Saturday, 17 June 2017

ఊహా విహారిణి

ఊహా విహారిణి
చల్లనివేళ రాదొడగె జారగ జొచ్చెను పూల తావులున్
మెల్లని పిల్లగాలి మెయి మీటుచు సాగెను పుల్కరించగన్
ఝల్లను మేనితో మనసు జంటగ గూడుచు  పాడె హాయిగా
యుల్లము పల్లవించ మది యూహల తేనెలు జాలువారగన్

ఎల్లలు లేని నా మనసుకెల్ల సుఖంబుల బేర్చి గూర్చ దా
పిల్లనగ్రోవియై పిలువ పేరిమి మీరిన కాంక్ష గల్గు నే
తెల్లము జేయ వెల్వడితి తేరుగ జేసి మనంబు భావముల్
తెల్లని ఆశ్వయూధముగ తెమ్మెర పగ్గముగా దనర్పగన్

బెల్లము గాగ నా మనసు బేరులు గట్టిన గండుజీమలై
గిల్లగ నీదు జ్ఞాపికలు గిచ్చుల నెల్ల భరించలేక నే
తల్లట జెందుచున్  మిగుల దైన్యము బొందుచు పుష్పవాటికల్
మొల్లల కుంజముల్ దిరుగ మోహిని కానవదేల  తెల్పుమా!

                     చెరుకు రామ మోహన్ రావు

No comments:

Post a Comment