మనోమంథనం
నేను నా రచనలేవయినా ఒక లంకె లో ఉంచుతాను. అందువల్ల ఉత్సాహవంతులు ఆస్య గ్రంధ కుడ్యముపై వెదకే అవసరము లేకుండా నేను తెలిపిన లంకెను తాము గుర్తుగా కాపాడుకొంటే ఎప్పుడయినా దానిని అనావృతము (To Open) చేసి చదువుకొనే వీలుంటుంది.
నేను ముసలివాడనే కానీ నేను ముఖ్యముగా పడుచువారి కొరకే వ్రాస్తాను. వారికి మన దేశ చరిత్ర, మన పురాతన వైభవము, మన పూర్వుల ప్రాభవము,మన దేశమును లేక మనదేశములోని వివిధ ప్రాంతములను ఏలిన రాజుల దేశ భక్తి, అన్నింటికీ మించి మన మహర్షివరేణ్యుల విజ్ఞాన యోగదానము, వారి పరిశీలనాపటిమ, ఈనాటికీ దూరేక్షణ (Telescope) సహాయముతో కనుగోనలేని విషయములను, సూక్ష్మదర్శినులకు, కనబడని విషయములను, ఊహల
కందని విషయములను, గ్రహచారము, భూగోళము, వివిధములగు ధాతువులు(Minerals)
వైద్యము, శస్త్ర చికిత్స, ఈ విధ్జముగా చెప్పుకొంటూ పోతే లెక్కకు మిక్కుటమగు ఎన్నో ఆవిష్కరణనలను, తమ తపోశక్తితో అందజేసి, పాశ్చాత్యులవలె పేరుకు తపించని వారిని గూర్చి నాకు తెలిసినది వ్రాస్తూ వున్నాను. నాకు తెలుసు ఈ పనివల్ల దమ్మిడీ ఆదాయము ఘడియ పురుసత్తు ఉండదని. ఆరెంటిని కాదని వ్రాస్తున్నానంటే మీకు తెలియజేయు ప్రయత్నము తప్ప నా మనసులో వేరు తపన లేదు. కానీ ఒక్కొక్కసారి అవి చూసే వారి సంఖ్య కేవలము నామమాత్రముగా వుంటుంది. నేను నిరాశపడుటలేదు. కారణము నేను కేవలము ఆశావాదిని కావటమే! నా సంకల్పబలము నన్ను మేడిమ త్రిప్పనీయుటలేదు.
మొన్న ఆంగ్లములో The Tyrant Diaries
(From the memoirs of a French adventurer who served at Tipu’s court)
FRANCOIS GAUTIER అను చరిత్రకారుడు మరియు ప్రముఖ పాత్రికేయుడు. పరదేశమగు France (Paris) లో పుట్టి హిందుత్వమును స్వీకరించి ఈ దేశపు యువతిని పెళ్లియాడి ఇచ్చట నిలిచిపోయి ఆధార సహితమగు చరిత్రను భారతీయులకు అందజేయ వలయునను తపనతో వ్రాస్తూవుంటే అటువంటి వ్యక్తి రచనలను తిరస్కరించినాడు ఒక పాఠకుడు.
మిగత పాఠకులు ఎవరయినా దీనిని చదివి ఖండించినారా అంటే చదివేతేనే కదా ఖండించేది అన్న జవాబు వస్తుంది. బహుశ పాఠకులలో తేలికగా వుండే విషయములకు అధికముగా స్పందించేవారు ఎక్కువగా వుంటారేమో! మనదేశమునకు పునర్వైభవము తేవలెనన్న తపనతో నా సమయమును, ముదిమికి వలయు కనీసపు సుఖమును లెక్కచేయక, నాశక్తినంతయును కూడగట్టుకొని, నా పరిధిలో నాకు చేతనయినంత పరిశోధన చేసిన పిదపనే నా వ్రాతలను మీకు పంచుచున్నాను.
చరిత్ర తెలుసుకొనుట ఎందుకు అన్న ఆలోచన కొందరిదయితే, చదివితే ఏమొస్తుంది అన్నధోరణి కొందరిది. అసలు చరిత్ర చదివితే తప్పిదములు ఎక్కడ జరిగినదీ తెలుస్తుంది. వానిని సవరించుకొనుటకు మనకు అవకాశము లభించుతుంది.
టిప్పు సుల్తాను ను గూర్చిన ఈ వివరములు చూడండి.
టిప్పు సుల్తాన్ 1750 నవంబర్ 20న జన్మించినాడని చరిత్రకు సంబంధించిన పాఠములు మరియూ వికీపిడియా తెలుపుచున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈనెల 10న టిప్పు జయంతిని అధికారికంగా జరిపింది. నవంబర్ 10 ఒక చీకటి రోజంటున్నారు చరిత్రకారులు. బెంగళూరు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి సూర్యనారాయణ రావు గారు ఏమంటున్నారో వారి మాటలోనే చదవండి.
Former Bangalore University Vice Chancellor Thimappa Manchale Suryanarayanarao called out the government’s ignorance on social media, “I just learnt from a historian that the tyrant Tipu’s birthday falls on November 20. November 10 is the day on which he hanged 700 Iyengars in Melkote.” As a result, the Melkote Iyengars do not celebrate Diwali even today. By cruel irony, that is the day the Karnataka government decided to celebrate its supposedly secular hero. How embarrassing can this get?
ఇక ఈ వాస్తవాన్ని గమనించండి (From Firstpost.com)
it’s the Coorgs, who he killed and converted, it’s the Mangalorean Catholics, whose churches he destroyed, and the Nairs of Wyanad and Malabar, who he tried to exterminate. Evidence for this comes from Tipu’s own letters and diaries. Instead, Chief Minister Siddaramaiah casually dismisses history by saying that the protests were by “communal forces”.
That’s not true, according to Coorgs. Says Coorg-born Gautham Machaiah, former executive vice-president, Zee Networks, “Coorgs are not opposed to Tipu Jayanti because he was a Muslim. He was a tyrant. He butchered thousands of Coorgs, mainly women and children, and forcibly converted innumerable people. We would have equally opposed Tipu Jayanti had he been a Hindu or a Christian.” The seething anger among Coorgs is ripe for exploitation.
భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో, వాల్మీకి, ఆటవికుడు కానీ బ్రహ్మత్వమును పొందిన మహానుభావుడు, ఆది కవి ఈ ప్రపంచములోనే, మరియు కనకదాసు వెనుకబడిన కురుబ గొల్ల కులస్తుడు, కానీ తన భక్తితో ఆ భగవంతుడినే తన వైపునకు తిప్పుకున్న పుణ్యమూర్తి, శ్రీ కృష్ణ దేవరాయలతోనే కనాభిషేకము చేయించుకొన్న, ఆయన గురువగు వ్యాసరాయలుకు అనుంగు శిష్యుడు, ఈ ఇరువురి జన్మ దినములను మన దేశీయ పంచాంగముననుసరించి శెలవు దినములుగా ప్రకటించినారు. అందుకు ఇది పోటీయా అన్నట్లు ఇప్పటి ప్రభుత్వము ఈపని చేసింది. మరి ఏవిధముగా ఆలోచించినా పై ఇరువురితో టిప్పుసుల్తాను పోల్చదగిన వాడా!
కర్ణాటక భగ్గుమనదా! టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుప రాష్ట్రమునకు ఇపుడు అవసరమా! ఇప్పుడు ఓ కొత్త వివాదం తెరమీదికి తెచ్చినట్లు కాదా?
మరి ఈ తప్పిదములు చరిత్రపుటలకు ఎక్కవలసిన అవసరము లేదా! ఇంతకన్నా ముఖ్యమగు సత్కార్యములు రాష్ట్రమునకు చేయవలసినవి లేవా!
ఈ వివరములు యువకులయిన మీరు గమనించిన తరువాతనయినా మంచిచెడులను అరసి చూసి మంచికి ప్రాధాన్యతనివ్వండి. చరిత్ర తెలుసుకోండి. ఇది రాజకీయము కాదు. దేశము అరాచాకీయము కాకుండా చూడండి. ఒక్కసారి మనో మంథనము చేసుకొండి. దేశమునకు అన్యాయము చేసిన వాళ్ళను మీరు పరీక్షించి తెలుసుకోండి. దేశము కొరకు ప్రాణాలను అర్పించిన మహనీయులను వెలుగులోనికి తెండి. ఎవరు వ్రాసే మాటలూ నమ్మవద్దు, నేను వ్రాసినవయినా సరే! మీరు పరిశీలించి వాస్తవమును గ్రహించి మీరు తెలుసుకొన్న వాస్తవ చరిత్రను మీ పిల్లలకందించండి.
స్వస్తి

No comments:
Post a Comment