రాణీ కిరణ్ దేవి
వీరత్వమునకు పెట్టినది పేరు
రాజపుత్రులు. వారిలో కూడా మహారాణా ప్రతాప్ తలమానికము. తానూ బ్రతికినంత కాలము
మొఘలులకు అంటే అక్బరుకు తల వంచని వీరుడు. గడ్డితో చేసిన రొట్టెలను దిని కటిక
నేలపైనైన పడుకొన్నాడు కానీ అక్బరుకు తలవంచినవాడు కాదు. అక్బరు ఆస్థాన సామంతుడగు, ప్రతాపసింహునికి వరుసకు తమ్ముడగు , మాన్ సింగ్ ను
రాయభారము పంపుతాడు. సందేశము ఏమిటంటే కేవలము 'అక్బరును
తనకు చక్రవర్తిగా కనుక రాణాప్రతాపుడు ఒప్పుకొంటే, చిత్తూర్ తో సహా అతని రాజ్యమంతా తిరిగి ఇచ్చివేయుట.' ప్రతాప్ తానూ బ్రతికినంతకాలము అక్బరుకు తలవంచనని
తెలుపుతూ, చనిపోయిన తరువాత
కూడా ప్రజలకు దేశానికి ఆదర్శముగా నిలుస్తానన్నాడు. అట్టి మహనీయులను కన్నా దేశములో
పుట్టినందుకు గర్వించవలెనో లేక అంతటి
గొప్పవారిని మరచిపోతున్న మన సంస్కారానికి శిగ్గుపడవలేనో తెలియని దుస్థితి మనది.
అట్టి రాణా ప్రతాప్ తమ్ముడు
శక్తిసింగ్ కూడా గొప్ప వీరుడు. ఆయన కుమార్తె రాణీ కిరణ్ దేవి. ఈమెను తన తండ్రి
బికనీరు రాజగు పృథ్వీరాజునకు ఇచ్చి పెళ్ళి చేసినాడు ఆమె తండ్రి. ఈ పృథ్వీరాజు, జయచంద్రుని కుమార్తెయగు రాణీ సంయుక్తను వివాహమాడిన
పృథ్వీ రాజు కాదు.
ఈ మహా వీరుడు మహమ్మద్ ఘోరీ తో మొదటి సారి 1191లో
మొదటి తారాయిన్ యుద్ధంలో పోరి ఘోరీణి బందీ చేసి సభలో ప్రవేశపెడితే నిజమైన
రాజపుత్రుడైనందువల్ల ఆతనిని విడిచిపెడతాడు, తన ఆస్థాన
సదస్యులు కారాగృహములో బంధించమని ఎంతగానో చెప్పినాకూడా! రాజపుత్రులు ఎంతటి నిష్ఠా
గరిష్ఠులో ఈ విషయము తెలుపుతుంది. కన్యాకుబ్జము రాజయిన జయచంద్రుని కుమారిత యగు రాణీ
సంయుక్త(సంయోజిత)ను అతని మనసుకు విరుద్ధముగా పెళ్ళియాడుటచే, పృథ్వీరాజు పై కత్తికట్టి ఘోరీని 1192 లో తిరిగి
ఆహ్వానించినాడు జయచంద్రుడు. ఆతను ఘోరీకి రహస్యముగా రాజపుత్రులు నియమబద్ధులు
కాబట్టి ప్రాతకాలము వరకు యుద్ధము చేయరని తెలిపినాడు. రాజపుత్రులు తమ కాలకృత్యములు
తీర్చుకొని సంధ్యావందనాది కార్యక్రమములు చేసుకోను తరుణములో వారిపై దండయాత్రజేసి
ఓడించుటకు తోడ్పడిన నీచుడు జయచంద్రుడు. ముస్లీం పరిపాలనకు నాంది పలికినది ఇతనే.
దీనినే మన తెలుగు సామెత రూపములో చేపవలేనంటే' ఇంటిలోవాడే
పెట్టేరా కంటిలో పుల్ల' అంటారు.
తిరిగీ విషయమునకు వస్తే, అక్బరునకు ఈ పృథ్వీరాజు ఆపృథ్వీరాజంతటి అజేయుడు కాదని
తలచి అత్యంత సౌందర్యవతి యగు కిరణ్ దేవి పైన కన్ను వేసినాడు. ఆరోజులలో నౌరోజ్ మేలా
అన్న ఒక ఉత్సవాన్ని ప్రత్యేకముగా స్త్రీలకోరకే మీనా బజార్ లో జరిపేవాడు. ముస్లీం
స్త్రీలు పరదాలో ఉండేవారు కాబట్టి వారికొరకు ప్రత్యేకముగా ఏర్పాటుచేసిన బజార్ ను
ఏర్పాటుచేసేవారు ముస్లిం రాజులు. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయము ఏమిటంటే
అక్బరు ఈ మీనా బజారునకు తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయుటకు వచ్చే ఆడవాళ్ళలో
తనకు నచ్చిన వారిని తన వద్దకు చేర్చుటకు కొందరు హిజ్డాలను (అంటే నపుంసకులను)
నియమంచి తానూ రహస్యముగా ఏర్పరచుకొన్న మందిరమునకు రప్పించుకొని తన పైశాచిక వాంచలను
తీర్చుకోనేవాడు.
ఒకసారి ఈ ఉత్సవమునకు కిరణ్ దేవి
రావటము జరిగినది. ఎప్పటినండియో మరులుగొన్న అక్బరు ఇదే ఆదనని గ్రహించి తన హిజ్డాలను
పనిచి మోసపూరితముగా ఆమెను తన మందిరమునకు రప్పించుకొంటాడు. కామాతురుడైన అతడు కిరణ్
దేవిని సమీపించిన వెంటనే ఆమె రహస్యముగా తన దుస్తులలో దాచుకొన్న కత్తిని తటాలున
లాగి ఆతనిని త్రుటికాలములో పడద్రోసి కత్తిని కంఠమునకు ఆనించింది. క్షమాగునమును
ఆభారనముగా ధరించిన రాజపుత్ర స్త్రీ కాబట్టి ఆతనికి ప్రాణభిక్ష పెడుతూ ఇకమీదట 'నౌరోజు' ఉత్సవాలు
జరుపనన్న ప్రమాణము చేయించుకొని అతనిని వదిలిపెట్టింది. ఇటువంటి హీనమగు పనులు చేయుట
వల్లనే అక్బరును THE GREAT అని ఆంగ్లేయులు అన్నారేమో!
No comments:
Post a Comment