Monday 4 July 2016

భారతీయ శాస్త్ర విజ్ఞానము ..9


భారతీయ శాస్త్ర విజ్ఞానము ..9
  (  లోహశాస్త్రము  )

[RV=ఋగ్వేదము; VS= వాజసనేయ సంహిత KS = కటక సంహిత TS = తైత్తరీయ సంహిత; SB= శతపద బ్రాహ్మణము]  

వేద సమాజం  సిరిసంపదలతో తులతూగుచుండినారు. వేద కాలపు మహిళలు బంగారు మరియు వెండి ఆభరణాలు ధరించేవారు.  రత్నమయ ఆభరణములు విరివిగా ఉపయోగించేవారు.  సహజంగానే మహిళలు ప్రతి ప్రత్యేక సందర్భములో నూ బంగారు ఆభరణాలు ఇప్పటికీ ధరించుతూనే వున్నారు కదా!.  స్వర్ణాభరణముల ఉనికి వేదకాలమునుండి విండినా ఆభరణాలు వివిధ రకాల ఆధారాలు క్రీ.పూ. మూడో శతాబ్ది నుండి అందుబాటులో ఉన్నాయి.ఎంతో ప్రాచీన దేయాలయ కుడ్యములపై గల భారతీయ శిల్పాల యొక్కఅంగాగమూ ఆభరణ భరితమైయున్నట్లు మనము చూస్తూనేవున్నాము. మనం నాటి గ్రీకు దేవతా విగ్రహములను చూస్తే వారి శరీరములపై  ఆభరణములసలు కనిపించవు. సుమేరియన్ మరియు బాబిలోనియన్ విగ్రహాలు చూస్తే ఆభరణాలు వారి మేనిపై ఆభరణాలతి తక్కువగా కనిపిస్తాయి. కేవలం ఈజిప్టు  మహిళలు హిందువులు వంటి కొన్ని ఆభరణాలు ధరించేవారు. బహుశా వారు ఆభరణాలను బహుశ  భారతదేశం నుండి దిగుమతి చేసుకొని యుంటారు. అదియును గాక భారత చరిత్ర భాస్కరుడు మహావిమర్శకాగ్రేసర బిరుదాంకితులు అయిన కోట వెంకటాచలముగారు తమ గ్రంథములలో మనదేశము నుండి ఎందరో ఈజిప్టు కు వలస వెళ్ళినట్లు బహుళముగా తెలిపియున్నారు. కాబట్టి ఈ స్వర్ణా భరణ కళ మనదేశమునుండి దేశాంతరములు వెళ్ళినట్లు నిశ్చముగా చెప్పవచ్చును.

ఒకసారి వేద మూలాలు ఏమంటున్నాయో తెలుసుకొందాము.

ఋగ్వేదము లోని శ్రీసూక్తము బ్రాహ్మణులలో చాలామందికుటుంది. It is one of the oldest extant texts in any Indo-European language. అని వికీ పీడియా లో వుంటుంది.అంటే దానిలో చెప్పినవి వేదము బహిర్గతమయ్యే కాలమునకు అందులో ఉటంకించినవి వున్నట్లేకదా! వేదము అపౌరుషేయము మరియు మౌఖిక విధానముననుసరించి వచ్చినది. కాబట్టి అందులో తెలిపిన హిరణ్య,సువర్ణ,చంద్రా, ఇవన్నీ బంగారునకు మారుపేర్లుగా వేదమున ఉటంకించ బడినదని మనకు సులభముగా అర్థమౌతుంది.ఋగ్వేదములో ఇది జాతరూపముగా గూడా వర్ణింపబడింది.

RV=ఋగ్వేదము; VS= వాజసనేయ సంహిత KS = కటక సంహిత TS = తైత్తరీయ సంహిత  

 భూమి నుండి బంగారు ను  వెలికితీయుటను గూర్చి ౠగెవదములో విరించ బడినది (ఋవ్ 1-117-5; ఆవ్ 12-1-6; 12-1-26; 12-1-44). బంగారం శుభ్రపచడమును గురించి  తైత్తిరీయ సంహిత (ట్శ్ 6-1-71-) మరియు శతపథ  బ్రాహ్మణములో  (శ్భ్ 2-1-1-5) లో పొందుపరచబడి వున్నాయి. బంగారు  నది ఒడ్డులవద్ద వద్ద పారంపరిక విధానముతో బంగారును గట్టును ఒరుసుకు పారే నది నుండి గ్రహించేవారు. అందుకే Indus ను హిరణ్మయమని  RV(10-75-8) సరస్వతిని హిరణ్యవర్తిని అని కూడా పిలిచేవారు (ఆవ్ 6-61-7).ఈ విషయమై స్వానుభవమొకటి చెప్పదలచుకొన్నాను.


ఆభరణ స్వర్ణమును హిరణ్యము అంటారు(RV 1-122-2; VS 15-50))
కటక  సంహిత  (KV 11.2) మరియు తైత్తిరీయ సంహితలో లో బంగారు తూనిక రాళ్ళను అష్టప్రదలు అని అంటారని తెలిపినారు.

ఖనిజమును బంగారు చేయబడుతుందని సతపథ బ్రాహ్మణములో (SB 6-1-3-5,12-4-3-1) బంగారును ఖనిజము నుండి తగిన ఉష్చెప్పబడినది . దానము గా 10 పెద్ద బంగారు గుండ్లను (హిరణ్య పిండములు) న్రాహ్మణునకు దివోదాసుడు ఇచ్చినట్లు ఋగ్వేదములో(ఋవ్6-47-23)చెప్పబడినది. ఒక్కొక్క ఆవు కొమ్ములకు 1000 బంగారు నాణెములు కట్టి అత్యంత ప్రతిభాశాలియైన వేదగ్నునకు ఇవ్వబడినదని  ఇచ్చేవారని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినది.ఆభరణ స్వర్ణమును హిరణ్యము అంటారు(RV (1-122-2; VS 15-50))
కటక  సమ్హిత (KV 11.2) మరియు తైత్తిరీయ సంహితలో లో బంగారు తూనిక రాళ్ళను అష్ట ప్రదలు అని అంటారని తెలిపినారు.

ఖనిజమును బంగారు నుండి తీయబడుతుందని నుండి శతపథ బ్రాహ్మణములో (SB 6-1-3-5,12-4-3-1) చెప్పబడినది . దానము గా 10 పెద్ద బంగారు గుండ్లను (హిరణ్య పిండములు) బ్రాహ్మణునకు దివోదాసుడు ఇచ్చినట్లు ఋగ్వేదములో(ఋవ్6-47-23)చెప్పబడినది. ఆవు కొమ్ములకు 1000 బంగారు నాణెములు కట్టి అత్యంత ప్రతిభాశాలియైన వేదజ్ఞ/వేదాంతికి ఇవ్వబడేదని   బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినది.దానిని జనకుని నుండి యాజ్ఞవల్క్యుడు గ్రహించినట్లు కూడా చెప్పబడినది.
రామాయణము ఆది కావ్యమన్నది జగమెరిగిన సత్యము. మనము వినే రామాయణము ఈ మన్వంతరములోని 24 వ మహా యుగమునందలి త్రేతాయుగమున రావణుని తపః ఫలమి క్షీణదశకు వచ్చినపుడు దశరథాత్మజుడైన రాముని చ్వ్తిలో చం[అనడినత్లు చెప్పబడినది. జరిగినట్లు వాయుపురాణము చెప్పుచున్నది.

త్రేతాయుగే చతుర్వింశే రావణాస్తపసః క్షయాత్
రామం దాశరథిం ప్రాప్యా సగణాః క్షయమీయవాన్

అది కాదు  ఈద్వాపరమునకు ముదటి త్రేతాయుగమని మాట్వరుసకు అనుకొన్నననూ 8,64,000 సంవత్సరములు (ద్వాపర యుగ పరిమితి) జరిగి  పోయినట్లే.మరి సీతమ్మ వదిలిన ఆభరణములు స్వర్ణసీత అంతా బంగారు మయమే కదా. ద్వాపరములో జరిగిన భారత ఇతిహాసములోని సభాపర్వములో ధర్మజుని రాజసూయమునకు వచ్చిన ఆహూతుల్లలో దక్షిణాది నుండి వచ్చిన చోళ పాడ్యులు మణిరత్న ఖచిత స్వర్ణాభరణములు కానుకలుగా ఇచ్చినట్లు  చెప్పబడియుంది. ఖడ్గపు వరలు బంగారుతోచేయబడి వజ్రముల తాపడము కలిగియుండెవి కానుకలుగా ధర్మజునికి సమర్పించినారట వివిధ దేశాధీశులు.

ఇంతే కాకుండా రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన 'ఆర్య నాగార్జునుడు'అనిపించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివసించినాడు.అందుకే ఈ పర్వతానికే ’నాగార్జున కొండ’అనే పేరొచ్చినది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .
కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .


ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించాడు ,
‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’ కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు. 
వేమన కూడా రసవిద్యనెరిగినవాడని అంటారు. కానీ నాగార్జునుడు ఆయనకు చాలా పూర్వీకుడు.

ఫై విషయముల వల్ల మనకేమి తెలుస్తూవున్నదంటే మనవారికి వేదకాలములోనే బంగారు ఖనిజము వెలికితీయుట గానీ, వెలికి తీసిన ముడి బంగారునుండి ఆభరణములు చేయుటగానీ , దానమునందు బనాగారునొసగుటగానీ, ద్రవ్యముగా బంగారు కాసులను ఉపయోగించుటగానీ లలక్షల ఏంద్ల క్రితమే తెలియునని తెలియవచ్చుచున్నది. కానీ Google పరిశోధనను ఆశ్రయించితే మనకు ఈ విధముగా అర్థముతుంది:

In ancient Egypt, around the time of Seti I (1320 B.C.), we find the creation of the first gold treasure map now known to us. Today, in the Turin Museum is a papyrus and fragments known as the "Carte des mines d'or." It pictures gold mines, miners' quarters, road leading to the mines and gold-bearing mountains, and so on.
The first use of gold as money occurred around 700 B.C., when Lydian merchants produced the first coins.(http://onlygold.com/Info/History-Of-Gold.asp)

కేవలము ఆ కాలమునాటి బంగారు నాణెములు వస్తురూపములో కనిపించని నేరానికి మనదేశమును వెనుకకు నెట్టుటలొ ఎంత ఈర్ష్య దాగుందో గమనించండి.

భారతీయ శాస్త్ర విజ్ఞానము ..10 
లో మళ్ళీ కలుస్తాము. 

No comments:

Post a Comment