కన్నడ ఆది కవి ‘పంపన’ మన తెలుగు
వాడు
కన్నడ ఆది కవిగా ప్రఖ్యాతి గడించిన పంప మనతెలుగు వాడనియు
బాపట్లకు చెందినా వంగిపర్రు వారి పూర్వుల నెలవనియు నేను గతములో తెలుగు ఘనతను
గూర్చి తెలుపుతూ తెలియజేసియున్దినాను. ఆ విషయమును ధృవపరుస్తూ శ్రీయుతులు 'నాగవర్ధన్
రాయల గారు' సవిస్తారముగా వ్రాసిన వ్యాసమును కొంత కాలము
క్రితము చదివియుండినాను బహుశ 'నమస్తే తెలంగాణా' అన్న దిన పత్రికలో అనుకొంటాను. ఆవిషయము ఎందుకో ఈ రోజు ణా తలపులలో
తిరుగుచున్నందువల్ల నాకు గుర్తున్న మేరకు తెలియబరచుచున్నాను.
పంపకవి 902 -975 మధ్యకాలమున జీవించిన కవి.అంటే దాదాపు
నన్నయ కన్నా 1౦౦ సంవత్సరములు పూర్వము వాడు. తెలుగు సంస్కృత కన్నడ భాషలలో కావ్యములు
వ్రాసిన మహా కవి. ఈయన వేములవాడను పాలించిన చాళుక్యులలోని అరికేసరి ఆస్థాన
పండితుడు.
బ్రాహ్మణుడగు ఈ కవి కుటుంబము జైన మతమును స్వీకరించినారు.
931 లో ఆయన కన్నడములో 'అర్జునుని నాయకునిగా చేస్తూ విక్రమార్జున
విజయము వ్రాయుట జరిగినది.'
అందులో ఆయన జిన గ్రంధమగు ఆది పురాణము లేక జినేంద్ర
పురాణమునే కాక తెలుగులో 4 గ్రంధములను వ్రాసినట్లు తెలియజేసినారు. అంటే నన్నయకు
పూర్వము తెలుగు కావ్యములు ఉండినవి అని మనకు తెలియుట లేదా! తెలుగులో పద్మ కవి
పద్మప్ప అన్న పేర్లతో వున్నవి పంపాన రచనలేనని నిడుదవోలు వెంకట్రావు గారు
పేర్కొన్నారు. శ్రీయుతులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కూడా తమ 'ప్రబంధ
రత్నావళిలో పంపనగారి తెలుగు పద్యమును ఉటంకించియున్నారు. పంపాన కవి తన తండ్రి 'భీమప్పయ్య గారి'గాను తాత అభిమాన చంద్ర అనియు
తెలియబరచినారట.ఆయన అరికేసరి మహారాజునకు తన 'విక్రమార్క
విజయమును అంకితమిచ్చుటతో ప్రసన్నుడైన ఆ రాజు ధర్మపురి అగ్రహారమును ఆయనకు
ఇచ్చినాడట.
ఈ విషయమును వెల్లడిస్తూ పంప కవి తమ్ముడగు జిన వల్లభుడు
ధర్మపురి పొలిమేరలలో వున్న వృషభాద్రిపై వేయించిన శిలాశాసనము నేటికినీ ఈ వాస్తవమును
చాతుచున్నదట. ఈ శాసనమే కాకుండా బోధ కురిక్యాలలో కూడా మనము ఇటువంటి శాసనములను
చూడనగును. అసలు పంప మహాకవి వ్రాసిన నాలుగు తెలుగు గ్రంధములలో మూడు చెన్నపట్టణము
నందలి మద్రాసు ఆర్కైవ్స్ లోనూ తదితర ప్రాంతాలలోనూ ఉన్నవని ఒకటి మాత్రము
లభిమ్పలేదని తేలగానా భాషా సాంస్కృతిక కార్యదర్శి మామిడి హరికృష్ణ గారు తెలిపినట్లు
నేను చదివిన గుర్తు.
వృద్ధాప్యములో సన్యసించిన పంపాన బోధన లో జీవ సమాధి యగుట
జరిగినదట. ఆయన జీవిత విశేషముల తెలుపుతూ తెలుగు కన్నడ సంస్కృత భాషలలో వ్రాసిన
పద్యములు కలిగిన శిలా ఫలకమును మనము చూడవచ్చునట.
పొన్నకవి
ఆంధ్రదేశము వాడనియు చిత్తూరుజిల్లాలోని పుంగనూరు వాస్తవ్యుడు అని
చెప్పుదురు.
అసగ అనంతరం 950 కాలం వాడైన కన్నడ కవి శ్రీ పొన్న అసగ రాసిన వాటిని ఉపయోగించుకొని
రచన చేశానని చెప్పుకొన్నాడు .తాను అసగ
కంటే గొప్ప కవిననీ ప్రకటించుకొన్నాడు .
రన్న, పొన్న,కన్నడ ఆదికవి పంపలలో ఇద్దరు తెలుగువారయితే,
తెలుగు భాషలో గ్రంధములు మనమనుకొన్న 'ఆంద్ర
భారతము కన్నా కనీసము వంద సంవత్సరములు పురాతనమైనవి కాలేదా. తెలుగు మహా భారతమునకన్నా
ముందు తెలుగు కావ్యములు వుండిన వాస్తవాన్ని మనము ఒప్పుకొనుటవల్ల తెలుగు భారతము
యొక్క వాసి వన్నె తరుగబోయేదిలేదు. అదేవిధముగా నన్నయ కవితా ప్రౌఢికీ కళంకము
రాబోయేది లేదు. ఆయనకు తోడ్పడిన నారాయణ భట్టు కన్నడిగుడు కాదా! ఈ రోజు మనము
గిరిగీచుకొని అపోహలతో అవస్థ పడుచున్నాము గానీ అన్యధా కాదు. అన్నిటికన్నా ముఖ్యము
మన తెలుగు ప్రాచీనత. మేగాతవన్నీ ఆతరువాత.
శుభం భూయాత్.
No comments:
Post a Comment