Friday 6 August 2021

అజరామర సూక్తి – 324 अजरामर सूक्ति – 324 Eternal Quote – 324

 అజరామర సూక్తి  324

अजरामर सूक्ति  324

Eternal Quote – 324

https://cherukuramamohan.blogspot.com/2021/08/324-324-eternal-quote-324.html

इन्द्रियाणि पुरा जित्वा जितं त्रिभुवनं त्वया ।

स्मरद्भिरिव तद्वैरम् इन्द्रियैरेव निर्जितः ॥ - वाल्मीकि रामायणयुद्धकाण्ड – 111.18

ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా l

స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః ll (వాల్మీకి రామాయణము  యుద్ధకాండ  111.18)

రావణాసురుని కళేబరాము ఉండు కూర్చుని విలపించుచూ ఆయన పత్ని మండోదరి ఈ 

విధముగా వాపోవుచున్నది. పూర్వము ఇంద్రియములనుత్రిభువనములనూ జయించి

మన్మధునికి లొంగిసమయముకై వేచియున్న ఇంద్రియములచేత నిర్జింపబడితివి.

నేను వ్రాసిన ఈ క్రింది పద్యము సందర్భా ఔచిత్యము కలిగినందువల్ల మీ ముందు 

ఉంచుచున్నాను.

కామము క్రోధమున్ మదము గాంచగ కూడుచు లోభమోహముల్

సీమయె లేని మత్సరము చెంతకు చేరగ ప్రేమతోడుతన్

ఏమరజేసి మానవుని కెక్కడ లేనటువంటి తాపమున్

తామొనగూర్చి యాతనిని తప్పక నాశము జేయునంతటన్

ఇంద్రియాలను జయించి వానిని పూర్తిగా అణచివేసిన తరువాత (మనస్సుఅంతర్గత 

భావనతో సహా) మీరు ముల్లోకములనూ జయించగలిగినారు. కానీ వానిని మీరు 

నిరంతరమూ అణచి ఉంచలేకపోయినారు. మరునికి బానిసయై మనుగడకే ముప్పు 

తెచ్చుకొన్నావు. ఈ క్రింది శ్లోకములో ఇంకొక మంచి మాట, మనము కలకాలమూ 

జ్ఞాపకము ఉంచుకోనవలసినది, మండోదరి చెప్పుచున్నది, గమనించండి.

 అవశ్యమేవ లభతే ఫలం ఒపాపస్య కర్మణః l

ఘోరం పర్యాగతే కాలే కర్తా నాస్త్యత్రసంశయః ll యుద్ధ కాండ - 111- 25

పాపము చేసి నే ఫలిత పంకము నంటగనైతి నంచు నీ

లోపల సంతసింపకుము లుల్లికి తగ్గ ఫలంబు తప్పకన్

తా పదిలమ్ముగాగనిను తప్పకచేరి సరైన దండనల్

ఆపక అందజేసి తన అక్కసు చక్కగ తీరజూచెడిన్

పాప కర్మ చేసిన వాడు దాని ఘోరమైన ఫలమును కాలము వచ్చినపుడు తప్పక 

అనుభవించును. సందేహము లేదు.

ఈ సర్గ మొత్తం ఆమె విలాపమును మహర్షి వాల్మీకి పరిపరి విధములుగా మనకు 

తెలియజేయుచున్నారు. అసలు ఈ నీతిదాయకమైన శ్లోకములు వ్యక్తిత్వ వికాసమునకు 

(Personality Development) కు అత్యంత శ్రేష్ఠము, ఉపయోగకరము అయినవి.మనకు 

తెలుగే సరిగా రాదు, ఇక సంస్కృతము ఏమొస్తుంది. భాష సమసిపోయేందుకు మనకు 

మున్డుతరము వారు చక్కని సోపానమును వేసి, పేరు ప్రఖ్యాతినార్జించి వెళ్ళిపోయినారు. 

వారి బాటలో నడిచి తెలుగును, కోడి కట్టిన దీపముగా చేసియుంచినాము. తల్లియగు 

సంస్కృతము ప్రక్కన మరుభూమిలో గుంత త్రవ్వుటే ఆలస్యము.

ఇప్పటికయినా కళ్ళు తెరచి మన పురాణేతిహాసములను వంటపట్టించుకొంటే శాస్త్రము, 

విజ్ఞానము, నీతినియమములకు పట్టుబట్టి, పట్టుబట్ట కట్టించినవారమౌతాము.

 

इन्द्रियाणि पुरा जित्वा जितं त्रिभुवनं त्वया ।

स्मरद्भिरिव तद्वैरम् इन्द्रियैरेव निर्जितः ॥ - वाल्मीकि रामायणयुद्धकाण्ड – 111.18

इन्द्रियों को वश में करने के बाद (मनआन्तरिक इन्द्रिय सहित) (सभी) आपके द्वारा तीनों लोकों 

पर विजय प्राप्त की गई थी आपके द्वारा की गई तपस्या)। आप (अब) परास्त हो गए हैं (आपके 

में) बारी) इंद्रियों द्वारा स्वयं (जिन्होंने सहयोग करना बंद कर दिया है आप) मानो उन्होंने आपके 

प्रति अपनी पुरानी दुश्मनी को याद कर लिया हो (आपके हाथों में उनकी बेचैनी के अवसर पर)। 

मुनि वाल्मीकि द्वारा लिखी गई अनेकों कृतियों को समाहित करते हुए संपूर्ण सरगा उनका विलाप 

है चारणीय भाव है। हम शिक्षण को संप्रेषित देखते हैं काव्य सौंदर्य के माध्यम से। 'व्यक्तित्वके 

भाषण का आंकड़ा इंद्रियों के संबंध में उपरोक्त में बहुत प्रभावी है पद्य और इन चुने हुए शब्दों में 

याद करने की शक्ति है पाठक के मन में सीता-अपहारन की पूरी कहानी और वह घटनाएँ जो 

इसके बाद रावण का पतन और मृत्यु हुई।

indriyāṇi purā jitvā jita tribhuvana tvayā 

smaradbhiriva tadvairam indriyaireva nirjita  वाल्मीकि रामायणयुद्धकाण्ड – 111.18

Valmiki rāmāyaa, yuddhakāṇḍa – 111.18

Formerly, by winning over your senses, the three worlds were won by you. As if 

in memory of that enmity, you were defeated by the same senses.

(A verse by lamenting Maṇḍodarī to Rāvaa's cadaver).

In the great first epic Rāmāyaa, we have seen that Rāvaa was an exceptional 

scholar who had performed numerous penances. He had the intellect and the 

endurance required for performing them, although for all wrong reasons. These 

achievements don't come easy. One has to win over his sense organs, defeat 

them, restrain them and show them who the boss is - so to speak! Rāvaa had 

achieved all of these quite easily. But he still gave in and yielded to his senses 

when he heard about Sītā from Śūrpanakhā (his sister). Chastity was blown to 

the wind. He surrendered so much to his senses that he wouldn't listen to any 

advice from anyone, including his own brother, Vibhīṣaa, or his wife, Maṇḍodarī

Upon his death, manDodarI lamented saying - he had conquered his senses 

earlier. Now, as if his senses came back to avenge their defeat, became the 

cause for his own downfall.

Senses are the entities that bring bondage. For example, if one yields to the 

sense organ - tongue, he will either like or dislike the food he eats. The minute 

there is राग-द्वेष (rāga-dvea - love or hate) there is a reaction to it. And then, 

along come bondage constraints and so on. Hence, the objects of pleasure for 

the sense organs are harbingers of trouble. It is not an easy task to win over 

them. They are so powerful that even after winning over them once, if they are 

not kept under check constantly, they will come back to strike harder than ever.

Awareness and incessant practice (anuṣṭhāna – अनुष्ठानare keys to keeping a 

level head.

స్వస్తి.

No comments:

Post a Comment