Saturday 10 June 2017

గరుడ గమన తవ చరణకమల.....జగద్గురు భారతీ తీర్థులవారి రచన

గరుడగమన తవ చరణకమల…..
రచన జగద్గురు భారతీ తీర్థ స్వాములవారు


గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్
మనసి లసతు మమ నిత్యమ్ ॥ 
మమ తాపమపాకురు దేవ-మమ పాపమపాకురు దేవ ॥
1. జలజనయన విధినముచిహరణముఖ-
విబుధవినుత-పదపద్మ -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
2. భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
3. శఙ్ఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
4. అగణిత-గుణగణ అశరణశరణద-
విదలిత-సురరిపుజాల -2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీతీర్థమ్-2
మమ తాపమపాకురు దేవ
 
మమ పాపమపాకురు దేవ ॥
ఈ పాటలో మొదటి పంక్తి భగవంతుని గుణవిశేషణాలను వర్ణించితే
రెండవ పంక్తి ఆయనకు ఆత్మ నివేదన.
ఈ పంక్తి ఈ గీతము యొక్క ఆసాంతమూ  పునరావృతమవుతూ వుంటుంది.
ఈ రచనలోని మరియొక ప్రత్యేకత ఏమిటంటే లయ. ఈ లయ సుందరము సురుచిరము, మధరము, మనోజ్ఞము, మనోహరము మరియు మహదానంద కారకము. ఒక అక్షరము ఎక్కువ కానీ ఒక అక్షరము తక్కువ కానీ ఆసాంతమూ ఈ గీతములో ఉండక మిక్కుటమగు లయబద్ధముగా వుంటుంది. మరి వ్రాసినది ఎవరు? జగద్గురువులు కదా! జగద్గురువులు భారతీ తీర్థులవారి చరణ కమలములకు త్రికరణ శుద్ధిగా మదీయ సాష్టాంగ దండప్రణామములు.
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి లసతు మమ నిత్యమ్
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి మమ నిత్యమ్ లసతు 
గరుడ గమన = ఓ గరుడ వాహనుడా
తవ చరణకమలమ్ = నీ పద కమలముల
ఇహ మమ మనసి = ఇక్కడ నా మనసులో
నిత్యం లసతు = కలకాలమూ విలసిల్లుగాక
  
మమ తాపమ్ + అపాకురు దేవ =నా తాపమును హరించు ఓ పరాత్పరా!
మమ పాపమ్ + అపాకురు దేవ = నా పాపమును హరించు పరంధామా!
(ప్రతి చరణంలోనూ ఈ పంక్తి పునరావృతమవుతుంది.)
ఇక చరణములు-
1. జలజ-నయన, విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ
జలజ-నయన = ఓ కమలాక్షా
విధి- = బ్రహ్మ
నముచి-హరణ- = నముచి ఒక రాక్షసుడు. ఈయన కశ్యపునకును ఆయన సతి
ధనువునకును జన్మించిన కుమారుడు. నముచి భార్య పేరు ప్రభ. దేవ దానవ యుద్ధంలో ఇంద్రుడు వజ్రయుధంతో కొట్టినా, బ్రహ్మ వరము వల్ల ఈయన ఇంచుక కూడా చలించలేదు. తడిసిన దానితోగానీ, తడవనిదానితో గానీ ఈతనికి చావులేదు. అయినా ఇంద్రునికి కనిపించకుండా దాగిన నముచిని కనుగొని,ఇంద్రుడు నముచితో చంపనని నమ్మించి స్నేహం చేసి పగలు రాత్రి గాని సంధ్యా సమయంలో, తడి పొడి గాని సముద్రపు అలల నురగతో తన వజ్రాయుధాన్ని ముంచి సంహరించినాడు. ఆ బ్రహ్మేన్ద్రాది
విబుధ= మహాత్ముల చేత ముఖ= ముఖమును  మరియు
పద-పద్మ = పాదపద్మములు కలిగి
వినుత = కీర్తింపబడువాడా 
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
2. భుజగ-శయన, భవ-మదన-జనక, మమ జనన-మరణ-భయ-హారీ ॥
భుజగ-శయన = శేష తల్ప గతుడా
భవ-మదన-జనక = ఇటు సంసారామునకు అటు  మన్మథునికి తండ్రి అయినవాడా
మమ జనన-మరణ-భయ-హారీ = నా జనన మరణమను భయమును సమయించువాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
3. శఙ్ఖ-చక్ర-ధర దుష్ట-దైత్య-హర సర్వ-లోక-శరణ ॥
శఙ్ఖ-చక్ర-ధర = శంఖ చక్రముల ధరించినవాడా
దుష్ట-దైత్య-హర = దుష్ట దైత్యులను దునుమాడేవాడా
సర్వ-లోక-శరణ = అన్ని లోకములకు శరణమునోసంగువాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
4. అగణిత-గుణగణ అశరణ-శరణద విదలిత-సుర-రిపు-జాల ॥
అగణిత-గుణగణ = లెక్కకు మిక్కుటమగు  గుణముల గణములు (గుంపులు) కలిగినవాడా
అశరణ-శరణద = శరణాగత రక్షకుడా (దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా!)
సుర-రిపు-జాల-విదళిత- = దేవతల విరోధులగు రాక్షస మూకలను చీల్చి చెండాడినవాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
5. భక్తవర్యమ్ ఇహ భూరి కరుణయా పాహి భారతీ-తీర్థమ్ 
ఇహ భక్తవర్యమ్ భారతీ-తీర్థమ్ భూరి కరుణయా పాహి ॥
భక్తవర్యమ్ = భక్త శ్రేష్ఠుడగు  (ఈ)
భారతీ-తీర్థమ్ = భారతీ-తీర్థుని (జగద్గురువులు)
ఇహ = కోర్కెమీర ( ఇహ అన్న మాటకు కోర్కె అన్న అర్థము కూడా కలదు.)
భూరి కరుణయా = చాలా కరుణతో
పాహి = రక్షించు
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
స్వస్తి


3 comments:

  1. ఓం శ్రీ గురుభ్యో నమః
    హరి ఓం

    గురువు గారికి వందనములు.

    రాగం: హరికాంభోజి

    స్వరాలు ఈ విధంగా వున్నవి.

    గరుడ గమన తవ
    g m m m m m p p

    చరణ కమల మిహ
    g m m m m m p p

    మనసి ల సతు మమ నిత్యం
    p d d d d d n d p p (m m)

    మనసి ల సతు మమ నిత్యం ||
    r r g p p d d n d p m

    మమ తాపమపా కురు దేవ
    m p p d d d n d p p

    మమ పాపమపా కురు దేవ ||
    m g r g p p d n dpdp m

    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు...🙏🙏

    ReplyDelete