Tuesday 3 August 2021

అజరామర సూక్తి – 320 अजरामर सूक्ति – 320 Eternal Quote – 320

 అజరామర సూక్తి  320

अजरामर सूक्ति  320

Eternal Quote  320

https://cherukuramamohan.blogspot.com/2021/08/320-320-eternal-quote-320.html

नाकाले म्रियते जन्तुः विद्धः शरशतैरपि ।

कुशकण्टकविद्धोऽपि प्राप्‍तकालो न जीवति ॥ - महाभारत

నాకాలే మ్రియతే జంతుః విద్యః శరశతైరపి l

కుశకంటక విద్యోపి ప్రాప్తకాలో న జీవతి ll మహా భారతము.

ఇదే శ్లోకార్థము గరుడ పురాణము లోనూ, నారద పాంచరాత్రములోనూ ఉన్నది.

నా ప్రాప్త కాలే మ్రియతే విద్యః శరశతైరపి l

తృణాగ్రేణాపి సంస్ప్రుష్టః ప్రాప్తకాలో న జీవతి ll

నారద పంచరాత్రం-ప్రాథమిక రాత్రే-అధ్యాయః-3

ఒక వ్యక్తిని లేక ఒక జీవినివంద బాణాలతో కొట్టినప్పటికీఅతనికి లేదా దానికి 

మరణకాలము సమీపించకపోతే  మరణించుట జరగదు. అదే మృత్యువు 

ఆసన్నమయితే  గడ్డి ముల్లు తాకినప్పటికీ అతను లేక ఆ ప్రాణి జీవితము ముగిసి 

పోవలసినదే!

ప్రతి ప్రాణీ తన కర్మఫలమను మూట నెత్తికెత్తుకొని భూమి మీదకు రావటము 

జరుగుతుంది. ఆ ఫలితమును అనుభవించుటకు తోడుగా ఈ జన్మలో కర్మలు తప్పక 

చేయవలసి వస్తుంది. వాని ఫలితము మరుజన్మలో అనుభవించవలసి వస్తుంది. ఇదే 

జనన మరణ చక్రము.

జీవి భూమిపై ఈ కర్తవ్య నిర్వహణ పూర్తిచేసేవరకూ జీవించియుండక తప్పదు. 

మరుక్షణమే పరలోకము ప్యానిన్చాకా తప్పాడు.

చావుకు కారణము మాత్రము తథ్యము. అది అతి చిన్నదే కావచ్చు అతి భయానకమిందే 

కావచ్చు. ఒకవేళ ఎవరయినా కారణము లేకనే పోయినారను భ్రమ మనలో కలిగినా, 

శరీరారాంతరాళములో ఎదో లోపముతో మరణించవచ్చు. అందుకే పెద్దలు ‘నిందె 

లేనిదే బొందె పోదు’ అన్నారు.

పోగాలము దాపురించినచో, నిలువరించే సామర్థ్యము ఎవరికీ లేదు. సమయము 

ముగిసినప్పుడుచెప్పాపెట్టకుండానే  క్షణాల్లో చనిపోవచ్చు. కొన్నిసార్లుఅత్యంత 

అసాధ్యమైన పరిస్థితుల నుండి బయటపడిన వ్యక్తి అత్యల్ప కారణాల వల్ల 

మరణించవచ్చు. శ్లోకములో చెప్పిన రీతిగా  గడ్డిపరక మొన కుచ్చుకొని, లేక ముల్లు 

కుచ్చుకొని కూడా గతించవచ్చు.  అందుకే శంకరులవారు

భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే l

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే ll

అర్థము మీరు ఎన్నోమార్లు విన్నదే!

అందువల్లభయంతో జీవితాన్ని గడపడం వల్ల ప్రయోజనం లేదు. అట్లని 

విశృంఖలముగా జీవించినవారికి విపరీత పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. మనం 

బ్రతికి ఉన్నప్పుడు మనం జీవితాన్ని పూర్తిస్థాయిలో గడపాలి కదా! అందుకు అలవాట్లు 

ఎంతో ప్రముఖ పాత్రను పోషించుతాయి.అందుకే ఎవరో ఇలా అన్నారు, “మీరు మీ 

విధిని మార్చలేకపోతేమీ వైఖరిని మార్చుకోండి”. ‘శుభస్య శీఘ్రం’.

नाकाले म्रियते जन्तुः विद्धः शरशतैरपि ।

कुशकण्टकविद्धोऽपि प्राप्तकालो  जीवति ॥ - महाभारत

इसी श्लोकार्थ को हम नारद पान्चारात्रम में और गरुड़ पुराण में भी देखसकते हैं l

नाप्राप्तकालो म्रियते विद्धः शरशतैरपि ।

तृणाग्रेणापि संस्पृष्टः प्राप्तकालो  जीवति ।। .२० ।।

नारदपञ्चरात्रम्‌/प्रथमैकरात्रे/अध्यायः 

सौ बाणों से भेदने पर भी प्राणी की मृत्यु नहीं होतीयदि उसका समय  हो। उसका समय  जाए

वह तिनके के कांटे के स्पर्श से भी नहीं बचेगा

प्रत्येक प्राणी अपने-अपने सामान के साथ यानी कर्म फल के साथ इस संसार में आता है। मनुष्य को 

उन सभी कर्मों और कार्यों को समाप्त करना पड़ता है जो उस जीवन में समाप्त होने के लिए होते हैं। 

वास्तव में इ दो प्रकार के होते हैं l  एक तो कर्म फल को भुगतना दूसरा इस जीवित में अच्छे या बुरे कर्म 

करना 

जब उसके जीवन का उद्देश्य प्राप्त नहीं हुआ हैचाहे कुछ भी हो जाएवह जीने वाला है। हमने बार-

बार सुना या देखा है कि कुछ लोग सबसे घातक दुर्घटना से बच जाते या सबसे खराब महामारी से 

प्राणों के साथ बाहर  जाते हैं। ये इस तथ्य के उदाहरण हैं कि उनके जीवन का उद्देश्य अभी तक 

प्राप्त नहीं हुआ है। श्लोक कहता है कि यदि समय अभी तक पक नहीं गया हैतो वह एक और 

सूर्योदय देखने के लिए जीवित रहेगाभले ही वह सौ बाणों से छेदा गया हो

इसके विपरीतयदि यहां उसका कार्य पूरा हो जाता हैतो कुछ भी या किसी में भी उसे रोकने की 

क्षमता नहीं है। जब उसका समय समाप्त हो जाता हैतो कोई कारण भी नहीं होता जिसकी 

आवश्यकता होती है। एक स्वस्थ व्यक्ति पल भर में मर सकता है। कभी-कभीएक व्यक्ति जो सबसे 

असंभव परिस्थितियों से बच जाता हैवह सबसे तुच्छ कारणों से गुजर भी सकता है। वह एक छोटे गड़े 

में  पाँव रखकर कंकड़ पे गिरपडता है और मर सकता था। याजैसा कि श्लोक कहता हैउसे घास के 

एक कांटे से चुभकर जान गवाँलेसक्ता है जो उसकी मृत्यु का कारण बन जाता है। ये केवल 'निमित्त-

मात्र' (मात्र कारणहैं बनजाते हैं l इसलिएमृत्यु के निरंतर भय में जीवन जीने का कोई मतलब नहीं है। 

इसमें कोई कुछ नहीं कर सकता। क्या हमें जीवित रहते हुए जीवन को पूरी तरह से नहीं जीना चाहिए

इसलिए किसी ने एक बार कहा था, "यदि आप अपना भाग्य नहीं बदल सकते तो अपना दृष्टिकोण 

बदल दें"। इसके बारे में सोचो...

nākāle mriyate jantu viddha śaraśatairapi 

Kuśakaṇṭakaviddho’pi praaptakaalo na jīvati ॥ - mahābhārata

The same sloka is almost repeated in Garuda Purana and Narada 

paancharaatra also. The text is given here under.

Na praapthakaalo mriyate vidyah shara shatairapi l

Trinaagrenaapi samsprishtah praaptakaalo na jīvati ll

A being, even when pierced by a hundred arrows, will not die if it is not his 

time. Come his time, he will not survive even the touch of a straw thorn.

It's all in good time! Each and every being comes to this world with his very 

own baggage. One has to exhaust all the deeds and actions that are meant 

to be exhausted in that life. When the purpose of his life has not been 

achieved, no matter what happens, he is going to live. Time and again, we 

have heard or seen that some people survived the deadliest crash or came 

out of the worst epidemic, etc. These are examples of the very fact that their 

life's purpose is not attained yet. The verse says that if the time is not ripe yet, 

he will live through to see another sunrise even if pierced by a hundred 

arrows.

On the contrary, if his assignment here is done, nothing or nobody has the 

capacity to hold him back. When his time is up, there is not even a reason 

that is needed. A healthy person could drop dead in an instant. Sometimes, 

person who has survived the most impossible circumstances could pass on 

due to the most trivial of the reasons. He could trip on a pebble and die. Or, 

as the verse says, he could be pricked by a strand of hay which becomes 

the reason for his death. These are only 'nimitta-mātra' (mere causes), means 

to an end, so to speak (figuratively and literally).

Hence, there is no point living life in perpetual fear of death. There is nothing 

one can do about it. Shouldn't we live life to the fullest when we are alive! 

That's why someone once said, “If you can't change your fate, change your 

attitude”. Think about it...

స్వస్తి.

No comments:

Post a Comment