Monday 4 July 2016

భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 12

భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 12
శరీర శాస్త్రము (human physiology) -- ఆయుర్వేదము
మన దేశ వైద్య ప్రగతిని గూర్చి ఆంగ్లేయులు గ్రహించి  తెలిపిన ఈ క్రింది విషయములను వారి భాషలోనే చదవండి.

For thousands of years, physicians relied heavily on a single treatment for hysteria, heart disease and just about every other malady: bloodletting. The theory behind the practice changed often over time, but the practice itself remained much the same -- with doctors often bleeding patients until they were weak, pale and, sometimes, unconscious.  -- Elena Conis -- June 26, 2006
Practitioners throughout Europe routinely bled patients who could afford it in efforts to prevent sickness brought on by excess food, weather changes and wounds.
By the late 1700's, bloodletting was the treatment of choice in America too -- thanks to the efforts of Declaration of Independence signer and physician Benjamin Rush.
Rush, who believed that tension in blood vessels was at the root of disease, turned to bloodletting to treat victims of Philadelphia's devastating yellow fever outbreak in 1793. He favored a quart at a time, repeated several times over several days, and claimed the treatment sped his recovery when he contracted the disease.
Later that same decade, George Washington fell ill with laryngitis, and his physicians bled him heavily, one after the other. The president gave up more than two liters of blood during the procedures and died a day later. Washington died on December 14, 1799 .
ఆయుర్వేదమును గూర్చి ఆలోచంచే ముందు అమెరికా ప్రథమాధ్యక్షుడు ఏవిధముగా మరణించినాడో గమనించి యుంటారు ఈపాటికి. సులభమైన ఆంగ్లములో ఉన్నందువల్ల నేను తిరిగి తెలుగులోకి తర్జుమా చేయలేదు. నరములు కోసి రక్తము తీస్తే రోగమునయమౌతుందన్నది, దాదాపు 18 వ శతాబ్దపు అంతము వరకు వారి వైద్యశాస్త్రము చెప్పిన మాట. అంతగోప్పవాడే ఆగతి పడితే సామాన్యులు ఎన్ని వేలమంది ఈ చికిత్స తో మరణించి యుంటారో అంచనా వేసుకోండి. ఈ రోజుకు గూడా ఆ వైద్యమునకు ఆది గురువైన

Hippocrates పేరు మీదనే భారతీయ వైద్య విద్యార్థులు కూడా ప్రమాణము చేసి వైద్యులౌతారు. ఈ క్రింది విషయము చదవండి.

 Certainly there were 'barbaric' practices as the use of bleeding cups, to take blood from a patient in a particular part of the body that was diseased; in order to cure that part of the body.  
మరి మన ధన్వంతరి , అశ్వనీ దేవతలు, శుశ్రుతుడు, చరకుడు మొదలైన మహనీయులను ఎందుకు తలవరో నాకయితే తెలియదు.
ఇప్పుడు మనము శరీర శాస్త్రము (human physiology) ను గూర్చి ఒక్కమాట చెప్పుకొని వైద్య శాస్త్రమునకు పోదాము.  ఋగ్వేదములో గల మంత్రపుష్పములో 'పద్మ కోశః ప్రదీకాశం హృదయంచాప్యధోముఖం  'అధౌ నిష్ట్యా వితశాంతి నాభ్యాం ఉపరితిష్టతి .....నీవారశూక మత్తన్వి పీతాభా స్వత్యణూపమా ...' నాభికి జానెడు ఎత్తులో ఎడమప్రక్క పద్మపు మొగ్గ ఆకారములో తలక్రిందులుగా గుండె యున్నది. దానికి సమీపముగా నీవార ధాన్యపు ముల్లు,దానిని మనము చూడలేదు కాబట్టి వడ్లగింజ పై ముల్లు అంత చిన్నదిగా నీలపు జ్యోతిగా వెలుగుతూ వుంటుంది అని ఉహించుకొందాము. ఆ నీలపు జ్యోతి మధ్యలో ఒక అణువు రూపములో పరమాత్ముడు నివశిస్తున్నాడు. ఆ విధంగా వెలిగే జ్యోతిని sinus node అని అంటారని ఒక doctor గారు చెబితే తెలుసుకొన్నాను. ఇంత సునిశిత పరిశీలన కలిగినవి మన వేదములు.అంతటి విజ్ఞానవంతులు మన ద్రష్టలు. దీనికి గానూ మన పూర్వులు శవములను కోసి చూసి తెలుసుకోలేదు. గూర్చి ఒక్క మాట. జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రములను గూర్చి అధర్వణ వేదము ఎన్నో విషయాలు తెలుపుతుంది.కౌటిల్యునిలాంటివారు మహా వైదికులు గనుకనే ఆ వేద సారమునకు తన మేధను జోడించి 'అర్థ శాస్త్రమును' వ్రాసినారు. ఇది నాకు తెలిసినవిషయము.  వేద మదన సాధనతో వేదవిదులైనవారు ఎన్నెన్నో విషయములు లోకానికి తమ ప్రజ్ఞచే చాటవచ్చును. కాస్త ఆయుర్వేద లోకములో అడుగుపెడదాము. 

ఆయుర్వేదమునకు ఆద్యుడు ధన్వంతరి.ఈయన వైష్ణవాంశ అని, క్షీరసాగర మథనములో ఈయన జన్మించినాడని  మన పురాణాలు చెబుతాయి. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతన కాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.
ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.
భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
  1. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
  2. కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దివోదాసు. కాశీ ఖండములో ఈయనను గూర్చి వివరముగా తెలుసుకోన వచ్చును. భాగవతములోని నవమ స్కందములో కూడా ")- ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పినట్లు తెలియవచ్చుచున్నది.
  3. విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించినాడని ఒక అభిప్రాయం.
విష్ణువు అవతారమైన ధన్వంతరి అశ్వినీ దేవతలకు ఆయుర్వేదవిద్య ప్రసాదించినట్లు తెలియబడుతూ వుంది. వేదాలలోవీరిని గూర్చిన వర్ణన  దాదాపు నూరు  సూక్తాల వరకు వుండుట మనము గమనించవచ్చు.  వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించటం జరిగింది.వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన 
మహా ఔషధాలు ఉంటాయట. వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవారి  ఆహ్వానంపై అనేక సమయాలలోవచ్చి శస్త్రచికిత్సలు సైతం
చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. వృద్దుడైన చ్యవనమహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన సుకన్య భార్యగా లభించింది. సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది. అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరితే బదులుగా వారు యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించమని అడిగినారు. వడంబదిక కుదురుటతో ఇరువైపులవారికీ పని జరిగిపోయింది. ఈ సందర్భములో అశ్వనీ దేవతలు చ్యవనునికి ఇచ్చిన ఔషధము చ్యవనప్రాశగా గణుతికెక్కినది. చరక సంహితలో చ్యవన ప్రాశ తయారీమరియు దాని ప్రాశస్త్యము మనకు విపులముగా లభిస్తుంది.దీనిని శీతాకాలం లో సేవించడం చాలా మంచిది. దీనిని తయారు చేయడం కూడా శీతాకాలం లోనే చేస్తారుట.

అశ్వినీ దేవతలు  నాటి దేవ ప్రజాసమూహమునకు వైద్యులుగా, ఓడలతో వ్యాపారము జేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండినట్లు ఋగ్వేదమున కానవచ్చుచున్నది. పూర్వము వైద్యము అంతా ఒకటే గొడుగు క్రింద ఉన్నట్లు మనకు అవగతమౌతుంది. అందుకే వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి. వేదాంతర్గతమైన వారి ప్రతిభ ఈ క్రింద తెలియబరచుట జరిగినది.
శయుడను ఋషియొక్క గోవుఈనలేని స్థితిలో నుండగా,దానికి సుఖ ప్రసవము జేసిరి.
రేభుడు, నందనడను ఋషులను రాక్షసులు బడద్రోయగా ప్రాణఘాతకములైన వారి గాయములను మాన్పి  రక్షించిరి.
తుభ్యుడు, అంతకుడు అను వారలను గూడ వీరు ఈవిధముగానే రక్షించిరి.
పరావృజుడను ఋషికి కాళ్ళు పోగా వానిని కృత్రిమముగా  నిర్మించిరి.
ౠజాశ్వుడను వానికి అంధత్వమురాగా, నాతని కన్నులు బాగుచేసి దృష్టి వచ్చునట్లు చేసిరి.
ఖేలుని భార్యయగు విస్పలికి యుద్ధమునందు కాళ్ళు విరిగిపోగా, లోహపు కాళ్ళు ఏర్పరిచిరి.
కణ్వపుత్రుడగు పృధుమహారాజునకు మంచి గుర్రములను ఇచ్చి పేరొందిరి.
అత్రి ఋషిని రక్కసులు గొంపోయి యొక యంత్రగృహమున బడవేసి వేధించుచుండగా, ఆతనిని చెరనుండి విడిపించిరి.
శయుడు, శర్యుడు, శర్యాతుడను వారలకు కావలసిన సాయములిచ్చిరి.
విమదుని భార్యను, భుజ్యుని, అద్రిగుని, ఋతస్తుపను, సుభరను, కుత్సుని, తుర్వీచిని, దభీతిని, ధ్వసంతిని, పురషంతిని, చ్యవనుని  వైద్యము చేసి రక్షించిరి. ఇందులో భుజ్యుడు సముద్రమున ఓడలో నుండి మునిగిపోవుచున్న పుడు వీరు కాపాడిరట.
కక్షివంతు డనువాని కూతురు ఘోషకు కుష్టురోగమును కుదిర్చిరి.
వృషదుని కుమారుడు చెవుడుచే బాధ పడుచుండగా, దానిని నయముచేసిరి.
కణ్వఋషి కన్నులు కానరాక ఉండగా బాగుచేసి దృష్టివచ్చునట్లు చేసిరి.
వేదుడను రాజును శత్రువులు యుద్ధమున బాధించునపుడు ఆతనిని రక్షించిరి.
ఇవి కాక ఇంకా ఎన్నో ద్రుష్టాతరములను మనము books.google.co.in ద్వారా కూడా తెలుసుకొనవచ్చును.
ఈ దృష్టాంతములను బట్టి అశ్వినీ దేవతలు శరీరధారులై పూర్వకాలపు దేవజాతి అనబడు నరులలో పుట్టి పేరొందిన వారైనట్లు స్పష్టము.కాని ఈ కార్యములన్నింటినీ  మొదటి అశ్వినిలిరువురే చేసిరనియు అనజాలము. వారి సంతతి వారందరును కొంతకాలము వరకు అశ్వినులనియే పిలువబడినట్లు మనము గ్రహించ వచ్చును. 
అశ్వినీ దేవతల తరువాత కాశీరాజైన దివౌదాసు ధన్వంతరిని గూర్చి కాస్త తెలుసుకొందాము. ఆయుర్వేదము నందు ఈయనను ప్రప్రథమ శస్త్ర చికిత్సకునిగా చెప్పుకోనవచ్చును. ఈయన ప్రథమ శస్త్రవైద్యుడని మనమనుకొనే  శుశృతునికే గురువు. ఈయన వద్ద ఈ విద్య నేర్చుకొన్న శుశృతుడు  తదనంతర కాలములో 'శుశృత సంహిత' వ్రాసినాడు. దీనిని ఇంకా ఔపధేనవ, ఔరభ్ర, భోజ,గాలవ, గార్గ్య,గోపుర రక్షిత, కనకాయన, నిమి, పౌష్కలావత మరియు వైతరణ అన్నవారలుకూడా జ్ఞానానుభవములను జోడించినారు. 'ధన్వంతరీయము' అన్నపేరుతో శుశృతుడు శస్త్రచికిత్స విద్యాలయమును కూడా స్థాపించినాడట.
ఒకసారి ప్రఖ్యాతి చెందిన పాశ్చాత్య పండితుల మాటలను వారి భాషలోనే చదువుదాము. శంఖువు నుండి వస్తేనేగదా తీర్థమౌతుంది.
“There is scarcely any doubt that this method… which seemed to emerge out of nothing (in Europe), … had its roots in early India… Nowhere else in the whole world of antiquity do we find any precedent for that conception,” observes Jürgen Thorwald (born as Heinz Bongartz October 28, 1915 – April 4, 2006 a German writer, journalist and historian known for his works describing the history of forensic medicine and of World War II.) He added that in 1814, a newspaper account from India inspired Joseph Constantine Carpue[( May 1764 – 30 January 1846) was an English surgeon who was born in London.Carpue is known for performing the first rhino plastic surgery in England, using a technique created in India several centuries earlier.] , a pioneer of modern plastic surgery to restore a nose. This was the first attempt in Europe then. Carpue was greatly impressed by such successful operations performed by Indian village surgeons exactly as described thousands of years ago in the Sushrut Samhita.
    “THE VAST VARIETY OF INDIAN SURGICAL INSTRUMENTS WHICH HAVE COME DOWN TO US FROM THE FIRST MILLENNIUM SUGGEST THAT SURGERY HAD DEVELOPED TO AN EXTRAORDINARY EXTENT IN EARLY INDIA.” -JURGEON THORWALD (SCIENCE AND SECRETS OF EARLY MEDICINE 1962)

    భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 13
    అగ్నివేశ సంహిత లో శస్త్ర చికిత్స ఆకాలమున మాధ్యందిన మార్తాండ తేజముతో విలసిల్లినదని తెలియవచ్చుచున్నది. డాక్టరు శ్రీమతి మన్నింగ్ మన చికిత్సా పరికరముల గూర్చి ఏమి చెప్పుచున్నదో ఒకసారి చూద్దాము.
    “THE SURGICAL INSTRUMENTS OF HINDUS WERE SUFFICIENTLY SHARP INDEED AS TO BE CAPABLE OF DIVIDING HAIR LONGITUDINALLY.” – DR. MRS. MANNING (BRITISH SURGEON)

    అన్నింటికన్నా అతిముఖ్యమైనది, అర్థము చేసుకోనివారిచేత అవహేళనకు గురియయ్యేది అగు ఒక ముఖ్య విషయము తెలుసుకొందాము. మహా భారతములో కుంతికి పుత్రులు కలగటము, తానూ 2 సంవత్సరములుగా గర్భవతియై కూడా తనకు కలుగక పోవటము గాంధారికి హృదయ శల్యమౌతుంది
    అందుకామె తన పోత్తికడుపుపై తనచేతితో బలంగా గుద్దుకొనడముతో పిండము నేలపైబడుతుంది. తపోదీక్షలోయుండే వ్యాసులవారు తమ యోగదృష్టిచే  గమనించి ఆ స్థలమునకు వెంటనే చేరుకొంటాడు. ఆయన, ఆ పిండము ఇంకా శిశురూపము దాల్చలేదనుట గ్రహించుటయేగాక అదియొక 101 జీవకణ కందుకముల (Moles) సంయోగముగానెరింగి వేరు వేరు గ్హృత కుమ్భాములయందు వుంచుతాడు. ఇక్కడ గ్హృత కుంభము అంటే నేతి పాత్ర అని అనుకోవద్దు. అది ఆ కందుకమునకు పోషక మాధ్యమము .  అందువల్లా దుర్యోధనాదులు 100 మంది దుస్సల అన్న అమ్మాయి కలుగుతారు.  ఈ ప్రక్రియకు వాడిన మూలసూత్రమును ఋభుసహోదరులచే  చెప్పబడిన 'చమసా విభాగము' (Division of Living cells) లో చూడవచ్చును. ఈ విధముగా , ద్రోణుడు , కవలలు కృపి, కృపుడు కూడా ద్రోణజులే (Test Tube Babies). ద్రినుడు కృపి భార్యాభార్తలౌతారు. సహజమన సంసారమును గడిపి అశ్వత్థామను కంటారు. కృపుడు మాత్రము సాధారణ రీతిలో జన్మించిన స్త్రీని పెళ్ళియాడుతాడు. ఋగ్వేదములోనే చెప్పబడిన ఈ కుంభసంభవుల పుట్టుకను గూర్చిన వివరములు ఆట్సాహికులైన శాస్త్రజ్ఞులకు వదిలిపెట్టుచున్నాను. నేను చెప్పదలచుకోన్నదల్లా మన పూర్వులు చెప్పిన విషయములు ఊహాజనితములని కొట్టిపారవేయకుండా శాస్త్రదృష్టి తో పరీక్షించమని నా అభ్యర్ధన. 
     ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.8 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సారాల తరువతా రొగులకి వైద్యం అవసరం కొసం క్షవరం అవసరమైనది, ఆ తరువాత కాలములొ కొంతమంది "చరకులు" కాస్తా "క్షురకులు" గా మార్పు చెందినట్లు చెబుతారు.


    ముందుగా శస్త్ర చికిత్సను గూర్చి కాస్త ముచ్చటించుకొందాము.
    శుశ్రుత సంహిత లో   మూడు వందల వివిధ శస్త్ర చికిత్సలను గూర్చియు  దానికి వలసిన  121 శస్త్రచికిత్సా (20 పదునైన మరియు 101 అనుబంధ) పరికరములను గూర్చియు వివరిస్తుంది. Tongs, forceps, scalpels, catheters, syringes, speculums, needles, saws, probes, scissors మొదలైన పరికరములన్నీ నాడు వారు ఉపయోగించినారు. Rhinoplasty (plastic reconstruction of the nose) కి సంబంధించిన అతి పురాతనమైన ఆధారము శుశ్రుతుని కాలము నాటిదే!
    ఇక్కడ రెండు విషయయములు తెలియబరచుతాను. ఒకటి మా అమ్మమ్మ నా బాల్యములో, తన అమ్మమ్మను గూర్చి తెలిపినది,వేరొకటి నాలుగైదు సంవత్సరముల క్రితము రాజీవ్ దీక్షిత్ గారు {Born on 30 November 1967 in Aligarh, Uttar Pradesh, India and Died on 30 November 2010 (aged 43) Bhilai, Chhattisgarh, India, Education M.Tech (IIT Kanpur)}చెబితే తెలియవచ్చినది.
    తల్లిలేని నన్ను మా అమ్మమ్మే పెంచి పెద్దచేసి నాకు ప్రయోజకత్వమును సమకూర్చినది. నా తండ్రి అందుకు తగిన సాధనములను సమకూర్చి సంఘములో సమర్థునిగా నిలిపినది. అసలు విషయానికి వస్తే మా అమ్మ గారి అమ్మమ్మది వేముల. ఇది కడప జిల్లా పులివెందులకు 14 కి.మీ.,కడప పులివెందుల రహదారిలో, పులివెందులకు దగ్గరగా వుంది.భర్త మరణానంతరము ఆమె జీవితమంతా ఒంటరిగా అచ్చటనే గడిపినది. ఆమెకు ఒకసారి శుక్లాలు (CATARACT) వస్తే మామూలుగా తన ఇంటికి క్షురకర్మకు గానూ వచ్చే మంగలికి కబురంపినది. ఆరోజులలో భర్తను ఎడబాసిన వారు నెల నేలా, ముఖ్యముగా బ్రాహ్మణులలో, గుండు గీయించుకోనేవారు.( ఇది మంచి సాంప్రదాయమా కాదా అన్న తర్క వితర్క కుతర్కములకు పోవద్దు. కేవలము నాటి కట్టుబాటు తెలియబరచినాను.)అతను ఇంటికి వచ్చి ఆమెకు శాస్త్ర చికిత్స చేసి శుక్లములను తీసివేసి ఆమెకు తిరిగీ కంటిచూపు కలిగించినాడట.ఎప్పుడో 80 సవత్సరములనాటి ఈ ఉదంతమును బలపరుస్తూ రాజీవ్ దీక్షిత్ గారు ఒక చారత్రిక సత్యమును వేల్లడించినారు.
    హైదర్ అలీ శ్రీరంగపట్టణమును రాజధానిగా చేసుకొని (క్రీ.శ.1761--1782) ఏలిన ఒక ప్రఖ్యాత కర్నాటక ప్రభువు. 
    ఆంగ్లేయులతో అసమానరీతిలో పోరాడి ప్రతిఘటించిన యోధుడు. ఒకసారి , బహుశ 1780 లో అనుకొంటాను, Colnal Coot మైసూరు యుద్ధములో హైదర్ అలీ కి పట్టుబడి రాజసభలో ప్రవేశపెట్ట బడుతాడు.అతనికి మరణ దండన విధించావలేనని ధర్మాసనము ఉత్తరువిస్తే, ముక్కు కోయుట (నాక్ కట్వానా)అందు సమానమని అతని ముక్కు కోసి చేతికిచ్చి పంపుతారు. ఆటను గుర్రముపై బెల్గాం సమీపించు సమయమున ఒక పౌరుడు అతని తెగిన ముక్కును జూసి, దయ తలచి ఆతనిని పిలుచుకు పోయి శస్త్ర చికిత్స చేసి ముక్కును యధాతథముగా అతికిస్తాడు. ఈ విషయము coot డైరీ లో వ్రాయబడి వున్నదట. ఇక్కడ గమనించ వలసినదేమిటంటే ఆ శస్త్ర చికిత్సకుడు గూడా మంగలే నట.అదికూడా చికిత్స ధనము తీసుకోకుండా ఉదారముగా చేసినాడట. ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే నాడు సంఘ శ్రేయస్సుకే కుల విభజన జరిగినదిగానీ స్వార్థ పరత్వముతో కాదు. ఎవరి పని వారిదే ,ఎవరి గొప్పదనమూ వారిదే!ఇందు అధిక అధమ తారతమ్యము ఆవగింజంతైనా లేదు.
    ఇంకొక విషయము గమనించండి:

    'Kangada' district in Himachal Pradesh was famous for its plastic surgeons. Some scholars are of the opinion that the word 'Kangada' is made from 'Kana + gadha' (ear repair). The British archaeologist Sir Alexander Cunningham (1814-93) has written about the tradition of Kangra plastic operations. We have information that in the reign of Akber, a Vaidya named Bidha used to do plastic operations in Kangra.' ( గూగుల్ సౌజన్యముతో)
    ఇది వారూ వీరూ పోసిన తీర్థము కాదు శంఖమునుంది వచ్చినది. మరి ఇంత గొప్ప చరిత్ర మనకున్నదన్న ఉహ కూడ ఇటీవల కాలము వరకు మనలో కలుగని దానికి సిగ్గుపడ నవసరము కలదుగదా! ఇప్పటికైనా యువత , మరియు నేటి బాల విద్యార్థుల తల్లిదండ్రులు కళ్ళు తెరిస్తే దేశ ప్రతిభను, మన పూర్వుల గొప్పదనాన్ని తెలుసుకోన్నవారవుతారు.
    ఒక్కసారి స్త్రీల ప్రసూతి విషయమును గూర్చి తెలుసుకొందాము. మాకు 10 ,  15 సంవత్సరముల వయసు వచ్చువరకు కూడా ప్రసూతి ఇంటివద్దనే జరిగేది. ఆపనిని 'మంత్రసాని' వచ్చి ఇంటికి వచ్చి చేసేది. కానుపు జరిగిన పిదప ఆమెకు ఇచ్చే డబ్బు ఆకు వాక్క 2 రూపాయలు. రాను రానూ అది ఒకవేళ 10 రూపాయలు అయితే అయి ఉండవచ్చు. నేడు మంత్రసానులు మాయమైపోయినారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆస్పత్రులలో ఒక ప్రసవమునకు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నామో నేను చెప్పనవసరము లేదు. అసలు మంత్రసాని అన్న పేరు ఎట్లు వచ్చిందో చూడండి. ఎ కారణము చేతనైనా గర్భస్త శిశువు తల క్రిందులైతే నేడు ఆపరేషను తప్పనిసరి. నాడు ఈ మంత్రసాని అతి బిగ్గరగా కర్ణ కఠోరముగా తనకు వచ్చిన మంత్రాలను (వేదం మంత్రములు కావు సుమా!) తిప్పించి చదివేదట ఆ గర్భవతి ముందు. అది వినలేక గర్భస్థ శిశువు కదిలి కదిలి తిరిగి తలను క్రిందికి తెచ్చేదట. కానుపు సులభము సుగమము అయ్యేది. ఎంతటి మహత్వ పూర్ణమైన విషయమో చూడండి.
    భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 14
    ఇంతవరకు శస్త్ర చికిత్సా శాస్త్రమును, ప్రసూతి విధానమును గూర్చి తెలుసుకొన్నాము, ఇక కాస్త వైద్యమును గూర్చిగూడా మన పూర్వుల ప్రతిభ తెలుసుకొందాము.
    చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి. సుశ్రుతుడి లాగానే చరకుడు కూడా "చరక సంహిత" అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించినాడు. అందులో చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం లో అధర్వ వేదం లో ఉన్నాయి .వాటిని క్రోడీకరించి స్వీయ అనుభవాన్ని జోడించి చికిత్సా విధానమును తెలియబరచినాడు. .చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది. చరక సంహిత వెలువడిన కొన్ని శాతాబ్దాల తరువాత కూడా అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు. వాళ్ళలో కాశ్మీకరుడు, ధృవబాల మొదలైన వాళ్ళు ముఖ్యులు. "చరకసంహిత" క్రీ.శ.987 లో అరబ్, పర్షియన్ భాషల్లోకి అనువదింపబడినది.
    శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాత,పిత్త,శ్లేష్మ దోషాల వల్లే కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయ లతో తయారైన త్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించినదే! అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు. క్యాన్సర్ కణాలకు, పక్షవాతం , మూర్చ , కుష్టువ్యాధి, చూపు మందగించటం లేదా పూర్తిగా పోవడం వంటి వ్యాధులకు అతి సులభమైన నివారణోపాయాలను చరకుడు తన చరక సంహితలో పొందుపరిచాడు.
    మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురి చెసింది. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం ఎన్నడో పేర్కొంది. భౌతిక పదార్థాలైన వృక్ష,జంతు, ఖనిజ,రసాయన సంబంధమైన ఔషధాలు శారీరక రుగ్మతల్ని తగ్గిస్తే కొన్ని రకాలైన మంత్రోచ్ఛాటన ఒక క్రమ పద్ధతిలో చేయటం వల్ల మానసిక రుగ్మతలు ఉపశమిస్తాయని చరకుడు ప్రతిపాదించాదు. ఇప్పుడు ఆధునిక వైద్యులు చేస్తున్న "ఆల్టాసోనిక్" వైద్య చికిత్సా విధానానికి చరుని సిద్ధాంతమే ప్రేరన.
    చరక సంహిత క్రీ.శ.3-2 శాతాబ్దాల మధ్య కాలంలో రచించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఈ చరక సంహిత "అష్టాంగ స్థానములు" గా రచించబడినది. దీని మొత్తం 120 అధ్యాయాలున్నాయి.
    1. సూత్రస్థానం : 30 అధ్యాయములు
    2.నిదానస్థానం : 8 అధ్యాయములు
    3.విమానస్థానం : 8 అధ్యాయములు
    4.శరీరస్థానం : 8 అధ్యాయములు
    5.ఇంద్రియస్థానం : 12 అధ్యాయములు
    6.చికిత్సస్థానం : 30 అధ్యాయములు
    7.కల్పస్థానం : 12 అధ్యాయములు
    8.సిద్ధిస్థానం : 12 అధ్యాయములు
    దీనిలో చికిత్స స్థానంలో 17 అధ్యాయాలు, కల్పస్థానం, సిద్ధిస్థానాలు పూర్తిగా క్రీ.శ. వ శతాబ్దానికి చెందిన ధృవబాల అనే ఆయుర్వేద శాస్త్రవేత్త రచించి కలిపినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం.
    మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శారీరక మానసిక దృడత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని, ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు.
    ఆధునిక వైద్యులు నేటికీ చరక సంహిత లోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్యసేవలు అందించటం విశేషం. చరకుని వైద్యగ్రంథం "చరకసంహిత" మీద మరిన్ని ఎక్కువ పరిశోధనలు విస్తృతంగా జరగవలసి ఉంది. అప్పుడే సర్వమానవాళికీ ఆయుర్వేదం ఆరోగ్యప్రదాయనిగా పరిఢవిల్లుతోంది.
    చరక సంహితను ఆపోశన పట్టినవాడు వాగ్భటుడు. ఆయన సంహిత సారాన్ని మూడు ముక్కలలో చెప్పినాడు. 
    ”హిత భుక్తి మిత భుక్తి రుత భుక్తి” మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి. తినటానికే జీవించ రాదు.జీవించుటకు తినవలెను. మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజనకరమో దాన్నే తినాలి
    రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజాఆహారాన్నే మితంగా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడుఅవుతుంది.హితమైనది మితముగా తినటం శ్రేయస్కరము.
    మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి. న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది
    ప్రాచీన వైద్యమునకు ఆద్యుడనదగిన ఆత్రేయ మహర్షి అడుగుజాడలలో అగ్ని వేశుని అద్వితీయ బోధనలతో తన రచనలకు పుష్టిని తుష్టిని సమకూర్చిన మహనీయుడు చరకుడు. ఈవిషయాన్నిచరకుడు తనగ్రంథములో పేర్కొన్నాడు .
    సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుడు అంద జేసిన మూలికా విశిష్టతను అమలు పరచిన పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారతదేశము మొదటి స్థానములో ఉంది.మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే. వైద్యములో పాదరసమును వాడుట శుసృతుని ద్వారానే లోకమునకెరుకైనది. నేటి వైద్య శాస్త్రజ్ఞులు కూడా ఆవిషయమై విస్తుపోతారు.
    అసలు వైద్యములో 1.యంత్ర 2.తంత్ర 3. మంత్రతంత్ర చికిత్సలుగా విభజించినారు.
    1. యంత్ర చికిత్స : కొన్ని రుగ్మతలకు యంత్రములు కట్టేవారు. భూత చికిత్స కూడా చేసేవారు. వంచన పరులు రంగప్రవేశము చేయనంతవరకూ ఈ చికిత్సలతో మేలు జరిగినది అన్న వాస్తవమునకు నేనే ఒక ఉదాహరణ.
    2. తంత్ర చికిత్స: అది నేటి ఆయుర్వేద వైద్యము. గొప్పగొప్పవారు తమ దీర్ఘ కాలిక వ్యాధులను ఈ చికిత్స తో నయము చేసుకొన్నారు, కానీ ప్రభుత్వమునకు దీనిని ప్రచాలితము చేసే ఆలోచన ఇంక్సా రాలేదు.
    3. మంత్ర చికిత్స : కొన్ని వ్యాధులను మంత్రముచే బాగు చేసే వారు. ముఖ్యముగా చిన్న పిల్లల విషయములో ఈ చికిత్స చేయుట నేను కళ్ళారా చూసిన విషయము. అసలు కామర్ల వ్యాధికి (కామెల, Jaundice) నేటికి కూడా Allopathy లో తగిన మందు లేదు. ఇందులో అనేక రాఖాలు గూడా వున్నాయన్నది అందరికీ తెలిసినదే! నేను కడలో కాలేజీ లో చదివే రోజులలో మా తమ్మునికి ఈ వ్యాధి సోకితే వానిని ప్రక్క వీధిలో నున్న ఒక బ్రాహ్మణ విధవరాలివద్దకు నేను మా అమ్మమ్మ వానిని తీసుకొని పోయినాము. ఆమె నాతో ఒక డజను బట్టలు కుట్టే చిన్న సూదులు బజారుకు పోయి తెమ్మని చెప్పినది. తెచ్చిన తరువాత ఆ సూదులను తన చేతిలోనుంచుకొని పిల్లవాని ఎదురుగా ఏవో మంత్రములు చెప్పి , సూదులు వున్నా చేతిని వాని కుడి ,ఎడమ ప్రక్కలకు ఆడించి తమ ఇంటి పంచ గూటిలో వేసి మమ్ము తిరిగి మరుసటి రోజు రమ్మన్నది. ఆరోజు పోయి ఆమె ఇంటి గూటిలో చూతుము కదా ఆ సూదులు ఎంతగా త్రుప్పు పట్టినాయంటే బెల్లపు ముక్కకు నల్లచీమలు పట్టినంత నలుపై ఉండినాయి. ఆమె ఆరోజూ ఆ తరువాతిరోజు అదేవిధముగా చేసింది. వ్యాధి ముదిరిన , మా వానికి అది మూడురోజులలో నిజముగా మాయమై పోయినది. ఈ రోజు అటువంటి చికిత్సకు మనము నోచుకోలేము. కారణము వానిపై మనకు కలిగించిన చిన్న చూపే కారణము. ఎవరు అంటే పాశ్చాత్యులు, వారిని అనుసరించే మన భిషగ్వరులు, మన చేవలేని ప్రభుత్వములు.
    ఇంకొక , ఇది మీకు తెలిసినదేఅయినా, విషయము మీకు తెలుపుచున్నాను. మా బాల్యములో వస్త్ర ఘాళితము పట్టిన అతి మెత్తని బొగ్గుపోడిలో, లేక ఆవు పేడతో చేసిన పిడకను కాల్చి ఆనుగ్గును పొడిచేసి వస్త్ర ఘాళితము పట్టిన అతి మెత్తని ఆ పొడిలో మాచికాయ గంధమును ఎండబెట్టి ఆ పొడిని, పచ్చ కర్పూరమును, లవంగపు పొడిని, ఉప్పును , ఎండిన వేపాకు పొడిని చూర్ణము చేసి దానిని దంత మంజనముగా ఉపయోగించే వారము. మా బాల్యములో tooth paste, tooth brush మేము ఎరుగము. నాగరికత ముదిరి అవియన్నీ మరచి కాలక్రమేణా పేస్టు-బ్రష్షుల బానిసలమైనాము. ఇప్పుడు 60 సంవత్సరముల తరువాత టాయిలెట్లలో దూరి mike పట్టుకొని ఆడవారు మీ tooth paste లో ఉప్పుందా, బొగ్గుండా అని అడుగుతున్నారు. నేటి యువతరమునకు అటువంటి సాధనములు మాకాలములో వాడిన విషయము కూడా తెలియనివారున్తారని నా అభిప్రాయము.

    కర్ణుని వంటి మహావీరుని నేను చంపినానే అని కృష్ణునితో చెప్పుకొని బాధ పడే అర్జునునితో కృష్ణుడిట్లన్నాడట :
    నరవరా నీచే నాచే
    వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
    ధర చేత భార్గవునుచే
    నరయంగా కర్నుడీల్గె నార్గురిచేతన్
    ఆవిధముగా ఎటువంటి దోషములు లేని నమ్మకమైన మానవత్వముతో తప్ప ద్నాకాన్క్ష లేని విద్యమును గోల్పోయి ఇంగ్లీషు డాక్టరు పాంచాల బడి వేలకు వేలు లేకుంటే లక్షలు పెట్టి వైద్యముచేయిన్చుకోనేమనలను గూర్చి మనమేనని అనుకొన్నా తక్కువే!
    ఒక సామెత వుంది . 'మున్నూరు రూపాయలూ పోయె , మూతి మీసములు పోయె నంబి సోమయాజులన్న పేరు పోక పోయె!'
    ఒకతను తన నంబి అన్న పేరులోని ముందున్న 'నంబి' అను పదము తీసిఎయ దలచుకొని ఎంతో కష్టపడి యజ్ఞము చేసి సోమాయాజులైనాదట. దాని వాళ్ళ అతని పేరు బోయి సోమయాజులు అన్న పేరు వచ్చిన్దికానీ ముందున్న నంబి పోకపోగా అతనిని 'నంబి సోమయాజులు అని పిలువదొడగినారట. ఈ మాట ఎందుకు చెప్పినానంటే మనము పాశ్చాత్యులను ఎంత అనుకరించినా మనకు వారు అవహేళనచేసే 'Indian' అన్న పేరు పోదు. మనము భారతీయులము అని గర్వముగా చెప్పుకొనే పనులు చేద్దాము.
    ఈ దేశ వైభవ పునర్నిర్మాణ కర్తలు యువకులే. దేశాన్ని కాపాడటమంటే మీ గౌరవమును తిరిగీ మీరు పొందడమే!

    వేరొక శాస్త్ర విభాగముతో తిరిగీ కలుస్తాము.




    No comments:

    Post a Comment