Wednesday 26 May 2021

అజరామర సూక్తి – 253 अजरामर सूक्ति – 253 Eternal Quote – 253

 

అజరామర సూక్తి  253

अजरामर सूक्ति  253

Eternal Quote  253

https://cherukuramamohan.blogspot.com/2021/05/253-253-eternal-quote-253.html

वयाम्सि पशवाश्चैवा भूतानि च जनाधिपा l

गृहस्थैरेव धार्यन्ते तस्माच्च्रेष्ठो गृहाश्रमी ll (सं० वि० गृहाश्रम प्र०)

వయాంసి పశవశ్చైవ భూతాని చ జనాధిపా l

గృహస్థైరేవ ధార్యంతే తస్మాచ్ఛ్రేష్ఠో గృహాశ్రమీ ll (సంవిగృహస్తాశ్రమ ప్ర)

చతుర్విధ ఆశ్రమములు ఈ విధముగా చెప్పబడినాయి. బ్రహ్మచర్యగృహస్థవానప్రస్థ

సన్యాసాశ్రమములు. వీనిలో గృహస్థ ధర్మము అత్యంత శ్రేష్ఠమైనది. ఎందుకంటే మిగతా 

మూడు ఆశ్రమ ధర్మాలవాళ్ళనూ పోషించ గలిగింది పోషింప వలసినది వాళ్ళే .

పక్షులు పశువులు మానవులు గృహస్థులచేతనేకదా పోషింపబడేది. అందుకే అది 

శ్రేష్ఠతమము.

కృత, త్రేతా, ద్వాపర యుగములలో సన్యసించిన వారాలలో ప్రస్ఫుటముగా కనిపించే 

పేరు  శుకబ్రహ్మదే! ఆయన కౌపీనము కూడా లేకుండా పుడుతూనే అడవులకు 

వెళ్ళిపొయినాడు. శ్రీకృష్ణుడు జగద్గురువైనా పెల్లయినవాడు పైగా ఆయన కూడా 

ద్వాపరమునకు చెందినవాడు. పరమాత్మ తరువాత ఆ పట్టమునండి పుచ్చుకొన్న 

మహనీయుడు ఆదిశంకరులవారు(క్రీ.పూ. 509-477). ఆ తరువాత ముఖ్యముగా 20, 

21 శతాబ్దములలో ఎంతోమంది, బాబాలు, స్వాములు, గురువులు ప్రభవించినారు. ఆది 

శంకరులు క్రీ.పూ. 5వ శతాబ్దికే ఈ మాట చెప్పినారు;

 

జటిలో ముండీ లుంజిత కేశః కాషాయాంబర బహుకృత వేషః l

పశ్యన్నపిచన పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః ll

చాలా మంది జటలు ధరించి.. లేదా గుండు గీయించుకుని కాషాయవస్త్రాలను ధరించి 

అనేక వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటి కోసమేగానీ వీరు కళ్లతో చూస్తూ 

కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు అని దీని అర్థం. ‘భజగోవిందం’లో 

శంకరాచార్యులు తొలి పన్నెండు శ్లోకాలు (ద్వాదశ మంజరికా స్తోత్రం) చెప్పిన 

అనంతరం వారి శిష్యులు 14 శ్లోకాలు చెప్పినట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. వాటిని 

‘చతుర్దశ మంజరికా స్తోత్రం’గా వ్యవహరిస్తారు. వాటిలో మొదటి శ్లోకమే ఇది. 

శంకరాచార్యులవారి శిష్యుడైన పద్మపాదాచార్యులవారు దీన్ని చెప్పినట్లు ఆర్య వాక్కు. 

కష్టపడకుండా హాయిగా జీవించాలనిలేదా తక్కువ పని చేసి ఎక్కువ లాభం 

పొందాలని మానవులు సహజంగా భావిస్తుంటారు. దానికి సన్యాసమే సరియైన 

మార్గమని నాటికే ఉండినారంటే, అట్టివారు ఈ రోజుల్లో ఉండుట పెద్ద ఆశర్యమైన 

విషయమేమీ కాదు.

 నిజానికి ఐహిక భోగములను సంపూర్ణముగా తృణీకరించి మనసును పరమాత్మ పై 

నిలిపిన వాడే నిజమైన సన్యాసి. అందుకే వేమన ‘హృదయముపదిలంబైతేగుదికొను 

సన్యాసమునకు కొమ్ములుగలవే’ అంటాడు. నిజమైన సన్యాసులు ప్రాపంచిక 

విషయాలను వదిలిపెట్టి జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకుని దాన్ని సాధించడానికి 

సాధన చేస్తుంటారు. నిరంతరం పరమాత్మకు సంబంధించిన విషయాలను శాస్త్రాల 

ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటూశిష్యులకు బోధిస్తూ ఆ విషయాలనే విచారణ 

చేస్తూ మిగత సమయమును  ధ్యానమునకు  కేతాయిన్చుతూ నిస్సంగులై ఉంటారు. 

అట్టివారు దేహపోషణకు ప్రాధాన్యమివ్వరు. అలాంటివారికి సమాజంలో ఎంతో గౌరవం 

ఉంటుంది. వారిని మహాత్ములుగా పరిగణించి పిలిచి అన్నం పెట్టి తమ జన్మ ధన్యమైనట్టు 

భావిస్తారు గృహస్థులు. అలాంటి గౌరవ మర్యాదలు పొందాలన్నాకడుపు నిండా 

కమ్మని తిండి తినాలన్నా ఆ వేషం వేయాలని కొందరు సోమరులు అనుకుంటారు. ఈ 

మోసగాళ్లు కూడా భగవంతునికి సంబంధించిన మాటలు మాట్లాడుతారు.

నాడు గృహస్థులయి కూడా వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, అత్రి, జమదగ్ని వంటి మహర్షులు 

ధనముపై వ్యామోహమును పొందక అనంత విజ్ఞానమును మనకందించినారు. నేడు 

కేవలము వాక్పటిమ కాశాయములతో దేశములోని ధనరాశులను కొల్లగొడుతున్నారు. ‘సూక్ష్మములో మోక్షము’ దొరుకుతుందని భావించి ‘గొర్రె  కసాయి’ సామెతను 

అనుసరించుతున్నారు.

నిజానికి గృహస్తుది గురుతరమైన బాధ్యత. అతను ఉన్నంతలోతాను తింటూ పరులకు 

పెడతాడు. అందుకే కబీర్ దాసు అంటాడు;

సాఁయీ ఇత్నా దీజియె జామే కుటుంబ్ సమాయ్ l

మై భీ భూకా ణా రహూఁ సాధున భూఁకా జాయ్ ll

అంటే గృహస్తు భగవంతుని ఎల్లపుడు అతిథి అభ్యాగతులకు పెట్టి తానూ అనగా తానూ 

తన కుటుంబము తినగాలిగినంత మాత్రమే ఇవ్వమని కోరుతాడు. అట్టి గృహస్తాశ్రమ 

ధర్మము శ్రేష్ఠతమము.

वयाम्सि पशवाश्चैवा भूतानि च जनाधिपा l

गृहस्थैरेव धार्यन्ते तस्माच्च्रेष्ठो गृहाश्रमी ll (सं० वि० गृहाश्रम प्र०)

जिस से ब्रह्मचारीवानप्रस्थ और संन्यासीइन तीन आश्रमियों को अन्न –वस्त्रादि दान से नित्यप्रति 

गृहस्थ धारण – पोषण करता है इस लिए व्यवहार में गृहाश्रम सबसे बड़ा है । इतना ही नहीं इतना 

ही नहीं. गृहस्ती वनाजलावायु चरों को भी एना देता है उसीलिए गृहस्ताश्रम श्रेष्ठतम मानाजाता 

है lकृत, त्रेता, द्वापर युगों में संसारी ज्यादा थे और वे लोग बहुत रुजू वर्तनी थे l गृहस्त रहतेहुए भी 

वशिष्ठ विश्वामित्र, अगस्त्य आदि ऋषिवर विवाहित थे लेकिन उन लोगों का विज्ञान योगदान का 

कोइ सीमा नहीं है l द्वापर में शुक महर्षि पैदा होते ही सन्यासी बनगएl 

उसीलिए वे शुकाब्रह्मा कहलाए l जगद्गुरु श्रीकृष्ण भी गृहस्ती ही थे l द्वापर के उपरान्त आदि 

शंकराचार्य को ही जगद्गुरु पद प्राप्त हुआ l लेकिन आजकल स्वामीजी बहुत बढ़गए और उनके 

आमदनी भी असीमित होगया l उसीलिए ये ढोंगी सन्यासीलोग केवल धनार्जन केलिए छलको अपनाए 

संसारी होकर भी कई महापुरुष महा विज्नान का योगदान दिए l गृहस्ताश्रम पर्म्पराको ब्धानेका एक 

प्रतिभाशाली उपकरण है l अगर पूरे व्यवसाई सन्यासी बनगे तो अनाज कौन उगाएगा और हम क्या 

खायेंगे l उसीलिए गृहस्ती सबसे अधिक होता है l

The First Ashrama - "Brahmacharya" or the Student Stage

The Second Ashrama - "Grihastha" or the Householder Stage

The Third Ashrama - "Vanaprastha" or the Hermit Stage

The Fourth Ashrama - "Sannyasa" or the Wandering Ascetic Stage

Grihasthaasrama is the one which takes care of all the other three in addition to which it takes care of all the livestock and all the humankind.

During the earlier yugas Mahrshis like Vashishta, Vishwamitra, Agstya, Valmiki, Vedavyaas were all married and their contribution of Vijnan to the world is immeasurable. Now a days Sanyasees are growing leaps and bounds. God only know how many of them have seen and shown the God. On the contrary the claim themselves to be God. One thing these people should remember that they are being fed by Grihasthis only. A person, to realise God, need not become a Sanyasi. Ramakrishna Paramahamsa is a married person. Till a few years back Swami Kandukuri Shivaanandamuyrthi was a Grihasthi.  To become a great scholar, to propagate good to public one need not be a Sanyasi and on the contrary he better be a Grihasthi to feed human and to impart knowledge to the best of his ability.

స్వస్తి.

No comments:

Post a Comment