Monday 4 July 2016

గోమాత సకల శుభదాత

గోమాత సకల శుభదాత

గావౌ విశ్వస్య మాతరః -- వేదవాక్కు అదౌ మాతా గురుర్పత్ని బ్రహ్మాణి రాజపత్నిక
దేనుర్ధాత్రి తథా పృథ్వి సప్తైతాః మాతృ దేవతాః
ధాత్రి = పెంపుడు తల్లి
అసలు ఈ ఏడూ మందిలో కన్నతల్లి, మిగత నలుగురు కన్నతల్లి లాంటివారు కాబట్టి ఈ ఐదుమంది మాత అన్న గొడుగు క్రిందికే వస్తారు. గోవు మాత. భూమి మాత. వీరిది మానవజన్మ కాకున్నా తల్లికన్న మిన్నయైన సేవ మానవాభ్యుదయమునకు చేస్తారు కాబట్టి వారిరువురు మానవులకు తల్లితో కూడి త్రి మాత్రుకలైనారు. వీరుకాక వీరిని కంటికి రెప్పలాగా చూసుకొనే పరాశక్తి అంటే లోకమాత కూడా చతుర్థ మాతృకగా పరిఢవిల్లినది.
దేనునాం కామ దేనుకాః (భగవద్గేత 10-28) ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట.
గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ!
గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం!
భావముః గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము).
'ఆ గావో అద్మన్నుత భద్రమగ్రన్ ' అని శ్రుతి గోవులను ఆహ్వానించుతూ మీరు మీ దూడలతో మా ఇళ్ళముందు తిరుగాడుచుందండి అని తెలుపుచున్నది. అసలు ఎ ఇంటి నుండి ఆవుల అంబారావములు అధికముగా వినిపించుతాయో ఆయింటికి ,ఆఇంటి యజమానికి గౌరవము ఎక్కువ అని అనే వారట.గో+రవము(శబ్దము) =గౌరవము .
గవాం మూత్ర పురీషస్య నోద్విజేత్ కథంచన
నచాసాం మాంసమశ్నీయాద్ గవాం పుష్టీం తథాప్నుయాత్ (మహాభారతము- అనుశాసనికపర్వము 78-17)

గోమూత్ర గోమయములు పవిత్రములు . అవి ఖాద్య యుక్తములు. గోమాంస భక్షణ నిశిద్ధము. గోమూత్ర పురీషములు ఆరోగ్య ప్రదములు. గోమయముతోఇల్లలికేసాంప్రదాయమునుకన్నారా చూసిన వారికితెలుస్తుంది ఆవుెపేడ మాత్రమెదుర్వాసనకలిగియుండదని. మరివేరుఏ జంతువు పురీషముతో కూడా ఇల్లు అలకముగదా! కారణము గోమహిమ తప్ప వేరుకారణము scientists చెప్పగానేనువినలేదు.
మరి ఇన్ని విధములుగా కొనియాడబడిన గోవును తినమని ఎక్కడ చెప్పినారు? చెప్పినారు . అది మిగతా యుగములకు మాత్రమె అన్నది మనము తెలుసుకోవలసినది.. వేదములో ప్రత్యెక సందర్భములలో గోమాంస భక్షణను గూర్చి చెప్పింది వాస్తవము. కానీ శాస్త్రమేమన్నదో చూడండి.
అగ్నిహోత్రం గావాలంబం సన్యాసం పల పైతృకం |
దేవేరాచ్చ సుతొత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్ ||

కలియుగములో అగ్నిహోత్రము, (కొందరు అశ్వమేధం అనిగూడా అంటారు) గోమాంసము,సన్యాసము, తద్దినములందు మాంస వినియోగము,,కట్టుకొన్న భార్యకు సంతాన లేమి ( అంటే దత్తత గానీ ఆమె అనుమతిపై వేరొక స్త్రీని వివాహము చేసుకోనుతగానీ చేయవచ్చును అని శాస్త్రము.)కలియుగములో పాటింప నవసరములేదు అని విశదముగా తెలిపినారు.
అసలు ఎంగిలి అంటనివి రెండే 1.ఆవు పాలు 2. ఆత్మ. ఆత్మా అంటే మనోటి ద్వారా మనలోనికిన్ చేరినది కాదు . కావున దానికి ఎంగిలి అంటదు మరి గుండెకూడా నోటినుండి లోనికి పోలేదు కదా అంటారేమో మనమ్తిన్న ఆహ్హారము ఎంగిలి సారము రక్తమై గుండెను చేరుచున్నది.కాబట్టి ఎంగిలే కదా!
మన దేశములో గోవు పేరుతో ఎన్నో పట్టణాలు, పురములు, ప్రాంతములు ఉన్నాయి. ఉదాహరణమునకు గౌహతి,గోరఖ్ పూర్,గోమటేశ్వర్ ,,గోదావరి,గౌతం, గోద్రా,,గోకర్ణ,గోయల్,గోవర్ధన్,గోచార్ ఇలా ఎన్నో 'గౌ' శబ్దముతో ఏర్పడిన వూర్లు. అసలు ఈనాడు బుడుతకీచుల ( Portuguese ) దయవలన గోవా గా పిలువబడే ఆప్రాంతము అసలు పేరు గోమంతకము. అంతకు మునుపు దానిని గోపకపురి, గోపట్టణము అన్న పేర్లుండేవి. అపభ్రంశమై అది గోవా గా ఆ బుడుతలవల్ల పిల్లువబడితే వారి ఉచ్చిష్టమే మహా ప్రసాదమని మనమారగించుచున్నాము. గోముఖ్ అన్న ప్రదేశము భాగీరథి జన్మస్థానము .గంగ భూమిపై అడుపెట్టినది ఇక్కడే. ఇది గంగోత్రికి ఇంకా40 కిలోమీటర్ల పైన వుంది. అంటే మనము పవిత్రముగా చేసే ప్రతిపనీ గో మయమే. అసలు గోమయము అన్న మాటకు ఆవు పేడఅన్న అర్థము వుంది. అది లక్షిస్థానముు. ఇంటిని పేడతో అలికేవారంటే ఇల్లంతా గోమయము చేసే వారు. అంటే ఇంటిని ఎంత పవిత్రముగా మన పూర్వులు భావించినారో చూడండి. అసలు మనము క్రొత్త ఇంట్లో చేరునపుడు ముందు గోవును లోనికి పంపుతాము. తరువాతే మనము. దీని అంతరార్థము ఏమంటే కట్టింపబడిన ఇల్లు మనకు తెలియని అశుచికి ఎన్నో విధాల ఎరయైయుంటుంది. దానిని ఆశ్రయించి ఎన్నో, ఇంటికి, యజమానికి, నష్టము వాటిల్లజేసే అసురీ శక్తులు ఆవహించి యుండవచ్చు. అందుకే ఆ క్రొత్త ఇంటిలోకి ఆవుది మొదటి యడుగు. అసలు 'గోః ప్రవేశము' గృహప్రవేశమైనదని పెద్దలు అనుకొంటూవుంటే విన్నాను.
రేపు మరికాస్త .........
గోమాత సకల శుభదాత -- 2.
ఈమాట గమనించండి: Professor Jacobi considers the name Surabhi—"the fragrant one"—to have 

originated from the peculiar smell of cows.


According to the Monier Williams Sanskrit–English Dictionary (1899), Surabhi means fragrant, charming, 

pleasing, as well as cow and earth. It can specifically refer to the divine cow Kamadhenu, the mother of 
cattle who is also sometimes described as a Matrika ("mother") goddess.[3]Other proper names 

attributed to Kamadhenu are Sabala ("the spotted one") and Kapila("the red one").[4] 
                                                                                                                  (google)

గోమాహిమలు తెలిపే పౌరాణిక కథల జోలికి నేను పోలేదు. ఎవరైనా ఔత్సాహికులు రోజు ఒకటి వంతున రెండు మూడు రోజులు వ్రాయ వచ్చు.
గోవు - ఆవు అన్న అర్థమే కాకుండా భూమి, కిరణము, స్వర్గము, సూర్యుడు, వేదములు, అన్న అర్థములే కాకుండా ఇంకా కూడా ఎన్నో చెబుతారు . సూర్యుని  కిరణములను తన మూపురమునందు గల సూర్యనాడిచే గ్రహించి తన పాలను అమృతమయము చేస్తుందని దానికి గోవు( 'గో' అంటే కిరణము అన్న అర్థము వున్నదని చెప్పుకొన్నాము కదా ) అన్న పేరు వచ్చినదని యంటారు. ఇక వేరొక విశేషమేమిటంటే పరమేశ్వరునికి గోపతి అన్న నామాంతరము వుంది. 
గోపతి అన్న పదమునకు ఆబోతు, ఇంద్రుడు, .రాజు,సూర్యుడు. సృష్టి స్థితి లయముల కధిపతియైన పరాత్పరునికి గూడా ఆపేరు కలదు. గోలోకము బ్రహ్మ లోకముకన్నా పైన ఉండుట ఆవుకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము. విష్ణువు గోపాలుడైనాడు. ఆయన ఇటు గోవులకు అటు వేదములకు ఆయన రక్షకుడు. అంటే శివ కేశవులిరువురితోనూ గోవు కలిసియుంది.

నమో దేవ్యై మహా దేవ్యై
సురభ్యై ఛ నమో నమః|
గవాం బీజ స్వరూపాయ
నమస్తే జగదంబికే|| 
ఇది స్వర్గలోకమున యుండే సురభి యన్న గోవునకు ఇంద్రుడు చేసే ప్రార్థన అని చెబుతారు.ఇందులో గమనించవలసిన దేమిటంటే
1. సురభ్యై అన్న మాట. సురభి అంటే ఎక్కడలేని హాయిని గొలిపే సువాసన అని ఒక అర్థము . సురభి అంతటి సువాసన కలిగియుంటుందట. 2. ఈ సురభి బీజ స్వరూపియై అన్ని గోవులలో ఉంటుందట. ఆవు పేడ సువాసన కలిగియుండుటకు ఇదే కారణమేమో! వేరు ఏ కారణము ఇంకా మనకు పాశ్చాత్యులు వారి అనుయాయులు మనకు ఇంకా చెప్పలేదు. ఇక దత్తాత్రేయ విగ్రహమును గమనించితే ఆయన వెనుక గోవు వుంటుంది అది కామదేనువే కానివ్వండి వేరేదయినా కానివ్వండి ఆవు ఆవే కదా! అసలు ఆవు కొమ్ముల మొనలో బ్రహ్మ, మధ్యన విష్ణువు మూలమున శివుడు వున్నారన్నది శాస్త్రవచనము. ఈ విధముగా చెప్పుకొంటూ పొతే ఆవును గూర్చి ఎంతయినా చెప్పవచ్చు.

లింగపురాణములో శివుని వర్ణించుతూ " గోక్షీర ధవళం దివ్యం..." అని స్వామిని వర్ణించుతారు. గోక్షీరమెంత గొప్పదో గమనించండి. తెల్లదనమునకు గోక్షీరమెంత పేరో అని నుకొంతున్నారేమో ,గోక్షీరముకన్నా తెల్లగా వున్నవి ప్రపంచములొఎన్నొవునాయి . వానితో ఎందుకు పోల్చలేదంటే అవేవీ ఆవుపాలయోక్క పవిత్రత కలిగి యుండవు. అంటే స్వామి శుద్ధతకు ఆవు పాలు మాత్రమె సాటి. ఈ విశ్వమున వేరేమీ లేవు.
శ్రీ కృష్ణుడు మహాభారతములో ఒక సందర్భములో ఈ మాట అంటాడు :
గోభీర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః
అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ
గోవులు, విప్రులు,వేదములు, పతివ్రతలు, సత్యవ్రతులు, లోభరహితులు, దానశీలురు, అగు ఈ ఎడుగురిచే ఈ భూమి ధరింపబడియున్నది. ఇక్కడ 7గురు గోప్పవారిలో గూడా గోవుదే ప్రథమ స్థానము.ఇవియన్నీ మన నమ్మకములు. 
బయటికి మనలను ఎద్దేవా జేస్తూ, చాపకింద నీరులా అమెరికా,చైనా దేశాలు గోమూత్రాన్ని పేటెంట్ చేసినారని విన్నాను..(అమెరికా ఫేటెంట్ నెంబెర్స్ 6410059 మరియు 6896907). ఇంకొక మాట అసలు ఆంగ్లపదము 'COW' గౌ 'GOW'నుండి పుట్టినదే!


ఆంద్ర ప్రదేశ్ లో 3100 గుర్తింపబడని  వధ్య శాలలున్నాయట. మరి గుర్తింపబడినవి 6 మాత్రమె.

లేక్కలకందనివి ఇంకెన్నో!

మహారాష్ట్ర,రాజస్థాన్జమ్మూ కాశ్మీర్హర్యానాచత్తీస్‌గడ్ రాష్ట్రాలు కూడా మాంసాహారం నిషేధించాయి.  వివిధ మత విశ్వాసాలు కల్గిన మన దేశంలో హిందువుల తరఫున మాట్లాడే శివసేనకు హిందూత్వం కంటే రాజకీయాలే ముఖ్యమన్న విషయాన్ని గోమాంసము విషయములో BJP ని ఎదిరించి, బెదిరించి, చెప్పకనే చెప్పింది. చట్టప్రకారం రాజ్యాంగంలోని అధికరణ (ARTICLE) 48 ప్రకారం వ్యవసాయాన్నిజంతు సంరక్షణను అమలు పరచుటకు ప్రభుత్వం గోవధ నిషేధం వంటి విషయాల ణు అమిత శ్రద్ధతో వ్యవహరించవలెనని నిర్దేశింపబడినది. గుర్రం మాంసాన్ని కాలిఫోర్నియాలోనూ,పంది మాంసాన్ని ముస్లిం దేశాలలోనూ నిషేధించినారు. పిల్లి లేదా కుక్క మాంసాన్ని అమ్మడం ఆస్ట్రేలియాలోనూ హాంగ్‌కాంగ్‌లోనూ,చట్టవ్యతిరేకం. 
సుమారు 26 లక్షల టన్నుల ఎద్దు మాంసం ఏటా భారత్‌లో ఆహారమవుతూవుంది. రూ. 14000 కోట్ల ఆదాయం ఈ ఎద్దుమాంసం ఎగుమతివల్ల లభిస్తూవుంది. ప్రభుత్వమూ కళ్ళు మూసుకొని తనకు వచ్చే విదేశామారకము లెక్కించుకొంటూ కూర్చొని వుంది.
 గోవు పేడ నుంచి పుట్టే క్రిములు భూమి ఎక్కువ నీటిని గ్రహించే విధంగా సన్నటి సొరంగ మార్గాల నేర్పరుస్తాయి. ఒక అంగుళంలో 129 శాతం నీటి వృద్ధి జరుగుతుంది. ఎకరాకు 254530 లీటర్ల నీరు భూమిలోకి చేరుతుంది. దీనివల్ల భూమి సారవంతమై కరువు నివారించబడుతుంది. గోవు పేడ అలికిన యింటి గోడలతో మానవ మేథస్సు పదునెక్కుతుందని న్యూయార్క్‌కు చెందిన బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలు మనవరకు చేరలేదు, మనకు తెలుసుకోవాలనీ లేదు.  ఒక హృదయాన్ని కైలిచే వాస్తవమేమిటంటే గోమాత మన దేశ సౌభాగ్యానికి మూలస్తంబము. 200 ఏళ్ళ క్రితము భారతదేశం భాగ్యదేశము.. 1913లో కలకత్తాలో బ్రిటీషు వాళ్ళు మొదటి గోవధశాలను ప్రారంభించటము జరిగింది. తెల్లవారి కుట్ర తో భారత భాగ్యము తెల్లవారిపోయింది.  పంటలు పండించే రైతుకు ఆవు పేడ సేంద్రియ ఎరువుగా ఉపయోగపడేది. రాను రాను కృత్రిమ ఎరువులురసాయనాలు కొనలేక రుణగ్రస్తుడై, వాడి తగ్గిన భూమిని వాడి ఉపయోగము లేదని ఉదాసీనుడైన వ్యవసాయిని సుఖసీనుని చేయలేని చేతగాని ప్రభుత్వపు సాలెగూడులో చావు బ్రతుకుల నడుమ సతమమౌతూ వున్నాడు.
గోవు పేడతో అమెరికాలో సైతం కోట్ల రూపాయలతో గోబర్ గ్యాస్ ప్లాంట్‌లు నిర్మాణమయ్యాయి. బ్రెజిల్ దేశం 40000 గోవుల్ని భారత్ నుంచి దిగుమతి చేసుకుని అక్కడి పాడిపరిశ్రమ,
 వ్యవసాయములను బలోపేతం చేసుకున్నది. గోక్షీరం అణుధార్మికతను ఎదుర్కొనే శక్తి కల్గివుందని రష్యను శాస్తవ్రేత్త హిరోవిచ్ అన్నాడు. క్షయవ్యాధిగ్రస్తులను గోశాలలో వుంచినపుడు గోవు పేడమూత్రాలనుంచి వచ్చివాసనవల్ల వారు రోగ విముక్తులైనారన్నది పదుల సంవత్సరముల క్రితము వార్తాపత్రికలలో వచ్చిన విషయము. .
10 గ్రాముల ఆవు నెయ్యితో హవనం చేస్తే 1000 కిలోల ఆక్సిజన్ వెలువడుతుందన్నది శాస్త్రపరముగా నిరూపితమైన సత్యము. గోవు పాలనుంచి తయారుచేసిన నెయ్యిని బియ్యంతో కలిపి మండించినపుడు వచ్చే ఇథిలిన్ ఆక్సైడ్ ప్రొపిలిన్ ఆక్సైడ్‌లు ప్రాణరక్షణకు మందులుగా పనిచేస్తాయన్నది మరియొక నిరూపిత విషయము. గోవు మూత్రం నుంచి 32 రకాల ఔషధాలను తయారుచేస్తున్నారు. జాతీయ పర్యావరణ పరిశోధనా సంస్థ కూడా వీటిని గుర్తించింది.
తిరిగి మిగిలినది 'గోమాత సకల శుభదాత -- 3' లో చర్చించుకొందాము.
గోమాత సకల శుభదాత -- 3
చరక సంహిత,వాగ్భటి,శుశృత,నిఘంటు,రత్నాకరము వంటి వాటిల్లో గోవు ప్రాముఖ్యతను వ్యవసాయ పరంగా,ఆరోగ్య పరంగా మంచిదని పేర్కొన్నారు.అధికమైన గోసంపద కలిగిన యెడల గో మూత్రము గో మయము ఎరువులుగా వాడిణ యెడల సంవత్సరమునకు 2 లేక 3 పంటలు పండించవచ్చునని పై శాస్త్రములు తెలుపుచున్నాయి. ఆంగ్లేయులు మన దేశమును ఆక్రమించాక మునుపు ఆనందముతో విలసిల్లిన కుల విద్వేషము లేని మన జాతని నిర్వీర్యము చేసినది ఆంగ్లేయులు ప్రారంభించిన గోవధ. మెకాలే గారి British parliament ఉపన్యాసము 2 ఫెబ్రవరి 1835 records లో చూస్తే ఆయన మనదేశ వినాశనమునకు ఏ ఏ సలహాలనిచ్చినారు అన్నది మనకు అవగతమౌతుంది.. ఆ records ను Hansard ( Hansard is the traditional name of the transcripts of Parliamentary Debates in Britain అంటారు. ఇది British parliament Library ) లో ఇప్పటికీ లభ్యము.

పశువులను వధించటం వల్ల గ్రీన్ హౌజ్ గ్యాసులు(మిథాన్,నైట్రస్ ఆక్సైడ్,మొదలైనవి) ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.ఇవి కార్లు,ట్రక్కులు వదిలే Carbon Monoxide వాయువు కంటే ఎక్కువని చెపుతున్నారు. మరి దీనికి కారణ మేమిటి కర్త ఎవరు?
భారతీయ సంస్కృతి లో గోవులు అత్యంత పూజనీయములు గా మన ఋషులు, పూర్వికులు, విద్వాంసులు నిర్ధారించినారు. గో వైశిష్ఠ్యత, మహిమ వేదంలోని ఋక్కులు, పురాణాది శాస్త్రాలూ విస్తారంగా వర్ణించాయి. "మాతరః సర్వ భూతానాం - గావః సర్వ సుఖ ప్రదా - అని పురాణ వచనం. గోవు అందరికి తల్లి (అందుకే వాడుకలో గోమాత అంటాం). అలాగే, గోవు సర్వవిధాలా సుఖ ప్రదాత. లింగ పురాణములో కూడా ఈశ్వరుని మనం ఇదివరకటి ఉత్తరంలో "పంచగవ్య ప్రాసనము" విశిష్ఠత ప్రస్తావించుకున్నాం.గోమయం (ఆవు పేడ), గో మూత్రం (ఆవు మూత్రము) గో క్షీరం (ఆవు పాలు), గో ధధి (ఆవు పాలపెరుగు); గో ఘ్రుతం (ఆవు నెయ్యి) ఇవి పంచగవ్యములు. వీటిలో సహజం గా అతి ప్రభావ వంతమైన జీవసృజన, రోగ నివారణ గుణ సంపద ఉందని మన ఋషులు, శాస్త్రవేత్తలు నిర్ధారణ చేసి, వాటిని మన జీవనశైలితో జతచేసి మనకు ఎంతో ఉపకారం చేసారు. ఈ పంచ గవ్యములకు ఆయుర్వేద శాస్త్రం - వైద్య శాస్త్ర పరంగా, ఔషధ గుణాలకు సర్వ శ్రేష్టం గా గుర్తించింది. గోమయము (ఆవు పేడ) పంచగవ్యాలలో ఒకటి. గోమయే వసతే లక్ష్మీ - అన్నది శాస్త్ర వచనము. అంటే గోమయంలో లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని, అందుకే మన పూర్వికులు ఉదయాన్నే ఆవు పేడ తో కళ్ళాపి జల్లి ముగ్గులు వేసి - ఎప్పుడూ గృహం లక్ష్మీ ప్రదంగా ఉండాలనే భావనతో - మన సంస్కృతిలో అదొక భాగం చేసినారు. అసలు లక్ష్మి, గోవులను కోరి పవిత్రమని వేదములచే కొనియాడబడిన గోమయములోనూ, గో పంచితము లోను నివసిస్తుంది. ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. అంటే ఆరెంటికీ అంత గోప్పదనముందనేకదా అర్థము.

ఒకసారి శ్రీ శ్రీ శ్రీ పరమాచార్య స్వామి  వారికివంట బ్రాహ్మణుడు  తోటకూర పప్పు వండి వడ్డించినాడట.  అది ఆరగించిస్వామి వారు చాలా బాగుందిఇది ఏమిపప్పు ? అని అడిగారట వంట బ్రాహ్మణుడు - అయ్యా ఇది తోటకూర పప్పు అని విన్నవంచిపరమాచార్య స్వామి కి తోటకూర పప్పు ఇష్టం అనినిర్ధారణకు వచ్చివరుస గా అదే వండి వడ్డించడం జరుగుతుండగా...నడిచే దేవుడి గా పేరుగాంచినశ్రీ పరమాచార్య స్వామి మూడు రోజులు పూర్తిగా భోజనంమాని, భోజన సమయానికి గోశాలకు పోయి వారి నాలుకను గోమయంతో   
శుద్ధిచేసుకోనేవారట.   పరమాచార్యులవారిని  పరివారము వారెందుకు భోజనమునకు వచ్చుటలేదని ప్రశ్నించగా -- శ్రీ స్వామివారు ఈ విధముగా చెప్పినారు " నేను సన్యాసినినాకు రుచులతో నిమిత్తం ఉండకూడదుకాని  తోటకూర పప్పు తిని చాల బాగుందని రుచికి ప్రాధాన్యత ఇవ్వటం చాల దోషంఅది పోగొట్టుకోవడానికి నాలుకను గోమయంతో శుద్ధిచేసి ఉపవాస దీక్ష చేస్తున్నాను అని చెప్పినారటఅంతటి మహనీయులు పరమాచార్య స్వామి వారు. అసలు వారు పరమ పదము చెందెదరని తమకు తోచిన పిదప తమ శేషజీవితమును గోశాలలోనే గడిపినారట.


ఎవరైనా పేరు గాంచిన వ్యక్తీ వారిని కలియుటకు వచ్చునపుడు ఆ వార్త ముందే తెలుపుతారు కాబట్టి స్వామివారు ఆమున్దురోజే ఆశ్రమ ప్రాంగణము తిరిగి వారికి తోచిన ప్రదేశములో అక్షతలు జల్లే వారట. ఒక సారి   గాంధి గారితో సమావేశం చేయాల్సి వస్తే, వారు అక్షతలు గోశాలలో వేసినారట. అందువల్ల శ్రీ పరమాచార్య స్వామి వారు తమ  గోష్టినిగోశాలలో నిర్వహించినారట..  

ఈ సందర్భములో ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పవలసియున్నది. మహర్షి రమణులు సన్యసించి అరుణాచలము లో ఆవాసము ఏర్పరచుకోన్నది అందరికీ తెలిసినదే!కాలూని  1926  ప్రాంతములో ఒక భక్తుడు స్వామి ఆశ్రమమునకు ఆవు దూడను దానమిస్తే , స్వామీ గ్రహించి ఇక నావిగా నీవే చూసుకో అన్నారు . అతను మొండిగా మీవద్దనే అవి వుండవలెనంటే ఆశ్రమములోని ఒక  భక్తుడు తానూ చూసుకొంటానన్నాడు. కొంత కాలము తరువాత కారణాంతరములచేత ఆవు దూడలను పశుపతి అయ్యర్ అన్న పశుసంపడగల బ్రాహ్మణునికి ఒప్పజెప్పటం జరిగింది. ఆయన ఇల్లు అరుణాచలము వూరిలో. 
ఒకరోజు స్వామీ ఆశీస్సులను పొందుటకు ఆ మాతా వత్సలను ఆశ్రమమునకు తోడుకొని వచ్చినాడు ఆ బ్రాహ్మణుడు. స్వామీ దర్శనము అనంతరము ఆదూడ దూరమైనా ఆదారిని గుర్తుపెట్టుకొని రోజూ స్వామి దర్శనానికి వచ్చేది. ప్రొద్దుట నుండి సాయంకాలము వరకు స్వామీ సన్నిధిలోనే గడిపి సాయంకాలము తన గూడు చేరేది.దానికి రమణులే లక్ష్మి అని పేరు పెట్టుకొన్నారు. ఆ ఆవు ప్రతిరోజూస్వామి ఆశీనులైన ఆసనమునకు ప్రదక్షిణలు చేసేది.ఇది ఆ గోవునకు నిత్య కార్యము. స్వామీ ఎంతో ప్రేమతో తన సన్నిధిలో వున్నపుడు ఆయనకు భక్తులిచ్చిన పండు ఫలము ఎంతో ప్రేమతో లక్ష్మికి తినిపించేవారు. ఆశ్రమములో సరియగు12 గం.లకు  భోజనమునకు ఎలుగెత్తి పిలిచేవారు. ఆతరువాత రాను రానూ గంట కొట్టుట మొదలైనది.  స్వామీ భక్తుల నడుమ ఎంతో వారితో సంభాషణలలో నిమగ్నమైన సమయములో ఈ ఆవు అక్కడ పిలుపు వినిపించగానే స్వామి ఎదుటికి వచ్చి నిలిచేది. స్వామీ కూడా వెంటనే ఓహో భోజన సమయమైనధి, లక్ష్మి పిలుచుచున్నది అని మదితలచి వెంటనే బయలుదేరేవారు ఆ సమయములో లక్ష్మిని చూసినంతనే!   
లక్ష్మి పెద్దయ్యింది. ఆశ్రమము పెరిగిపోయింది. ఆశ్రమములో గోశాల నిర్మిస్తే లక్ష్మి స్వామీ వద్దకు వచ్చి ఆయనను తోడుకొని పోయేవరకు మొండిగా ఆయన వద్దనే కూర్చుని  ఆయనను పిలుచుకొని పోయి , ఆయన గోశాలలో అడుగు పెట్టిన తరువాత తానూ అడుగు పెట్టినది. అది గోవు యొక్క గొప్పదనము. మరియొక విచిత్రమైన విషయమేమిటంటే ఆయావు మూడు ఈతలను రమణులవారి జన్మతిధి యందే కన్నది.
వారి అనుబంధము మాటలకంధనిది.
ఆరోజు 18 June 1948 (సర్వధారి ఆణి మాసము అనగా జ్యేష్ఠమాసము, శుక్ల పక్ష ద్వాదశి,విశాఖా నక్షత్రములో)  వ సంవత్సరము శుక్రవారము అంటే లక్ష్మీ వారము పగలు 11. 30 కి ( కొందరు గురువారాన్ని ఆవిధంగా పిలుచుకొంటారు ) లక్ష్మీ సమానమై ,9 కాన్పులను గలిగిన ఆ గోమాత , స్వామి వారు తన చేతితో ఆవును నిమిరి, తమ చెంపను ఆవు చెంపకు తాకించి , ఆవు గుండె పైన తన అరచేయిని కొద్దిసేపు , సన్యాస దీక్ష ఇస్తున్నారా అన్నట్లు, వుంచి 'అమ్మా ఇక వెళ్ళనా అని శేలవుతీసుకొని సమావేశ సదనము చేఋ నంతలో బ్రహ్మైక్యమును పొందినది. స్వామి ఒక సన్యాసిని ఎటువంటి  సత్కారాలతో సమాధి చేస్తారో ఆ గోవును ఆ మర్యాదతో అంతిమ సంస్కారమును నెరపమని శేలవిచ్చినారు. ఆవు గోప్పదనమంటే అది.

గోమాత సకల శుభదాత -- 4



ఈ అద్భుతము నొకసారి చూడండి.
చైతన్య మహాప్రభు (18 ఫిబ్రవరి 1486 – 14 జూన్ 1534) రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం 1485-1533. జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి NADIA). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒడిషాలలో అదే మతాన్ని ప్రచారం చేసినాడు.ఈయన భేదాభేద వేదాన్తరీతిని అనుసరించి ప్రచారము గావించినాడు. ఆయన కాలములో చాంద్ కాజి అను మహమ్మదీయుడు నవద్వీపపు పట్టణాదికారి. పట్టణాదికారిని వారు కాజీ అంటారు. అతని అసలుపేరు మౌలానా సిరాజుద్దీన్ అని తలుస్తాను. ఆ కాలములో మతపరమైన నీరు హిందువుల పైజల్లి వారిని ముస్లీములుగా మార్చినారట. అప్పుడు, ఆవిధముగా మారిన వారిని తిరిగీ హిందువుగా అంగీకరించేవారు కాదు హైందవులు. అదికాకుండా హిందువులపై అమితమైన పన్నుల భారము మోపి వారిని ముస్లీములుగా మార్చే వారు. ఆ సమయయములో ఉదయించిన ప్రచండ భాను తేజము చైతన్యుడు. మనలో ఎక్కువమందికి ఈ చైతన్యుని కంటే 'చైతన్య కాలేజీలే' తెలుసు. ఈ కాజీ ఒక వీధిలోని భక్తుని ఇంట్లో భజన జరుగుతూ వుంటే అక్కడి ముస్లీములు ఖాజీ తో విన్నవించుకొన్నారు. ఆటను ఆగ్రహోదగృడై అచ్చటికి వెళ్లి మృదంగాములను పగులగొట్టి భీభత్సము చేసినాడు. ఆవిషయమును భక్తులు చైతన్యునికి తెలిపినారు. ఆయన నవద్వీప నగర సంకీర్తనకు ఏర్పాటుజేసి తానూ ముందుండి ఖాజీ ఇంటికి బృందమును నడిపించినాడు. బృందము బారులుదీరి చాలా చాలా దూరము వ్యాపించింది. విషయము ఖ్జీకి తెలిసి భయభ్రాంతుడై బిక్కు బిక్కు మంటూ తన మహలులో ఒక చోట కూర్చొని వున్నాడు. చైతన్యులవారు రానే వచ్చినారు. తలుపులు తెరిపించి కాజీతో సమానముగా ఉచితాసనమునలంకరించి అతని పై హూంకరించి అతని చేతికి ఒక ఆవుపాల లోటా నిచ్చి త్రాపించినాడు. ఇప్పుడు ఈ పాలు త్రాగి నీవు గోవును తల్లిగా చేసుకొన్నావు. ఇకపై ఆవును చంపినా, సంకీర్తన ఆపినా నిన్న పరమాత్ముడు క్షమించాడు అని చెప్పినాడు. అసలు చైతన్యుల వారి మాటలలోనే " go దుగ్ద్ ఖావ్ గబి తొమారా మాతా " (శ్రీ చైతన్య చరితామృత , ఆది లీల, 17 వ విభాగము, 153 వ చరణము.) తల్లి ఏడ వట్టిపోతే తానె తల్లియై పాలిచ్చే గోమాత మాంసము తినుట తల్లిని తిన్నట్లుకాదా అని నిగ్గదీసినాడు.గో ప్రాశస్త్యము చెబుతూ ఆమహనీయుడు ఈవిధముగా అన్నాడు :

గో అంగయతలోమ, లత సహస్ర వత్సర
గో వధి రవురవ -మధ్యే పసే నిరంతర (శ్రీ చైతన్య చరితామృత , ఆది లీల, 17 వ విభాగము, 166 వ చరణము.)

ఆవుల జంపి, ఆవు మాంసము తినువాడు రౌరవాది నరకమును, ఆవు శరీరము పై గలిగిన రోమమముల సంఖ్యతో సమానమైన సంవత్సరములు అనుభవించవలేనని చెప్పినాడు.

చైతన్య ప్రభువు మాటలచే ప్రభావితుడైన ఖాజీ నాటినండి గోవధ గోమాంస భక్షణము తాను మానుటయే గాక తన వారితో మాన్పించి
మాటకు కట్టుబడిన మనిషిగా నిలిచిపోవుటయే గాక తాను బెంగాలు నవాబునకు మత సలహా దారుడు కాబట్టి 'ఈ మాంసభక్షణ మతములు అసంపూర్ణములు, భగవంతుని జాడ తెలుసుకొనుటకు సనాతన ధర్మము మాత్రమే సరియైనది' అని తెలిపినాడు. ఆతని సమాధి ఇప్పటికీ 500 సంవత్సరములు కలిగిన చెట్టుక్రింద పూజలందుకొంటూనే వుంది.


వేదాలను అనుసరించి అవుకు మూపురము , గంగడోలు , కొమ్ములు ఉండవలెను . మన దేశపు గోజాతులు మాత్రమే ఈ లక్షణాలన్నీ కలిగియుంటాయి. ఆవుల డెక్కల నుండి ఒక రకమైన నూనె వెలు వడి భూమిని సారవంతము చేస్తుంది . ఈ విషయం వేదాలలో చెప్పబడినది . ఆవు సహజ మరణము పొందిన పిదప దాని నుండి తీయదగినవి 1. గోరోచనము 2. ఆవు కొమ్ములు. ఆవులు చనిపోయిన పిదప ఆవు శరీరమునుండి గోరోచనము తీస్తారు. దీనికి మహత్తరమైన ఔషధ శక్తి ఉంది . పక్షవాతానికి ఇది గొప్ప మందు . చూశారా ఆవు చనిపోయాక కూడా మనకి యెంత మేలు చేస్తుందో.
బుధ గ్రహ దోషముపోవుటకు ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారములను నీళ్ళలో
వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయునన్నది ఆయుర్వేదములో ఔషధ స్త్నాన ప్రకరణ లో చెప్పబడినది.
ఆవు కొమ్ముద్వారా నీటితో అభిషేకించుట శివునికి అత్యంత ప్రియమైనది.
రఘువంశ కావ్యంలో గోవు గురించి చెప్తూ భూమికి గోవుకి అవిచ్చిన్న సంబంధం ఉందనీ, అందుకే అధర్మం ప్రబలినపుడు, భూ భారం ఎక్కువైనప్పుడు,భూ దేవి గోమాత రూపం ధరించి, దేవతలతో కలసి, భగవంతుని " ధర్మ సంస్థాపనార్ధం భూమి పై అవతరించ" ప్రార్దిస్తుందట. అసలు దిలీపమహారాజుకు 'రఘువు' వంటి పుత్రుడు కలుగుటకు నందినీ గోసేవయే కదా కారణము.
 శ్రీ రామ జనన సమయంలోసమస్త దేవతలు   శ్రీ మహా విష్ణువును ఆవాహన చేయడానికి ముందు గో ద్విజ హితకారీ జయ........ అంటూ  "గోమాతమహిమనేగానం చేసినారుగోవు రుద్రులకు మాతఅష్ట వసువులకు పుత్రికఅదితి పుత్రులకు సోదరి గా చెప్పబడింది.   మనం అందరం తెలిసుకునిపాటించిపాటించేట్టుచేయవలసిన  సత్యం - గోవు నిరపరాధిగోవు అవధ్య (వధింప రానిది).  గోవులను పూజిద్దాంగోమాత గౌరవ మహిమలను సదా కీర్తిద్దాం,  గోవధ పాప భూయిష్ట మని ఎలుగెత్తి చాటుదాంగో సంరక్షణ చేస్తున్న సంస్తలను మన శక్తివంచన లేకుండా ప్రోత్సహిద్దాంగోసేవ చేద్దాం.గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచగవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పినారు.అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం. గోమూత్రము వేప ఆకులు కలిపి ఒక కుండలో వుంచి పైన మూత పెట్టి దానిని భూమిలో పాతిపెట్టి , కొన్ని రోజుల తరువాత దానిని వెలికి దీసి దానినుండి ఒక ద్రవమును తయారు చేసి దానిని పంటలపై పిచికారి చేస్తే పంటలకు చీడ పీడ నసిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సహజమరణము సంప్రాప్తించిన గూవులను పంట భూములలో పూడ్చుట వల్ల భూమి సారవంత మౌతుందని తెలియవస్తూవుంది. ఒకటి కాదు రెండుకాదు ఆవు మన బాగుకుఇవ్వని వారమే లేదు. అట్టి ఆవును తినుట 'తిన్నయింటి వాసములు లెక్కించుట కాదా!'

గోగ్రహణమును గూర్చి యోచించే ముందు దుర్యోధనుడు భీష్మాచార్యులనడుగుతాడు,మారు వేషములలో వున్నా పాండవులను ముఖ్యముగా ధర్మరాజును ఏదేశములోవుండేదీ ఏ విధముగా గుర్తించవచ్చునని.  ఆయన ఎక్కడ గోసంతతి అత్యంత అభివృద్ధిలో ఉంటుందో అక్కడే ధర్మజుడుంటాడు అని చెబుతాడు. ఇది గోవుల గొప్పదనము తెలుపదా!
ఇక గోరక్షణకే, గోపాలనకే శ్రీకృష్ణావతారము. శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపినారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము. ఇంద్రుని కాదని గోపూజ చేయించి ఇంద్రుని గర్వవమడంచినవాడు ఆ కృష్ణపరమాత్ముడు. ఇంద్రునితో, గోరక్షకుడు కావున గోవిందుడన్న బిరుదము పొంది గోవింద పట్టాభిషేకము చేయించుకొన్నాడు. రామాయణములో శ్రీరామ పట్టాభిషేకమును ఇంద్ర పట్టాభిషేకముతో పోలుస్తారు వాల్మీకి మహర్షి. అందుకు రాముడు తన మనసులో, ఆ ఇంద్రుని ఓడించిన మేఘనాథుని, అతని తండ్రియైన మహాబలశాలి రావణుని చంపిన నా పట్టాభిషేకమును ఇంద్ర పట్టాభిషేకముతో పోల్పబదినదే అని. అందుకే పరమాత్మ ఆకోరిక ద్వాపరములో తన కినుకను ఉపశమింపజేసుకొన్నాడు. చాతుర్వర్ణములలో ఒక్కొక్కరికి వారి విధి బాధ్యత కర్తవ్యాలను వేదశాస్త్రములు నిర్దేశించినాయి. అందులో భాగముగా మాత్రమె బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేయవలె. అది సమాజము కొరకే! స్వార్థానికి కాదు. రాజు లేక క్షత్రియుడు పరిపాలన రక్షణ చేపట్టవలె. అదికూడా సంఘశ్రేయస్సుకే!. వైశ్యుడు ధనము సంపాదించవలె . దానిని సంఘాభ్యున్నతికి వాడవలె. శూద్రుడు సేవ చేయవలె. అదికూడా సంఘ పురోగతికే! అతి పెద్ద  Multi National Company ల అధికారులుకూడా తమ వద్దకు వచ్చిన వ్యక్తిని How can I serve you sir! అని అడుగుతారు. మరి వారి గౌరవము దిగాజారినట్లనుకొంటున్నామా! ఆహా ఎంత సంస్కారి అనుకొంటున్నాము. ఇదీ అంతే. శూద్ర వర్ణము తమ సమయమును యజ్ఞ యాగాది, వ్రత పూజాది కార్యములందు వినియోగించలేరు కనుక  వారికి అందుబాటులో ఉండేవిధంగా గోసేవ, గోపూజ కల్పించినారు మన వేదశాస్త్రాలలో. ఎవరినీ ,ఎప్పుడూ మన వేదశాస్త్రములు కించపరుచలేదు. ఆ ఆవే కదా కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి పుట్టలో వున్నపుడు ఆహారముగా పాలిచ్చినది. ఆవు అంత ఉన్నతమైనట్టిదయినందువల్లనేకధా దానిని చంపుటకు గొల్లవాడు గొడ్డలి ఎత్తితే తన తల శ్రీనివాసుడు అడ్డపెట్టినది. ఆవు, అంటే కేవలము మూపురము గలిగిన మన భారతీయ సంతతి గోవులు మాత్రమె,రోమములు తమ పరిసరములకు ఒక ప్రత్యెక శక్తిని ప్రసరింప జేస్తుంటాయట. ఎంత అధికముగా గోవులుంటే ఆ శక్తి అంత అధికముగా వుంటుంది. అప్పుడు ఆ పరిసరాలు ఆరోగ్యముతో వేల్లివిరుస్తూవుంటాయి.
మన దేశపు గోవులలో మూపురమున 'సూర్యకేతువు' అన్న నాడి ఉంటుందట. సూర్య కిరణములు దానిపై బడినపుడు అది సూక్ష్మమైన పుప్పొడి యంత మెత్తటి బంగారు రేణువులను ఉత్పత్తి చేస్తుందట. అందువల్లనే ఆవుపాలు గానీ అందుండి తయారయిన పదార్తములుగానీ అత్యంత ఆరోగ్య దాయకములు.
   గోమాత సకల శుభదాత -- 5

ఇంకా గోదాన ప్రాశస్త్యాన్ని గూర్చిమనకు అనుశాసనిక పర్వములో ధర్మ రాజుకు భీష్ముడు చేసిన ఉపదేశములో పుష్కలముగా కనబడుతుంది. బృహస్పతి గొదానానీ గూర్చి మాన్దాతకు ఎంత గొప్పగా చెబుతాడో గమనించండి."మహారాజా ! ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి మూడు రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరినకోరికలు సిద్ధిస్తాయి " అని బృహస్పతి మాంధాతకు చెప్పినాడు.
కపిల గోవును గూర్చి నాలుగు మాటలు చెప్పుకొందాము. కొన్ని ఆవులు హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లిదగ్గర పాలు తాగుతూ ఉండినది. ఆ పాల నురగ గాలికి ఎగిరి ఆ పరిసరములో  తపస్సు చేసుకుంటున్న పరమశివుడి చెంపను తాకింది. ధ్యాన భగ్నము పరమశివునికి కోపము తెప్పించాగా ఆయన మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి అగ్ని వర్ణమునకు మారినవిగానీ మన్మధునివలె భస్మము కాలేదు. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి " మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! అది ఎంగిలి కానపుడు, అమృతమనియే చెప్పబడిన ఆవు పాలనురగ ఏవిధముగా ఎంగిలౌతుంది. దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు " అని వేడుకునాడు. భోళాశంకరుడు బ్రహ్మ జవాబుకు ప్రసన్నుడయి " నాకారణముగా రంగు మారిన ఈ గోవులను కపిల ధేనువులుగా పిలువబడుటయే గాక వీనిని దానము చేసినవారికి, గ్రహించిన వారికీ పాపములన్నీ నశియించి పరమపదమును పొందుతారు అని వరమునిచ్చినాడు. అందుకు ప్రతిగా ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా బ్రహ్మదేవుడు శివునకు ఇవ్వటము జరిగినది. పరమశివుడు  ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతినిచ్చినాడు.  అని భీష్ముడు చెప్పాడు. కపిల గోవుల గూర్చి , నందిని గూర్చి వేరు  కథలు కూడా పురాణాలలో గలవు. ఏదయినా కపిల గోవు ప్రాశస్త్యమును, నదీశ్వరుని భక్తిని గూర్చి తెలిపేదే!. గూసంతతికి అంత మహాత్మ్యము వున్నది కాబట్టే, దేవాలయములో నంది శివునికేడురుగా వుంటుంది. భక్తులెవరైనా ప్రక్కల నిలబడి దర్శనము చేసుకోవలసినదేగానీ ,స్వామీ శక్తిని నిగ్రహించగల శక్తి గోసంతతికి మాత్రమె యుంటుందని మనకు తెలియవచ్చుచున్నది.


గోమాహిమను గూర్చి భీష్ముడు ధర్మజునితో సౌదాసుని వృత్తాంతమునీవిధముగా చెబుతాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇక్ష్వాకు వంశజుడైన సౌదాసుడు అను రాజు తన పురోహితుడు వశిష్ఠుడిని చూసి " మహాత్మా ! ఈ లోకములో పవిత్రమైనది ఏది ? " అని అదుగాగా వశిష్ఠుడు " సౌదాసా ! ఆవు అన్నింటికన్నాపవిత్రమైనది. ఆవు హవిస్సుకు పుట్టినిల్లు. అన్ని జీవులకు గోవు ఆధారము. గోవులు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ. స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది. మానవులు తమ కున్న గోసంపదలో పదింట ఒక దానిని దానంగా ఇవ్వాలి. గోవును ఉదయం స్మరించి నమస్కరించడం అధికమైన పుణ్యం ప్రసాదిస్తుంది. ఆవు పేడ, ఆవు పంచితము పవిత్రమైనవి. కాని ఆవు మాంసము తినడం మహా పాపము. మానవులకు పీడ కలల వలన వచ్చే ఫలితం గోవును స్మరించిన నివారించ బడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చెయ్యడం, ఆవు పంచితం ఔషధంగా తీసుకోవడం మంచిది. బ్రాహ్మణులు గోసంపద కాపాడుకుంటూ ఉంటారు. గోదానము వలన అనంతమైన సుఖాలు కలుగుతాయి " అని  గోవుల విశిష్ఠత గురించి వివరిస్తాడు.


ఈ వివరము నేను google search లో సేకరించినది. 1947 లో జనాభా 30 కోట్లుపశు సంతతి 48 కోట్లు నేటి జనాభా (ఇంచుమించు) 120 కోట్లు పశుసంఖ్య 6 కోట్లు. చూసినారా ఎంత వ్యత్యాసమో! ఈ విషయమై కాస్త ఆలోచిస్తాము. ఒక ఆవుకు కిలో బియ్యము ఆహారముగా ఇస్తే నిజానికి ఆ బియ్యము ఐదారుమంది పేదలకు కడుపునిమ్పుతుంది. మరి ఆవుల నోరుకొట్టి మనుషులకు పెట్టవలెనని అంటున్నారా అంటారేమో! నేను అలా అనుట లేదు. ఆ ఆవును ఆతిన్దితో కృత్రిమమైన enzymes ను inject చేసి వానిని విపరీతముగా బలిసిపోవునట్లు చేసి విదేశములకు ఎగుమతి చేయుట గానీ దేశములోనే గోవధశాలలకు చేర్చి వాని మాంసమును ఎగుమతి చేయుతగానీ చేయుచున్నారు. దీనివల్ల ఇక్కడ తినక నిరుపేద తిని ఆవు ఇద్దరూ చనిపోతున్నారు. కానీ అట్టి మాంసము తిన్నవారు కూడా కాన్సర్ , హార్ట్ ఎటాక్  వంటి వివిధ విధములైన వ్యాధులతో మరణించుతున్నారుఇది దేశానికి , అసలు ప్రపంచానికే ఎంత తీరని నష్టమో గమనించండి.
ఆవు ప్రేవులలో Keratin అన్న మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయి ఇవి ఆవు పాలద్వారా మనము సేవించుట చేత చర్మమునకు నిగారింపు, గోళ్ళకు, జుట్టుకు గట్టిదనము మరియు ఆరోగ్యమును 

పించుతుంది. అసలు మన నీతిశాస్త్రము 

ఈవిధముగా చేబుతూవుంది:


ఘృతేన వర్ధతే బుద్ధి క్షీరేణాయుర్వర్ధతాం |


శాకేన వర్ధతే ధాతుః మాంసం మాంసేన వర్ధతి ||


కేవలము ఆవునేయ్యిని మాత్రమె ఘృతము అంటారు. అసలు ( Doctors) వైద్యులు నెయ్యి తినవద్దంటారు. 


కానీ నేతిలో soluble

and insoluble fats అని రెండు రాఖాలు వుంటాయి. అరగానివి అంటే రక్తములో కలిసి పోలేనివి nsoluble 


fats, 

కలిసి పోయేవి soluble fats. రక్తములో కలిసే క్రొవ్వు పదార్థాలు (Fats ) శరీర దార్ధ్యానికి ఎంతో అవసరము. 

అవి అందజేస్తుంది ఆవునెయ్యి. క్షీరము అంటే ఆవుపాలు. అవి ఆరోగ్య దాయకము కావున ఆయుస్సును 

పెంచుతుందని పెద్దలు చెప్పినారు. ఇక కాయగూరలు శరీరానికి తగిన ఖనిజ లవణములను (minerals), 



మాంసము కేవలము మాంసమును వృద్ధిచేస్తాయని  చెబుతూవుంది. మనకివేమీతెలియదు.  తెలుసుకొన


నక్కరలేదు.   ఒక 10 వేల రూపాయలతో doctorవద్దకు పోతే ఆయనే చెబుతాడుకదా ! శంఖున బడితేనే కదా 


తీర్థమయ్యేది. ఆవులపై నేటి శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనలలో  ఈ క్రింది విషయములు 

తెలియవచ్చుచున్నవి :

1. ఆవులు బుద్ధి శీలత గలిగిన జంతువులు. వానికి జ్ఞాపకశక్తి మెండు.

2. తల్లియావుకు తన దూడ పైన అవ్యాజమైన ప్రేమ. తనదూడ కనిపించకపోతే అంబా! అంబా! అని అలమతిన్చుతూనే వుంటుంది. అసలు ఆవు దూడను మాత్రమె మన పూర్వులు వత్స అన్నారు. అందుండి వచ్చినదే వాత్సల్యము. అసలు ఆవుకు గల వాత్సల్యమేమితో చూడండి. ఆవు శాఖాహారి.అయినా తన 'వత్స'ను  ప్రసవిన్చినవెంటనే  ఆ దూడ శరీరమునకు అంటుకోన్నజిగురునంతా  (గుర్తుంచుకొండి అది శాకము కాదు.)  ఏమాత్రము అసహ్యించుకోనక మొత్తము నాకివేస్తుంది. ఈకాలము నా అనుభవములో తమ స్వంత బిడ్డల మలమూత్రములను అసహ్యించు కోనుచూ దళసరి తళువములను (Diapers )ను వాడుచున్నారు. ఆ పసికూనలు పెద్దయిన తరువాత దొడ్డికాళ్ళతో నడుస్తూవుండేది చూస్తే తాము చేసిన తప్పు  మనోఫలకము పై మాయని మచ్చగా నిలువదా! అందుకే ఆవు చూపే ప్రేమను వాత్సల్యమన్నారు, ఆమాట మనుషులకు మన పూర్వులు వాడలేదు.. ఆవు ఎంత గొప్పదో ఆలోచించండి.

3. పరిశోధకులు ఆవులు తమ సమస్యలను పసిగట్టుటయేగాక వాటి పరిష్కారమాలోచించి, సాధించి ఆనందాన్ని పొందుతాయని కనుగొన్నారు.

4. ఆవులో కృతజ్ఞత వుంటుంది. కరుణతో కూడిన ఆవు కన్నులే ఆమాట చెబుతాయి.ఇందుకు సంబంధించిన ఒక కథ అనుశాసనిక పర్వములోనే భీష్ముడు చెప్పగా మనకు తెలియ వస్తుంది.
పూర్వము త్రిశిఖరము అనే కొండ ఉండేది. ఆ కొండప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. వారిలో సుమిత్రుడు ఒకడు. అతనికి చర్మ వ్యాధి వుండేది.ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇవ్వటము జరిగింది.. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చినాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామర తంపరగా సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసి పోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడు ఫేనుడు అని పిలువబడినాడు. ఒక ఆవు ఆయన చర్మ వ్యాధిని గమనించి తానూ కొండకు మేత కు పోయినపుడు ఆ వ్యాధికి తగిన మూలికలు గల ఆ హారమును తీసుకొనేది. ఆ ఆవు సుమిత్రుని అభిమానము చూరగొనుట చేత ఆ ఆవు దూడకు ఇవ్వగా మిగిలిన పాలు త్రాగేవాడు. కొంత కాలము పిదప ఆయన వ్యాధి నయమైపోయింది. ఇది గోవులోని ప్రత్యేకత, శ్వానాదు లనుపెంచి (కుక్క ,పిల్లి మొదలగు జంతువులను పెంచి )  శ్వాసకోశ వ్యాధులు తెచ్చుకోనేకంటే ఆవును పెంచి ఆరోగ్యమును పొందవచ్చు కదా!

5. పులులను జాతీయ జంతువులనుజేసి అభయారణ్యములను కట్టిన మనకు అందుబాటులోనే యుండి మన పెంపుదలకు కారణమైన అమ్బారావములు వినిపించనందువల్ల జాతీయ స్థాయిలో గోశాలలు కట్టలేదేమో!

6. అయ్యోపాపము అంతగా ఆవును తినవద్దని అర్థించుచున్నారే పోనీలే దానిని వదలి వేరే జంతుమాంసము తిందామన మాంసాహారు
లనుకొంటే అసలు సమస్యే లేదు. అభ్యర్థనలు అన్నీ అంధేందూదయములు,అరణ్య రోదనములు, మహాబధిర శంఖారావములు అగుచున్నాయి. 
7. వద్య స్థలములలో గోవులను ఎంత హృదయ విదారకముగా ఆవును చంపుతారన్నది తెలిస్తే మనసు వికలమై కనీసము ఆరోజుకు తిండి మానివేయ వలసిందే.

8.  లక్షల కొద్దీ గొవులను వధించే అమెరికాలొ జరిగిన ఈ ఉదంతము గమనించండి. మసచుయెట్స్ ప్రాంతములొ గొవధ శాలను తప్పించుకొని ఒక ఆవు తప్పించుకొనుటకు 5 అడుగుల Gate ఎగిరి అడవులలో దాగియుండిందట. PETA (People for the Ethical Treatment of Animals) అన్న జీవకారుణ్య సంస్థ దానిని రక్షించి నిర్భయ ప్రాంతములకు చెర్చిందట. ఇటువంటి వాస్తవ ఉధంతములు అనేకములు. తెలివి, అభిమానము, అనురాగము , క్షేమము కొరే ఆ ఒక్క ప్రాణిని వదలవచ్చు కదా!గోవును మాత్రమే గొమాత అంటాము. పందిని సూకర మాత అని కుక్కను శునకమాత అని అనము కదా! మరి ఆవును నరికితే తల్లిని నరికినట్లుకాదా! 

9. PETA తెలిపిన ఈ విషయాన్ని ఆంగ్లములొనె చదవండి.
Mad cow disease is already in the United States, and the U.S. government is not following World Health Organization recommendations for ensuring that it doesn’t spread. While Japan and all Europe countries have banned the feeding of animal protein to farmed animals, the practice continues across the board in the U.S. meat industry, which is just begging for a “mad chicken,” a “mad pig,” or some other variant of the disease in the U.S. meat supply. Because it takes years for the disease to show up in humans, there’s no way of knowing how many Americans have already been infected.

10.గోవు పిడకలతో చేసిన వంట అత్యంత ఆరోగ్య ప్రదము. ఇందుకు ఒక ఉదాహరణ : భోపాల్ దారుణము జరిగినపుడు ఆవు పిడకలతో హోమ కార్యక్రమములో మునిగియుండిన ఒక కుటుంబ ఆశ్చర్య కరమైన రీతిలో ఏ ఆపద లేనే లేకుండా కాపాడబడినదని కంచి పరమాచార్యులవారు ఒకసారి తమ అనుగ్రహ భాషణములో నే చెప్పినారు. అసలు మన పూర్వుల గొప్పదనము ఒకసారి గమనించండి. 'దున్న' యముని వాహనము. మరి మనము దున్న పాలు, పెరుగు నెయ్యి వాడుతాము. మరి దున్నను నమ్మిన వాళ్ళను ఎక్కడికది తీసుకు పోగలుగుతుంది యముని వద్దకు తప్ప. అదే 'ధేనువు' ను నమ్మితే ఆఉ పాలు, పెరుగు నెయ్యి తింటే ,అంటే ఆవును నమ్ముకొంటే కైలాసమే కదా మనకు కాబోయేది ఆవాసము. కానీ మోసాల నిలయమైన ఈ కాలములో అన్నీ మనము కోరుకోన్నట్లుగా జరుగవు . అందుకే తినేది భగవంతిని తలచి తింటే ఆ పైన ఆ పాపపుణ్యాలు ఆయనవే. మనము ఆశక్తులము. తెలిసి కూడా జీవితముతో రాజీ పడక తప్పని కాలములో బ్రతుకుతున్నాము
అసలు ఇంకొక ముఖ్యమైన విషయము చూడండి. అమెరికా లో ఆవు మాంసమే ఆవునకు తినిపించి దాని క్షీరసంపద వృద్ధిచేసి అమ్ముతారట. అందువల్ల అక్కడివారు అంతు 

తెలియని వ్యాధుల బారిన పడి ఆవు పాలు పెరుగు మొదలయినవి కూడా మాని కేవలము శాకములు 

మాత్రమే తింటూ  Vegas గా పిలిపించుకొంటున్నారట.  ఇంకొక విషయము. స్వస్తి మంత్రములో 

"స్వస్తిప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహి మహీశాం
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా స్సుఖినోభవంతు"

ఈ మంత్రమును విమర్శకులు కొందఱు  'గో''వుంటే ఉండనీ బ్రాహ్మణేభ్యః ఎందుకు ? వారు మాత్రమే బాగుంటే చాలునా అని ఒక విప్లవము లేవనేత్తుతూ వుంటారు. ఈ వివరణ చదవండి. లోకానికి తిండి ముఖ్యము . తిండికి పంట ముఖ్యము. పంటకు వాన ముఖ్యము. వానకు యజ్ఞము ముఖ్యము. ( యజ్ఞములతో వానలు కురుస్తాయని శాస్త్రీయముగా కూడా నిరూపించినారు మరియు ఎన్నో ప్రభుత్వములు యజ్ఞములు చేయించి వానలు కురిపించినది పత్రికా ముఖముగా కూడా ఎన్నిమార్లో చదివినాము. అన్య మతస్థుడైన ఒక ముఖ్య మంత్రిగారు కూడా ఈ పని చేయించినారు.) యజ్ఞమునకు  గోవు పంచగవ్యము ముఖ్యము . చేయించుటకు బ్రాహ్మణుడు ముఖ్యము. వీరిరువురు సుఖముగా వుంటే యజ్ఞయాగాదులకు కొదవ ఉండదు. అందువల్ల అగ్ని హవిస్సుల రూపములో దేవతలకు ఆహారము తీసుకు పోతాడు కదా! వారి కరుణ కలిగితే లోకాలకు సుఖమే కదా! కాబట్టి ఇకనైనా పెద్దలను తప్పుపట్టవద్దు. వారు ద్రష్టలు. అయినది కానిది అనుమానముగా పెట్టుకొని అనర్థము చేసే దానికంటే ఒక బోధగురువును(డబ్బులడిగే బాధ గురువు కాదు ) ఎన్నుకొని చెప్పినది విని ఆచరించితే మంచిది.


గోదేవతలు మన దేశమునందే కాక ఈజిప్టు గ్రీసు రోము దేశములలో కూడా గోపూజ జరిగేది.కానీ గ్రీసు దేశానికి భారతీయులు విరివిగా వలస పోయినట్లు బ్రహ్మశ్రీ కోట వెంకటాచలము గారు సహేతుకముగా నిరూపించినారు. ఇక గ్రీసు విషయానికొస్తే India In Greece By 
E. pococke చదివితే గ్రీసు లోని భారతీయ మూలాలను గూర్చి తెలుస్తుంది. కాబట్టి మనవారు అచ్చటికి వలస పొతే మన సాంప్రదాయాలు కూడా పోయినట్లే కదా!  ఈజిప్టు గోదేవత కరుణ ,ప్రేమకు చిహ్నముగా తలచుతారు. ఆవు కరుణామూర్తి, ప్రేఅమూర్తి, కామిత దాత్రి అనేకదా మనము భావించుతున్నాము. ప్రపంచమంతా ఒక కాలములో దేవతగా భావించిన ఆ తల్లిని తరిగి తినకపోతే కడుపు నిండదా! అసలు వున్న మాట వున్నట్లు చెప్పుకొంటే ఈ సనాతన ధర్మమును పాటించేవారిలోగూడా అనేకులు చాటుమాటుగా ఆవును తినే వారున్నారన్న వాస్తవాన్ని వ్రాయవలసి వస్తున్నందుకు తల వంచుకొంటూ ఇప్పటికి ఈ వ్యాసము ఇంతటితో ముగిస్తున్నాను.

గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిస్సత్వ వాదిభిః 

అనుద్ధతైర్దానశీలైశ్చ సప్తభిర్దాపతే మహీ
గోవులు, విప్రులు, వేదములు, పతివ్రతలు, సత్యవాదులు, నిగర్వులు, దానశీలురు ఈ ఏడుమందితోటి ఈ భూమి వర్ధిల్లుతూ వుంది.
స్వస్తి

No comments:

Post a Comment