Tuesday 25 May 2021

అజరామర సూక్తి – 251 अजरामर सूक्ति – 251 Eternal Quote – 251

 

అజరామర సూక్తి  251

अजरामर सूक्ति  251

Eternal Quote  251

https://cherukuramamohan.blogspot.com/2021/05/251-251-eternal-quote-251.html

वस्त्रेण वपुषा वाचा विद्यया विनयेन च ।

वकारैः पञ्चभिर्हीनः नरो नायाति गौरवम् ॥

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చl

వకారైః పంచభిర్హీనః నరో నాయాతి గౌరవం ll

శుభ్ర వస్త్రాలు దేహమ్ము శుద్ధ వాక్కు

విద్య వినయమ్ము లను ఐదు విలువగల్గు

గుణ సమూహము లేకున్న కూడబోదు

గౌరవము మానవునికిల కచ్చితముగ

అన్నారు మన పెద్దలు . అంటే మనిషి వ్యక్తిత్వాన్నిసూచించే  అంశాలు ఐదు ఉన్నాయి.  

అవే౦టంటే వస్త్రం రూపం మాటతీరు విద్య వినయం  అనేవి . వాటిగురించి 

క్రమంగా తెలుసుకుందాం .  

1.       వస్త్రం : ఒక వ్యక్తి ధరించే బట్టలు అతడు ఎటువంటి వాడో తెలుపుతాయి. 

అందువల్ల ప్రతివ్యక్తి తనకున్నంతలో  ఎప్పుడు పరిశుభ్రమైన బట్టలనే  ధరించాలి. 

మురికి బట్టలు వేసుకో కూడదు .  వేసుకొన్న బట్టలు వ్యక్తి  యొక్క హుందాతనాన్ని 

ప్రతిబింబించేవిగా ఉండాలి . ఇక్కడ మంచిబట్టలంటే ఖరీదైన బట్టలని కాదు 

పరిశుభ్రమైన బట్టలని మాత్రమే  . సమాజంలో   కొంతమంది బట్టలను బట్టి 

గౌరవించేవారు కూడ ఉంటారు.

అందువల్ల పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఎవరూ ఆక్షేపించే విధంగా ఉ౦డకూడదు . 

అందుకే పెద్దలు ఈ విధముగా చెప్పినారు.

వస్త్రేణ వపుషా మూర్ఖాః పందితనాం సభాస్వాపి l

ఛత్ర న్యాయేన రాజన్తే సత్సగా ఫలమీ దృశం ll

శుభ్రమైన బట్టలతో పండితుల సభలో కూర్చున్న వ్యక్తి తాన పండితుడు కాకున్నా , నోరు 

మెదపనంతవరకూ, ధరించిన బట్టలచే సభలో గౌరవమును, తెరువబడిన 

గొడుగులున్న వారి నడుమ గొడుగు లేనివాడుకూడా ఉన్నవానివలేనే గుర్తింపు 

పొందుతాడు. మరియొక శ్లోకమును చూడండి.

కుచేలినం దంతమలాపహాసినం

బహ్వాశన౦ నిష్ఠురవాక్యభాషిణ౦

సూర్యోదయే చాస్తమాయే చ శాయినం

విముంచతి శ్రీ రపి చక్రపాణిన౦

మాసిన బట్టలు వేసుకున్న వ్యక్తిని,  ముఖ ప్రక్షాళనము చేసుకొనని వాడిని,  

తిండిపోతును,  కఠినంగా మాట్లాడేవానినిసూర్యోదయ - సూర్యాస్తమయ వేళల్లో 

పడుకునే వానిని లక్ష్మి దరిజేరదట. ఒక వేళ ఆ పనులు విష్ణువు చేస్తున్నా అతన్ని విడిచి 

పెట్టేస్తు౦దట.  కావున మనము  ఇతరులు ఆక్షేపించే విధంగా కాకుండా పరిశుభ్రమైనవి 

సంస్కారము ఉట్టి పడేవిధమగ బట్టలు ధరించాలి.

    2. రూపము :-  ఇది రెండో అంశము .  మనిషి రూపాన్ని బట్టి కూడ ఒక్కొక్కప్పుడు 

వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. “యత్రాకృతి: తత్ర గుణా: భవంతి” అన్నారు మన పెద్దలు . 

ఎక్కడ రూపం ఉంటుందో అక్కడ గుణాలు కూడ ఉంటాయని ప్రతీతి .  అంటే 

అందంగా ఉన్న ప్రతివాడు మంచివాడని  అందవికారంగా ఉన్నవాడు చెడ్డవాడని 

అర్థంకాదు. రూపం గుణాన్ని చాటే అంశాల్లో ఒకటని  మాత్రమే. అందువల్ల ప్రతిమనిషి 

తనకున్నంతలో ఆకర్షణీయంగాహుందాగా  గంబీరంగా కనిపించాలి .

౩. వాక్కు :- ఇది మూడోది . మనిషి వ్యక్తిత్వం మాటతీరును బట్టి చెప్పొచ్చు . 

కొంతమంది మృదువుగా మాట్లాడతారు కొంతమంది కఠినంగా మాట్లాడతారు . 

ఎంతో కఠినమైన విషయాన్ని కూడ మృదువుగా చెప్పొచ్చు . కొంతమంది ప్రతి చిన్న 

విషయాన్ని చాల కఠోరంగా మాట్లాడతారు . అందువల్ల ఇతరులకు బాధకలగకుండా 

మాట్లాడ గలగాలి . సందర్భోచితముగా తలచి నేను వ్రాసిన పద్యమును ఈ దిగువ 

పొందుపరచినాను.

మాట వలన జరుగు మహిలోన కార్యముల్

మాట వలన పెరుగు మైత్రి ,కనగ

మాట నేర్వకున్న మనుగడ లేదిది

రామమోహనుక్తి రమ్య సూక్తి

4. విద్య :-  ఇది నాల్గవ అంశము . మనిషికి విద్య నిజమైన అలంకారము. ‘విద్యకు సాటి 

ధనంబు లేదిలన్’ అనియు ‘విద్యలేని వాడు వింతపశువు’ అనియు భర్తృహరి నీతి 

శతకము ఘోషిస్తూ ఉన్నది. ఇప్పుడు చదువు ‘కొన్న’వారు కొందరు సంతపశువుల 

నాదర్శముగా  తీసుకోనుచున్నారు.

తల్లిదండ్రి సుతుల దరిజేరి చక్కగా

నీతి బోధనములు నేర్పిరేని

నీతిమంతుడగుచు జాతిని నిలబెట్టు

రామమోహనుక్తి రమ్య సూక్తి

"మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠిత: l” “న శోభతే సభా మధ్యే హంస మధ్యే 

బకో యథా" అంటుంది పంచతంత్రం . అంటే పిల్లల్ని చదివించని తల్లి తండ్రి వారి 

పాలిట శత్రువులట. ఎందుకంటే  చదువులేని వాడు సమాజములో హంసలమధ్య 

కొంగలా తేలిపోతాడట. అంతేకాకుండా “పుత్ర: శత్రు: అపండిత:” అని కూడ 

చెబుతుంది పంచతంత్రం. అంటే చదువుకోని సంతానము తల్లితండ్రుల  

పాలి శత్రువులట.

అందువల్ల తల్లిదండ్రులు విధిగా తమపిల్లల్ని చదివించాలి. పిల్లలు విధిగా చదువుకోవాలి.

5. వినయము: ఇది ఐదవ అంశము. చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు 

వినయము కూడ అంతే ముఖ్యం. అందువల్ల మనిషి ఎంత విద్యావంతుడౌతాడో   అంత 

వినయవంతుడు కూడ కావాలి . వినయంలేని విద్య వాసన లేని పువ్వు వంటిది . అది 

ఎవరికీ ఉపయోగ పడదు . తనకు కూడ పనికిరాదు. 

మనిషి ఈ ఐదు అంశాలను జాగ్రత్తగా పరిశీలించి తగిన విధంగా మసలుకుంటే అది 

వ్యక్తిత్వవికాసానికి ఎంతో దోహదము చేస్తుంది.

वस्त्रेण वपुषा वाचा विद्यया विनयेन च ।

वकारैः पञ्चभिर्हीनः नरो नायाति गौरवम् ॥

इन सभी 5 '-कार माने 'वासे शुरू होने वाले शब्द के बिना एक व्यक्ति सम्मान प्राप्त नहीं 

करसकता है: ओ पांच इस प्रकार है : कपडरूपभाषणज्ञान और विनम्रता

किसी व्यक्ति को सम्मान प्राप्त करने के लिए कुछ बुनियादी आवश्यकताएं होती हैं यहां सभी पांच 

आवश्यकताएं 'वासे शुरू होती हैं

 1. वस्त्र (कपड) । इंसानों के लिए समाज में जरूरी है यह कपडे फालतू और महंगा होना जरूरी 

नहीं हैबस सभ्य और उपयुक्त रहेंगे तो

2. वपुष (शारीरिक सुन्दरता व शुभ्रता) । यह केवल शारीरिक सुंदरता की बात नहीं कर रहा हैबल्कि 

आंतरिक सुंदरता और स्वच्छता व्यक्ति का जौरव बढाता है

3. वाका (भाषण) । व्यक्ति की वाणी सुखदआकर्षक और हानिरहित होनी चाहिए

4. विद्या (ज्ञानशिक्षा) । एक व्यक्ति के लिए उपरोक्त तीन 'वकारबरकरार रखने के लिए यह बहुत 

महत्वपूर्ण है शिक्षा दुनिया और खुद को बढ़ावा देती है यह मुक्ति प्राप्त करने का एक अचूक 

तरीका भी है

5. विनययह किसी भी इंसान के लिए यह गुण सबसे महत्वपूर्ण है चाहे वह अमीर हो या गरीबयुवा 

हो या बूढ - नम्रता ही एक ऐसा आभूषा है जिसे वह हर समय अपने साथ रखना चाहिए

जिस व्यक्ति में उपरोक्त सभी गुण होते हैंवह जहाँ भी जाता हैस्वतः ही मान-सम्मान प्राप्त कर 

लेता है

vastrea vapuṣā vācā vidyayā vinayena ca 

vakārai pañcabhirhīna naro nāyāti gauravam 

 A person without all these 5 'va' kaaraa-s (words starting with 'va') does not attain respect: 

clothes, appearance, speech, knowledge and humility.

For a person to attain respect, there are a few basic requirements. All the five requirements quoted here start with the Sanskrit alphabet 'va'.

1. Vastra (clothes). For humans, being absorbed in society is necessary. It doesn't 

have to be extravagant and expensive but just decent and appropriate.

2. Vapuṣā (appearance). This is not just referring to physical beauty, but more the 

presentability of a person, in reference to inner beauty and cleanliness.

3. Vācā (speech). One's speech should be pleasant, appealing and harmless. 

Speech is the most invaluable component for human being which enriches or 

enhances his stature in the society.

4. Vidyaa (knowledge, education). This is very important for a person to have, in 

order to possess the above three 'VA’kāra-s. Education gives one awareness of the 

world (and himself). It is also the one surefire way to attain liberation (Mukti).

5. Vinaya (humility). Above all Vinaya is the most important adornment to any 

human being. Whether he is rich or poor, young or old - humility is the one 

adornment he can carry with him at all times. A person without humility is as good 

as a king having crown but not clothes.

The person having all the above qualities, automatically attains respect wherever 

he is.

స్వస్తి.

No comments:

Post a Comment