Monday 4 July 2016

భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 11

భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 11
భారతీయ విజ్ఞాన శాస్త్రము -- 10 లో అనేక ఖనిజములు లోహములను గూర్చి చర్చించినాము. వజ్రాదులు కూడా ఖనిజములే! (గనులనుండి పుట్టినవే!) కావున ఇపుడు వానిని గూర్చి తెలుసుకొందాము. వజ్ర వైఢూర్య, మరకత మాణిక్యాదులను గూర్చిమనము మన రామాయణ,మహాభారతాది ఇతిహాసములందును, మస్త్య వామన భాగవత కాశీ స్కందాది పురాణములందును, అనేక శాస్త్రములందును వింటూనే ఉంటాము. అసలు మహేన్ద్రుని ఆయుధమే వజ్రము. ఒకసారి దేవీ భాగవతము చదివితే అమ్మవారి ఉనికి ఎన్ని లోహ ప్రాకారాలు దాటినా తరువా వస్తుంది.  ఒక్కొక్క ప్రాకారము ఏవిధమైన శోభలతో అలరారారుతూవుంది మనము తిలకించ వచ్చు. ఈ పురాణముల ప్రాచీనతే మన పాశ్చాత్య ,వారి అనుయాయులైన మనవారికి అందనపుడు, అందుగల వర్ణనలు కల్పనలనలేము కదా! నిప్పులేనిదే పొగ రాదన్న నానుడిని గూర్చి యింతకు క్రితమే చెప్పియున్నాను. కాబట్టి వజ్రాలు ఉండినాయి అంటే వజ్రాల గనులు వుండినాయనే కదా! పాశ్చ్యాత్య చరితకారుల కందనంత కాలము నుండి ఇవి ఉండినవి కావుననే వీనిని గూర్చి చెప్పుకొన్నాము. అసలింత చరిత్ర మరిఎదేశానికి కూడా లేదు. ఒక వేళ పూర్వులు వ్రాసిన పుస్తకములలో వీని దాఖలాలు వున్నవా అంటే తప్పకుండా వున్నవి.కౌటిల్యుని అర్థ శాస్త్రము (క్రీ.పూ.4వ శతాబ్దము ), ప్లీని (క్రీ శ 1వ శతాబ్దము), 
టాలమీ (క్రీ.శ. 2 శతాబ్దము ), బుద్ధ భట్ట (6 వ శతాబ్దికి ముందు), వరాహ మిహిరుడు(6 వ శతాబ్ది లో),వ్రాసిన వ్రాతలను బట్టి మనదేశము లో వజ్రాల గనులుండేవని , మన దేశమే సంపదల గని యని తెలియ వచ్చుచున్నది.
క్రీస్తు పూర్వము  6000 లో మహాజనపద సామ్రాజ్యమున వజ్రముల యొక్క వాడకము అమితముగా ఉండినదని మనకు తెలియవచ్చుచున్నది. ఆకాలమునకే తండులములు (బియ్యము) ఎంతో ప్రాధాన్యత సంతరించుకోన్నట్లు మనకు తెలియవచ్చుచున్నది. వారి ద్రవ్య మారకమును 'రూపకము' అనేవారు. ఆకాలము 20 తండులముల బరువు తూగిన వజ్రము విలువ 2,00,000 రూపకములుండేదట.' 'రత్నపరీక్ష' నియమావళిని ఆ రోజులలో గ్రంథస్థము చేసి యున్చినారట. ఈ విషయములను చాణక్యుని అర్థ శాస్త్రములో మనము గమనించగలము.


  • మౌక్తికం = ముత్యము = pearl
  • మాణిక్యం = కెంపు = ruby
  • వైఢూర్యం = రత్నం = lapis-lazuli
  • గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
  • వజ్రం = diamond
  • విద్రుమం =ప్రవాళము= పగడం = coral
  • పుష్యరాగం = తెల్లటి మణి = topaz
  • మరకతం = పచ్చ = emerald
  • నీలమణి = sapphire
వీనిని నవరత్నాలు అంటారు. విలువైన రాళ్ళను ఒక్క మన దేశమందు తప్ప ఎ దేశములోనూ ఇంత తీక్ష్ణమయిన పరిశీలన , పరిశోధనలతో 
వర్గీకరించ లేదు. ఎంతో పురాతన కాలము నుండి మనకు ఇవి అందుబాటున ఉన్నందువలననే కదా మనము వీటి  ఔన్నత్యమును లోకానికి తెలుప గలిగినాము. ఇటువంటి వర్గీకరణ మనవారు తప్ప మనకన్నా ముందు వేరెవరూ చెసిన దాఖలాలు లెవుకదా! 
అలక్ష్యేంద్రుని (Alexander ) తరువాతనే వజ్రములు మనదేశము నుండి పడమరకు సాగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతకు మునుపు అవి విదేశములకు పంపుట బహుశ నిషిద్ధింపబడి యుండవచ్చునని నిపుణుల భావన. కొందరు చరిత్ర పరిశోధకులు ధన వంతులు
రాజవంశీకుల తప్పులకు వజ్రములను చెల్లించట పరిహారముగా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పుచున్నారు. దీనిని బట్టి ఎ విధముగా యోచించినా కూడా మన నాగరికత యౌవ్వనములో వున్నకాలములో ఈజిప్టు నాగరికత పుట్టినట్లు స్పష్టముగా తెలుస్తూవుంది. ఈ గద్దవజ్రముల గనులకు ఆలవాలమని నిష్పాక్షిక చరిత్రకారుల రచనలు చదివితే ఎవరికైనా అర్థమౌతుంది. ఒక వ్యక్తి గురువుల మూలముగా గొప్ప తెలివిమంతుడైతే వాడు సాన పట్టిన  వజ్రము అంటాము.
వాస్తవమును గమనించితే క్రీస్తుకు పూర్వమే ఎన్నో వేల సంవత్సరములనుండి మన దేశమున కాశ్మీరులో నీలాలు (sapphires) మయాన్మార్ (బర్మా) లో (బర్మా ఒకప్పుడు మనదేశాములోని భాగమే ) కెంపులు, అత్యంత ప్రసిద్ధి గాంచినవి. కానీ వజ్రమునకు వీటికన్నా విలువ ఎక్కువ.అసలు వజ్రం వజ్రేనా భిద్యతే అన్నారు పెద్దలు . వజ్రాన్ని వజ్రమే భేదిన్చాగాలదట. అంటే వాజరమెంత గట్టిదో గమనించండి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వజ్రాలకు పెన్నా తీరము ప్రసిద్ధికెక్కినది . కడప జిల్లాలోని కోడూరు రాజంపేట ప్రాంతాలలో విరివిగా వజ్రాల
గనులుండేవట. కృష్ణ గోదావరి పరీవాహక ప్రాంతములందు కూడా వజ్రాల గనులుండేవట.గుంటూరు జిల్లాలోని కల్లూరు లో అత్యంత పెద్దదియైన వజ్రాలగని ఉండేదట. అత్త సొత్తు అల్లుడు దానము చేసినట్లు ఆసంపదను నిజాము నవాబు ఆంగ్లేయులకు ధారా దత్తము చేసిన, లేక వేరు విధములుగా కూడా పరాయి దేశముల పాలైన , ప్రపంచములోని అత్యంత విలువైన వజ్రములలోని అధికాంశము, మన దేశపు వజ్రములు  ఏ  ఏ  దేశాలలో వున్నాయో తిలకించండి. (గూగుల్ సౌజన్యముతో )
  • Koh-i Nūr (186ct) - in the British Crown Jewels, London
  • The Great Mogul Diamond (787ct) - Lost after Nādir Shāh sacked Delhi
  • The Pitt or Regent Diamond (410ct) - in the Apollo Gallery, Louvre Museum, Paris
  • The Orloff Diamond (300 ct) - in the Diamond Treasury, Kremlin, Moscow
  • Nizām Diamond (340ct) - in the Nizām's Treasury, Hyderabad
  • Daryā-ye Nūr (182 ct) - in the Iranian Crown Jewels, on display:Central Bank of Iran,Tehran
  • The Hope Diamond (67ct) - in the American Museum of Natural History, theSmithsonian Institution, Washington
  • The Golconda (135ct) - belonging to Dunklings Jewellers, Melbourne, Australia.
  • The Kolluru Diamond (63ct) - Purchased by Tavernier and present location unknown.
  • Dresden Green Diamond (41 ct) - "The New Green Vault" in the Staatliche Kunstsammlungen Dresden.
పశ్చిమాఫ్రికా లోని కిమ్బర్లి లో ఉల్కా పాతముల కారణముగా వజ్రములు అగుపించే వరకు అత్యధిక వజ్రసంపద మన దేశామునదే. నేడు అత్యంత వజ్రసంపద గలిగిన 10 దేశములలో కనీసము ఒకటిగా నైనా మనదేశము లేదు. 


దాదాపు 1000 సంవత్సరముల మహమ్మదీయ, క్రైస్తవ పరిపాలన తరువాత రత్న గర్భయైన మనదేశము అగర్భ దరిద్ర దేశముగా క్రైస్తవ చరిత్రకారులు మనకు పట్టము కట్టినారు. అసలు వాస్కోడగామా హిందూ మహాసముద్రములో తానూ తెచ్చుకోన్ననావలలో చావు బ్రతుకుల నడుమ ఆ మార్గమున పోవుచున్న తన నావకన్నా 10 రెట్లు పెద్దదయిన నావలో పోవుచున్న గుజరాతీయ వ్యాపారిని దేహీ యంటే అతనికి ప్రాణ భిక్ష యొసగి మనదేశాములోనికి తెచ్చినాడన్నది  పాశ్చాత్య చరిత్రకారులు మరుగు పరచినవాస్తవము. ఆతరువాత మనదేశామునకు 4 మార్లు వచ్చి మన సంపద కొల్లగోట్టుకొని పోతూ చివరిసారిగా సముద్రములోనే మరణించినాడట. 13 వ శతాబ్దములో మార్కోపోలో మొదలు ౧౭ వ శతాబ్దములో హెన్రీ హోవార్డ్ వరకు మన దేశమును సందర్శించి (వారి స్వలాభామునకే సుమా!) దేశములోని వివిధ ప్రాంతములలో వజ్రాల గానులున్నట్లు తెలిపినారు. సంయుక్త ఆంధ్ర దేశములో కృష్ణ,గుంటూరు, కడప, అనంతపురము, కర్నూలు,మహబూబ్ నగరులలోను, మధ్య ప్రదేశ్ లోని పన్న ప్రాంతములోను వజ్రఖనులు ఉండినవని mapsindia.com తెలియబరచుచున్నది. గోలుకొండ కాకతీయుల రాజధానిగా 'మంగళ వారము ' అన్న పేరుతో ఒకప్పుడు శోభిల్లు చున్నపుడు ఈ రాష్ట్రము యొక్క రత్నకోశముగా కొనియాడబడినది. అటుపిమ్మట నిజాము నవాబుల హస్తగతమై రత్నములకు బదులుగా మనకు రాళ్ళు మిగిల్చినది నిజాములు మన కనులముందుంచిన నిజము. Diamonds In The Deccan an overview by S.V.Satyanarayana  అన్న పుస్తకము మీరు చదవగలిగితే ఇంకా వాస్తవాలు తెలుసుకొన వచ్చు.
Published on Oct 2, 2013
Diamonds are thought to have been first recognized and mined in India, where significant alluvial deposits of the stone could be found many centuries ago along the rivers Penner, Krishna and Godavari. Diamonds have been known in India for at least 3,000 years but most likely 6,000 years. 

ఈ సందర్భములో మన సంపద ఎంత విదేశీయుల చేతులలోకి పోయింది, అన్న విషయమును తెలుసుకొని కోహినూరు చేతులు మారిన విషయమును ఆకళింపు జేసుకొందాము.
 కోహినూరు వజ్రం... మయూర సింహాసనం, శివాజీ ఖడ్గం, హౌప్‌ వజ్రం, తైమూరు చక్రవర్తి కెంపుల హారం (మన దేశ సంపదను కొల్లగొట్టి గ్రహించినదే ),బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌,ఇలా అనేక మన వారసత్వ సంపదలు దేశం వీడి ఏళ్లు గడిచినాయి. చాలా వరకూ విదేశాల్లో, మ్యూజియాల్లో దర్శనమిస్తుంటే మరి కొన్ని మహారాణుల వగలకు బలియై నగలలో పొదగబడి అంటే బంధింపబడి   మూలుగుతూ మన కనుమరుగైపోయినాయి. ఇవన్నీ మనవే అని యావత్‌ ప్రపంచానికి తెలిసినా, ఎప్పటిెకైనా అవి మన దేశానికి రాకుండా పోతాయా అంటూ ఆశావాదుల్లా,కళ్ళలో వత్తులేసుకుని అసహాయులమై నిరీక్షించడం మినహా తిరిగి తెచ్చుకోలేని దౌర్భాగ్యము కలుగజేసిన మనమెన్నుకొన్న మన ఘనమైన నాయకులు మనకు చిరస్మరణీయులు. 
కోహినూర్‌ వజ్రంభారతదేశ చరిత్రలో కోహినూర్‌ వజ్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. మన కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రం దొరికిన ఈ వజ్రం    14వ శతాబ్దంలో మొఘల్‌చక్రవర్తి బాబరు చెంతకు చేరింది. ఆపై షాజహాన్‌ తన నెమలి సింహాసనంలో ఈ వజ్రం పొదిగించాడని... మొఘలాయిల వారసత్వ సంపదగా వచ్చిన ఈ వజ్రంపై కన్నేసిన నాదిర్షా 1739లో ఢిల్లీపై దండెత్తి నాటి మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షాను ఓడించి... కోహి నూర్‌ వివరాలు కనుక్కుని కోహినూర్‌ అని అప్రయత్నంగా అన్నా డని...దీంతో ఆ పేరే దానికి స్థిరపడి పోయిందని చరిత్రకారులు చెబుతారు. నాదార్షా ఎత్తుకుపోయిన ఆ వజ్రం 1747లో కుర్దిష్‌ తెగలపై ఆయన దాడులని ప్రతిఘటించిన సొంత అనుచరగణం చేతిలో కన్ను మూయగా, వారి ద్వారానే 18వ దశకంలో మన దేశంలోని షాజా అనే రాజుని చేరింది. 

అయితే షాజాని బందించిన కాశ్మీర్ రాజును ఓడించినందుకు ప్రతిగా, షాజా భార్య లాహౌర్‌ మహారాజు రంజిత్‌సింగ్‌కు అందచేయగా, ఆయన తన తదనంతరం కోహినూరును  పూరీ జగన్నాధుడికి చెందేలా విల్లురాసి చనిపోవుత జరిగింది. అయితే అప్పటికే ఈ దేశంలో బ్రిటీష్‌ పాలకుల దాష్టీకాలు ప్రారంభమై అపార సంపదని తమ దేశానికి తీసుకుపోవటం ప్రారంభించైనా దరిమిలా వారి కళ్ళబడ్డ కోహినూర్‌ను ఏప్రిల్‌ 6 1850న హెచ్‌ఎంఎస్‌ మీడియా నౌక ద్వారా బొంబాయి తీరం నుండి ఇంగ్లాడుకు ఎన్నో ఒడిదుడుకుల నడుమ తరలించుకుపోయిన వీరాధివీరులు. అత్యంత విలువైన ఆ వజ్రం బ్రిటీష్‌ మహారాణి కిరీటంలో చోటు దక్కించుకుని నేడు అత్యంత భద్రతతో సందర్శకులకు కనువిందు కలిగిస్తూ... సేదతీరుతోంది. 
ఈ విధంగా మన దేశమునుండి కొల్లగోత్తబడిన వజ్ర సంపద ప్రపంచములోని  నలు మూలలా 20కి పైగా దేశాల్లో ఉన్నాయని తెలియవస్తూవుంది. ఇవి కాకుండా లాహోర్‌ మహారాజు షేర్‌సింగ్‌ నిత్యం ధరించే పచ్చలబెల్ట్‌, రీగల్‌కిరీటం, తైమూరు కెంపుల హారం, గోల్డెన్‌ మహారాజా డైమండ్గ ఇలా ఎన్నో బ్రిటన్‌లోని విండ్గసర్‌ క్యాజిల్‌లో కనిపిస్తాయి.ఇన్నిపోయినా చీమ కుట్టినట్లయినా లేని మహనీయులు మనదేశ ప్రథమ ప్రదానిగారు. వారి వారసులకు ఎన్నో దశాబ్దాలు పట్టముగట్టి వారి ఋణము తీర్చుకోన్నాము. 

ఇక ఇంతటితో ఈ ఈ పూర్వ వైభవమునాకు నమస్కరించి, మన నెహ్రు గారు అప్పటి అమెరిక రాయభారి గాల్ బ్రేత్ గారితో అన్న ' I am the last British Ruler of India' అన్న వారి అమూల్యమైన మనసులోని మాటకు నమస్కరించి మన పూర్వుల వైభవమును చాటే వేరొక శాస్త్రమును చూద్దాము.

No comments:

Post a Comment