Sunday 9 May 2021

అజరామర సూక్తి – 235 अजरामर सूक्ती - 235 Eternal Quote – 235

 అజరామర సూక్తి  235

अजरामर सूक्ती -  235

Eternal Quote – 235

https://cherukuramamohan.blogspot.com/2021/05/235-235-eternal-quote-235.html

 नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः ।

विक्रमार्जितवित्तास्य स्वयमेव मृगेन्द्रता ॥ - हितोपदेशसुह्रुद्भेद

 

నాభి షేకో న సంస్కారః సింహస్యక్రియతే మృగైఃl
 
మార్జిత విత్తాస్య స్వయమేవ మ్రుగేంద్రతాll

సింహమునకుఅడవి జంతువులచేత,  అభిషేకము గానీఇతర సంస్కార ప్రోక్షణములు 

గానీ,  చేయబడలేదు. అది కేవలము తన  పరాక్రమముతోమాత్రమే  స్వయముగా

ఆర్జించినరాజ్యమునకు,  మృగేంద్రతను సిధ్ధించుకొన్నది. అంటే తన పరాక్రమము చేత 

మాత్రమే రాజయినదిఅన్యథా కాదు.

అరణ్యములోని జంతువులన్నీ కలిసి వచ్చి, “నీవే మా అరణ్యానికి అంతటికీ రాజువునీవు 

మమ్మల్ని పరిపాలించు!” అని పవిత్రమైన గంగా జలాలని శిరస్సు మీద జల్లిసింహానికి 

సంస్కార ప్రోక్షణలుఅభిషేకాలు చేసి రాజ్యాభిషిక్తుని చేయలేదు. సింహము తన స్వంత 

పరాక్రమముతోనే మృగరాజయినది.

స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారుస్వయంశక్తి అనగా తమ శారీరిక బౌద్ధిక 

బలములతో, తలపెట్టిన కార్యసాధనని సాఫల్యం చేసుకుంటారు. వారికి తమ  ప్రతిభా 

పాటవాలుస్వయంకృషి అన్న సాధనములు మాత్రమే ఉపయోగించుకొంటారు. 

తద్వారా లక్ష్యమును సాధించుతారు. ప్రయత్నమే  ప్రగతికి మార్గము అన్నది ఈ శ్లోకము ద్వారా మనకు తెలియవస్తూ వున్నది. ‘స్వయం కృషి స్వరూపమే’ నాయకుడు. ‘ఒకరు పెట్టే సద్ది, ఒకరు చెప్పే బుద్ధి’ ఎంతకాలము సాధ్యమౌతుంది.

नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः ।

विक्रमार्जितवित्तास्य स्वयमेव मृगेन्द्रता ॥ - हितोपदेशसुह्रुद्भेद

 

 अभिषेक  संस्कार सिंह के लिए करते है मृग अर्थात जंगल के जीव जंतु जैसे हिरनवन के राजा सिंह को राजा बनाने के लिए उसका  अभिषेक करते है  अन्य कोई संस्कार विक्रम अर्थात पराक्रम से अर्जित राज्य के लिए स्वयं हि सिंह कर्म करता है अर्थात सिंह स्वयं अपने पराक्रम से हि स्वयं के लिए राज्य अर्जित करता है और जंगल का राजा बनता हैl

पराक्रम से राज्य बनाकर उसका राजा स्वयं हि बना जाता है और इस हेतु किसी से अभिषेक या संस्कार कराने की आवश्यकता नहि हैl  इस श्लोक या मंत्र का भाव है की कर्म हि प्रधान हैराज्य पराक्रम /कर्म से हि बनाया जाता हैपाखंड (अभिषेक आदि )की परवाह नहि करनी है l बुद्धिमत्ता और परिश्रम ही आदमी को पहचान बनासकते हैं कुछ और नहीं l

nābhieko na saskāra sihasya kriyate mgai 

vikramārjitavittāsya svayameva mgendratā ॥ - hitopadeśa, suhrudbheda

No coronation or ritual is done by animals; Acquisition (of territory) due to natural prowess makes him King of the jungle.

Actions speak louder than words!

A lion majestically roaming in the jungle did not have a crowning ceremony, nor were any rituals performed by the other animals for him. He doesn't even have to be declared as the King of the Jungle. All the other animals know by his power, courage, valor and fearlessness that he is the rightful king! Such should be the effect of our actions.

Whatever be the quality: bravery, piety, generosity, nobility, or intelligence, the asset should be expressed through its respective deeds rather than just speech.

Let actions speak for themselves!

స్వస్తి.

No comments:

Post a Comment