Wednesday 21 July 2021

అజరామర సూక్తి – 307 अजरामर सूक्ति – 307 Eternal Quote – 307

 అజరామర సూక్తి – 307

अजरामर सूक्ति – 307

Eternal Quote – 307

गुणवज्जनसंसर्गात् याति नीचोऽपि गौरवम् ।

पुष्पमालाप्रसङ्गेण सूत्रं शिरसि धार्यते ॥ - सुभाषितसुधानिधि

గుణవజ్జన సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవమ్!

పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే!!

పూవులతోటి దారమును పోల్చగ, కల్గదు తావి, ఐనయున్

పూవులు మాలయై తరుణి పుష్కల  కౌశిక కేశ శీర్షమున్

కోవగ తావులొల్కుచును కోమలి కొప్పును చేర్చె సూత్రమై

కావున పొందు మంచిదిగ కల్గిన గౌరవమబ్బు మోహనా!

సువాసనలను వెదజల్లే పూవులు స్త్రీ శిరమునకు ఎంతో శోభను కూర్చుటయే గాక, ఆమె రాకను గాలిద్వారా పరిసరాలకు చేరవేస్తుంది. దారమునకు పూవునకున్న స్నిగ్ధత సౌకుమార్యము, సువాసన లేవు. కానీ పట్టుదారములవలె ఎంతో నాజూకుగా ఉన్నపుష్కలమగు ఆమె కేశసంపదను కొప్పుగా చుట్టుకోన్నపుడు, ఆ కొప్పుచుట్టూ అమర్చవలసిన పుష్పహారమునకు ఆలంబన దారమే ! పూల సరమునకు ఆ దారము ఆధారమగుట చేత కృతజ్ఞతగా పూవులు తమ తావిని దానికి పంచినవి. పూవులు దారము చేత హారముగా మారి భగవంతుని మెడనజేరి ఆయన ఎదపై నివాసమేర్పరచుకొంతాయి దారముతో సహా!  అందుకే పెద్దలు ఈ విధముగా తెలిపినారు:

వస్త్రేణ వపుషా మూర్ఖాః పండితానాం సభాస్వపి l

ఛత్రన్యాయేన రాజన్తే సత్సంగ ఫలమీదృశమ్ ll

శుభ్రమైన బట్టలు కట్టుకొని విజ్ఞుల సభలో మౌనముగా కూర్చొనియుంటే, నోరు తెరువనంతవరకు అతనికీ పండితులతో సమానముగా ఆదర సత్కారాలు లభిస్తాయి.

 गुणवज्जनसंसर्गात् याति नीचोऽपि गौरवम् ।

पुष्पमालाप्रसङ्गेण सूत्रं शिरसि धार्यते ॥ - सुभाषितसुधानिधि

अच्छे लोगों की संगति से तुच्छ व्यक्ति भी मान-सम्मान प्राप्त करेगा। फूलों के बहाने सिर पर धागा भी चढ़ जाता है

फूलों को माला बनना है तो एक डोरी की सहायता जरूर लेना पड़ता है। वह धागाएक माला के रूप मेंभगवान के कंठ सीमाको अलंकृत करता है और उनके हृदय के बिकट बसजाता है । महिलाएं इसे सिर पर भी पहनते हैं थागा, जिसे कोइ सुगंध नहीं होता, फूलों ने उसे अपनी सुगंध बाँटते हैं

इसी तरहमेधावी लोगों की संगति में रहने से तुच्छ को भी सम्मान मिलता है

Guavajjanasasargāt yāti nīco'pi gauravam 

Pupamālāprasagea sūtra śirasi dhāryate ॥ - subhāṣitasudhānidhi

Due to the company of good people, even an insignificant person will attain respectability. On the pretext of the flowers, the thread (too) gets worn on the head.

Flowers get tied into a garland using a string. That thread, in the form of a garland, will be offered to the Lord. It attains the highest respect of being at His feet or better yet, close to His heart. People would even wear it on their heads! Usually, nobody would wear just a string of thread on their hair as an adornment. But it is the company of the flowers that brings honor to the thread.

Similarly, being in the company of the meritorious brings respect and dignity to the insignificant as well.

స్వస్తి. 

No comments:

Post a Comment