Saturday 10 June 2017

ఋగ్వేదము - కాంతి వేగము

ఋగ్వేదము - కాంతి వేగము 
https://cherukuramamohan.blogspot.com/2017/06/blog-post.html
ఋగ్వేదముననుసరించి కాంతివేగ గణన

వేదము విద్య నిధానము
వాదము వలదయ్య వినుము వక్రత దేలా
ఖేదముల పార ద్రోలుచు
మోదము గాంచెదవు చదువ మోహన రామా!
ఇది నా అంతరాత్మ నాకు తెలిపిన మాట. ఒకసారి నేనున్న  Share Taxi లో ఒక యువకుడు ఎక్కినాడు. కొంత సమయము గడచిన తరువాత అతనితో తాను జీన్స్ ప్యాంటు వేయుటలోని ప్రాధాన్యత ఏమయినా ప్రత్యేకముగా వున్నదా అని అడిగినాను. అతను జవాబుగా 'నలుగురితోటి నారాయణ' అన్నాడు. దాని వాడకము మంచిది కాదని సహేతుకముగా తెలిపినాను.నా మాటను ఒప్పుకొని నాతో మాటా మాటా కలిపినాడు. ఆతని మాటల ద్వారా నేను తెలుసుకొనినదేమిటన ఆతడు వేదములందలి శాస్త్ర విషయ పరిశోధన చేస్తూ ఉన్నాడని. మనసుకు ఎంతో సంతోషము కలిగినది. వేదములు అజరామరములన్న నమ్మకము కలిగింది. 
ఆ నమ్మకముతోనే మీతో పంచుకొనుటకు ఈ ఋగ్వేదములోని శాస్త్ర విషయమును మీకు తెలియజేయదలచినాను.
నిజానికి ఈ కాలమునాటి యువతీ యువకులు ' వేదములలో ఎన్నో శాస్త్ర విషయములు వున్నాయి అంటే తెలుసుకోకుండానే ముందు నవ్వేస్తారు. ఐన్స్టీన్, షోపెన్ హోవర్ లాంటి అనేకులైన పాశ్చాత్య ప్రముఖ శాస్త్రజ్ఞులు ప్రముఖులు ఎంతగానో ప్రశంసించిన ఈవేదములను కన్న భూమిపై పుట్టుటకు మనము ఎంత పుణ్యము చేసుకొన్నామో! వేదములలో ఋగ్వేదము మొదటిది.
ఋగ్వేదము సూర్యుని గొప్పదనమును గూర్చి నేను చదివిన ఒక ఆంగ్ల పుస్తకములోని మాటలను యథాతథముగా మీముందు ఉంచుచున్నాను.
"This homage is to the ancient-born Seers, to the ancient makers of the Path."  - Rig Veda X. 14-15.
"Let us bring our minds to rest in
The Glory of the Divine Sun!
May He inspire our reflections!"
  - Rig Veda II. 62. 10).
"You shine, all living things emerge. You disappear, they go to rest. Recognizing our innocence, O golden-haired Sun, arise; let each day be better than the last."    Rig Veda (X, 37, 9).
The Rig Veda is the Veda par excellence, the real Veda that traces the earliest growth of religious ideas in India.

ఈ క్రింద కాంతి వేగమును గూర్చి ఋగ్వేదము ఏమి చెప్పినదో చూస్తాము.

ఈ విషయమై పరిశోధించిన యస్ యస్ డే మరియు ఫై వి వర్తక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దిగువ తత్సంబంధిత వివరములను తెలుపుచున్నాను.
14 వ శతాబ్దమున, బుక్కరాయల రాజ గురువు మరియు, వేద భాష్యమును వ్రాసిన సాయణ మాధవులు విద్యారణ్యుల వారి సహోదరులని కొందరు పండితులంటే వారే వీరని కొందరంటారు. ఏది ఏమయినా వారు ఈ భారత భూమికి 'వేద భాష్యము'ల రూపమున యొసంగిన కానుక అమూల్యము అపురూపము .
సాయణ ఋగ్వేద భాష్యానుసారము సూర్య కాంతి 2,202 యోజనములు 1\2 నిమేషము ( మనము ఇప్పుడు కాలమానములో వాడే నిమిసము కాదు.) లో పయనించుచున్నది. ఈ విషయమునే భట్ట భాస్కరుడు (భాస్కరాచార్య ll 10 వ శతాబ్దము కావచ్చు) తన తైత్తిరీయ బ్రాహ్మణక భాష్యములో వివరించినాడు.
 ఎటువంటి దూర దర్శనుల సహాయము లేకుండా, కృత్రిమ ఉపగ్రహముల ద్వారా కాకుండా, గ్రహచారము, సూర్యోదయ సమయము, సూర్యాస్తమయ కాలము, గ్రహణములు, తితివార నక్షత్ర యోగ కరణములు గల్గిన మన పంచాంగములు ఎప్పటినుండి మొదలయినాయి అన్న ప్రశ్నకు జవాబు ఎవరూ చెప్పలేరు. అంతటి విజ్ఞానమును పంచిన వేదముల తలమానికమగు ఋగ్వేద గ్రంథములోని ప్రథమ సంహిత లోని 4వ అనువాకము లోని 50 మంత్రము ఈ విధముగా వుంది:

तरणिर्विश्वदर्शतो जयोतिष्क्र्दसि सूर्य |
विश्वमा भासिरोचनम |
తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదతి సూర్యl
విశ్వమా భాసి రోచనంl

సువర్ణ సుందర సుపధగ  సూర్యా
భాస భరిత క్షితి జనగతి కార్యా (స్వేచ్ఛానువాదము)
వేగము మరియు అందమును సంతరించుకొని ఈ భూమిని వెలుగులతో నింపిన ఆర్యా సూర్యా! అన్న అర్థమును  అన్వయించుకొనవచ్చును పై శ్లోకమునకు. దీనిని సాయణ భాష్యము ఈ విధముగా వ్యాఖ్యానించుతూ వుంది.
तथा स्मरयते योजनम्.
सहस्रे शते द्वे द्वे शतेद्वे योजने एकेन निमिषार्धेन क्रममन
దీని అర్థము ఏమిటంటే 
కాంతి వేగము = 1\2 నిమేషమునకు (మనమువాడే నిముసము అంటే MINUTE కాదు.)
ఒక యోజనము = 9.09 మైళ్లు
ఇక ఈ కాల-దూర కొలమానములను పరిశీలించుదాము.

మాహాభారతములోని శాంతి పర్వమందలి మోక్షధర్మ విభాగామునందు కాల గణనను మనము ఈ విధముగా చూడవచ్చును:

15 నిమేషములు = 1 కాష్ట
30 కాష్టాలు = 1కల
30.3 కలలు = 1 ముహూర్తము
30 ముహూర్తములు = 1దివారాత్రి = 24 గంటలు
కావున ఒక దివారాత్రి = 24 గంటలు = 30 x 30.3 x 30 x 15 నిమేషములు = 409050 నిమేషములు
1 గంట = 60 x 60 = 3600 సెకనులు
24 గంటలు = 24 x 3600 సెకనులు = 409050 నిమేషములు
409050 నిమేషములు = 86,400 సెకనులు
1 నిమేషము (రెప్ప పాటు కాలము) = 0.2112 సెకనులు 
1/2 నిమేషము = 0.1056 సెకనులు

విష్ణు పురాణము నందాలి 6వ అధ్యాయములో  యోజనమును ఈ విధముగా లెక్కించుట జరిగినది.



 10 పరమాణువులు = 1 పర సూక్ష్మము 
 10 పరసూక్ష్మములు = 1 త్రసరేణువు
 10 త్రసరేణువులు =    1 మహి రజస్సు (ఒక మట్టి రేణువు)
 10 మహి రజస్సు =      1 బాలాగ్రము   (వెంట్రుక కొస)            
10 బాలాగ్రములు =      1 లిక్ష 
10 లిక్షలు = 1 యూకము
10 యూకములు = 1 యవోదరము (బార్లీ బియ్యపుగింజ యొక్క పొట్ట)
10 యవోదరములు = 1 యవ ధాన్యపు గింజ
10 యవలు = 1 అంగుళము
6 అంగుళములు = 1 పాదము
2 పాదములు = 1 వితస్థి
2 వితస్థులు = 1 హస్తము
4 హస్తములు = 1 దండము లేక పౌరుసము = 6'(feet)
2000 దండములు = 1 గౌయుతి (ఆవు రంకె వినబడు దూరము) = 12000 feet
4 గౌయుతులు = 1 యోజనము = 9.09 మైళ్లు

గణింపు:
ఇపుడు కాంతి వేగమును గణించి చూచెదము.
పైన తెలిపిన శ్లోకములను ధ్యానములోనుంచుకొనినచో మనకు కాంతి 1\2 నిమేషమునకు 2202 యోజనములు పయనించునటుల తెలియవచ్చినది.
అంటే కాంతి వేగము = 2202 x 9.09 miles per 0.1056 seconds
= 20016.18 మైళ్ళు 0.1056 సెకనులకు
= 189547 మైళ్లు ఒక సెకనునకు


ఆధునిక సైన్సు ప్రకారము కాంతివేగము = 186,28.7 మైళ్లు ఒక సెకనునకు.
దీనిని 19 వ శతాబ్దములో మాక్స్వెల్ అను సైంటిస్టు తెలియజేసినాడు.
కానీ లెక్కలకు అందని కాలములోనే ఈ విషయము ఋగ్వేదములో చెప్పబడినది. 
చూసినారుకదా మన వేదముల ఔన్నత్యము, మన పూర్వీకుల గొప్పదనము.


స్వస్తి



No comments:

Post a Comment