Thursday 2 February 2017

రాణీ పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీ

రాణీ పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీ
ఢిల్లీ పాలకులలో ఈతను రెండవ వాడు. ఇతను టర్కీ కి చెందినవాడు. మనము తెలుగులో వాడే తురక అన్న పదము టర్కీ అన్న పదము నుండీ వచ్చినదే! 1296 నుండి 1316 వరకు 20 సంవత్సరములు ఈయన పరిపాలనా కాలము. తాను రెండవ అలెగ్జాండరు గానూ, ఇస్లామునకు మరియొక ప్రవక్త గానూ కాదలచినాడు. అప్పుడు నాటి ప్రసిద్ధిగన్న ‘సూఫీ సన్యాసి’ యగు అష్రఫ్ జహంగీర్ సేమ్నాని కావాలనుకొంటే  రెండవ అలేగ్జాండరువు కావచ్చు కానీ మత ప్రవక్త అగుటకు ప్రయత్నించవద్దు అని చెప్పుట జరిగింది. సరేనని తలచి ‘సికందర్-ఏ-సాని’ అన్న బిరుదు తగిలించుకున్నాడు. He was a Tyrant, an oppressive ruler who levied heavy taxes on Hindus and even disallowed them to possess weapons.
( గూగుల్ aazad.com సౌజన్యము) 
హిందువులపై ఇతను సాగించిన దురంతములు ఇన్ని అన్ని అని చెప్పనలవి కాదు. లక్షల మందిని తన 20 సంవత్సరముల రాజ్యకాలములో చంపగా , బ్రతికిన హిందువులపై లేనిపోని పన్నులు విధించుటయే గాక వారు చక్కని బట్టలు కూడా వేసుకో కూడదని చెప్పిన క్రూరుడు. తన సామ్రాజ్యము లోని పల్లెలు, పురములు, పట్టణములలో  అర్థబలము, అంగబలము కలిగిన మహమ్మదీయులకు మాత్రమే పెత్తనమిచ్చి అప్రాంతపు హిందువులపై పెత్తనము చలాయింప జేసినాడు.
మాలిక్ కాఫిర్ అన్న నపుంసకుడు ఈతని సర్వ సేనాధిపతి. అలావుద్దీన్ కు ఎన్నో రాజ్యములు ఎన్నో రాజ్యములు జయించి సంపాదించి పెట్టిన ఈతడు నిజమునకు హిందువు. కంభాత్ యుద్ధమున తటస్థించిన ఇతని తల్లిదండ్రులను చంపి బాలునిగా ఉన్న ఇతని అందమునకు మెచ్చి మెచ్చి పుంరతికి అలవాటు పడిన అల్లాఉద్దీన్ 1౦౦౦ దీనారములిచ్చి ఈతనిని కొని నపుంసకుని చేసినాడు. అంతటితో ఆగక ఇస్లామునకు మార్చి ‘మాలిక్ కాఫర్’ అన్న నామకరణము చేసినాడు. అందుకే అతనిని ‘హజార్ దినారీ’ అని కూడా అనేవారు.
అన్నివిధాలా అతని మెప్పు సంపాదించి సర్వోచ్ఛ  సేనానాయకుడైనాడు కాఫర్. దేవగిరి, హోయసల, హలెబీడు, పాండ్య దేశమగు మధుర ను జయించి దక్షిణా పథమును మహమ్మదీయ పాలన లోనికి తెచ్చినాడు. మధుర దేవాలయమున ఈతను చేసిన ఘాతుకములు మాటలకు అందనివి. చివరకు అల్లాఉద్దీన్ ను అతని వారసులను కూడా చంపి 36 దినములు దేశమును పరిపాలించి ఘాతుకముగా తన సిపాయీల చేతనే చంపబడినాడు.
  ఇక రాణీ పద్మిని లేక పద్మావతి విషయమునకు వత్తము.
రావల్ రతన్ సింగ్ యోధుడు, కళా పోషకుడు, ప్రజా హితైషి మరియు సమర్థవంతమైన మహా రాజు. ఆయన పద్మినీ దేవిని స్వయంవరములో గెలిచి వివాహమాడుతాడు. ఆమె తండ్రి మెచ్చి ఆయనకు ఎన్నో అపురూపమగు కానుకలు ఇవ్వగా అతని తోబుట్టువులు రాఘవ్ మరియు చేతన్ తమకు కూడా ఇప్పించమని రతన్ సింగ్ ను అడుగుతారు. ఆయన అది సభ్యత కాదని తెలిపినా పట్టుబట్టుటతో వారిని దేశమునుండి బహిష్కరించుతాడు.
వారు సరాసరి  ఢిల్లీ సుల్తాను అగు అల్లా ఉద్దీన్ ఖిల్జీ వద్దకు వెళ్లి తమను పరిచయము చేసుకొని తగు సమయములో ఆతనికి పద్మావతి (పెళ్ళికి తరువాతి పేరు) అతిశయించిన అందచందాలను గూర్చి చెప్పి అతనిలో కామము రగుల్గొల్పుతారు. ఈ విషయమున ఇంకొక కథ కూడా ప్రచారములో వుంది. రాఘవ్ చేతన్ అనే వేణు వాదకుడు ఆ కళ యందు ఎంతో పేరు గాంచినవాడు. దానికి తోడుగా అతను భూత పిశాచ ఉపాసకుడు. అది రాజ్యములో అనూచానముగా నిషిద్ధము. ఆవిషయము కంటబడి రాజు అతనిని తల సగము గొరిగించి సున్నపు పట్టెలు పెట్టి గాడిద నెక్కించి, ఇతరులెవరూ ఆ పనికి సాహసించని రీతిలో అవమాన పరుస్తాడు.  దానితో అతడు డిల్లీ కి చేరువగు అరణ్యము చేరి అల్లా ఉద్దీన్ ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఉంటాడు. ఆరోజు రానే వస్తుంది.  అతని వేణు గానమునకు ముగ్ధుడై తన శిపాయీలను పంపి ఆతనిని తన సభకు తోడి తెమ్మంటాడు. ఆతను వచ్చి సుల్తానుకు తన వేణుగానము పద్మావతి ముందు దిగదుడుపు అంటూ ఆమె అందమును అతిశయించి పొగుడుతాడు. ఈ రెంటిలో ఏది నిజమయినా ఆ తరువాత జరిగినది మాత్రము ఒకటే! ఖిల్జీ ఒక కుట్ర చేస్తాడు. మేవార్ దుర్గము దుర్భేద్యము కావున రతన్ సింగు నకు తాను మిత్రునిగా మెలగ దలచినట్లును, ఒకసారి సహోదరి సమానురాలగు పద్మిని ముఖము నొకసారి చూపించ వలసినట్లును కోరుతాడు. రాజు వల్లె యంటాడు.
కానీ ఇందు ఎదో మోసమున్నట్లు రాణీ పద్మిని పసి కడుతుంది. అసలు అల్లా ఉద్దీను కుతంత్రము ఏమిటంటే యుద్ధము తో ఆ కోటను జయించుట కష్టమని తెలిసి తనతో బాటు అతి చురుకైన మరియు బలశాలులైన బలగముతో కోట లోనికి ప్రవేశించి రాజును బందీ చేసి తన స్థావరమునకు తీసుకుపోయి రాణిని పొందే బేరమును ఆడుదామనుకొంటాడు.
రాణి తన రూపమును అద్దములో చూపుతుంది. భ్రమించిన ఖిల్జీ తప్పక ఆమె తన జనానా చేరవలసిందేనన్న నిర్ణయానికి వస్తాడు. గౌరవముగా తనను సాగానంపుటకు వచ్చిన రతన్ సింగును బంధించి తన గుడారమునకు తీసుకు పోయి రాణికి ‘ఆమె తనదైతేనే రాజుకు విముక్తి’ అన్న షరతును విధించుతాడు.
ఆమె చాతుర్యము కలిగినది కాబట్టి సరే అంటూ తన వెంట 15౦ పల్లకీలలో తన పరివారముతో వస్తానంటుంది. మెరికల వంటి  యోధులు ఒక్కొక్క పల్లకీ లో నలుగురు కత్తి కటారు బాకులు మొదలగు శాస్త్రములతో కూర్చొనగా నలుగురు దానిని మోసే బోయలుగా ఏర్పాటు చేసి ఇద్దరు కొడుకుల నాయకత్వములో పంపుతుంది. వారు రాజును విడిపించి కోటను చేర్చ గలుగుతారు కానీ తాము మరణించుతారు.
ఆగ్రహోదగ్రుడైన ఖిల్జీ కోట అనుపానములను తను రాజు వద్దకు మైత్రి నెరుపుటకు పోయి ఉండినాడు కాబట్టి కోటలోనికి ఖాద్య వస్తువులు పోకుండా కట్టుదిట్టము చేసినాడు. రానురాను పరిస్థితి విషమించుటతో వీరులగా పోరాడి ప్రాణ త్యాగము చేయ దలంచి యుద్ధము చేస్తారు.
ఇక ప్రాయోపవేశమే శరణమని తలచిన రాణీ పద్మావతి తన పరివారముతో జౌహర్ కుండ్ (చితి మంటలు పేర్చిన అతి పెద్ద గాడి) లో దూకి ప్రాణ త్యాగము చేస్తుంది.
ఈ గాధను 154౦ లో మాలిక్ మొహమ్మద్ జాయసీ తన ‘పద్మావత్’ అన్న కావ్యములో వ్రాసినాడు.  ఒక్క కవిత చదువగలిగిన వారి కొరకు:
तन चितउर, मन राजा कीन्हा। हिय सिंघल, बुधि पदमिनि चीन्हा॥
गुरू सुआ जेइ पंथ देखावा । बिनु गुरु जगत को निरगुन पावा ?
नागमती यह दुनिया-धंधा । बाँचा सोइ न एहि चित बंधा ॥
राघव दूत सोई सैतानू । माया अलाउदीन सुलतानू ॥
प्रेम-कथा एहि भाँति बिचारहु । बूझि लेहु जौ बूझै पारहु ॥

13౦3 లో జరిగిన ఈ సంఘటనను 2౦౦ ల సంవత్సరముల తరువాత వ్రాయటము జరిగినది. ఏది ఏమయినా శూరతకు రాజ పుత్ర యోధులు లు పాతీవ్రత్యమునకు రాజపుత్ర మహారాణులు పెట్టినది పేరు గదా!
౩౦,౦౦౦ మంది ముస్లిములను ద్రోహులని ఊహించి, లక్షల మంది హిందువులను పొట్టన పెట్టుకొన్న అల్లా ఉద్దీన్ ఖిల్జీ గోప్పదనమిదియే!

అటువంటి హీన మనస్కునితో, అతని కలలోనికి పద్మావతిని రానిచ్చి చుంబన దృశ్యమును చేర్చ ప్రయత్నించుట నిజమయిన భారతీయత నరములలో ప్రవహించే వ్యక్తి ఎవరయినా నాకు సంబంధించినది కాదు కదా అని ఊరకుండగలడా! అసలటువంటి ఆలోచన ఆ సినిమా దర్శకునికి గానీ, ఆ దృశ్యములో నటించుటకు అభ్యంతరము తెలుపని నటులకు గానీ దేశభక్తి అన్నది లేనట్లేనా! డబ్బు కొరకు ఏమయినా చేయ నిచ్చగించుట వారు నేర్చుకొన్న సంస్కృతి అనుకోనవలెనా! అన్న విషయముల గూర్చి ఆలోచించుట పాఠకుల మనోగతమునకు వదలివేస్తున్నాను.
స్వస్తి





2 comments:

  1. రసపుత్రవీరుల పౌరుషమూ, పరిపాలనాదక్షతా, యుధ్ధ నైపుణ్యాదుల చరిత్ర ....చదువబడక ఎలాగూ మరువబడుతున్నది. ఇక రాజపుత్రరాణుల పాతివ్రత్యమూ,శౌర్యమూ, ధర్మనిరతీ ..... కూడా తప్పుగా ప్రచారం చేయబడితే తరువాతి తరానికి సరియైన చరిత్ర ఎలా తెలిసేది?!. సినిమా నేడు బలమైన సామాజిక మాధ్యమం కాబట్టి తీసేవారూ, తీయించేవారూ, చేసేవారూ, చూసేవారూ కూడా తమ తమ సామాజిక బాధ్యతను గుర్తెరగాలి.

    మీనాబజార్ పేరిట అక్బర్ చౌకబారు చేష్టలకు బుద్ధిచెప్పిన జోషీబాయి శౌర్యాన్ని చదివాను. ఇంకా .... యుద్ధసమయంలో తమ మగవారికి 'కఫన్' గా పిలువబడే ఎర్రని వస్త్రాన్నికట్టి, వీరతిలకం దిద్ది పంపి, తమ గురించి వారికి వెనుక ఆలోచన వుండకుండా .... తల్లీ
    కూతుళ్ళను ఒకే జనానాలో చేర్చుకునే మహమ్మదీయుల చేతికి చిక్కకుండా చందనపు చితిలో దూకి ఆత్మర్పణ చేసుకునే ఎదరో రసపుత్రస్త్రీల గూర్చి చదివాను.ఆ ప్రక్రియని జోహార్ అంటారు. అలా కఫన్ కట్టిన రాజపుత్రుడు ప్రళయకాలరుద్రుడై విజయమో వీరస్వర్గమో చందాన పోరాడతాడనీ, ఎన్నోసార్లు వారిపౌరుషానికి తాళలేక తమ సేనలు పలాయనం చిత్తగించాయనీ అక్బర్నామా లో వుంది.
    అటువంటి భారతీయ మహిళల శీల, ధైర్యాలను గూర్చి సగౌరవంగా ప్రవర్తించటం సముచితం. అటువంటి మరోరాణి పద్మినీదేవి గూర్చి తెలియచేశారు, కృతజ్ఞతలు.

    ReplyDelete