Friday 20 August 2021

అజరామర సూక్తి – 338 अजरामर सूक्ति – 338 Eternal Quote – 338

 అజరామర సూక్తి  338

अजरामर सूक्ति  338

Eternal Quote – 338

https://cherukuramamohan.blogspot.com/2021/08/338-338-eternal-quote-338.html

अहंममाभिमानोत्थैः कामलोभादिभिर्मलैः।

वीतं यदा मनः शुद्धमदुःखमसुखं समम्॥16॥

तदा पुरुष आत्मानं केवलं प्रकृतेः परम्।

निरन्तरं स्वयंज्योतिरणिमानमखण्डितम्॥17॥

ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन चात्मना।

परिपश्यत्युदासीनं प्रकृतिं च हतौजसम् ॥18॥ - व्यास भागवतम्

 

అహమ్మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః l

వీతం యథా మనః శుద్ధం ఆదుఃఖమసుఖం సమం ll 16

తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరం l

నిరంతరం స్వయం జ్యోతిరణిమానమఖండితం ll  17

జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తియుక్తేనచాత్మనా l

పరిపత్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసం ll 18 వ్యాస భాగవతము 

ఈ శ్లోకము భాగవతము లోని తృతీయ స్కందములోని 25వ అధ్యాయమున దేవహూతి కపిల మహర్షి సంవాదమున వస్తాయి. దేవహూతి కపిలుని తల్లి. కపిలుడు శ్రీ మహావిష్ణువు అవతారము. ఆయన తన తల్లితో పై శ్లోకములను చెప్పుచున్నాడు.

నేను నాది అనే అహంకార మమకార రూపమైన అభిమానంవల్ల కామ, క్రోధ, లోభాది దోష సమూహములు ఆవిర్భవించినపుడు, చిత్తము వానికి లోనుగాకుండ వానినుండి విడివడినప్పుడు పరిశుద్ధ మవుతుంది. చిత్తము పరిశుద్ధమైనప్పుడు సుఖ దుఃఖములకు అతీతమగు  రూపముగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతికంటె అతీతుడు, స్వయంప్రకాశక శక్తి కలిగినవాడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మను, ఆ పరమాత్మ తేజస్సువల్ల నిస్తేజమైన ప్రపంచాన్నీ యోగివరేణ్యులు భక్తిజ్ఞానవైరాగ్యాలతో కూడిన చిత్తంతో దర్శించినవారై మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుని యందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమ మైనదని, తక్కిన మార్గాలు దానికి సాటిరావని చాటిచెప్పినారు. ఇంద్రియార్థాలైన శబ్దస్పర్శరూపరసగంధాలతో కలయిక అసద్విషయమై అనగా ఆచరణ యోగ్యము కానిదై, దృఢమైన బంధానికి కారణం అవుతుంది. ఆ సంగమము భగవంతుని సంబంధమై సద్విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై, సత్పురుషులకు, తెరిచిన మోక్షద్వారం అవుతుంది అన్నది విద్వాంసుల అభిప్రాయము. సహనముతో, సమస్తజీవరాశికి  ఆత్మీయులై, శాంతస్వభావులై, కరుణార్ద్రహృదయులై, కర్మఫలాలను పరిత్యజించి, తన, పర అన్న వ్యత్యాసమును విడచి నన్ను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, నా చరిత్రను వీనులవిందుగా ఆలకించి ఆనందిస్తూ, నా కథలే చెప్పుకొంటూ, నా కథలే వింటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యము మాత్రమే కోరదగినది. అదే సకల దోషాలను నివారిస్తుంది. అటువంటివారి స్నేహంవల్ల సర్వప్రాణుల హృదయాలలో చెవులలో సుధారసము చిందించే నా కథాప్రసంగాలు ప్రాప్తిస్తాయి. నా గుణాలను వినడంవల్ల లౌకిక సుఖములకు అతీతులై, అతీంద్రియులై, ఆత్మా సాక్షాత్కారాన్ని పొందుతారు. సక్రమమైన మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఉద్భవిస్తాయి. అందుకే ఆదివేదమైన ఋగ్వేదము ఆదిలోనే ఈ విధముగా చెప్పుచున్నది:

ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతోదబ్ధాసో  అపరీతాస ఉద్భిదఃI

దేవానోయథా సదమిద్ వృధే ఆసన్నప్రాయువో రక్షితారో దివేదివేII (ఋగ్వేదము)

దశదిశలనుండి నిరంతర కళ్యాణకారకమగు ఆలోచనలే లేక భావనలే మాలో ప్రసరించుగాక. అట్టి భావనలకు ఎటువంటి అవరోధము వుండకుండుగాక. మంగళకరమగు అజ్ఞాత విషయములు కూడా మా కర్ణ శ్రావ్యమగుగాక. నిరంతరమూ సకల దేవతలూ మమ్ము రక్షించుతూ మా ప్రగతికి కారణభూతులగుచుందురుగాక.

పరమాత్మ ఇంకా ఈ విధముగా తల్లికి తెలియజేస్తూ ఉన్నాడు.

ఎవడు నేను చేసిన ఈ విశ్వసృష్టినీ, నా లీలావిహారాలనూ తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తిచేత ఇంద్రియ సుఖాలకూ, కనిపించేవీ వినిపించేవీ అయిన ఇహలోక పరలోక సుఖాలకూ లోనుకాకుండా, మనోనిశ్చలత కొరకు చక్కని యోగమార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతిగుణాలను అనుసరించటం వల్లనూ, వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లనూ, ఆత్మార్పణ రూపమైన భక్తియోగం వల్లనూ సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరాళాలలో నిలుపుకొంటాడు” అని కపిలుడు బోధించి బ్రత్యగాత్మకుండ నైన నన్ను నంతఃకరణ నియుక్తునిం గావించు"మని కపిలుడు తన తల్లితో చెప్పినాడు.

ఇంద్రియ నిగ్రహము, సత్సాంగత్యము, ఈర్ష్యాద్వేషకోపతాపదుల విసర్జనము, కలిగిన వానికి భగవత్ సాయుజ్యము హస్తామలకమే!

अहंममाभिमानोत्थैः कामलोभादिभिर्मलैः।

वीतं यदा मनः शुद्धमदुःखमसुखं समम्॥16

तदा पुरुष आत्मानं केवलं प्रकृतेः परम्।

निरन्तरं स्वयंज्योतिरणिमानमखण्डितम्॥17

ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन चात्मना।

परिपश्यत्युदासीनं प्रकृतिं च हतौजसम् ॥18

कपिल मुनि संख्या दर्शन के प्रवर्तक हैं l इन्हें भगवान् विष्णु का पंचम अवतार माना जाता है l 

इनकी माता का का नाम देवहूती और पिता का नाम कर्दम है l उन दम्पति के प्रार्थना पर भगवान् 

विष्णु ने स्वयं उनका ओउलाद बनकर भूतल पहुंचे l कर्दम अकेला वानप्रस्थ आश्रम जातेहुए 

देवहूति से बोलता है कि उनको भगवान् के बारेमे अं मौके पर कपिल विस्तृत रूपसे बताएगा l जो 

ज्ञान माताको कपिल ने सौंपा वही सांख्यदर्शन कहलाता है l 

महर्षि कपिल आने माता एवाहूति को ऐसा उपदेश दे रहे हैं :

जब कोई पूरी तरह से असत्य से उत्पन्न वासना और लोभ की अशुद्धियों से शुद्ध शरीर को "मैं" के 

रूप में और शारीरिक संपत्ति को "मेरा" के रूप में मानता है, तब किसी के मन के रूप में 

पहचानना शुद्ध हो जाता है। उस शुद्ध अवस्था में वह तथाकथित भौतिक सुख और संकट की 

अवस्था को पार कर जाता है। उस समय आत्मा स्वयं को देख सकती है भौतिक अस्तित्व से परे 

और हमेशा आत्म-प्रभावशाली,अखंडित, और आकार में बहुत छोटा होजाता है। वही आत्म-

साक्षात्कार की स्थिथि होती है और उस स्थिति में, भक्ति सेवा में ज्ञान और त्याग के अभ्यास से

कोई देखता है सब कुछ सही परिप्रेक्ष्य मेंवह भौतिक अस्तित्व के प्रति उदासीन हो जाता है, और 

भौतिक प्रभाव उस पर कम शक्तिशाली रूप से कार्य करता है। उसी लिए ऋगवेद प्रारम्भ में ही 

ऐसा कहागया है: 

आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरीतास उद्भिदः ।

देवा नोयथा सदमिद् वृधे आसन्नप्रायुवो रक्षितारो दिवेदिवे॥ - ऋगवेद

 अर्थ - हमारे पास चारों ओर से ऐंसे कल्याणकारी विचार आते रहें जो किसी से न दबें, उन्हें कहीं से 

बाधित न किया जा सके एवं अज्ञात विषयों को प्रकट करने वाले हों। प्रगति को न रोकने वाले  और 

सदैव रक्षा में तत्पर देवता प्रतिदिन  हमारी वृद्धि के लिए तत्पर रहें।


Ahammabhimanotthaiah kamalobhadibhirmalaih.

Vitam yada manah suddhamaduhkhamsukhm sam16

Tada purusha atmanam kevalam prakriteh param.

Continam swayamjyotiranimanamkhanditam17

Jnanavairagyayukten Bhaktiyukten Chatmana.

Paripashtyudasinam prakritim cha hatujasam 18

When one is completely cleansed of the impurities of lust and greed

produced from the false identification of the body as “I” and bodily

possessions as “mine”, one’s mind becomes purified.  In that pure state he

transcends the stage of so-called material happiness and distress.  At

that time the soul can see himself to be transcendental to material

existence and always self-effulgent, never fragmented, although

very minute in size. In that position of self-realization, by

practice of knowledge and renunciation in devotional service,

one sees everything in the right perspective; he becomes

indifferent to material existence, and the material influence acts

less powerfully upon him.  

That is why Rigveda says like this:

AA no bhadrah kratavo yantu vishwatodabdhaso apritas udbhidah.

Deva noytha sadamid vridhe asannaprayuvo rakshitaro divedive

May powers auspicious come to us from every side, never deceived, unhindered, and victorious. That the Gods ever may be with us for our gain, our guardians day by day unceasing in their care. 

స్వస్తి.

 

 

No comments:

Post a Comment