Saturday 22 May 2021

అజరామర సూక్తి – 248 अजरामर सूक्ति – 248 Eternal Quote – 248

 

అజరామర సూక్తి  248

अजरामर सूक्ति  248

Eternal Quote  248

https://cherukuramamohan.blogspot.com/2021/05/248-248-eternal-quote-248.html

काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः ।

वसन्तकाले संप्राप्ते काकः काकः पिकः पिकः ॥ कुवलयानन्द

 

కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః ।

వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః ॥ - కువలయానంద కావ్యము

కాకినలుపుకోయిలకూడా  నలుపు. మరి ఆ రెండింటి మధ్య భేదమేమున్నది?

 కాకి కోకిలల మధ్య భేదము ఎప్పుడు తెలుస్తుందంటే వసంత కాలము

మొదలైనప్పుడుకాకిది కఠోరమైన అరుపుగానూ, కోయిలది శ్రవణానందకరమైన

కూతగానూ తెలియవస్తుంది. పుడుతూనే కాకి, కోకిల ఒకేవిధంగా ఉంటాయి. వాటిని 

వేరు చేయడం కొంత కష్టమైన పనే. పైగా రెండూ కాకి గూటిలోనే ఉంటాయి. జాగ్రత్తగా 

పరిశీలిస్తే తప్ప ఆకారంలోనూతేడా కనిపెట్టడము కాకికే కష్టము. కానీ వసంతకాలం 

ఆరంభమైన వెంటనే పిల్ల కోయిల గొంతు విప్పుతుంది. కాకి దానిని వెంటనే తరిమి 

వేస్తుంది. మామిడి మొదలైన చెట్ల చిగురాకులని తినికోకిల తన గొంతు సవరించుకుని 

గళం విప్పి షడ్జమం లో కూయడం మొదలుపెడితేఆ అద్భుతమైన స్వరానికి సకల జీవ 

జాలమూమనుష్యులతో సహా సమ్మోహనం చెందక తప్పదు ఆ గాత్ర మాధుర్యములో. 

అప్పుడు మనక్లు అవగతమౌతుంది  కాకి అరుపునకు, కోకిల నిస్వనమునకు గల తేడా!

అదే విధముగా సజ్జనులనూసాదువులనూవిశేష ప్రతిభావంతులనూ

మహానుభావులనూమహాపురుషులనూ సామాన్య జనావళినుండి, వారివారి 

ప్రత్యేకతలను గమనించినపుడు  మనము గుర్తించగలము అన్న వాస్తవమును, 

 పరోక్షంగా ఈ సుభాషితము మనకు తెలియజేస్తూ ఉన్నది. రూప లావణ్యాలతో

అవయవాల అమరికతో మనుష్యులందరూ ఒకే విధంగా కనపడిననూవారు అందరూ 

ఒకే విధమైన వారు కాదు. వారి వారి చదువులూసంస్కారమూముఖ్యముగా 

మాటతీరు, స్నేహశీలతఉన్నతభావ సమాగమముదృక్పధముభావ వ్యక్తీకరణశాస్త్ర 

పాండిత్యాముసకల మానవ సౌభ్రాతృత్వము, మానవతాయుత మమతానురాగాములు

విశ్వ కళ్యాణ పృక్తసదాశయ సాధకత్వము వంటి లక్షణాలను బట్టి,  వారిని సాధారణ 

మానవ సమూహాలనుండి వేరుగా చూడ గలము.

బలుపును జూచి మోసపోక చిన్నగా ఉన్నా ఎంతో మిన్నయగు మనిషి మనస్తత్వమును 

గమనించమని  ఈ సుభాషితము పరోక్షముగా మనలను హెచ్చరించుతూ వున్నది. 

ఇదే వాస్తవమును తెలుపుచున్న నేను వ్రాసిన ఈ దిగువ పద్యమును ఒకపరి పరికించేది.

మేలు చెలమ నీరు మినరలు వాటరు

శుద్ధముగనె యుండు చూచుటకును

స్వాస్త్యమొసగు చెలమ జలముకు సరిసాటి

బ్రాండు వాటరెట్లు బరగనగును

काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः ।

वसन्तकाले संप्राप्ते काकः काकः पिकः पिकः ॥ कुवलयानन्द

कोयल भी काले रंग की होती है और कौवा भी काले रंग का ही होता है फिर दोनों में क्या भेद (अन्तर) हैवसन्त 

ऋतु के आगमन होते ही पता चल जाता है कि कोयल कोयल होती है और कौवा कौवा होता है।

कौआ कोकिला पहले तो एक ही घोस्लेमे कव्वे के अंडे के साथ रखती है l जनम के बाद वे दोनों साथ साथ घूम सकते हैंऔर 

दोनों एक ही तरह खाना और उड़ान का भी कोशिश करसकते हैं । लेकिन ये केवल बाहरी नकलें होंगी। पहले पहल 

जाब कोयल अपने गलेसे आवाज निकालती है तो कव्वा उसे अपने घोस्लेसे हटा देता है l

एक कोकिला का वास्तविक स्वरूप उसकी मधुर आवाज हैजो एक कौवे में अनुपस्थित है। कौवा और कोकिला का 

रूपक यह बताने के लिए दिया गया है कि हमें वही होना चाहिए जो हम हैं। अगर हम बात करने मेंचलने या किसी 

और की तरह काम करने में अच्छा नहीं होता हैऐसा नक़ल करने में हम दूसरों से पकडे भी जासकते हैं l  इस धरती पर 

प्रत्येक प्राणी अनमोल है और ईश्वर ने प्रत्येक प्राणी को एक उद्देश्य के साथ बनाया है। 'दूसरोंकी भूमिकाएं  हम 

लेनेका कोइ प्रयास नहीं करनी चाहिए।  हम किसी ऐसे व्यक्ति होने का नाटक करने के बजाय स्वयं बनें जो हम खुद 

हैं। बाहरी दिखावे से कोई फर्क नहीं पड़ताजो अंदर है वह सब मायने रखता है!

 kāka kṛṣṇa pika kṛṣṇa ko bheda pikakākayo 

vasantakāle saprāpte kāka kāka pika pika  kuvalayānanda

 A crow is black, a nightingale is black... what's the difference between the two? Come spring, a crow 

is a crow, a nightingale is a nightingale.

In appearance, a crow and a nightingale aren't very different. A crow is black and so is a 

nightingale. How can we tell the difference? It doesn't matter because when spring 

arrives, the difference will instantly become evident! While a nightingale sings 

melodiously, a crow... well... crows. The crow can hang out with the nightingale; and try 

to eat like him or fly like him. But these would only be external imitations. The true 

nature of a nightingale is its sweet voice, which is inimitable by a crow.  (A crow is 

special in its own way and contributes in ways he was made for!)

The metaphor of the crow and nightingale is given to illustrate that we must be who we 

are. It doesn't do much good if we talk, walk or act like someone else. Each and every 

being is precious on this earth and God made each being with a purpose. The roles of 

'others' are already taken..., by other people, obviously :). Let's be ourselves instead of 

pretending to be someone who we are not.

External appearances don't make a difference, what's inside is all that matters!

స్వస్తి.

No comments:

Post a Comment