Wednesday, 21 June 2017

సంత్ కబీర్ వాణి

సంత్ కబీర్ వాణి
गुरु गोविंद दोउ खड़े, काके लागूं पांय
बलिहारी गुरु आपनो, गोविंद दियो बताय।

గురు గోవింద్ దొవూ ఖడే కాకే లాగూఁ పాఁయ్
బలిహారీ గురు ఆప్నో, గోవింద్ దియో బతాయ్


ఒకవేళ గురువు దేవుడు ఒకే పర్యాయము  నిలిస్తే ఎవరి పాద స్పర్శ ముందు చేయవలెను అన్నది ఒక పెద్ద సందిగ్ధము. సంత్ కబీర్ దాసు చక్కని పరిష్కారము చెబుతూ వున్నాడు. నీకు దేవుని చూపినవాడు గురువే కదా! మొదటి చరణ స్పర్శ గురువుకే అని ఘంటా పథముగా చేబుతూవున్నాడు. అందుకే కదా 'గురుస్సాక్షాత్ పరబ్రహ్మ' అన్నది. 

माला फेरत जुग भया, फिरा न मन का फेर,
कर का मनका डार दे, मन का मनका फेर।

మాలా ఫేరత్ జగ భయా, ఫిరా న మన్ క ఫేర్ 
కర్ కా మన్ కా డర్ దే, మాన్ కా మన్కా ఫేర్

చేతితో జపమాలను (తావలమును) త్రిప్పుతూ మనసును కూడా దానితోబాటూ నిలకడ లేకుండా త్రిప్పుతూ వుంటే ఏమి ఫలితము వుంటుంది.nee జపమాల త్రిప్పుట మాని మనసును నిశ్చలముగా ఉంచు. 'చిత్తము శివుని మీద భక్తి చెప్పులమీద' ఉన్నంతవరకు nee సంకల్పము నెరవేరదు. మనసును సూర్యునిగా ఉంచితే గ్రహాలూ దాని చుట్టూ తిరుగవలసిందే!
సంత్ కబీర్ వాణి
पोथी पढ़ि पढ़ि जग मुआपंडित भया न कोय,
ढाई आखर प्रेम कापढ़े सो पंडित होय।
పోథీ పఢి పఢి జగ మువా, పండిత్ భయా న కోయ్
ఢాయీ ఆఖర్ ప్రేమ కా పఢేసొ పండిత్ హొయ్
ఎన్నో పుస్తకాలు చదివి , ఎన్నెన్నో ఉపన్యాసాలు విని పొందిన జ్ఞానమెంత అణి యోచించే లోపలే మనిషి చివరి మజిలీ చేరుకొంటాడు. ఒకవేళ తానూ విద్వాంసుడనైనాను అని తెలుసుకో కలిగినా పుణ్యకాలము పూర్తి అయినది కాబట్టి చేయ గలిగినది ఏమీ ఉండదు. ఒక్క  2 1/2 (प्यार) అక్షరాల ఈ పదమును సవ్యముగా అర్థము చేసుకో కలిగితే అంతకు మించిన పండితుడూ లేదు అంతకు మించిన పరమార్థమూ లేదు.ప్రేమ అను మాటకు చలన చిత్రములలో, వలటైన్స్ డే నాడు, అమ్మాయిలను వలలో వేయడము లాంటివి కాదు. అనురాగము, మమకారము,వాత్సల్యము కరుణ సుహృద్భావము పరోపకారము అని ఈ విధమగు ఆర్ద్రతా భారితములగు విశేషణముల కలపోత ప్రేమ. నీవు చేసే పనిని, nee కంటి ఎదుటివాడినీ నీవు పరమాత్మ స్వరూపముగా భావించగలిగితే అది ప్రేమకు నిర్వచనమౌతుంది.
చదివి పుస్తకముల సారమ్ము ప్రేమని
తెలియనలేని వాడు తెలుప మొరకు
పాడుపడిన బావి పనికిరాదెటులైన
రామ మొహనుక్తి రమ్యసూక్తి
భావము : చెరుకు రామ మోహన్ రావు 

जाति न पूछो साधु की, पूछ लीजिये ज्ञान,
मोल करो तरवार का, पड़ा रहन दो म्यान।
జాతి ణ పూచో సాధు కీ, పూఛ్ లిజియే జ్ఞాన్
మోర్ కరో తర్వార్ కా, పదా రహన్ దొ మ్యాన్
జ్ఞానికి జాతి తో నిమిత్తము లేదు. జగతికి గాయత్ర్ర్ మంత్రమునిచ్చిన విశ్వామిత్రునిదేజాతి,ఆది కవి వాల్మీకిదేజాతి,వేదవేదాంగోపనిషదితిహాసములు వ్రాసిన వ్యాసునిదేజాతి, జగద్గురువు శంకరులవారినే ప్రశ్నించిన చండాలునిదేజాతి? ఈ విధముగా ఎంతోమంది జాతితో సంబంధములేని మహనీయులను గూర్చి మనము చెప్పుకోవచ్చు.
వర ఎంత సువర్ణ రత్న మనిమయమై శోభిల్లుచున్నా లోన వున్నా కత్తి పదునుగలిగినదైతేనే ప్రయోజనము కలిగేది.
బుద్ధి వాడకుండ ఫోరు'జి' సెల్లును 
కొనుచు సిమ్ము నొకడు కూర్చ లేదు
వెలను కల్గి కూడ విలువ లేనిదదాయె
రామ మొహనుక్తి రమ్య సూక్తి
కావున మహనీయులకు జాతి వర్ణములు ఆటంకములు కావు. అవి అరచేతిని సూర్యునికి అడ్డుపెట్టినట్లుంటుంది.



जग में बैरी कोई नहीं, जो मन शीतल होय
यह आपा तो डाल दे, दया करे सब कोय
జగ మే బైరీ కోయీ నహీఁ, జో మన్ శీతల్ హొయ్
యహ్ ఆపా తో దాల్ దేఁ, దయా కారే సబ్ కోయ్
మనసు నిర్మలముగా ఉంచుకోగలిగితే లోకములో అట్టి వ్యక్తికి విరోధి భూతద్దము పెట్టి వెదకినా కనిపించడు. అహంకారము వదలితే అందరూ మనవాళ్ళే. 'తన కోపమే తన శతృవు.' 'క్రోధో వైశ్వానరో' అన్నారు పెద్దలు. క్రోధము నిప్పుతో సమానము. అది ఎదుటివాడినేకాదు తనను కూడా కాలుస్తుంది.  సంత్ కబీర్ వాణి 
साईं इतना दीजिए, जा में कुटुंब समाय
मैं भी भूखा न रहूं, साधु ना भूखा जाय
ఓ పరమాత్మా! నేను నిన్ను అక్షయ ధాన్య రాశులను, అపూర్వ ధన సంపదను కోరుటలేదు.  నేను కోరేది కేవలము నేను నా కుటుంబము నా ఇంటికి వచ్చిన అతిథి, అభ్యాగతులకు తగిన భోజనము మాత్రమె!





No comments:

Post a Comment