Sunday 22 August 2021

అజరామర సూక్తి – 339 अजरामर सूक्ति – 339 Eternal Quote – 339

 

అజరామర సూక్తి  339

अजरामर सूक्ति  339

Eternal Quote – 339

https://cherukuramamohan.blogspot.com/2021/08/339-339-eternal-quote-339.html

वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः

सम इह परितोषो निर्विशेषो विशेषः 

स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला

मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः ॥ - वैराग्यशतक, भर्तृहरि

వయమిహ పరితుష్టా వల్కలైస్త్వం దుకూలైః

సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః ।

స తు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా

మనసి చ పరితుష్టే కోఽర్థవాన్‌ కో దరిద్రః - వైరాగ్య శతకము భర్తృహరి

ఏనుగు లక్ష్మణ కవిగారి ఆంధ్రానువాదము:

కలిత దుకూల వస్త్రములు గట్టిన నీకును జీర్ణ వల్కలం

బులు ధరియించు మాకును ప్రమోదము తుల్యము లేదు వాసి; య

గ్గలమగు తృష్ణ  ఎవ్వనికి; గాఢ దరిద్రుడు వాడు; లేమియుం

గలిమియు లేవు సమ్మద వికస్వర మానసులైన వారికిన్

ఇది నా అనుసరణ లేక అనుకరణ:

నారచీరకట్టి నడయాడు మునికిని

పట్టు వలువ కట్టు ప్రభువునకును

భేదమేమిలేదు పెనగొనుతృప్తిలో 

రామమోహనుక్తి రమ్య సూక్తి

పై శ్లోకము భర్తృహరి వైరాగ్య శతకములోని యతి నృపతి సంవాదములో 53వ 

శ్లోకముగా మనకు కనిపిస్తుంది.

పై శ్లోక సారాంశము: ఒక సన్యాసి ఈ విధముగా చెప్పుచున్నాడు:

మేము బట్టల కోసం చెట్ల బెరడులనుండి నారను తీసి ఆ వల్కలములను ధరిస్తాము. 

మీరు దుకూలములు అనగా పట్టు దుస్తులు ధరిస్తారు. కానీ ఇరువురిలోనూ కలిగే

సంతృప్తి ఒకేలా ఉంటుంది మరియు ఆ సంతృప్తిలో ఎటువంటి వ్యత్యాసమూ కనిపించదు.

అంతులేని కోరికలు కలిగినవారే నిరుపేదలు. మనస్సులో సంతృప్తి ఉంటే,

ఆతను నిజమైన ధనవంతుడు. మరి నిజానికి  ధనవంతుడు ఎవరు,పేదవాడు ఎవరు?

అనగా సంతృప్తి కలిగియున్న వానికి దారిద్ర్యము, ఐశ్వర్యము రెండూ సమానమే!

ఆంద్ర మహాభాగవతములోని ‘బలిచక్రవర్తి చరితమున’ శుక్రాచార్యునకు బలిచక్రవర్తి

చెప్పిన ‘వ్యాప్తింజెందక వగవక’ ‘కారే రాజులు రాజ్యముల్.....’ అన్న పద్యములను, న్తకు

మునుపు సందర్భోచితముగా చెప్పుటచే  ఇచట ఉటంకించలేదు.

జగద్గురువులు  శ్రీశ్రీ భారతీతీర్థమహాస్వామివారి అనుగ్రహ భాషణములోని  ఈ 

వివరణను గమనించండి..

సంతోషమయ జీవనానికి సంతృప్తి తప్పనిసరిగా కావాలి. ఎంతటి ఆస్తిపాస్తులైనా తృప్తి

లేకపోతే మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని అందించలేవు. సుఖసంతోషాలను అందించే

వస్తువులను కోరుకునే వ్యక్తి వాటిని పొందటానికి కష్టపడి పనిచేయాలి. కష్టంలో

సంతోషం లభించదు కదా! అలా కష్టపడి పొందిన వస్తువులను కాపాడుకోవడానికి 

మళ్ళీ కష్టపడాలి. అప్పుడూ సంతోషం ఉండదు. ఒక వేళ ఒక కారణంగా కష్టపడి సంపాదించిన ఆ వస్తువులను పోగొట్టుకుంటే, ఉన్నదనుకున్న సంతోషం పూర్తిగా నశించి దుఃఖమే మిగులుతుంది. అందువలన ఏదో సంపాదించాలనెడి కోరికను కలిగి ఉండడం మనకు మంచిది కాదు. ప్రాచీనకాలంలో వనాలలో నివసించే ఋషులకు ఆస్తిపాస్తులు ఏమీ ఉండేవికావు. అయినా వారు ఆనందంగా లేరా? వారి ఆనందానికి ముఖ్యకారణం వారికున్న సంతృప్తియే.

పురాణాలలో పరమశివుడు శరీరమంతా విభూతిని పూసుకొని, పులిచర్మాన్ని ధరించి

వృషభవాహనంపై యున్నట్టు వర్ణించారు. ఇంద్రియసుఖాల నుండి మనలను దారి

మళ్ళించడానికే సాంకేతికంగా ఇలా చెప్పబడింది. మనం ఎంతటి ధనవంతులమైనా

సాధారణ జీవితాన్నే గడపాలి. అప్పుడే ఆనందంగా ఉండగలం. ధనం అనుకోకుండా

మనకు లభిస్తే మంచి పనులు చేయడానికి, ధార్మిక కార్యక్రమాలను ఆచరించడానికి ఆ

ధనాన్ని ఉపయోగించాలి. మన జీవితాలను సామాన్యంగా గడపాలి .

ఈ ప్రపంచంలో ధనవంతులెవరు? పేదవారెవరు? అని ప్రశ్నించినట్లయితే, ఎవరి

హృదయం సంతృప్తితో నిండి ఉందో, ఎవరికి ఎటువంటి కోరికలు లేవో వారే

ధనవంతులనీ, ఎవరికి ఈ లక్షణాలు ఉండవో వారు పేదవారని మనం సమాధానం

చెప్పాలి.

అందువలన సంతృప్తి అనే ఆదర్శాన్ని మనం ఆచరిస్తూ ఆనందమయ జీవనాన్ని

గడపడానికి ప్రయత్నించాలి.

वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः

सम इह परितोषो निर्विशेषो विशेषः 

स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला

मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः ॥ - वैराग्यशतक, भर्तृहरि

हे राजन हम यहाँ पेड़ की चालों से न्काले तंतुओं से बनाएगे वल्कल से संतुष्ट हैं और आप रेशमी 

वस्त्रों से सुसज्जित आप भी संतुष्ट हैं l हमारे बीच में संठुश्ती का कोइ अंतर नहीं है l संतोष दोनों में 

एक ही सामान है l परंत्हू जिनको धनलिप्सा अधिक है वही पुरुष दरिद्र है, क्यों कि मन के संतुष्ट 

होनेपर न कोइ धनी है न कोइ दरिद्र l

मालिनी वृत्त पर सेट, यह श्लोक एक घरेलू सच्चाई को अभिव्यक्ति देता है। हम नहीं जानते कि

भर्तृहरि के मन में कौन था जब उन्होंने 'त्वम्' कहा था, लेकिन यह पद हम सभी पर लागू होता है।

कवि अपने विषय को एकवचन में संबोधित करते हुए बहुवचन में अपने बारे में बोलता है। यह 

अच्छी तरह से अमीरों के लिए उनकी अवमानना ​​​​को दर्शाता है। 'निर्विषे' शब्द संस्कृत में एक 

पकड़ वाक्यांश में बदल गया है, हालांकि ज्यादातर लोग स्रोत को जाने बिना इसका इस्तेमाल 

करते हैं। यह भर्तृहरि का एक सुंदर श्लोक है जहाँ वे कहते हैं कि ऋषियों और अमीरों में कोई बड़ा अंतर नहीं है

इससे कोई फर्क नहीं पड़ता कि कोई बड़े बंगले में रहता है या जंगलों मेंइससे कोई फर्क नहीं पड़ता कि कोई सोने की थाली और चांदी की लोटा से खाता और पीता है या सिर्फ पेड़ों से फल तोड़ के खाता हैइससे कोई फर्क नहीं पड़ता कि कोई लत्ता में रहता है या धन मेंकिसी के धन को मौद्रिक पैमाने के बजाय संतोष के पैमाने पर मापा जाता हैवह जो अपनी संपत्ति से संतुष्ट है वह सबसे अमीर प्राणी हैजो असन्तुष्ट है और अधिक धन के लिए अथक प्यासा है वह वास्तव में गरीब हैभले ही वह दुनिया का राजा है, अगर उसके पास तृप्ति मने संतोष नहीं है, तो वह पृथ्वी पर सबसे गरीब, जरूरतमंद व्यक्ति है

हमारे पास जो कुछ है उसके लिए संतुष्ट और आभारी होना ही जाने का रास्ता है!

vayamiha parituṣṭā valkalaistva dukūlai

sama iha paritoo nirviśeo viśea

sa tu bhavati daridro yasya tṛṣṇā viśālā

manasi ca parituṣṭe ko’rthavān ko daridra ॥- vairāgyaśataka, bharthari

I’m happy wearing tree barks; silk garments please you. The satisfaction is the 

same; difference is merely apparent. A person is poor whose desire is limitless. 

Once the mind is content, who is the rich, who poor?

Set to the Mālinī meter, this verse gives expression to a home truth. We do not 

know who Bharthari had in mind when he said ‘tvam;’ but the verse applies to 

all of us. The poet speaks of himself in the plural while addressing his subject in 

the singular. This nicely suggests his contempt for the rich. ‘Nirviśeo viśea’ has 

turned into a catch phrase in Sanskrit, though most people use it without 

knowing the source.

This is a beautiful shloka by Bharthari where he says there is no big difference 

between the sages and the rich. It doesn't matter if one lives in a huge bungalow 

or in the wilderness of the forests. It also doesn't matter if one eats from golden 

plates and silver cutlery or just plucks fruit from the trees. It doesn't matter if one 

lives in rags or in riches. One's wealth is measured on the scale of contentment 

rather than the monetary scale. He who is content with his possessions is the 

richest being. He who is discontent and tirelessly thirsts for more is really poor. 

Even if he is the king of the world, if he does not have तृप्ति (tpti - contentment), 

he is the poorest, neediest person on earth.

Being satisfied and thankful for what we have is the way to go!

స్వస్తి.

 

 

No comments:

Post a Comment