Sunday 1 August 2021

అజరామర సూక్తి – 319 अजरामर सूक्ति – 319 Eternal Quote – 319

 అజరామర సూక్తి  319

अजरामर सूक्ति  319

Eternal Quote  319

https://cherukuramamohan.blogspot.com/2021/08/319-319-eternal-quote-319.html

यावत्स्वस्थो ह्ययं देहः यावन्मृत्युश्च दूरतः ।

तावदात्महितं कुर्यात् प्राणान्ते किं करिष्यति ॥- चाणक्य नीति

యావత్స్వస్థో హ్యయం దేహో యావన్మృత్యుశ్చ దూరతః ।

తావదాత్మహితం కుర్యాత్ప్రాణాన్తే కిం కరిష్యతి ॥ - చాణక్య నీతి – 4 – 4

ఎంతవఱకైతేదేహము రోగములేనిదై యుండునోమఱియు,

ఎంతకాలముమరణముదూరముగా నుండునోఅంతవఱకుతనకు మేలును 

గలిగించు ధర్మాచరణముపుణ్యకర్మలనుచేయుచుండవలెనుప్రాణములు పోయిన 

తరువాతఏమి చేయగలడు?

ఈ విషయమునే భర్తృహరి ఈ క్రింది విధముగా తెలియజేసినారు:

 యావత్సస్థ మిదం శరీర మరుజం యావజ్జరా దూరతో,
 

యావచ్చేన్ద్రి య శక్తిరప్రతిహతా యావర్షయో నాయుషః |
 

ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్‌,
 

పన్దీస్తే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః ||(భర్తృ.వైరా.75)

ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదము:

ధృతిగొని రోగముల్ జరయు దేహమునొంపకముందె, ఇంద్రియ

ప్రతిహతి లేక ముందె, తన ప్రాణ విరామము కాక ముందె పం

డితజను డాదరింప దగు ఠీవి బ్రయత్నము ముక్తికిన్ మహో

ద్దత శిఖి నిల్లుగాలు తరి దాలిమి నూతులు త్రావ్వుతోప్పునే?

 శరీరము రోగము లేకుండ స్వస్థతగా నున్నప్పుడుముసలితనము రాకముందేఇంద్రియ

శక్తి పటుత్వము కలిగియున్నప్పుడుఆయుస్సు క్షీణింపనపుడు బుద్దిమంతుడు తన 

శ్రేయస్సు కొఱకు మిక్కిలి ప్రయత్నింపవలెను. అటులకాక అన్నియు క్షీణించిన తరువాత

ప్రయత్నించుట కొంప తగులబడుచుండ బావి త్రవ్వుటకు ప్రయత్నించుటవలె 

వ్యర్థమగును. 

ఆత్మకల్యాణము కొఱకు నేమి చేయవలెనో జవాబు-

 కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యం మహేశ్వరమ్‌ |
 త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమమ్‌ ||

రాత్రింబవళ్లు పుణ్యకర్మలు చేయుము. పరమేశ్వరుని నిత్యము స్మరింపుము. దుర్జన సాంగత్యము విడువుము. సజ్జన సాంగత్యము చేయుము. కాని క్రింది పరిస్థితి యుండును.

 వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయన్తీ,

 రోమాశ్చ శత్రవ ఇవ ప్రహరన్తి గాత్రమ్‌ |

 ఆయుః పరిస్రవతి భిన్నఘాదివామ్చో,
 

లోకో న చాత్మహిత మాచరతీతి చిత్రమ్‌ ||

భర్తృహరి సుభాషితము – వైరాగ్య శతకము -38

(చాణక్య రాజనీతి శాస్త్రము 4-24)
 

ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాదము:

కడు వెరపించుచున్ ముదిమి గద్దరి బెబ్బులిమాడ్కి నున్న, దె

క్కుడుపగదా యలంబలె దెగుళ్ళు శరీరము నొంచుచున్న, వె

ప్పుడు జను భిన్న కుంభజల ముంబలె నాయువు లిట్టులయ్యు, దా

రుడుగక మానవుల్ దురిత మోలి నొనర్చుచు నున్నవారహో !

భయంకరమైన పెద్దపులి వలె వృద్ధావస్థ భయభీతుని చేయుచుండును. రోగములు 

శత్రువులవలె శరీరమును ఆక్రమించుచుండును. పగిలినకుండనుండి నీరు 

స్రవించునట్లు ఆయుస్సు క్షీణించుచుండును. అయినను మనుష్యుడు తన కల్యాణము, పెళ్లి కాదు మేలు, కొఱకు ప్రయత్నము చేయడు. ఇది మహా విచిత్రము.

यावत्स्वस्थो ह्ययं देहः यावन्मृत्युश्च दूरतः ।

तावदात्महितं कुर्यात् प्राणान्ते किं करिष्यति ॥- चाणक्य नीति

इस नीति में चाणक्य कहते हैं जब तक हम स्वस्थ हैंहमारा शरीर हमारे नियंत्रण में हैतब तक 

आत्म कल्याण के लिए पुण्य कर्म कर लेना चाहिए। क्योंकिमृत्यु होने के बाद कोई भी कुछ नहीं 

कर सकता है।

अच्छे स्वास्थ्य का महत्व बताते हुए आचार्य कहते हैं कि धर्मअर्थकाम और मोक्ष ये चारों पुरुषार्थ 

सिर्फ तब ही मिल सकते हैंजब हमारा शरीर स्वस्थ हो। इसीलिए हम स्वस्थ बने रहेइसके लिए 

जरूरी काम करते रहना चाहिए।

अच्छा खान-पानयोग-प्राणायामसंतुलित दिनचर्या का पालन करने से हम रोगों से बच सकते हैं। 

स्वस्थशरीर से धर्म-कर्म जैसे पूजादान-पुण्य कर सकते हैं। इसीलिए जब तक शरीर स्वस्थ है

हमें पुण्य कर्म करलेना चाहिए।

हमारे अच्छे काम ही हमारा जीवन सफल कर सकते हैं। मृत्यु के बाद कोई भी कुछ नहीं कर 

सकता है।

yāvatsvastho hyaya deha yāvanmtyuśca dūrata 

tāvadātmahita kuryāt prāṇānte ki kariyati ॥ - cāṇakya nīti

As long as the body is healthy, as long as death is far away (when younger), 

perform deeds beneficial for the soul. What can (one) do at the end of life (when 

death is near)?

When in good health and form, most of the time and energy is spent on accruing 

more wealth, properties, possessions, etc. All the younger years of life are 

engaged in 'enjoying life'. But in reality, the indulgences while 'enjoying life' only 

harm the progress of the soul. The poet says, when hale and healthy, perform 

deeds beneficial to the soul. No one knows when he will draw his last breath. But 

then, it is a known factor that most people live through their youth, grow old and 

eventually face death. When still young,

when death is 'presumed' to be far away, that is the time to work on performing 

good deeds. What can one do from his deathbed when he is barely able to take 

care of himself!

The general misnomer among youth is that virtuous actions and noble deeds 

can be saved for a later date!  The truth is, one has to rush to start being aware 

of his actions and benefiting his soul as early as he can. When one lifetime is 

just not enough to contemplate on everything, one cannot think he will be able to 

accomplish everything in just a few years later! Another issue will be all the 

unwanted vāsanas (tendencies) he has accumulated in this birth as well. 

Unlearning and relearning again at a much later stage of life will make it harder 

than ever to think about uplifting the soul!

 Now is the time! Procrastination is not even a choice when the subject is the 

soul. One has to contemplate every single day if his actions were pro-active 

towards the soul or degenerative. Only then can he move in the direction of 

progress!

స్వస్తి.

No comments:

Post a Comment