityūcu dānameka kalau yuge 

parāśarasmtiThe same shloka is seen in Manusmruthi also.

In ktayuga penance was best; in tretāyuga, knowledge, it is said; they say yajna and yaga in the dvāparayuga; but in Kaliyuga, it is only Daana i.e. giving or serving needy to the best of our ability.

Ktayuga better known as satyayuga, is the first of the cycle of 4 yugas. During that Yuga, very tough and rigid penances were deemed as the most rewarding. Dharma was very well established and to be the most virtuous, one needed to perform intense penances and meditations.

 After some dilution of dharma, came the tretāyuga. During that epoch, one could attain liberation through the mode of jñāna (knowledge). Learning the scriptures and leading a pious life were essential to be virtuous. THIS NEEDS VIGOUROUS Sadhana.

 Further fall of dharma gave rise to the dvāparayuga. In this age, one was required to perform sacrifices and give offerings to the deities through the fire in order to increase their virtues.

 After dharma dwindled furthermore, kaliyuga came. Here time is crunched and values are compromised easily! One has to work really hard to keep on track from distractions and attractions.  During this Yuga, to be virtuous, all one needs to do is give danam selflessly! Gaining virtue has been made so simple. One doesn't have to perform very rigorous penances nor understand multitudes of scriptures nor perform tough sacrifices. Giving up the attachment to possessions and sharing with fellow beings generously is all that is required to make one virtuous! Is that too much to ask for? Unfortunately people hesitate to be generous. They always search for virtual mala fides in the people who approach them and search for reasons hectically to avoid them, think it as their greatness and attribute it to their intelligence.

 Giving can be at various levels. "If you have much, give of your wealth; if you have little, give of your heart." It is not what is given that matters as much as how it is given. You give little when you give your possessions. It is when you give selflessly that you truly give. Sibi Chkravarthi, Dadhichi, Karna etc. are the role models from the Puranas.

Give heartily!

స్వస్తి.

**************************************

No comments:

Post a Comment