Monday 30 August 2021

అజరామర సూక్తి – 348 अजरामर सूक्ति – 348 Eternal Quote – 348

 అజరామర సూక్తి  348

अजरामर सूक्ति  348

Eternal Quote  348

https://cherukuramamohan.blogspot.com/2021/08/348-348-eternal-quote-348.html

सुखस्यानन्तरं दुःखं दुःखस्यानन्तरं सुखम् ।

चक्रवत्परिवर्तन्ते सुखानि च दुःखानि च ॥  अज्ञात 

సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం l

చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచll అజ్ఞాత

సుఖంతరువాత దుఃఖందుఃఖం తరువాత సుఖం - బండి చక్రంవలె ఈ సుఖదుఃఖాలు 

తిరుగుతూ ఉంటాయి.

కలిమి లేములుమంచిచెడులువెలుగు నీడలు వంటి ద్వంద్వాల లోనివే 

సుఖదుఃఖాలుకూడా. వీటిలో ఏ ఒక్కటీ శాశ్వతంకాదు. ఈ విషయము తెలియని వారు 

ఉండరు కానీ ఈ వాస్తవమును అనుభవము లోనికి తెచ్చుకొనక దుఃఖములు ఉన్నపుడు 

ఆ సముద్రమున మునిగి అన్యము ఆలోచించరు. అదేవిధముగా సుఖముల వెల్లువ 

వచ్చిందంటే అందులో కొట్టుకొనిపోవుట తప్పించి అది క్షణభంగురమని ఆలోచించరు.

“సర్వే జనాస్సుఖినో భవంతు"అంటే అందరూ సుఖంగా ఉండాలని “మా కశ్చిత్ 

దుఃఖభాగ్భవేత్" ఏమాత్రమూ ఎవ్వరూ దుఃఖితులు కాకుందురుగాక ) అన్నది మన 

వైదిక సాంప్రదాయము. నిత్యానుష్ఠానపరుడగు బ్రాహ్మణుడు ఈ విధముగా 

ప్రతియోక్కరి కొరకూ ప్రతి దినమూ పరమాత్మను కోరుకొంటాడు. ఏది నిజమైన 

సుఖంఏది నిజమైన దుఃఖంఅనేది సునిశితంగా ఆలోచించు కోవాలి. భగవద్గీత - 

సాత్త్వికరాజసతామస సుఖాలను నిర్వచించింది. దుఃఖము నిజమునకు విరక్తికి 

హేతువై సత్యదర్శనం చేయిస్తుందికర్తవ్యబోధ చేస్తుంది అనటానికి అర్జున 

విషాదయోగమే తార్కాణం.

అహన్యస్తమయాంతానిఉదయాంతా చ శర్వరీ /సుఖస్యాంతం సదాదుఃఖం

దుఃఖస్యాంతం సదా సుఖమ్."(పగలు - సూర్యాస్తమయంతోరాత్రి  సూర్యోదయంతో 

అంతమౌతాయి. సుఖం ఎప్పుడూ దుఃఖంతోదుఃఖంఎప్పుడూ సుఖంతో 

అంతమౌతాయి) ఈ ప్రాకృతిక ధర్మాన్ని అవగతం చేసుకుంటే సుఖాలకు 

పొంగిపోవటందుఃఖాలకు క్రుంగిపోవటం ఉచితంకాదని తెలుస్తుంది. ద్వంద్వాలను 

ఓర్చు కోవటమే స్థితప్రజ్ఞత అని గీతోపదేశం.

నాస్తి రాగ సమం దుఃఖంనాస్తి త్యాగ సమం సుఖమ్" (రాగంతో సమమైన దుఃఖము

త్యాగంతో సమమైన సుఖము లేదు) అని ఫలితప్రజ్ఞుల మాట. సుఖదుఃఖాలకు అతీతమైన 

స్థితిని సాధించటం అంత తేలికైనది కాదు. ఆ స్థితిని సాధించటాన్ని మించిన 

ఔన్నత్యంలేదు.

నాస్తి విద్యా సమం చక్షుః నాస్తివిద్యా సమం ఫలం l

నాస్తి రాగ సమం దుఃఖం  నాస్తి త్యాగ సమం సుఖం ll

బ్రహ్మ విద్యకు సమానమగు దృష్టిబ్రహ్మవిద్యకు సమానమగు ఫలితము వేరేదియును 

లేదు. అదేవిధముగా అతిశయించిన అనురాగమునకు సమానమగు దుఃఖము 

త్యాగమునకు మించిన సుఖము లేదని  వ్యాస భారతములోని శాంతి పర్వమున 

రెండువందల దెబ్బదిఆరవ అధ్యాయములో మాండవ్య జనక సంవాదమునందు  

మోక్షధర్మ పరిశీలనాక్రమములో ఈ శ్లోకము చెప్పబడినది.

పరమాత్ముడు భగవద్గీతలో ఏమంటున్నాడో గమనించండి.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। భగవద్గీత 2-56 ।।

దుఃఖముల నడుమ కూడా కలతచెందని వాడుసుఖముల కోసం ప్రాకులాడని వాడు

మమకారముభయముక్రోధము విడిచిన వానిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.

బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడుఅది ఆయా భోగ వస్తువుల కోసం 

పరుగులు పెడుతుందిదీనితో మనస్సు భగవత్ ధ్యాస నుండి మరలి పోతుంది. కాబట్టి

సుఖాల కోసం వెంపర్లాడకుండాదుఃఖాల వల్ల చింతించకుండా మనస్సుని కట్టడి 

చేసినవాడు స్థిత ప్రజ్ఞుడైన ముని. ఇంకాఅటువంటి యోగిభయముకోపము వంటి 

వాటికి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు. ఈ విధంగా మనస్సు 

సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది.

తస్మాత్ జాగ్రత.

सुखस्यानन्तरं दुःखं दुःखस्यानन्तरं सुखम् ।

चक्रवत्परिवर्तन्ते सुखानि च दुःखानि च ॥

खुशी के बाद दर्द होता हैऔर दुख के बाद सुख आता है। सुख-दुख चक्र की भाँति घूमते रहते हैं

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।

वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते।। भगवद्गीता2.56।।

आदि शंकराचार्यजी इस श्लोक का विवरण देतेहुए ऐसा बोल्राहे हैं l आध्यात्मिकता जीजान से

चाहनेवाला किसी प्रकारके दुःखोंके प्राप्त होनेमें मन उद्विग्न नहीं होनेदेता अर्थात् क्षुभित नहीं होता

उसे अनुद्विग्नमान कहते हैं। तथा सुखोंकी प्राप्तिमें जिसकी स्पृहा तृष्णा नष्ट सामान होजाती है, 

अर्थात् ईंधन डालनेसे जैसे अग्नि बढ़ती है वैसे ही सुखके साथसाथ और सुखों केलिए जी तरसता है l  

उस प्रकार जिसकी लालसा नहीं बढ़ती वह विगतस्पृह कहलाता है। एवं आसक्ति भय और क्रोध 

जिसके नष्ट हो गये हैं वह वीतरागभयक्रोध स्थित धीर कहलाता है l  ऐसे गुणोंसे युक्त जब कोई हो 

जाता है तब वह स्थितप्रज्ञ और मुनि कहलाता है।

फूल आते हैंचले जाते हैं. कांटे आते हैंचले जाते हैं. सुख आते हैंचले जाते हैं. दुख आते हैंचले

जाते हैं. जो जगत के इस ‘चले जाने’ के शाश्वत नियम को जान लेता हैउसका जीवन क्रमश: 

बंधनों से मुक्त होने लगता है. वह वृद्ध फिर हंसने लगा और बोला, ”दिन के बाद रात्रि है और रात्रि 

के बाद दिन. जब दिन नहीं टिकतातो रात्रि भी कैसे टिकेगीपरिवर्तन प्रकृति का नियम है. ठीक 

से सुन लो – जब अच्छे दिन नहीं रहेतो बुरे दिन भी नहीं रहेंगे. और जो व्यक्ति इस सत्य को जान 

लेता हैवह सुख में सुखी नहीं होता और दुख में दुखी नहीं. उसका जीवन उस अडिग चट्टान की 

भांति हो जाता हैजो वर्षा और धूप में समान ही बनी रहती है.”

सुख और दुख को जो समभाव से लेसमझना कि उसने स्वयं को जान लिया. क्योंकिस्वयं की

पृथकता का बोध ही समभाव को जन्म देता है. सुख-दुख आते और जाते हैंजो न आता है और न

जाता हैवह हैस्वयं का अस्तित्वइस अस्तित्व में ठहर जाना ही समत्व है.

आध्यात्मिक आदि तीनों प्रकारके दुःखोंके प्राप्त होनेमें जिसका मन उद्विग्न नहीं होता अर्थात् क्षुभित

नहीं होता उसे अनुद्विग्नमना कहते हैं। तथा सुखोंकी प्राप्तिमें जिसकी स्पृहातृष्णा नष्ट हो गयी है

अर्थात् ईंधन डालनेसे जैसे अग्नि बढ़ती है वैसे ही सुखके साथसाथ जिसकी लालसा नहीं बढ़ती वह

विगतस्पृह कहलाता है। एवं आसक्ति भय और क्रोध जिसके नष्ट हो गये हैं वह वीतरागभयक्रोध

कहलाता है ऐसे गुणोंसे युक्त जब कोई हो जाता है तब वह स्थितधी यानी स्थितप्रज्ञ और मुनि यानी

संन्यासी कहलाता है।

sukhasyānantara dukha dukhasyānantara sukham 

cakravatparivartante sukhāni ca dukhāni ca 

Joy is followed by pain; and suffering is followed by happiness. Joys and 

sorrows rotate like a wheel.

Have patience!

Eventually, all sorrows will be followed by happiness. Keep the faith.

All celebrations fizzle out and sadness looms in. Don't lose your grounding when 

happy.

Life is like a wheel that keeps rotating; what is on top will eventually hit the 

bottom. And what's at rock bottom will eventually rise to the top.

Bhagavadgita says like this.  

Duhkheshv-anudvigna-manah sukheshu vigata-sprihah l

Vita-raga-bhaya-krodhah sthita-dhir munir uchyate ll 2-56

An enlightened person does not allow the mind to harbor the material frailties of 

lust, anger, greed, envy, etc. Only then can the mind steadily contemplate on 

transcendence and be fixed in the divine. If one permits the mind to brood over 

miseries, then the contemplation on the divine ceases and the mind is dragged 

down from the transcendental level. The process of torture works in the same 

manner. More than the present pain itself, it is the memories of past pain and 

apprehensions of future pain that torment the mind. But when the mind drops 

these two and has to simply grope with the present sensation, the pain 

surprisingly shrinks to a manageable (within the limits of tolerance) size. It is well 

known that historically Buddhist monks adopted a similar technique for tolerating 

torture from invading conquerors.

Similarly, if the mind craves external pleasures, it runs to the objects of 

enjoyment, and is again diverted from divine contemplation. So a sage of steady 

wisdom is one who does not allow the mind to hanker for pleasure or lament for 

miseries. Further, such a sage does not permit the mind to succumb to the urges 

of fear and anger. In this way, the mind becomes situated on the transcendental 

level.

 All one can do is - remember 'this too shall pass', in both circumstances!

స్వస్తి.

No comments:

Post a Comment