Friday 7 May 2021

అజరామర సూక్తి – 232 अजरामर सूक्ती - 232 Eternal Quote – 232

 అజరామర సూక్తి  232

अजरामर सूक्ती -  232

Eternal Quote – 232

https://cherukuramamohan.blogspot.com/2021/05/232-232-eternal-quote-232.html

असंशयं क्षत्र परिग्रहक्षमा यदार्यमासामाभिलाषिमे मनः l

सतां हि सन्देहपदेषु वस्तुषुप्रमाणमन्तकरण प्रवृत्तयः ll अभिज्ञान शाकुंतलम् – कालीदास

 

అసంశయం క్షత్ర పరిగ్రహక్షమా యదార్య మాసామాభిలాశిమే మనఃl

సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణమంతకరణ ప్రవృత్తయః ll

అభిజ్ఞాన శాకుంతలము (కాళీదాసు)

దుష్యంతుడు వనములో శకుంతలను చూస్తాడు. అక్కడ ఆమెతోబాటు ఆమె సఖి ప్రియంవద కూడా ఉంటుంది. ఆ సందర్భములో శకుంతలకు ఇష్టమైన ‘వనజ్యోత్స్న’ అని పేరు పెట్టుకొని పిలిచే లత అందమైన నిటారుగా ఉన్న ఆమ్ర వృక్షమునకు చుట్టుకొని ఉంటుంది. వన జ్యోత్స్న ను గూర్చి శకుంతలతో ప్రియంవద గుర్తుచేస్తే ఆ లతను మరచితే నన్ను నేను మరచిపోయినట్లే అంటుంది. ఆ సందర్భములో నా సఖి శకుంతలకు కూడా వనజ్యోత్స్న కు దొరికిన మామిడి చెట్టువలె అందమైన పురుషుడు దొరుకవలెనంటుంది.

దుష్యంతుడు అది తానే ఎందుకు కాకూడదన్న ఆలోచనలో పడతాడు.

ఆ సందర్భములో తనలో తాను ఈ విధముగా తలపోస్తాడు:

 “శకుంతల ఒక క్షత్రియుడు పాణిగ్రణము చేయుటకు యోగ్యురాలు. ఎందుకంటే శ్రేష్ఠమైన నా మనసు అందుకు అభిలషించుతూ ఉంది. శ్రేష్ఠ పురుషుల అంతఃకరణము అబద్ధమాడదు. ఈవిడ క్షత్రియ పరిణయమునకు యోగ్యురాలు అని నా అంతరాత్మ చెబుతూ ఉన్నది.

ఋజుమార్గములో నడచే వ్యక్తికి  తన నడవడిక మీద గానీ తానూ చేయబోయే పనిమీద గానీ సందిగ్దత ఏర్పడినపుడు ఆత్మ బుద్ధినే అనుసరించుతాడు . మనువు కూడా ‘సాధూనామాత్మానః తుష్టిరేవ’ అని అన్నాడు. 'ఆత్మ బుద్ధి సుఖంచైవఅన్నారు కదా ఆర్యులు కూడా!

असंशयं क्षत्र परिग्रहक्षमा यदार्यमासामाभिलाषिमे मनः l

सतां हि सन्देहपदेषु वस्तुषुप्रमाणमन्तकरण प्रवृत्तयः ll अभिज्ञान शाकुंतलम् – कालीदास

 सहेली प्रियंवदा  शकुन्तला को उसकी, वनज्योत्सना नाम का  प्रियालता की याद दिलाती है l तब शकुन्तला कहती है अगर मै इसे भूल जाऊंगी तो स्वयं को ही भूल जाऊंगी l वह कहती है की इस आम्र वृक्ष और वनाज्योत्सना का मिलन बहुत सुन्दर समय में हुआ है l प्रियंवदा सामने वाले दुष्यंत से यह बोलती है की शाकुंथालाभी वनज्योत्सना के जैसा आम्र वृक्ष उन्हें भी मिले l

तब दुष्यंत ऐसा सोचता है:

निश्चित रूप से शकुन्तला क्षत्रिय के द्वारा पत्नी रूप में ग्रहण करने योग्य है, क्यूँ की मेरा श्रेष्ट मन इसका अभिलाषी है l फिर वह अपने संदेह का निवारण इस निश्चय से करता है कि जहाँ संदेहास्पद विषय ह,  व्वाहान श्रेष्ठ व्यक्ति के अन्तःकरण के वृत्ती ही प्रमाण होती है क्यूँ की मेरा श्रेष्ठ मन इसकी और आकृष्ट होरहा है अतः निश्चित रूप से यह क्षत्रिय के परिणय योग्य है l

इस सूक्ति का परमार्थ ए है कि जहाँ विषय संदेहास्पद हो वहाँ सज्जनों की अन्तःकारण की वृत्थियाँ ही कर्त्तव्य और कर्त्तव्य का निश्चय करनेवाली होती है l मनुस्मृति में भी कहा है ‘साधूनामात्मानः तुष्टिरेव’.

Asamshayam kshatra parigrahakshamaa yadaaryaamaasaamaabhilaashime manaH l 

Sataam hi sandehapadeshu vastushu Pramaanam antahkarana pravruttayah ll

Abhijnana shaakuntalam – Kalidas

 For people of character, when in a dilemma whether a particular conduct or deed is good or bad, their own inner voice or conscience is the final arbiter.

 While Sakuntala was with her dearest  friend  Priyamvada, Priyamvada says “your most loved creeper Vanajyotsna spiraled the mango tree which is so robust and nice. She says the same to Raja Dushyanth also. After listening it Dushyant thinks “My soul says her to be fit to be married by a Kshatriya. People of pure heart in the absence of a suitable advice from a suitable person like a Guru, goes by his heart. Even Manudharma shaastra confirms it.

స్వస్తి.

No comments:

Post a Comment